ఈ ప్రపంచంలో అమ్మాయిలెవరూ నాకు సైట్ కొట్టకపోతే ఏమైంది.. నా ఊహాలోకం నాకు లేదా.. ఐనా నా డ్రీం గర్లు ముందు, ఈ మిస్ వరల్డులూ.. మిస్ యూనివర్సులూ ఎందుకు పనికొస్తారూ.. అఫ్‌కోర్స్ నా డ్రీం గర్లుని నేనూ ఇంత వరకూ చూడ్లేదనుకోండీ.. ఏమైనా ఆ అందమే అందం..
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, July 11, 2010
నా సఖియా..
Saturday, July 10, 2010
భాద్యత(Responsi.."ability")
అదేంటో భాద్యతాయుతంగా ఉండేవాళ్ళు ఎంత సౌమ్యంగా ఉన్నా.. ఎంత సామరస్యంగా డీల్ చేసినా.. వాళ్ళను చూస్తే ఒక రకమైన భయం, మరో రకమైన గౌరవం కలుగుతుంటుంది అందరికీనూ.. భాద్యతాయుతంగా లేని వారికి ఎంత కౌశలం, పాటవం ఉన్నా.. ఆ సాధికారత రాదెందుకనో.. కానీ బాగా భాద్యతతో ఉన్నావాళ్ళలో, సరదాగా మాట్లాడేవాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను.. బహుశా భాద్యతా,భారాలు మిత్రులై.. భాద్యతా, సరదాలు శత్రువులై ఉంటాయనుకుంటా.. ఐనా అందరూ నాలాగా ఫన్నీగా ఉంటారనుకుంటే ఎలా.. కదా?! :) ... ఐనా ఏంటో.. ముందుగా ఎంజాయ్ అనే నెపంతో చిన్న చిన్న "కోరికలు" తీరేందుకు జీవితమనే మురుగు నీటి ఊబిలో దిగుతారు జనాలు... ఎంజాయ్‌మెంట్ చాక్లెట్ కోటింగున్న చేదు మెడిసిన్ లాగా ఉంటుంది.. కోటింగు కరిగిపోగానే.. భాద్యతలు.. ప్రతి ఒక్కరూ జీవితమనే ఊబిలో ఈదుతూ చిన్నప్పటి కుట్రలీశ్వరన్ రేంజిలో బిల్డప్పులిచ్చేవాళ్ళే... ఇంకా సరదా ఐన విషయం ఏంటంటే ఎవరెంత తక్కువ లోతు మునిగిపోతే వాళ్ళంత బాగా జీవితాన్ని గెలిచినట్లు వాళ్ళలో వాళ్ళే డిసైడ్ చేసుకుని.. వాళ్ళ గెలుపుతో, ఓడిపోతున్నారని వాళ్ళు ఫీలవుతున్నవారిని గేళి చెయ్యటం వారి సరదా.. ఒడ్డు మీదే ఉండిపోదామనుకునే వాళ్ళని.. లోపలికెళ్ళేవాళ్ళు లాగేస్తుంటారు.. ఒడ్డునున్నవాళ్ళు తోసేస్తుంటారు.. కొద్ది కొద్దిగా అర్దం చేసుకునేందుకు ట్రై చేసే విషయమేంటంటే బావ దారిద్ర్యపు భాషణాన్ని ఎవరూ పట్టించుకోరు కానీ.. భాద్యతా దారిద్ర్యపు జీవితాన్ని మాత్రం చేతకానితనం క్రింద భావిస్తారు...... జీవితం అనేది ప్రకృతి ఐతే జీతం అనేది వికృతి అంట... దాని ఆకృతి మళ్ళీ భాద్యతేనంట.. మరైతే కెలామిటీ అంటే ఏ కృతో?.............. ఏదో వ్రాశాను..... కారణాలేమీ లేవు.... ఇంత చదివాక మెంటల్ హాస్పిటల్‌కి ఫోన్ చెయ్యకండేం..... ఏం లేదు ఇలా వ్రాయగలిగే వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోవటం చాలా కష్టమక్కడ....
|
Friday, July 9, 2010
ఆ కన్నీళ్ళ విలువ ఎంతో?!
మార్చిలో ఒక రోజు కైలాసగిరి ప్రక్కనున్న తెన్నేటి పార్కులో సాయంత్ర సమయంలో, జోరుగా వీస్తున్న గాలి హోరులో ప్రకృతిలో మమేకమైపోయి ఉన్న మనసుని తట్టి లేపిన కొన్ని ఊహలు...
|
Wednesday, July 7, 2010
మసాజ్...
