ఉపకారికినుపకారము విపరీతముగాదు సేయ వివరింపదగున్ అపకారికినుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతి నర్సరీ, కిండర్ గార్డెన్ ఇంకా అలాంటి స్థాయి నుండి చదువుకున్న వాళ్ళకి కూడా పైన చెప్పిన సుమతీ శతకంలో పద్యం దాని తాత్పర్యం తెలుసును.. ఐనా నాకు డౌటే అందుకే నేను చెబుతాను.. తాత్పర్యం: నీకు హెల్ప్ చేసేవాడికి నువ్వు హెల్ప్ చెయ్యటం పెద్ద గొప్పవిషయం కాదూ, కానీ నిన్ను హర్ట్ చెయ్యటానికి ప్రయత్నించినవాడికి కూడా నువ్వు హెల్ప్ చెయ్యగలిగితే అదీ గొప్ప.. అలా చెయ్యగలిగిన వాడే నేర్పరి.. నేర్పరి అంటే learnt అని అర్దం. పద్యాన్ని చదివేశారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రండి.. ఆ పద్యం మన ప్రాక్టికల్ లైఫ్‌కి ఎంతవరకూ అవసరమంటారు? నిజంగానే ఆ శతక కాలానికీ ఇప్పటికీ స్థితి గతులు చాలా మారాయి కదా.. ఇప్పుడు నన్ను స్కూల్లో వేసి ఈ పద్యాన్ని చెబితే.. బయట ప్రపంచాన్ని గమనించే నేను రచయితని చిన్నచూపు చూస్తానేమో అనిపిస్తుంది.. ఈ పద్యాన్ని ఆదర్శంగా తీసుకునే తింగరోల్లెవరైనా వాళ్ళకి advantage లేనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినవాళ్ళకి హెల్ప్ చేస్తారా.. పై లైన్లు ఓకే.. మూడో లైను అసలు సంభవిస్తుందా.. ఒక వేళ ఎవరి దగ్గరకైనా ఈ పద్యం తీసుకెళ్ళి హితోపదేశం చెయ్యాలని నేను తలిస్తే, వాళ్ళ వాదన క్రింది లైన్లలో ఉన్న వాక్యాలలాగానే ఉంటుందేమో... "అరటి తోలు చేయు ఎగతాళి కేక, విరిగిన నా నడ్డి మద్యనున్న వెన్నుపూసకెరుక, నాతో వాగకుండ చేరెదవా నీ ఇల్లు, లేక రాల్చనా నీ పల్లు పదనాల్గు రెల్లు" అదేంటీ నోటిలోని పల్లు ముప్పై రెండు కదా అనే కదా మీ డౌటు.. వావ్ మీరు బయాలజీలో బాగా స్ట్రాంగనుకుంటా.. కానీ ఇక్కడి లాజిక్కేంటంటే.. వాడప్పటికే హితోపదేశం చేసినవాడిని పీకి నాలుగు పల్లు రాలుస్తాడు.. కాబట్టి పల్లు పదనాల్గు రెల్లే.. మరి మీ "అమూల్"యమైన లేదా "హార్లిక్సు"ఐన అదీ కాకుంటే "బూస్టైన" అభిప్రాయమేమిటో.. ఐనా ఈ కాలంలో నేర్పరికి సుమతీ శతకంలోనే చాలా చక్కటి పద్యం ఉందని నా అభిప్రాయం.. "ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ" ఏం కాదంటారా.. కాకపోతే అందరికీ ఆ టాలెంటుంటుందా? ఏమో మరి? నేను మూడో తరగతి చదువుతున్నప్పుడొకసారి మా తాతయ్య నాకు పద్యాలు చెబుతూ ఈ పద్యం చదివి దాని గురించి చెప్పి ఏం అర్దమయ్యిందంటే ఏమీ చెప్పలేక చీవాట్లు తిన్నాను.. ఒక గంట దాని