నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Thursday, August 19, 2010

కాటికి కాలు సాచేవెందుకే ఓ మనసా..

నా మనసే నన్ను ఇష్టపడను పొమ్మంటే, దానికి కావాల్సిన తోడుకి నేనెలా ఇష్టమౌతాను?, ఐనా సరే ఆశతో నా మనసుని లాలించ ప్రయత్నించాను. దానికి ఇష్టమౌనో లేక కష్టమౌనో...?
 
 

Wednesday, August 18, 2010

ఛీ నా జీవితం..

ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను..

Monday, August 16, 2010

15thఆగ్2010

ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దిన వేడుకలు జరిగాయ్, అందులో బాగంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సయ్యీద్ ఈ హస్నైన్ విద్యార్థి మరియు ఉద్యోగ సమూహాన్నుద్దేశించి ప్రసంగించారు. అందులో బాగంగా అరవై ఏళ్ళకి పైగా అభివృధ్ధి చెందిన స్వతంత్రానంతర భారతావని గురించి చెబుతూ, అదే పడిలో విశ్వవిద్యాలయం అభివృధ్ధి గురించి కూడా చెప్పారు. నేషనల్ ఎక్రెడిషన్ కమిటీ తొంభై ఏడు శాతం ఇచ్చిన మార్కింగుని, అలాగే ఇటీవల జరిగిన ఒక ఇంటర్నేషనల్ ర్యాంకింగులో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆసియాలో మొప్పై నాల్గవ స్థానాన్ని పొంది ఉండగా ఇండియాలో ఉన్న మరి ఏ ఇతర యూనివర్సిటీ కూడా కనీసం తొంభై లోపు ర్యాంకులో లేదని నొక్కి వక్కానించారు, భవిష్యత్తులో ప్రపంచపు మొదటి పది యూనివర్సిటీల వరుసలో ఉంచే ప్రయత్నాలు చేసేందుకు సిధ్ధంగా ఉన్నామన్నారు. యూనివర్సిటీకి ప్రస్తుతం ఉన్న 64Mbps ఇంటర్నెట్ లైను 1Gbps లైనుగా పెంచటం జరుగుతుందని చెప్పారు. భారతావని గురించి మాట్లాడుతూ, మన దేశాన్ని ఇండియా, భారత్ అనే రెండు పేర్లని కాలానుగుణంగా మారుతున్న వ్యవస్థీకృతమైన మార్పులనుద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య మరియు విద్యా రంగాలలో అభివృధ్ధిని ఇండియా లక్షణాలగానూ, ఏ విషయం ఎంత అభివృధ్ధి చెందినా, అది చేరని ఎంతో మంది ప్రజలు వాళ్ళ పరిస్థితులను భారత్ అనే పేరున్న దేశపు లక్షణాలుగానూ అభివర్ణిస్తూ, ఇండియా మరియు భారత్‌ల మద్య వ్యత్యాసం కాలచక్రంలో అధికమౌతుందే కానీ తగ్గట్లేదని వాపోయారు. అభివృధ్ధి పధంలో నడవటంతో పాటు ఈ వ్యత్యాసాన్ని సమసిపోయేట్టు చేయటం మనందరి భవిష్యత్కార్యాచరణ ప్రణాళికలో బాగం కావాలని పిలుపునిచ్చి తమ సందేశాన్ని ముగించారు.

కార్యక్రమంలో తరువాయి బాగంగా విద్యార్ధుల నృత్య, నాటకాదులను తిలకించిన మీదట.. స్వతంత్ర పర్వదిన కార్యక్రమం స్వీట్ పంపకంతో ముగిసింది..


vc with registrar

parade march fast by campus school students

Dance performance of campus school students

gathering of employees and students of University of Hyderabad

Dance performance of campus school students

Employees and students

Another picture of Dance performance of campus school students

Another picture Dance performance of campus school students

Another picture of Dance performance of campus school students

a person carves a rock into Islamic prayer

a person carves a rock into Islamic prayer (pic2)

Another person makes it into Jesus

Another person makes it into Jesus (pic2)

The other person makes it to Lord krishna's statue

When all above three see it, they start quarreling about the changes made

Then a patriot makes it into Gandhi statue, which all three accept. This explains the National integrity of the people that in turn tell us that India is a place of where exists Unity in Diversity

జై హింద్
 

యామిని...

ఆగస్టు 14వ తేదీన, SPICMACAY(society for promotion of  Indian Classical Music and Culture Among Youth) అనే ఒక సొసైటీ నిర్వహించిన యామిని అనే ఓవర్ నైట్ సంగీత సదస్సు అద్భుతంగా రసవత్తరంగా సాగింది, రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాలకి ఆరంభమైన ఆ సంగీత విభావరి, 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ సాగింది. ఈ సంగీత సభలో ఉదయం వరకూ ఉన్నవాళ్ళ సంఖ్యని ఆదారంగా చూస్తే అనిపిస్తుంది, శాస్త్రీయ సంగీతానికి ఆదరణ బాగానే ఉందీ అని.

క్రింది లిస్టులో ఉన్న సంగీత విద్వాంసులు తమ కౌశలంతో శ్రోతలను అలరించి ఆనంద ఢోలికలలో ముంచెత్తారు...