ఇందాకనే ఈ మసాజ్ ఫోటోని ఏదో వెబ్‌సైట్లో చూశాను.. ఈ మద్య హైదరాబాద్‌లో జరిగిన మసాజ్ ఉదంతాలు గుర్తొచ్చి.. మసాజ్ చేయించుకుంటున్న ఉడతకి కమీషనర్ ఎక్కడొస్తాడో అని భయంతో మసాజ్ చేయించుకున్నట్లుగా మార్చి ఇక్కడ పోస్ట్ చేశాను.. సరదాగా అనిపిస్తే మీరూ నవ్వుకోవచ్చు.. మీ వ్యాఖ్యానంతో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూపించండి....
|
విజిటింగ్ ఎ 'మోషన్'లెస్ ఫ్రెండ్...
నేనూ మా ఫ్రెండూ కలిసి మా ఇంకో ఫ్రెండింటికి వెళ్ళాం జస్ట్ అలా సరదాగా మాట్లాడుకుందామని. వెళ్ళేసరికి వాడు వాళ్ళింట్లో డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని దిగాలుగా మొహం పెట్టుకుని కళ్ళు పీక్కుపోయినట్లుగా ఉన్నాడు.. బాగానే పలకరించి మాతో పాటు కూర్చున్నాడు.. వాడున్నట్లుండి వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు.. ఆ మోనో యాక్షన్ డైలాగులిలా సాగాయి.. "అది చెప్పినట్లు నేను వినటమేమిటి.. అయితే గియితే నేను చెప్పినట్లు అది వినాలి.. దాని వలన ఎన్ని సార్లు అనవసరమైన తిరుగులు తిరగాల్సొచ్చిందో.. దాని పీడ విరగడైతే నీకొక కొబ్బరి కాయ కొడతాను దేవుడా.. అబ్బబ్బ క్షణానికొక దేశమెల్లి వచ్చినంత పనయ్యింది.... " ఇలా వాడి డైలాగ్ డెలివరీ సాగుతుంటే మద్యలో కల్పించుకుని అడిగాడు నాతో పాటుగా వచ్చిన ఇంకో ఫ్రెండు "అసలేమయ్యిందిరా, విషయం ఏమిటీ? ఏమైనా లవ్ ఫెయిల్యూరా? మాక్కూడా తెలియకుండా నువ్వు లవ్వెప్పుడు చేశ్శావేంటి?" దానికి వాడి సమాధానం, "ఒరేయ్ సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి." ఈ డైలాగు విన్నాక నేనన్నాను "ఒరేయ్, ఆ కష్టాలేవో చెబితే సీత కష్టాలకి ఆంజనేయుడంత సహాయం చెయ్యలేకపోయినా కనీసం విభీషణ సహాయం చేస్తాం కదా" అని. దానికి రిప్లైగా వాడన్నాడు "లేదురా ఇది ఎగస్ట్రీమ్‌లీ పర్సనల్, అడగద్దు ప్లీజ్" అన్నాడు.. చదువుతున్న మీకు మండినట్లే నాకూ మండింది.. మరి అలాంటోడివి అలా ఏకపాత్రాభినయం ఎందుకు చెయ్యాలని వాడిని దులిపేసి.. మేమొచ్చామని వంటింట్లో టీ తయారు చేస్తున్న ఆంటీగారిని(మా ఫ్రెండు వాళ్ళ అమ్మ) విషయమేంటాంటీ, లవ్వేమైనా ఫెయిలయ్యాడా అని అడిగాను.. దానికి ఆంటీ పగలబడి నవ్వి.. ఔను బాబూ మోర్నింగు నుండీ వాడికి మోషన్స్.. అందుకే బాత్రూముకీ వాడికీ లవ్ ఫెయిలయ్యీ అలా మూలుగు రూపంలో ఏకపాత్రాభినయార్తనాదాలు చేస్తున్నాడు.. వాడిని నువ్వు దులిపినట్లే నేనూ దులిపాను, కానీ అలాగే