గురించే ఆలోచించాక ఆయన దగ్గరికే వెళ్ళి అప్పటి నా భాషా పరిజ్ఞాన లేమితో అక్కడున్న పదాలనే కొద్దిగా మార్చి చెబితే.. చీవాట్లు పెట్టివవారు కాస్తా పగలబడి నవ్వి తర్వాత వాళ్ళ స్కూల్లో కొలీగ్సుతో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారంట.. ఆ మార్చిన పద్యం ఎలా సాగిందంటే.. "ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటాడక అన్యుల మనముల్ నొప్పించి,తానొచ్చి తన్నించుకు తిరుగువాడె మౌళీ సుమతీ" నన్ను నేను పొగిడేసుకున్నానని మీకు జెలసీగా ఉంది కదా.. ఏం అవసరం లేదు కావాలంటే మీ పేరు చెప్పండి మిమ్మల్ని కూడా పొగుడుతాను.. అప్పటి మహానుభావులు రాసిన గొప్ప గొప్ప పద్యాలని ఈ కాలానికి చెందిన మనం.. సారీ సారీ.. "నేను" ఇలా తింగరి తింగరిగా చెప్పుకుంటున్నాను.. మరి మనం రాసే సాహిత్యంపైన ఇంకో శతాబ్దం తర్వాతవారు చేసే కామెంట్లేమిటో.. :) కానీ ఈ పోస్టులో నే టూ మచ్ సీరియస్సుగా, అస్సలు నవ్వకుండా, ముఖం బిగబట్టి మరీ అడిగే ప్రశ్నేంటంటే.. స్కూల్లో పిల్లలకి ఇలాంటి అప్రస్తుతమైన పద్యాలు అవసరమా, లేదా.. అసలవి అప్రస్తుతమా కాదా.. పద్య,గద్య పాఠ్యాంశాలన్నీ కొంతమంది స్థబ్ధ విద్యావంతుని ఆస్తులుగా భావిస్తున్నారు.. ఈ భావన నిజంగా నిజమా?? వాళ్ళే మన భాష మృత భాష కోవలోనికి చేరుతుందని భయపెడుతున్నారు.. దీన్ని మీరు ఒప్పుకుంటారా?? నేనైతే ఇవన్నీ మన పాఠ్యాంశాలలో భాగాలు కావాలంటాను.. కారణం మీ వివరణని లేదా వాదనని కామెంట్ల రూపంలో నాతో చర్చిస్తే చెబుతాను లేదంటే చెప్పను..
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Showing posts with label Fnny. Show all posts

Saturday, June 26, 2010
అపకారికినుపకారము.. కరెక్టేనా??
Wednesday, May 26, 2010
Monday, May 24, 2010
దోమలకి ఎయిడ్సు ఎందుకు రాదంటే...!! :)
ఒరేయ్ దోమలకి ఎయిడ్సెందుకు రాదురా... మా ఫ్రెండు గాడు క్లాసైపోయిన తర్వాత అడిగాడు.. వెనకాల మా ఫ్రెండింకొకడు.. ఆ ప్రశ్న నేల మీద పడితే ఏదో అద్దం పగిలినట్టు పగిలిపోతుందన్నట్లుగా ఠక్కున సమాధానం చెప్పాడు.. "దోమలు మనుషులతో లైంగిక సంపర్కం జరపలేవు కాబట్టి" అని.. మీరూహిస్తున్నట్లుగానే సమాధానం విని నవ్వకున్నవాళ్ళు నవ్వుకున్నారు.. తిట్టుకున్నవాళ్ళు తిట్టుకున్నారు.. వాడిచ్చిన యాధృచ్చిక సమాదానం ఎంత ఫన్నీ/వల్గర్‌గా ఉన్నా.. మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఉదయించే ఉంటుంది..
