ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Showing posts with label fun sake. Show all posts
Showing posts with label fun sake. Show all posts
Wednesday, August 18, 2010
ఛీ నా జీవితం..
Tuesday, June 29, 2010
పాంచాలీ పంచ లవర్ విసర్జకీ..!!
| దుర్యోధనుడు కనుక ఇరవై ఒకటో శతాబ్ధంలో ఉండి, పాంచాలి అనే అమ్మాయికి లవ్ ప్రొపోజ్ చేసి ఫెయిలైతే ఆ డైలాగులు... బహుశా ఇలా ఉండొచ్చేమో.. దుర్యోధనుడి fans ఎవరైనా ఉంటే హర్టవ్వద్దు ప్లీజ్.. "పాంచాలీ పంచ లవర్‌విసర్జకీ.. ఏటే ఏటేటే.. నీ ఎర్ర బస్సు తప్పి పోయిన తొక్కటాట్టహాసమూ.. ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక.. కిడ్నీలని వెన్ను పూసతో గుచ్చినట్లు.. నీ ఎకిలి నవ్వులే నా చెవిలో మార్మ్రోగుచున్నవే.. అహో బేవార్సి బచ్చాల తిలకుండనై రోజుకి ఇరవై గంటలు పడుకునే బద్దక ధవుళేయుండనై .. స్నేహ, గురు, బందు మిత్ర పరివారమంతయూ బూతులు తిడుతున్ననూ దులుపుకొని పోగలుగు నిస్సిగ్గరినై.. ఎదవెవరన్న వేయి మందిలో మొదట చేయెత్తు ధైర్యశాలినై, వెర్రిబాగులతనములో సహస్ర వీరతాళ్ళ సమన్వితుడనై.. అమానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక ఒళ్ళు బలిసి పగులబడి నవ్వుటయా? అహో! తన విసర్జక లవర్లలో నన్నూ ఒకడిగా భావింపక, సమ్మానింపక లవర్ధర్మ పరిశ్చక్తయై.. లజ్జా విముక్తయై.. ఆ బంధకి నన్నేల గేళి చెయ్యవలె.. ఔనులే! లవర్నొదిలేసిన lassకి లజ్జేమి! సిగ్గేమి! పంచ లవర్ విసర్జక పాతకి యని ఎరింగియూ నేనేల ట్రై చేయవలె? ఎదవకి ఇంత కంటే గొప్ప ఫిగరు దొరకదని సరిపెట్టుకుందునా? ఐనా అది ఒప్పుకొనునా? ఐననూ నేనసలు ఎందుకు ప్రేమించవలె? ప్రేమించితిని పో! దీనినెందుకు గాంచవలె? గాంచితిని పో ! ప్రేమించ డిసైడెందుకు అవ్వవలే? డిసైడైతిని పో! నేనెందుకు ప్రొపోజ్ చెయ్యవలె? చేసితిని పో! అదలా ఎర్ర బస్సు తప్పోయిన తొక్కటాట్టహాసమెందుకు చేయవలె? చేసినది పో! దానికి నేనెందుకు ఫీలవ్వవలె? హతవిధీ! హతవిధీ! హతవిధీ! అవమాన జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నవి మామా! పాంచాలి కృతావమాన మానసుడనై .. అవమానాతిమాన వర్జితుడనై .. మర్యాధిక్రమనయయి మేల్కొనుండుటయా? ముసుగు తన్ని నిద్ర పోవుటయా? ఛీ! ఛీ! ఆడుదానిపై పగ సాధింపలేక ముసుగు తన్ని నిద్రపోయాడని అపఖ్యాతి ఆపై వేరొకటియా! ఇప్పుడేది కర్తవ్యం! మేల్కొనుటయా? నిద్ర పోవుటయా?"
|
Thursday, June 10, 2010
అసలేమయ్యిందంటే...!?!?!
