మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, August 29, 2010
Saturday, August 28, 2010
వాడికెందుకంత పరధ్యానమో..? ;)
మా ఫ్రెండొకండు ల్యాబ్ నుండి బయలుదేరాడంట, ఆలోచిస్తూ ఏ లోకంలో ఉన్నాడో ఏంటో, అలా ఆలోచిస్తూనే టాయ్‌లెట్లోకి దూరాడంట అందులోకి వెళ్ళగానే సింకులోకి దూరిపోయి మరీ మొహం కడుక్కుంటున్న ఒక చుడీదార్ వస్త్రధారిని చూసి, లేడీస్ టాయ్‌లెట్లోకి వెళ్ళిపోయాడేమో అని తత్తరపాటుగా బయటకి దూకేసి ప్రక్క డోర్ వైపు వెళ్ళేసరికి దానిమీద రాసి ఉంది అది లేడీస్ టాయ్‌లెట్ అని.. మళ్ళీ వెనక్కొచ్చి చూస్తే ముందర వీడు వెళ్ళిన డోర్ మీద జెంట్సు టాయ్‌లెట్టు అనే రాసుంది, ఐనా డౌటు వీడక, వీడీకేం చెయ్యాలో తెలియక నిల్చుని ఎదురు చూస్తున్నాడు, ఒక వేళ జెంట్సు టాయ్‌లెట్లోనికి లేడీ ఏమన్నా పొరపాటున వెళిపోయిందేమో అనుకుని, ఈ లోపు సింకు వాష్ చేస్తున్న... సారీ సారీ.. సింకులో ఫేస్ వాష్ చేసుకుంటున్న ఆ ఆసామి బయటికొచ్చాడు, అప్పటికిగానీ మావాడికి అర్ధం కాలేదు అందులో ఉన్నది అబ్బాయే అనిన్నీ, అతను శార్వాణీ వస్త్రాన్ని ధరించి ఉన్నాడనిన్నీ.. దానినే వీడు చుడీదార్‌గా పొరపాటు పడ్డాడనిన్నీ.... అలా ఎవరికీ తెలియకుండా వాడిని వాడే అవమాన పరుచుకున్నవాడు మౌత్ మూసుకుని ఉండొచ్చుగా, ఆహా! బయటికొచ్చినాయనతో మొత్తం స్టోరీ చెప్పి అబ్బాయిలిలా చుడీదార్లేసుకోకూడదని నీకు తెలియదా, వేసుకుంటే వేసుకున్నావ్.. వాటితో జెంట్స్ టాయ్‌లెట్లోకి వచ్చేయడమేనా అని దబాయించాడంట, పాపం ఆ చుడీదార్... సారీ సారీ శార్వాణీలాంటి వస్త్రం వేసుకున్నోడు కూడా మా ఫ్రెండే, నా దగ్గర ఎంత సేపు విరగపడి నవ్వాడో వాడికే తెలీదు.. :) :) ఆ దబాయించిన ఫ్రెండు మళ్ళీ ఏం చెబుతాడో తెలుసా, వాడు డ్రెస్సుని చూసి పొరపాటు పడినందుకు వాడికి అవమానంగా లేదంట, అలా వెయిట్ చేశాక బయటికొచ్చింది అబ్బాయైనందుకు చాలా అవమానంగా ఉందంట.. హ్హహ్హహ్హహ్హహ్హ్హ్హ్హాహాఆ... కొందరి ఇన్సిడెంట్సు ఇలా ఆటోమేటిగ్గా ఫన్నీగా ఐపోతుంటాయ్.. |
Friday, August 27, 2010
ఎ క్రిటికల్ ఆన్ "ఇంటెలిజెంట్ డిజైన్" థియరీ ఆఫ్ ఇవల్యూషన్
Thursday, August 26, 2010
Wednesday, August 25, 2010
సారీ, దీనికి పేరేం పెట్టాలో అర్దం కాలేదు..
ఏదో చెప్పాలనుంది నా మనసుకి, వినే ఓపిక నీకుందా?? ప్రశ్నిస్తే బదులీయక మూగదయ్యింది అంతరాత్మ.. దేనికో ఈ జీవితకాలపు ఎదురుచూపులు అనుకుందో ఏమో... జీవిత పరమార్ధపు మూలకాలు సంతోషం, ఆనందం అని కూడా మర్చిపోయిందనుకుంటా. మనసుకి తెలుసు ఈ అంతరాత్మ పరమాత్మకొరకు ఎంత వెతికిందో, ఎక్కడైనా కనిపిస్తాడేమో అని.. ఆ పరమాత్మకి ఉన్న వ్యాఖ్యానాలు, వివరణలు, కథలు, విశేషాలు తప్ప తన అనుభవాలేమీ లేవు పాపం. కోరికలకీ, అవసరాలకీ ఉన్న సారూప్యతలను, వ్యత్యాసాలనే ఇటుకలూ, సున్నంగా జీవితాలనే కట్టడాలని నిర్మించిన ఆ నిరాకారికి లేదా సాకారికి వీటి ఉనికికి పరమార్ధం ఏమిటో వాటికి తెలియచెయ్యాలనిపించలేదేమో. పెద్దలు చెప్పిన పేర్లు, లక్షణాలు తప్ప పాపం అంతరాత్మకీ, పరమాత్మకీ వ్యత్యాసం ఏమిటో కూడాతెలియదు.. ఎందుకుంటుందో, ఎలా ఉంటుందో చెప్పగలిగేవారెవ్వరూ లేరు. ఆదిలో జీవ భావావిష్కరణం జరిగిందో, భావ జీవావిష్కరణం జరిగిందో పాపం ప్రశ్నార్ధకమే ఐపోయింది దానికి. భావం లేని జీవం ఎలా ఉద్భవిస్తుందో తెలియకముందే జీవం లేని భావం ఉనికి మరో ప్రశ్న అయ్యింది. ఇంతటి సునిశితమైన ప్రశ్నలకి జావాబివ్వలేని మనిషిని ఎందుకు ఉత్తమ జీవ జాతిగా మనిషి గుర్తిస్తాడు.. వేదం వల్లిస్తుందనా, అదీ మనిషే చెప్పాడు కదా, ఏం మనిషి కానివారు చెప్పారా, ఎవరు వారు?? ఎవరికి బద్దులు?? ఇలా ఏ ప్రశ్నకీ కారణం కానీ అవసరం కానీ లేకుండానే కుప్పలు తెప్పలు ప్రశ్నార్ధకాలతో నిండిపోయింది, వాటిని తొలగించే సమాధానం ఒక్కటీ దొరకలేదు.. మనసుకేం చెప్పాలో తెలియక కిమ్మనకుండా కూర్చుంది. అంతరాత్మకి సమాధానాలిచ్చే తెలివి దానికి లేదు. మనస్సుండే లౌకిక ప్రపంచానికీ, అంతరాత్మ ఆస్వాదిస్తున్న అలౌకిక ప్రపంచానికీ లంకెలు దొరక్క సతమతమయ్యే మనసు, అంతరిక్షంలో నిల్చుని అనంతమైన 4phiRcube ఘనపరిమాణమంతా అంధకారాన్నే అలుముకుని ఉన్నట్లుగా తలచి, గమనమెటో, గమ్యమేదో తెలియకుండా ఉంది. అసలా గమనమూ గమ్యమూ ఎందుకో కూడా మనసు కూడా ప్రశ్నించేస్తుంది. మనసుకి తనంటే ఏంటో తనకి తెలిసిన తర్వాతి కాలం నుండి తనలో జనించిన కోరికలన్నిటికీ రెక్కలు తొడిగి, అనంతమైన గగనసీమలో ఉరకలు పరుగులుగా ఎగరేయాలనుకుంది. తన కోరికలనే గుర్రాలను సంద్రంలో ఎగసిపడే అలలకి పోటీగా చెయ్యాలనుకుంది. కానీ తానుండేది ఒక స్థబ్దు శరీరం, తన యజమాని ఒక నిశ్శబ్ద అంతరాత్మ... ఇంకా ఏమడుగుతుంది మనసు మాత్రం, ఎవరినని అడుగుతుంది.. తన శరీరంలానే స్థబ్దమై, స్థానువై అణువు కూడా చలించక.. మరణం వరకూ తన ఋణమేదో తీరనట్టు అలానే ఉండిపోయింది, ఉండిపోతుంది... తను చలించాలంటే తనది కానిదేదో తనని కదిలించాలంతే....... :( |
Monday, August 23, 2010
Thursday, August 19, 2010
కాటికి కాలు సాచేవెందుకే ఓ మనసా..
నా మనసే నన్ను ఇష్టపడను పొమ్మంటే, దానికి కావాల్సిన తోడుకి నేనెలా ఇష్టమౌతాను?, ఐనా సరే ఆశతో నా మనసుని లాలించ ప్రయత్నించాను. దానికి ఇష్టమౌనో లేక కష్టమౌనో...? |
Wednesday, August 18, 2010
ఛీ నా జీవితం..
ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. |
Subscribe to:
Posts (Atom)




