|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Tuesday, September 28, 2010
నా (అ)ధర్మ సందేహా(శా)లు...
Thursday, September 23, 2010
అదియూ ధిక్కారమాయే.. చీత్కారమాయే...
నా వైఖరికి నేను బాగా అప్పున్న సమయంలో టైప్ చేసిన కవిత ఇది.. తన ఉనికినే ఎప్పుడూ రహస్యంగా ఉంచే దేవుడు కూడా తనకి సహాయం చెయ్యడని తలచిన మనిషి, బహుశా ఇలా భావించే అవకాశం లేకపోలేదు.. |
Tuesday, September 21, 2010
Sunday, September 19, 2010
చెవిటివాని ముందు శంఖమే...
| గరళం నా భోజనమైనంత మాత్రాన అమృతం నాకు విషమంటావా కష్టం నా బాటైనంత మాత్రాన దుఃఖం నా మిత్రుడే అంటావా ప్రేయసి నాకు లేనంత మాత్రాన ప్రేమకి నేనర్హుణ్ణేనంటావా నష్టం నన్నిష్టపడినంత మాత్రాన మరణమే నా శరణమంటావా నువ్వేమంటావో అనేయ్ నా అంతః శత్రువా, నీ ప్రతి మాటా నాకు చెవిటివాని ముందు శంఖమే ... |
Saturday, September 18, 2010
Wednesday, September 15, 2010
సంక్రాంతి :)
ప్రస్తుతం వర్షాల విసురుకి అతివృష్టి భయం పట్టుకుంది జనాలకి, కానీ వాటిని సమయానుగుణంగా సద్వినియోగం చేసుకునేవారికి, వీటి వలన వచ్చే దిగుబడు ఒక సంక్రాంతి కలగా కనపడుతుంది... ఆ ఆలోచనకి స్వప్నదర్పణ చిత్తరువు, నేను మూనిరుడు సంక్రాంతి మీద రాసిన ఈ కవిత. ఓ లుక్కేయండి మరి... |
Sunday, September 12, 2010
నా పేరు, యానిమేషన్లో...
ఒక మూడేళ్ళ క్రితం అంటే నేను ఎమ్మెస్సీలో ఉండగా ఈ ఆర్టు గీశాను.. ఈ ఆర్టుని HCUలో F హాస్టల్లో నా రూమ్‌కి నేమ్ బోర్డు లాగా ఒక పది నెలలు కంటే ఎక్కువ కాలమే మెయింటెయిన్ చేశాను.. నాకు బాగా నచ్చటం వలన స్క్యాన్ తీసి యానిమేషన్ బిల్డ్ చేశాను. లవ్ సింబల్ ప్రక్కనే పాములా ఉండే L ఇంకా కన్నులా ఉండే i.. టోటల్‌గా "లవ్లీ" మరలా లవ్ సింబల్‌ని చూస్తే అందులో బ్లూ M, బ్లాక్ O, ఇంకా రెడ్ కలర్ U తో పాటు ప్రక్కనే L, i మొత్తం ఆ బొమ్మని ఇంగ్లీషులో రెండుసార్లు చదివితే.. లవ్లీ మౌళీ(Lovely Mouli) అనేటట్లుగా కనపడుతుంది... నా పేరు శివుని పేరన్నమాట.. శివునికి ఆభరణాలు నాగుపాము ఇంకా చంద్రుడు... అదీ కాక మూడో కన్ను ఉంటుంది శివునికి బొమ్మలో i మద్యలో ఉన్న కన్ను శివుని త్రినేత్రాన్ని గుర్తుకు తెస్తుంది.. ఈ విధంగా ఇటు ఆంగ్లాన్నీ, అటు పురాణాన్నీ కలిపి చిత్రించానన్నమాట.. మీకు నచ్చిందా? :) |
Saturday, September 11, 2010
పెన్నాన్హ్యాండ్ డ్రాయింగ్..
ఏదో ఆలోచిస్తుండగా, ఆ ఆలోచనల్ని బొమ్మలో చూపించాలని ఇలా గీసేశాను, కానీ నా ఆలోచన కంటే, నా బ్లాగ్ పాఠకుల ప్రజ్ఞాశక్తి అద్భుతమని భావించి, ఈ బొమ్మకి అర్దాన్ని మిమ్మల్ని, మీ భావాలతోనే వివరించమని అడుగుతున్నాను... రాస్తారా మరి వ్యాఖ్యల్ని.. :) |
Friday, September 10, 2010
జఘన లోలకపు గజగామిని...
నీ నడుమే అందం, నడకే నాట్యం అనేటట్టుగా.. ఆమె నడిస్తే, ఆ నడకలో ఉండే అందానికి నా లే-మ్యాన్ ల్యాంగ్వేజీలో నాకు తెలిసిన మూడు నాలుగు రకాల పదాలు, ఏదో చెప్పేయాలని ఇలా ఇలా ఈ కవితలా మీ ముందుకి ఉబికి వచ్చేశాయ్... వాటికీ తెలీదు అంతటి అందాన్ని వర్ణించటానికి, నా హ్యాండీక్యాప్ ల్యాంగ్వేజే కాదూ, మాంచి హ్యాండ్సమ్ ల్యాంగ్వేజీ కూడా సరిపోదని.. భాషలో తప్పుల్ని చూడక... భావంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ.. |
Subscribe to:
Posts (Atom)