| నేనొక్కన్నే నడిచి వెళ్ళి పెంటగానూ, వైట్ హౌసూ ఏ ఆయుధమూ లేకుండా అధీనంలోకి తెచ్చుకుని అమెరికాని ఇండియాలో కలిపేసి విజయగర్వంతో ఊగిపోతున్నట్టు గానూ.. రెండు ప్రపంచ యుధ్ధాల్ని ఒకేసారి చేసి వచ్చినంత అలసటగానూ.. పుట్టినెంటనే ఏ క్లాసూ అవసరం లేకుండా పిహెచ్.డీ. చేసేసినంత గొప్పగానూ.. ప్రపంచంలోనున్న అందరు అందగత్తెలూ, ఎవరూ దొరకనట్టు నా వెనకే పడుతున్నంత అద్భుతంగానూ.. వైకుంఠపాళి ఆటలో పాముల గడిలన్నీ దాటి వెళిపోయిన ఆటాగాడిలాగానూ.. ఆస్కారు, నోబెలు, బుక్కరు ప్రైజులు మూడూ కలిపి ఒక్కసారే తీసుకున్నంత ఆనందంగానూ.. భూభారాన్నంతా మోస్తున్న అట్లాస్‌కి దాని పీడ విరగడైనంత సంతోషంగానూ, పిల్లలందరూ సెటిలైపోయి బీచ్ సీనిక్ వ్యూలో పచ్చటి లాన్ ఎదురుగా ఉండగా బాల్కనీలో వాలు చైర్ ఉయ్యాలలో ఊగుతూ కూర్చున్న ఒక తండ్రి ఉన్నంత ధీమాగానూ ఉన్నాన్నేను... ఇంతకీ ఏం పీకావ్..!?!?!?! ఇదే కదా మీ ఆశ్చర్యార్దక సహిత ప్రశ్నార్ధకం.. ఏం లేదు ఇప్పుడే ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పనిని పూర్తి చేశాను.... అదేనండీ.. "బట్టలుతుక్కున్నాను.." మరిప్పుడు చెప్పండి పైన చెప్పినవన్నీ అతిశయోక్తులంటారా?? |
Monday, June 7, 2010
పోస్టుపోన్...
| మన ప్రపంచంలో ఉన్న symptoms ఏవీ ముందుగా కనపడనివ్వని అతి పెద్ద diseasesలో postponementని ఒకటిగా చెబుతాన్నేను, నా అంతట నేనే దాని బారిన చాలా సార్లు పడ్డాను, symptoms ఐతే కనపడవ్ కానీ.. పర్యవసానాలు చాలా ధారుణంగా ఉంటాయ్.. ప్రతి ఒక్కరికీ ఎపుడో ఒకప్పుడు దీని గురించి తెలిసొచ్చే ఉంటుంది.. |
Thursday, June 3, 2010
నేను ఎటకారస్తున్నా..!! :)
| ఇది మరీ ధారుణం కదండీ, ఏదో మాట వరసకి ఏదన్నా అంటే అలా ఎటకారస్తున్ననేస్తున్నారు వీళ్ళంతా. విషయమేంటంటే నా ఫ్రెండొకడున్నాడు వాడి దగ్గర నేనొక పుస్తకం తీసుకున్నాను (తీసుకున్నాను కానీ చదివేడిస్తే కదా), దాన్ని తిరిగిచ్చేద్దామంటే ఆ రోజు తీరిక లేక నా ఇంకొక ఫ్రెండుని రిక్వెస్టు చేసి ఆ పుస్తకాన్ని దాని "ఓనరు"డుకిచ్చేయమని చెప్పాను(ఓనరుడు అన్నానని వీడు నన్ను ఎటకారస్తున్ననేశాడు). ఇక్కడొచ్చిన చిక్కేంటంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ముఖపరిచయం లేదు, అందువలన బుక్కు ఇవ్వాల్సిన నా ఫ్రెండడిగాడు ఆ ఓనరుడి పోలికలు ఎలా ఉంటాయో చెప్పమని అడిగాడు. వర్ణనలు చెయ్యటానికి నేనేమీ కాళిదాసుని కాదు కదా ఐనా చెప్పాను, చిరంజీవికి గాలి తీసేస్తే వెలిగిపోతున్న మోహన్‌బాబు మొహంలాగా ఫేసూ, చొక్కాలో ఇల్లు కట్టుకుని బ్రతికేస్తున్నట్టు బాడీ (మనోడు బాగా సన్నంగా, పీలగా ఉంటాడులే), చీకేసిన తాటి టెంకెలాగా జుట్టూ (అంటే ఎలా ఉంటే అలా చెప్పకుంటే వీడు పోల్చుకోలేడు కదా మరి).. ఈ మహానుభావుడు వాడి దగ్గరకెళ్ళి పుస్తకమిచ్చేసి ఉత్సాహం ఆపుకోలేక వాడితో ఫ్రెండ్సిప్ చేసుకుని మరీ నేను చెప్పిన పోలికల్ని వాడికి లీక్ చేసేశాడు.. మన బుక్కు ఓనరుడిగాడికి బాగా మండినట్టుంది, వాడు ఫోన్ చేసి మరీ నన్ను ఎటకారస్తున్నని తిట్టేశాడు.. పాపం నేను. నిజాలు చెప్పినందుకు ఇలా తిట్లు కాయాల్సొచ్చింది.. వీడు, అదే ఓనరుడు నన్ను ఇంకోసారి కూడా తిట్టేశాడు, ఆ స్టోరీ ఏంటంటే.. వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు, నేను బిజీగా ఉండి చూసి కూడా తియ్యలేదు, కానీ ఆ విషయం చెబితే వాడు నమ్మడు ఇంకా ఫీలౌతాడు కూడానూ, బిజీ తగ్గిపోయిన తర్వాత నేనే వాడికి కాల్ చేస్తే ఫోన్ లిఫ్టు చెయ్యలేదెందుకని అడిగేశాడు.. ఫోను సైలెంటులో ఉందీ వినబడక తియ్యలేదని చెప్పా.. అంటే వైబ్రేషన్ లేదా అన్నాడు.. వైబ్రేషన్ ఉంది కానీ ఫోనేమో మెత్తటి ప్రదేశం మీద రెండు క్లోత్స్ మద్యలోఉండిపోయింది కాబట్టి తెలియలేదు అన్నా, నా నోటి దురదని వాడు క్యాచ్ చేసేశాడనుకుంటా డౌటొచ్చి డీటెయిల్డుగా చెప్పమన్నాడు.. ఏం చేస్తాం చెప్పాను.. "అది కాదురా ఫోను పోకెట్లో ఉందీ అది మరి రెండు క్లోత్సు మద్యలో ఉన్నట్టే కదా.. ఆ పోకెట్టేమో నా తొడపైన ఉంది, తొడంటే మరి మెత్తని ప్రదేశమే కదా, నువ్వంటే బొత్తిగా బోన్ గాడివి వైబ్రేషన్ వస్తే బాడీ అంతా ఊగిపోతుంది" అనే సరికి టపీ మని ఫోను పెట్టేశాడు, సాయంత్రం వరకూ వాళ్ళ వీధిలో గుమ్మం దగ్గర కర్ర పట్టుకుని మరీ నిల్చున్నాడంట, నేనా దారిలో వెల్తానేమో ఒక చూపు చూడొచ్చని.. మనమటువైపు వెళ్తే కదా, కోపం తగ్గాక ఫోన్ చేసి కనీసం ప్ఫది సార్లనుంటాడు నన్ను ఎటకారస్తున్నని.. ఏం నాకు కోపం రాదా నేను కూడా కర్ర పట్టుకుని నిల్చున్నా గుమ్మం దగర, వాడు కూడా మా ఇంటి వైపు రాలేదు. నేను కొంచెం లావుగా ఉంటానేమో(ఒక మోస్తరు కంటే చాలా తక్కువే) ఐనా మా మామయ్య నన్ను ఇద్దరు మనుషులంటాడు (కనీసం ఒకటింపావు కూడ ఉండనంటే వినడే). ఒక సారి తనూ నేనూ తన కారులో కూర్చున్నప్పుడు దానికి బ్యాటరీ బాగులేక(ఇది మెకానిక్ చెప్పాడు) స్టార్టు కాకపోతే, కారు ఇద్దరు కంటే ఎక్కువమంది ఉంటే వెళ్దంట అన్నాడు, మరి నువ్వు దిగిపోతే కారెవరు నడుపుతారూ అన్నాను.. దానికే ఆయన నన్ను ఎటకారస్తున్ననేశాడు.. మీరే చెప్పండీ నేను ఎటకారస్తున్నా మా మామయ్యనా.. ఏంటో నోట్లోవేలెడితే లాలీపాపలో షుగరెయ్యటం మర్చిపోయారేంటీ అని అడిగే అమాయకున్ని నేను, ఇలాంటోడ్ని అందరూ ఎటకారస్తున్ననేయడమేనంటా!!.. ఇదేమన్నా న్యాయంగా ఉందా..?? :) |
Sunday, May 16, 2010
సండేనాటి మండే ఎండా మజాకా...
ఈ మండే ఎండాకాలంలో
సండే నాడు గుండెలు మండుతుంటే
తడి తుండు గుండుపై వేయించి
మానని పుండంటి ఉక్కపోతని చూడ
రండి రండంటూ గండర గండడిలా రెచ్చిపోతున్న
సూర్యుని తాపంలో పండంటి మల్లెపూచెండు కూడా మాడిపోతుంటే
ఎంచక్కా ఏసీ రూములో దిండేసుకుని పండే వాణ్ణి చూసి...... మీరేమంటారు..
సండే నాడు గుండెలు మండుతుంటే
తడి తుండు గుండుపై వేయించి
మానని పుండంటి ఉక్కపోతని చూడ
రండి రండంటూ గండర గండడిలా రెచ్చిపోతున్న
సూర్యుని తాపంలో పండంటి మల్లెపూచెండు కూడా మాడిపోతుంటే
ఎంచక్కా ఏసీ రూములో దిండేసుకుని పండే వాణ్ణి చూసి...... మీరేమంటారు..
Subscribe to:
Posts (Atom)