యామిని (క్లాసికల్ ఓవర్‌నైట్)
  • మోహన వీణ by పండిట్. విశ్వమోహన్
  • భట్ (పద్మశ్రీ అవార్డు గ్రహీత)
  • దృపధ్ Vocal by రహీమ్
  • ఫహిముద్దీన్ దగార్ (పద్మభూషణ్ అవార్డు గ్రహీత)
  • బోంబే సిస్టర్స్- శ్రీమతి. సరోజ & శ్రీమతి.లలిత (కర్ణాటక సంగీతం)
  • ఉస్తాద్ అబ్దుల్ రషీద్ ఖాన్ (హిందూస్తానీ క్లాసికల్ వోకల్)
  • శ్రీ. డి.బాలకృష్ణ (వీణ)
ఇక్కడ కొందరి ఫోటోలను వీక్షించవచ్చు

 








Thursday, August 12, 2010

కొన్ని సిత్రాలు...

వివిధ సందర్భాల్లో తీసిన కొన్ని ఛాయా చిత్రాలు, ఇవన్నీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో చిత్రీకరించటం జరిగింది..
ఇది సన్ రైజా, సన్ సెట్టా, చెప్పుకోండి చూద్దాం

Near to south part of campus@HCU






ఫోటో బాగుంది కదా.. 

ఈ ఫోటో @the end of ఎండాకాలం

రాళ్ళని ఇలా జున్ను ముక్కల్లా ఎందుకు కోస్తారో‌ ఏంటో.. ఈ ఫోటో‌ చూసినప్పుడల్లా నోరూరిపోతుంది

Don't be mistaken it for live tree biofuelling to generate light

Photography by Don @ Dusk డాన్ ఎవరనే కదా మీ డౌటూ.. ఆ డెన్ను లేని డాన్ నేనే

గచ్చు బాగా ఫోటో తీశాను కదా...

స్కల్ తయారు చెయ్యటానికి క్రిష్టల్ దొరక్కా... ఇలా..!!

Indian jones paper skull

నా కళాత్మక హృదయానికి నాకు నేను "చప్పట్లు", మీరు 'పుల్లట్లు' 'దోశలు' వెయ్యొద్దు ప్లీజ్..

I'm lucky ఆ పేపర్ గ్లాసుకి మాటలు రావు

చిన్నప్పుడు మూడు కొండలు మద్యన సూర్యుడు, రెండు పక్షులు, కొన్ని మేఘాలు ఒక నది అలా బొమ్మలు వేసేవాడిని... కానీ ఇక్కడ జస్ట్ రాళ్ళతో అడ్జెస్టైపోవాలంతే... అన్నీ కావాలంటే వీసీ ఒప్పుకోరు..

Bufello lake అచ్చతెలుగులో గేదెల సరస్సు...

బ్యూటీ ఆఫ్ బఫెల్లో లేక్.. అదేంటీ లేక్ ఆడా కాదు మగా కాదు.. కాబట్టి బ్యూటీఫుల్, హ్యాండ్సమ్‌లాంటివి మానేసి ఆసం అంటాను.. అదే అదే awesome

తామర తూడుల/కాడల నీడలు... మరీ ఎక్కువైందీ అవి తామర తూడులు కావు అంటారా.. ఎందుకొచ్చిన బాదండీ.. అలా కాదన్నారంటే నాలోనున్న తుంటరి వాటిని తామర కాకపోతే గజ్జి అంటాడు, అవసరమా చెప్పండీ..

ఏంటో వాటిలో ఉండేదీ డీఎన్‌యే/ప్రోటీన్లే మనలో ఉండేదీ అవే... మరెందుకో అంత డిఫరెన్సు... అదేంటో దేవుడు ఏ పనీ లేకపోతే హ్యాపీగా గూటీ బిల్లా ఆడుకోవచ్చుగా.. ఇలా సృష్టి చెయ్యాల్సిన పనేంటంటా.. మళ్ళీ ఏమన్నా అన్నామంటే అన్నామంటారు..

ఈ రెండు ఫ్లవర్సూ.. పుప్పొడి రేణువులని ట్రాన్సఫర్ చేసుకుని "ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం అనుకుంటాయనుకుంటా" ఏమో ఈ సారి వీడియో రికార్డు చేసి చూద్దాం....

నా యుటోపియన్ వరల్డులో ఇంతకంటే అందమైనవి చాలా చాలా ఉంటాయ్.. కాకుంటే ఫోటో తియ్యటానికి అవ్వదంతే.. ఏం చేస్తాం చెప్పండీ..


 

Tuesday, August 3, 2010

Monday, August 2, 2010

గ్యాస్కొనేడ్...

 
నిద్రపోతాము, అందులో ఏమీ తెలీదు.. ఒక వేళ నిద్ర లేస్తే అది జీవితం, లేకపోతే మిగిలినోళ్ళ దృష్టిలో అది మరణం... నిద్ర ఎలాగైనా జరగొచ్చు.. నేను... ఒక్కన్ని..... ఎప్పటికీ..... ఏనాటికీ................అదే నిజం..................... everybody thinks if they do live for several times... yes they do as they sleep and get up everyday....... అనుభవిస్తున్న బాధైనా సంతోషమైనా ఈ ఒక్కసారే......... These many molecules getting clubbed together to form a pre-defined set called living being........................ is an impossible task to make you you or me me again...................... Everyone says someone governs all these happenings... I don't know why but I simply laugh at them..... ఔను నిజంగానే.... నవ్వొస్తుంది............................ నిజంగానే ఉన్నాడా........... లేక ఉందా............??? .............. You silly man, you feel as if you are inventing something by your thought and action... you rubbish buddy.. infact just like an action and reaction of Newton's third law, life does go on its own principles........ simply human is a material who mal-reacts with its co ---- as if its not immaterialistic.. నిజ్జం, బిన్ లాడెన్ మీద ఒట్టు.