ఔను మరీ..!! మంగళ షాపుకి వెళ్ళి ఎయిడ్సువాడి బ్లేడు తగిలితేనో.. లేక హాస్పిటల్లో ఎయిడ్సు రోగి రక్తం తగిలిన సూది మనకి గుచ్చితేనో వ్యాపించగల్గే ఎయిడ్సు.. మన tiny dracula అదేనండీ దోమ.. కుడితే ఎందుకు వ్యాపించదూ???.. మీలో ఎంత మందికి దీనికి సరైన సమాదానం తెలుసో నాకు తెలియదు కానీ.. నాకు తెలిసింది నేను చెబుతాను..
HIV తను పని చెయ్యగలగాలంటే ఉండాల్సిన పరిస్థితులలో అత్యవసరమైనది ఎవరంటే మనిషి మాత్రమే.... "ఎందుకలాగా..!!??"... అంటూ యమలీలలో సుబ్బరాయశర్మకి వచ్చినట్టుగా మీకు డౌటొచ్చుండొచ్చు.. ఔను దానికి ఒక కారణం ఉంది.. దోమ జీర్ణాశయంలోకి వెళ్ళిన HIV దాని జీర్ణరసాల నుండి తప్పించుకోగల్గినా.. అది అందులో జీవించగల్గే ఆసరా లేదన్నమాట.. అంటే మలేరియా పరాన్నజీవిలాగా దోమ శరీరంలో HIVకి చుట్టాలెవరూ లేరన్నమాట.... నాకు తెలుసు.. HIVకి మాత్రమే ఉండే చుట్టాలు ఎవరూ అని మీకు డౌటొచ్చేసిందని.. చుట్టాలు అనే కంటే.. ఐడెంటిటీ కార్డు చూపెడితేనే లోపలకి రానిచ్చేవాళ్ళు అంటే బాగుంటుంది...
ఔను HIVకి glycoprotein160 (gp160=gp120+gp40 two proteins of 160kilodaltons of molecular weight both together) ఇంకా మనిషి తెల్ల రక్తకణ (T-helper ఇంకా Tc)పొరలో CD4 (cluster of differentiation to help in antigen processing in collaboration with APCs) అనే మెంబ్రేన్ ప్రోటీన్ మాలిక్యూల్... ఈ రెండూ కలిసీ.. "మీది తెనాలే మాది తెనాలే మనది తెనాలే" టైపులో డ్యాన్సులేసి మరీ ఆడుకుని.. చివరకి CD4 తన కణపు పొరని HIVతో కలిపేసీ.... రావమ్మా మహా లచ్చిమీ రావమ్మా నీ ఎడంకాలూ ముందెట్టీ రావమ్మా అని మరీ సాదరంగా అహ్వానించి మరీ.. మనిషిని పీల్చి పిప్పిచేసేందుకు రంగం సిద్దం చేస్తుంది.. పాపం CD4 ఎందుకు ఇలా చేస్తుందీ HIV dangerous అని దానికి తెలియదా.. లేక ఎవరన్నా లంచమిస్తారా... మీ డౌటిదే కదా..