మాట్లాడుతున్నాడు.. ఈ లోపు ఒక గావు కేకలాంటి అరుపుతో మా ఫ్రెండుగాడి కేక వినిపించింది "మమ్మీ, వాడికెందుకు చెప్పావ్.. ఇంక చూసుకో వాడేదో ఎడ్వర్టైజ్‌మెంటు ఏజెంటులాగా అందరికీ చెబుతాడు" అన్నాడు.. దానికి మేమందరం పగలబడి నవ్వాం. ఇంకొంత సేపు మాట్లాడాక, మందులేసుకోరా లవ్ సక్సెసైపోతుందీ అని వాడికో ఎదవైజ్ ఇచ్చి వాడికి మందులు తీసుకొద్దామని వెళుతుంటే వాడు పిలిచి రిక్వెస్టింగు స్వరంతో స్లో మోషన్లో ఎమోషన్‌తో ఒక ఆర్డరేశాడు.. "ఒరేయ్, ఈ విషయం ఎవరితోనూ చెప్పనని ప్రామిస్ చెయ్యి ప్లీజ్.." అన్నాడు.. నేనందుకు ఒప్పుకుని ఇద్దరికి తప్ప ఎవరికీ చెప్పనని ప్రమాణం చేశాను.. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరూ అని ఆసక్తితో అడిగాడు.. కొద్దిగా దూరంగా జరిగి "అడిగినోళ్ళు, అడగనోళ్ళు" అని జవాబు చెప్పి లగెత్తాను.. వాడికి మోషన్స్ కావటం వలన వాడిలో మోషన్ తగ్గి నన్ను పట్టుకోలేక ఆగిపోయాడు.. బయటకొచ్చాక మెడికల్ షాపులో వాడికి కావాల్సిన మందులు కొని వాళ్ళ మమ్మీకి ఇచ్చేసి వాడికి అందకుండా పరిగెట్టుకొచ్చేశాక నేనూ నాతో వాడిని విజిట్ చెయ్యటానికొచ్చిన ఇంకో ఫ్రెండూ, ఇద్దరం కలిసి చాలా సేపు నవ్వుకున్నాం, తల్చుకుని తల్చుకుని మరీ...
|
Sunday, July 4, 2010
తానసలు నా కొరకు జన్మించెనో లేక మానేసెనో..!!??
రాసిన కవితకి సూటవ్వని వ్యాఖ్యానాన్ని చేస్తున్నానేమో ఇక్కడ, లేదులే సూటయ్యే వ్యాఖ్యానమే.. ఔను మరి లవ్ చేసేవాడికి ఫీలింగ్సుండకూడదా.. ఇంట'ర్మీడియట్' స్టేజిలో లవ్ చేస్తే.. మూతి మీద మీసాలు కూడా లేవు.. నీకు లవ్వెందుకు అంటారు.. అదే డిగ్రీ లాంటి టైములో లవ్ చేద్దామంటే.. ప్రతి ఒక్కరూ మొహం అద్దంలో చూసుకోమనేవారే.. మరీ అంత ధారుణంగా ఉన్నానా నా ప్రొఫైల్ ఫోటో చూసి మీరే చెప్పండి.. పోనీలే అనుకుని పిహెచ్.డి చేసేటప్పుడు లవ్ అనే థాట్‌ని ఎవరితోనన్నా షేర్ చేసుకుంటే చాలు... ఇదేదో లవ్వంటే పూర్తిగా ట్రాష్/నేరం అని గుర్తించాల్సిన ఏజిలాగా చూస్తారు జనాలు.. ఏమో.. ఎంతమంది జనాలు లవ్‌ని ఏమన్నా.. నాకు మాత్రం లవ్వు చాలా గ్రేట్.. అందుకే ఎప్పటికైనా నాకు ఐ లవ్ యూ అని చెప్పే అమ్మాయి కోసం ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాను.. ఎవరికైనా ప్రొపోజ్ చెయ్యమని సలహా ఇవ్వకండి, అలాగైతే మళ్ళీ మొహం అద్దంలో చూసుకోమనే 'డై'లాగొస్తుంది, మరీ అలా అద్దం సహనాన్ని పరీక్షించటం అనేది అమానుషం.. కాదేటి మరి??
