ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద సంస్కృతంలో ఒక మంచి శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో వాక్చాతుర్యం అనేది ఒక నిజమైన, మరియు శాశ్వతమైన అలంకారంగా పేర్కొనబడింది... చంద్రహారాలూ, లేపనాలూ, పన్నీటి స్నానాలూ, పూల మాలలూ అలంకారాలు కాదూ, సంస్కారంతో కూడిన(contextual interpretation needed) వాక్కు సరైన అలంకారమౌతుందీ, వాక్కు అనే అలంకారమే లోకాలలోకెల్లా మంచి అలంకారం అని చెప్పబడింది... కేయూరాని న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా భర్తృహరికి వాక్కు అనే అలంకారంతో పాటు, ఆచరణ అనే అసంక్రమిక ఆస్తి గురించి మనసులో తట్టలేదేమో.. అప్పటి పరిస్థితుల ప్రభావంలోనూ, దేశ కాల మాన స్థితిగతులలోనూ ఆచరణకి అంత ఆధరణ లేకనో అలా కాక తను ప్రేమతో ఇచ్చిన పండు చేతులు మారిన విధానంతో, జీవితం అనే విషయంలో కన్నులు తెరిచి మోక్షపదం వైపు దృష్టి మరలిపోవటం వలననో మరి తెలియదు. కానీ అలంకారం అలంకారమే కానీ మనిషి కాదు, మనిషేంటో తెలియజేసేది అతని ఆచరణ, వ్యవహారం... simply speaking work and worth of human makes him what he/she really is. అందుకనే ఆంగ్లంలో కూడా చెబుతారు Actions speak louder than Voice అని... పై శ్లోకాన్ని విమర్శిస్తుందా అనేటట్లుండేది ఒక వేమన పద్యం అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను హహహహ్!! ప్రస్తుత ప్రపంచం అంతా vacuumలో పెట్టిన ఇనుము అయస్కాంతం తనని attract చేసిన వైపు దూసుకుపోతున్నట్టు ప్రయాణిస్తుంటే, నీతులెన్ని చెప్పి ఏం లాభం లే, ఇటు తనకీ పనికిరావు, అటు వాటిని చదివేవాడికీ పనికిరావనేమో ప్రస్తుత కాలపు రచయితలెవరూ అలాంటివి రాయటానికి పూనుకోవట్లేదు... ఏదేమైనా ఒకటి మాత్రం నిజం కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవటం అనేది, సౌండు బాక్సుల్లేని మ్యూజిక్ సిస్టం లాంటి పరిస్థితి. వాళ్ళ బుర్రలో/చేతల్లో చేవ ఎంతుందో మనకీ and/or వాళ్ళకీ తెలియకపోయినా తెలియాల్సిన అవసరం లేకుండానే, వాళ్ళ మాటల్తోనే చిలుక జోస్యం నుండి టీవీ యాంకరింగ్ వరకూ నిరాటంకంగా మరియు దగ'ధ్ధగా'యమానంగా సాగుతున్న జీవితాలు.. భర్తృహరి శ్లోకానికి ఉదాహరణలు.. :) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, October 31, 2010
కేయూరాని న భూషయంతి పురుషం..(my view on art of communication)
Friday, October 29, 2010
నేను నువ్వైన నా ప్రేమలో...
.........ఏ విషయాన్నైనా ఎంతో సులభంగా భావించగలిగిన మనిషి, తన నిజమైన ప్రేమ విషయంలో అలా భావించలేడు, పరిస్థితులు తనని వెక్కిరిసున్నా, వెక్కి వెక్కి ఏడుస్తాడే తప్ప, వెనక్కి మరలి ఆ విషయాన్ని మరచిపోలేడు... నిజమైన ప్రేమ మరుపుకి రావాలంటే పునర్జన్మమెత్తాలి (అదంటూ ఉంటే)..... మరి ఆమెకిదంతా అర్దం కాదెందుకనో............ |
Thursday, October 28, 2010
ఏ బాధాతప్త హృదయుని శాపమో...!!
| మనసుని మీటే స్వప్న స్వరాలెన్నో, వాటి సోయగాల లాలనలో ప్రియుడు తన నిజ ప్రదేశాన్ని వీడి ఎక్కడెక్కడో విహరిస్తాడు... ఆ ఊహా యుటోపియా లోకాల్లో ఎంత దూరం వెళ్ళినా, అది ఒక యుటోపియాగానే తనకి మిగిలిన కారణం గుర్తురాగానే, కన్నీరు మున్నీరౌతాడు... మాట పెగలని రోధనల సాక్షిగా, ఆవిరైపోయిన కన్నీరే ఆధారంగా, ఒంటరిదైపోయి మిన్నకుండి చూస్తున్న హృదయమే తన ఆసరాగా... :( |
Wednesday, October 27, 2010
అదృష్టానిది సంకుచిత హృదయం ఫ్రెండూ...
