| నిన్ననే ఓరేంజి మూవీ చూశాను.. సినిమా నాకు బాగా నచ్చింది.. అందులో నాకు నచ్చిన భాగాన్ని share చేసుకుందామనిపించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Showing posts with label చలనచిత్రం. Show all posts
Showing posts with label చలనచిత్రం. Show all posts
Sunday, April 10, 2011
కారణాలతో మిగిలిపోకూడదు... :)
Saturday, June 19, 2010
CJ7: నాకు నచ్చింది...
ఒక చిన్న అబ్బాయి.. స్కూల్లో చదువుకుంటాడు, తన తండ్రి బాగా పేదవాడు కావటంతో.. సరైన బట్టలు, చెప్పులూ కూడా లేక అప్పుడప్పుడూ స్కూల్లో టీచర్ల చేత తిట్లు కూడా తింటూంటాడు.. అతడికి బొమ్మలంటే ఇష్టం కానీ, వాళ్ళ నాన్న కొనిపెట్టలేడు.. ఒక రోజు ఆ అబ్బాయికి ఒక ఏలియన్ డాగ్ దొరుకుతుంది.. కుళ్ళిన యాపిల్ని మంచి పండుగా మార్చగలిగే ఆ ఏలియన్ డాగ్‌ని చూసి ఎన్నెన్నో అద్భుతాల్ని ఊహించుకుంటాడు.. కానీ తాననుకున్న అద్భుతాలు వేటినీ ఆ కుక్కపిల్ల చెయ్యలేదు.. అద్భుతాలు ఒరగక సున్నా మార్కులొస్తే సున్నాకి పదిని చేర్చి తన తండ్రికి అబద్దాన్ని చూపెడతాడు.. నిజం తెలిసిన తండ్రి.. ఆ అబ్బాయిని తిడతాడు.. ఎప్పుడూ మోసం చెయ్యటం, అబద్దమాడటం, దెబ్బలాడటం లాంటివి చెయ్యకూడదని తాను చెప్పింది ఆ అబ్బాయి వినలేదని అంటాడు.. ఆ తర్వాత జరిగిన సంఘటనల పరిక్రమలో ఆ అబ్బాయి మంచి మార్కులతో పాసవుతాడు.. కానీ అతడి తండ్రి బిల్డింగ్ పనిలో యాక్సిడెంటై చావు, బ్రతుకుల మద్య ఉంటే.. బాదతో వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ ఆబ్బాయిని చూసిన ఏలియన్ డాగ్.. తన ప్రాణాన్నే ఇచ్చేసి.. పిల్లాడి తండ్రిని బ్రతికిస్తుంది.. ప్రాణం పోయిన ఆ ముద్దు ముద్దు ఏలియన్ డాగ్ ఒక బొమ్మగా మిగిలిపోతుంది.. చిన్న సినిమా, కథ.. పాత్రల సంఖ్య ఇలాంటివన్నీ తక్కువగానే ఉన్నా హృదయానికి హత్తుకునేలాగా తీశారు.. అందుకే అంటారనుకుంటే ప్రజ్ఞకి పనిముట్లు తక్కువున్నా/లేకున్నా.. తన ఉనికి చాటుకుంటుందని.. |
Subscribe to:
Posts (Atom)
