- కోరికలు లేని మనిషే చివరికి, దైవత్వాన్ని సంతరించుకోగలడని పురాణపురుషులందరూ చెబుతారు కదా, మరి దేవతలు అమరత్వం కోసం, క్షీరసాగర మధనం, తరువాయి బాగంలో అమృత సేవనం ఎందుకు చేసినట్టూ... దేవతలకి కోరికలుండొచ్చా??,
- అమృతం తాగిన దైవ స్వరూపుడే అమరత్వాన్ని సంతరించుకోగలిగితే, మరి, వానరుడై, అమృతపానం చేయని ఆంజనేయుడూ, నరులైనట్టి పరశు రాముడూ, అస్వథ్ధామా ఎలా మృత్యుంజయులయ్యారూ??,
- మత గ్రంధాల్లో ఉండే ప్రతి వాక్యానికీ రెండేసి, మూడేసి రకాలుగా వ్యాఖ్యానాలూ, వివరణలూ ఉంటూ... ప్రశ్నించే ప్రతి విషయానికీ మసి పూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నిస్తారు.. ఏం ఆ గ్రంధాలని వ్రాసేవాళ్ళకి తిన్నగా రాయటం రాదా? లేక పైత్యమా?
- మన ఇండియన్సు చాలా మందికి వేరే ఏ దేశం ఏదైనా సాధిస్తే.. మా తాతలు ఎప్పుడో నేతులు తాగారని.. వెన్ను చరుచుకునే అలవాటుంది.. డియర్ రీడర్ మీరు అందులో భాగమా, వేరేనా??
- మనిషి తనకి తెలివి ఉన్నంత మాత్రాన తనని తాను అన్ని జీవులకంటే సుపీరియర్ అని ఎందుకనుకుంటాడు... తను కూడా చచ్చిపోతాడు, చావంటే భయపడతాడు, చావకుండా ఉండేందుకు అన్ని జీవుల వాటి వాటి విధానాల్లో అవి ప్రయత్నించినట్లే తాను తన దారిలోనే ప్రయత్నిస్తాడు... జీవించటం కూడా, పెంచుతాడు, పెరుగుతాడు, సంపాదిస్తాడు, కంటాడు, ఆటవిక న్యాయంలాగానే దోచుకుంటాడు, పొట్ట ఆకలే కాకుండా చాలా ఆకల్లతో కొట్టుమిట్టాడుకుంటూంటాడు.. మరి ఎందుకు తను సుపీరియర్.. నాలాగా టైప్ చెయ్యటం రాదని, నీలా చదవటం తనకి రాదని ఒక చింపాంజీ ఏమీ ఫీలవ్వదు కదా... మరి ఎందుకు నువ్వూ, నేనూ దానికంటే గొప్ప... ??
- ..................
|