ఏదో ఆలోచిస్తుండగా, ఆ ఆలోచనల్ని బొమ్మలో చూపించాలని ఇలా గీసేశాను, కానీ నా ఆలోచన కంటే, నా బ్లాగ్ పాఠకుల ప్రజ్ఞాశక్తి అద్భుతమని భావించి, ఈ బొమ్మకి అర్దాన్ని మిమ్మల్ని, మీ భావాలతోనే వివరించమని అడుగుతున్నాను... రాస్తారా మరి వ్యాఖ్యల్ని.. :) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, September 11, 2010
పెన్నాన్‌హ్యాండ్ డ్రాయింగ్..
Friday, September 10, 2010
జఘన లోలకపు గజగామిని...
నీ నడుమే అందం, నడకే నాట్యం అనేటట్టుగా.. ఆమె నడిస్తే, ఆ నడకలో ఉండే అందానికి నా లే-మ్యాన్ ల్యాంగ్వేజీలో నాకు తెలిసిన మూడు నాలుగు రకాల పదాలు, ఏదో చెప్పేయాలని ఇలా ఇలా ఈ కవితలా మీ ముందుకి ఉబికి వచ్చేశాయ్... వాటికీ తెలీదు అంతటి అందాన్ని వర్ణించటానికి, నా హ్యాండీక్యాప్ ల్యాంగ్వేజే కాదూ, మాంచి హ్యాండ్సమ్ ల్యాంగ్వేజీ కూడా సరిపోదని.. భాషలో తప్పుల్ని చూడక... భావంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ.. |
Wednesday, September 8, 2010
ఏమీ లేదు...
| ప్రేమకీ, కన్నీళ్ళకీ ఉన్న అనుబంధం ఏనాటిదో, ఎన్నాళ్ళదో.... కొన్నిసార్లనిపిస్తుంది.. ఆ రెండూ నిజమైన ప్రేమికులని... ఒకసారి పులుల అంతరించటం గురించి విన్నప్పుడనిపించింది, "నిజమే పులుల్ని కాపాడుకోటానికి కనీసం కొన్ని అవకాశాలు ఉన్నాయ్"... నిజమైన ప్రేమ మాత్రం పుస్తకాల్లోనీ, సినిమాల్లోనే దొరుకుతుంది... |
Tuesday, September 7, 2010
నా మీద నేను తయారు చేసుకున్న కార్టూన్లు
Monday, September 6, 2010
An ఇన్‌కన్వీనియంట్ ట్రూత్ A small review...
"An Inconvenient Truth" సినిమా, పారామౌంటువాళ్ళు తీశారు, గ్లోబల్ వార్మింగు వార్నింగుని పట్టించుకోని వాళ్ళకి, ఇది నిజంగా చెమటలు పట్టించే మూవీ..??, ఈ క్రింది లింకులో మీరు ఆ సినిమా మొత్తం చూడొచ్చు... అంతా బాగానే ఉంది కానీ.. సినిమాటిక్ ఉత్కంఠని ఏర్పరచటానికి కొద్ది అతి చేశారని చెప్పొచ్చు... An Inconvenient truth movie ఆస్కార్ అవార్డు కూడా లభించిన ఈ సినిమా మీద, విమర్శలు కూడా తక్కువేమీ లేవు... సినిమా రక్తి కట్టాలని, కొన్ని కొన్ని అసంబద్దమైన విషయాలని చొప్పించారని, అలాగే.. ఐస్ కరగటానికీ.. గ్లోబల్ వార్మింగుకీ.. గ్రీన్ హౌస్ గ్యాసెస్‌కీ మద్యనున్న సంబంధాలని వివరించే.. రేఖాపటాలలో శాస్త్రీయత లేదని.. ఇలా పలు రకాల విమర్శలున్నాయ్... ఈ క్రింది లింకులో వీడియో చూస్తే మీకే అర్దం ఔతుంది Criticism on An Inconvenient truth movie కానీ ఎన్ని రకాలుగా చూసినా, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుండటమూ అబద్దం కాదు, అలాగే సినిమాలో చూపించినంత వేగంగా కాకపోయినా.. చాలా ఏళ్ళలోపు ఐనా సరే వాటి ఎఫెక్ట్సు.. తప్పవనే చెప్పాలి... అంతెందుకు.. ఇప్పడు వాతావరణంలో ఉన్న మొత్తం క్లోరో ఫ్లోరో కార్బన్సుని వాతావరణంలోకి విడుదలవ్వకుండా మానేసినా ఇప్పటికే ఉన్నవి, ఇంకో ఏభై సంవత్సరాలు ఉండొచ్చని సమాచారం.. వాతావరణం పరిస్థితి చూడబోతే... మన తర్వాతి, తర్వాతి తరం పిల్లలందరూ స్పేస్ ట్రావెలింగ్ సూట్సులాంటివాటితో సహజంగా పుట్టేటట్టుగా జెనెటిక్ ఇంజినీరింగు చెయ్యాల్సిన పని మా బయాలజిస్టుల మీద పడేట్టుంది.... మనమొకటి తలిస్తే.. జరిగేది ఎలా జరుగుతుందో మనమూ చూద్దాం...... |
Saturday, September 4, 2010
రెండు చెప్పులూ రేటెంతా..?
చిన్నప్పుడొకసారి చెప్పులు కొందాం అని షాపుకి వెళ్ళి మంచి చెప్పులున్నాయా అని అడిగాను, ఆ ఉన్నాయీ అన్నాడు షాపువాడు, ఐతే రెండు చెప్పులివ్వండి అని అడిగాను, వాడు పగలబడి నవ్వుతూ, మేం జతలు అమ్ముతాం అన్నాడు, నాకు అర్దం కాక క్లియర్‌గా చెబుదామని, కుడి కాలికి ఒకటి ఎడమ కాలికి ఒకటి ఇమ్మని అడిగాను.. వాడు మళ్ళీ పగలబడి నవ్వి నవ్వు ఆపకుండానే చెప్పులిచ్చి డబ్బులు తీసుకున్నాడు.. నేను ఇంటికొచ్చి విషయం చెప్పి , వాడు నవ్వినందుకు మా అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చేశాను, ఓదార్చాల్సిన మా అమ్మ కూడా ఏంటో, పకపకా నవ్వేసింది.. పోనీ అమ్మ ఒక్కతే నవ్వితే ప్రోబ్లం లేదు.. ఆ విషయం చెప్పిన అందరూ నవ్వుతూ నన్ను వెక్కిరించటం స్టార్ట్ చేశారు.. నేనైతే రెండు రోజులు ఎవరితో మాట్లాడలేదు.. హా!! నేనేం తప్పు మాట్లాడాననీ... చెప్పులు రెండు కాళ్ళకీ ఇవ్వమని వాడిని క్లియర్‌గా అడిగితే తప్పా..?? |
Friday, September 3, 2010
నిన్నేమన్నాననిరా కన్నా?
మనందరికీ తల్లిలాంటి భూమిని, కాలుష్యపు కోరల్లో ఇరికించేసున్నాం.. భూమాతకే మనతో మాట్లాడాలనిపిస్తే... బహుశా ఈ క్రింది కవితలో భావం ఆమె మాటలో ప్రస్ఫుటమవ్వచ్చేమో? |
Thursday, September 2, 2010
Subscribe to:
Posts (Atom)