అసలు విషయం ఏంటంటే ముందే చెప్పుకున్నాం కదా CD4 యాంటీజెన్ ప్రోసెసింగులో ఉపయోగపడుతుందనీ........ అంటే 'అనగనగా ఒక రోజు' సినిమాలో బ్రహ్మానందమేమో......... "పోలీసంటే ఎలా ఉండాలి.. వెదవెవడు, జంటిల్మనెవడు.. మొహం చూడగానే స్నిఫ్ఫర్ డాగ్ లాగా పట్టేయాలి.. ఐ వాంటు టు టాక్ టు నెల్లూరి పెద్దారెడ్డి రైట్ నౌ.." అని కబుర్లు చెబుతాడు గుర్తుందా.. అలాగే.... వచ్చింది మనోడా లేక బయటోడా అనేది చూసుకునే భాద్యత CD4 అతికించి ఉన్న కణానిదే అన్నమాట(ఇక్కడ CD4 ఒక scrutiny enabled gateway అనుకోవాలి)... ఐనా fake identity కార్డూ ఇంకా కమల్‌హాసన్ సినిమాలోలాగా మాస్కూ HIV వేసుకుంటే... పాపం CD4 మాత్రం ఏమి చేస్తుంది.. మేఘసందేశంలో జయసుధలాగానో లేకుంటే కార్తీకదీపంలో శారదలాగానో అమాయకంగా హారతి పట్టేస్తుంది... నెక్స్టు సీను ఏం జరిగింది.. ఇలా అడుగుతారని తెలుసు...... అంతా చెప్పాలంటే పెద్ద పుస్తకమౌతుంది... నెట్లో సెర్చి చెయ్యండి.. కానీ దోమల వలన ఎయిడ్సు వ్యాప్తి కోటిలో ఒకరికన్నా ఉంటుందని statistics వాళ్ళు చెబుతారు.. కారణమేంటంటే.. ఏ పరిస్థితిలోనైనా దోమ పీల్చిన రక్తం ఎయిడ్సు రోగి రక్తకణాలు healthy individualలోనికి వెళితే అప్పుడు ఎయిడ్సు వచ్చే అవకాశం ఉంది.. కానీ చాలా తక్కువ(this possibility is almost ruled out, ఐనా ఎవరు చూశారూ... జెనెరేషన్‌కొక రంగు మార్చే జీవి ఆ HIV) .. I'm not giving references.. if you want.. you've to search through net...
Have a nice day..

Sunday, May 23, 2010
Saturday, May 22, 2010
నాకిష్టం ఫ్లవరు.. కానీ నాకు లేదు లవరు.. :)
ప్రేమ ఎంత గాఢమైనదైనా... దాని విఫలం ఏ ఆత్మహత్యతోనో... హత్యతోనో కాక.. ఇలా సరదా ఎక్సుప్రెషన్‌తో "ఎండై"తేనే బాగుంటుంది... అఫ్‌కోర్స్ పిల్లికి ఎటకారం.. ఎలకకి వెగటు కారం అనేటట్టుంది.. అదే వినేవాడికి వెటకారంగానూ.. తన లవ్ గురించి చెప్పే లవ్ ఫెయి'ల్యూర్' హీరోకి వెగటుగానూ ఉంటుందనుకోండీ... సరే తన బాధని ఎలా వెళ్ళబుచ్చుతున్నాడో చూద్దాం..
Friday, May 21, 2010
BSNL:బాయ్ సాబ్ నహీ లగేగా..
బీప్.. బీప్... అంటూ మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది.. ఏంటా అని చూశాడు మా ఫ్రెండు... పాపం గర్లు ఫ్రెండు మెసేజీ కోసం ఎదురు చూస్తున్నాడేమో (ఈ విషయం నాకైతే తెలీదు జస్ట్ నా guess అంతే ).. నిరాశతో కూడిన నిర్లిప్తత అలుముకున్న ఆగ్రహపూరిత వర్ణం దాల్చింది తన మొహం.. ఏంటి మేటర్ అని అడిగితే అప్పుడు తనే తిరిగి నన్ను ప్రశ్నించాడు..
ఐశ్వరాయ్ ఎవరు అని.. ??
నేను మనోడ్ని తేడాగా చూస్తూ... ఏదో చెణుకు విసిరేలోపే తనే మళ్ళీ స్టార్టు చేశాడు
డి1: actor
డి2: politician
అప్పుడర్దమైంది నాకు ఇందాక మెసేజ్ చదవగానే తన మొహంలో భావజాలాలు అలా ఎందుకు ప్రస్ఫుటమయ్యాయో.. ఎందుకంటే నాదీ అదే network (BSNL)..
పాపం ఆ మెసేజీతో పాటు ఇంకొన్ని మెసేజీలను... అంటే.. రజనీకాంత్ ఎవరు.. చార్మినార్.. హైదరాబాద్లో ఉందా.. కేరళలో ఉందా.. లేక మీ పక్కింట్లోఉందా.. ఇలాంటివన్నమాట..