| నువ్వు అడిగిన సాయం ఎవరూ చెయ్యకపోవటం ఒంటరితనం కాదు ఫ్రెండూ... నీకు కావాల్సిన సాయం చెయ్యమని నిన్ను కూడా నువ్వు అడగలేని పరిస్థితి ఎదురైతే అది నిజమైన ఒంటరితనం.... అందుకే నీకు నీకంటే మంచి ఫ్రెండు కనీసం ఒకరన్నా ఉండాలి, ఏ ఎల్లోరా శిల్పం వల్లనో నువ్వొక శిలా విగ్రహమైపోతే, నువ్వడక్కుండానే ఒక ట్రాలీలో తీసుకెళ్ళి కనీసం నిన్ను నిమజ్జనం చెయ్యటానికైనా ఉండాలొకరు... కానీ అదృష్టానిది సంకుచిత హృదయం... నువ్వూ, నేనూ ఏమీ చెయ్యలేం ఫ్రెండూ...... |
Sunday, October 24, 2010
కాలమైనా చెబుతుందో లేదో??
| ...........................వాడెప్పుడూ అంతే, బాధ కలిగితే తట్టుకోలేడు, అప్పుడప్పుడూ ఒక్కడే కూర్చుని బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాడని ఎవరో చెబితే విన్నాను, ఏమి జరిగిందో తెలియదు.. కానీ వాడి మనసు మనసులో లేదు.. నవ్వులో జీవం లేదు.. మాటలో ఉండాల్సిన భావం కనిపించట్లేదు.. కనిపిస్తే ఎంతసేపట్లో తనని ఒంటరిగా వదిలేస్తామా అన్నట్లు మొహం పెడతాడు. కారణమేంటో చెప్పడు, ఎప్పుడూ అంతా దాచుకునే ఇంట్రావర్టేమో, మొహంలో భావాల్ని పులుముకుని కనిపిస్తాడు.. ఏమిట్రా అది సైకోలాగా అంటే, మొహం రెండు చేతుల్లో దాచేసి, ఎవరికీ తెలియకుండా తన అరచేతి చారల్నే, కన్నీటి ప్రవాహపు దారుల్లా భావిస్తాడు, మొండోడు, బండోడు, గుండే తనకి లేదంటాడు, దాని అవసరమూ లేదంటాడు... ఎప్పుడూ, ఎదురు చూస్తున్నానంటాడు, దేని కోసమో ఎవ్వరికీ చెప్పడు, కాలమైనా చెబుతుందో లేదో............................................ |
అసలు తెలుగులో నాకు తెలిసిన తెలుగెంతంటే..
ఉదయాన్నే టిఫిన్ చేద్దామని మెస్‌కి వెళ్ళినపుడు ఫ్రెండ్సుతో అలా అలా మాట్లాడుతుండగా, ఎవరికి ఎన్నెన్ని భాషలొచ్చు అనే విషయం చర్చలోనికొచ్చింది.. దానికి నా సమాధానంగా నాకు మూడు భాషలు తెలుసు తెలుగు యావరేజీ, ఇంగ్లీషు బిలో యావరేజీ, హిందీ బిలో పావర్టీ లైన్ అని చెప్పాను.. ఆ ఎక్స్ప్రెషన్‌కి అందరం నవ్వుకుంటుండగా.. నా ఫ్రెండొకడన్నాడు, "నువ్వు రాసిన కవితలు తెలుగు తెలిసినోళ్ళే అర్దం చేసుకోటానికి కష్టపడుతున్నారు, నీ తెలుగు యావరేజీయా" అని. దానికి సమాధానంగా, అలా అనే వాళ్ళు చిన్నప్పట్నుంచీ కాన్వెంట్సులో బాగా కేజీలు కేజీలు చదివి ఉంటారులే కాని, కవితలు రాయటానికి పరమోత్కృష్టమైన భాషా జ్ఞానమేమీ అవసరం లేదూ అని చెప్పి అసలు తెలుగు అనబడే తెలుగుకీ, నాకు తెలిసినపాటి తెలుగుకీ ఉన్న తేడాని అక్కడే ఈ క్రింది కవితతో వివరించాను, ఇది విన్న తర్వాత ఆయన వేరే శబ్దాలేమీ చెయ్యలేదు ఈ విషయం పైన... |
వికసించే చిరునవ్వా..
నీ నైరాశ్యం నిమేషం, ఆనందం అనంతం, ఆశల భారాన్నీ.. భావాల బాధల్నీ.. ప్రక్కన పెట్టి, చిద్విలాసుడివై చిరునవ్వు నవ్వవోయి అని నాలోని రెండో మనిషి మొదటి మనిషిని ఊరడించిన సందర్భంలో లిఖితమైన ఈ కవనం, మీ కోసం... |
Wednesday, October 20, 2010
Tuesday, October 19, 2010
Subscribe to:
Posts (Atom)