|
Friday, July 2, 2010
ఫిరానా: ఎప్పుడూ ఆకలితో ఉండే రాక్షసి చేపలు
నిన్ననే ఒక మెయిల్ చూశాను.. అందులో నీటి ఒడ్డున ఏదో పార్టీ జరుగుతున్న డెస్కు మీద జనాలు పరుగు లెత్తుతున్నట్టు కనపడుతున్నారు.. దాని తర్వాతి చిత్రాలలో చూస్తే.. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం.. ఒక మోస్తరు నుండి తీవ్రస్థాయిలో గాయ పడిన మానవ మృత దేహాలు కొన్ని ఆ నీళ్ళలో కనిపించాయి.. దానికి కారణం ఏదోదారుణ మారణ హోమం అనుకున్నాను.. కానీ అరచెయ్యంత కూడా లేని కొన్ని చేపలు వాళ్ళని అలా తినేశాయని తెలిసి నిర్ఘాంతపోయాను.. కార్డేట్స్..కెరాసిడే..కెరాసిఫార్మ్స్ కి సంబంధించిన చేపలంట ఇవి (బయలోజికల్లీ).. అంతే కాకుండా ఇవి సర్వభక్షకులంట(ఆమ్నివోరస్). వీటి సైజు ఆరు నుండి పద్దెనిమిది అంగుళాల వరకూ ఉండి.. అమెజాన్, పెరాగ్వేలాంటి నదీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయంట.. అంతే కాకుండా బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా కనిపించాయని చెబుతారు.. దాని తర్వాత ఒక వీడియో చూశాను.. ఎవరో ఆసామి ఒక ఎలకని ఫిరానా చేపలుండే ఎక్వేరియంలోనికి వదిలాడు.. అంతే నిమిషం కూడా కాకముందే దాని వెన్నుపూస మాత్రం మిగిల్చాయవి.. వీటి పల్లు మరీ దారుగా దారుణంగా కనిపిస్తున్నాయి తెలుసా అమ్మో, ఒక్క ముక్కలో చెప్పాలంటే వీటిని రాక్షస చేపలని చెప్పొచ్చు.. నా సలహా ఏంటంటే మీరెప్పుడైనా తెలియని ప్రదేశాల్లో ఏదైనా ఏటిలోనో లేక, చెరువులోనో.. దూకే ముందు అక్కడి పరిస్థితుల గురించి, విష పురుగుల గురించి విచారించి మరీ దూకటం మంచిదని నా ఉద్దేశ్యం.. ఒకవేళ మీరు వేరే దేశంలో ఉంటే అప్పుడు ఇది మరీ అవసరం.. ఇక్కడ ఇందాక నేను చెప్పిన విగత జీవులైన మానవుల ఛాయా చిత్రాలు ఉన్నాయి.. మీది వీక్ గుండె ఐతే చూడటం మానేయండి.. ^^^ ^^^ ^^^^ ^^^^^ ^^^^^^ ^^^^^^^ ^^^^^^^^
|
Thursday, July 1, 2010
మనసా మన్నించవా...
..........నిజమే ఎన్నాల్లపాటో ఒంటరిగా వదిలేసి, తన ఉనికినే గుర్తించకుండా మనసుని, ఒక్కసారిగా పలకరించినంత మాత్రాన మాట్లాడేస్తుందా.. అలిగి వెళ్ళి తను ఎవరికీ కనిపించని చీకట్లోనే కూర్చుంటుంది... దానికి వేరే మనసు తోడూ లేక.. తన మనిషీ పలుకరించక.. జీవితమంతా విషాద నిశీధిలాగనే భావించి.. తన కన్నీటి ధారలతో శోక సంద్రాన్ని నింపి.. అందులోనే దుమికి అంతమైపోతుందేమో, అందుకే మనసా మన్నించవా అన్నా, మాటా మంతీ లేక మూగగా రోధిస్తూనే ఉంది...............
|
రోబోట్ టోయ్ వీడియోలు..
| ఈ వీడియోలో ఒక చిన్న పక్షి రోబోట్ ఉంది.. దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తే బలే నవ్వొస్తుంది.. మీ మ్యూజిక్ సిస్టమ్ అలా ఒక చోటో కూర్చుని.. మ్యూజిక్ అందిస్తుంటే మీకు బోర్ కొడుతూ.. మంచి మూడ్ జనరేట్ అవ్వట్లేదా... వీలైతే దీన్ని ఈ వీడియోలో ఉండే రోబోట్‌ని ట్రై చెయ్యండి.. :) ఫన్నీ రోబోట్ ఫైట్.... నిడివి తక్కువే ఐనా కొంచెం బాగుంది.. చూడండి...
|
Subscribe to:
Posts (Atom)