చూపించి తన బాదని నాతో చెప్పి వాపోయాడు.. (నాతో చెప్పి మాత్రం ఏం లాభం.. జోగీ జోగీ రాసుకుంటే బూడిదే కదా రాలేది)..
అస్సలు మా ఫ్రెండుకి ఉన్న అసలు బాద ఇది కాదంట.. ఫుల్ సిగ్నల్ ఉన్న ఏరియాలో సెకెండు ఫ్లోరు పిట్టగోడెక్కి స్థంభం పట్టుకుని ఫోన్ చేసినా.. (ఆ చేసిన ఫోను మనోడి ఫోన్‌కి ప్రక్కనే ఉన్నా).. మీరు కాల్ చేస్తున్న subscriber బాత్రూమ్‌కెళ్ళారు.. లాంటి సిల్లీ రిప్లైలు వస్తాయి కానీ ఫోన్ అందదు.. కానీ సిగ్నల్ ఒక్క డిజిట్ మాత్రమే ఉన్న ల్యాబ్లోకైనా సరే వాడు పంపించే యాడ్ మెసేజీలు వెతుక్కుంటూ వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ వాపోయాడు... పాపం (ఈ జాలి నాక్కూడా వర్తిస్తుంది). నాకైతే డౌటే.. శాటిలైట్ నెట్‌వర్కుతో పాటు బీఎస్సెన్నోళ్ళకి అబ్రకదబ్ర, తావీద్ మహిమ లాంటి మంత్ర శక్తులేవో ఉండుంటాయి, లేప్పోతే సిగ్నలున్న దగ్గర ఫోనే వెళ్ళంది అది లేని దగ్గరకి మెసేజెస్ ఎలా వెళతాయ్...
పోనీలే దేవుడి దయ వలన మేసేజీలో ప్రశ్నలిచ్చి సమాదానం ఇవ్వాలో వద్దో అనే చాయిస్ మనకే వదిలేస్తున్నాడు.. అలా కాకుండా.. సమాదానం తెలిసి కూడా రిప్లై చెయ్యలేదో.. నీ బుర్ర వేయి వ్రక్కలగుగాక అని పంపట్లేదు కదా అని సర్ది చెప్పాను..
ఆ మద్యన ఎవరో అంటే విన్నాను BSNL అంటే...
బి : బాయ్
ఎస్: సాబ్
ఎన్: నహీ
ఎల్: లగేగా
అంట... బాగా సరిపోయింది...(అంటే బాయ్ సాబ్ కాని వాళ్ళు లగేగానా అని అడగొద్దు)
ఈ లోపు ఇంకో మెసేజ్ వచ్చింది.. దాని తాత్పర్యం.... సారీ సారాంశం ఏంటంటే... ఎవరో పూజ అంట.. ఫ్రెండ్సు కోసం ఎదురు చూస్తూ ఉందంట.. తనతో మనం ఫ్రెండ్సిప్ చెయ్యొచ్చంట.. మెసేజీ కేవలం ఐదు రూపాయలేనంట.. మనోడు మళ్ళీ ఆవేదనా పూరిత బిక్క మొహం వేసుకుని.. ఏం చెయ్యమంటావ్ మౌళీ... ఐదు రూపాయలు పోతే పోయాయ్.. బూతులు రాసి మరీ ఎస్సెమ్మెస్ పంపేయనా అన్నాడు... దానికి నేనన్నానూ.. అయ్యో బూతుల్ని వాళ్ళు లైట్‌గా తీసుకుంటారూ.. ఒక ఐదు వేలు అప్పుంటే అడుగు.. అన్నాను.. మా వాడు ఒక చిరుమందహాసాన్ని జవాబుగా ఇచ్చిన తర్వాత ఆ సంభాషణ ముగిసింది..

Subscribe to:
Posts (Atom)