మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, September 30, 2011
Wednesday, September 21, 2011
Monday, September 5, 2011
అక్షరం
| అక్షరం గురించి వ్రాయమంటే ఏదో అలా అలా వచ్చిన కొన్ని పదాలని ఇలా మీ ముందు ఉంచాలనిపించింది... క్షరం అంటే నాశనం అక్షరం=నః క్షరం - అంటే నాశనం కానిది, నాశనమనేదే లేనిది; ఇది అక్షరానికి భాషాపరమైన అర్ధం. మనోభివృధ్ధి సాధించిన మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. తనదైన శైలిలో జీవించటానికి, తనదైన ఉన్నతమైన సంక్లిష్ట భావజాలాన్ని వ్యక్తీకరించటానికి అలాగే వ్యక్తీకరించబడినదాన్ని స్వీకరించటానికి తనకి అవసరమైన మాధ్యమం భాష, ఆ భాష అక్షరాల అమరిక. ప్రపంచమంతా నిభిడీకృతమై ఉన్న సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపదని అర్ధం చేసుకునేందుకు , ఆ సంపదని మానవాళి శ్రేయస్సుకి ఉపకరించేట్టు చేసేందుకు అవసరమైన అక్షర జ్ఞానం ఆవశ్యకత వర్ణింప శక్యం కానిది. ఆ అక్షర జ్ఞానం కలిగి ఉండటం అక్షరాస్యత, అది లోపించటం అనేది నిరక్షరాస్యత. ఒక నిరక్షరాస్యుడు తన అవసరాన్ని సరిగా వ్యక్త పరచలేని ఒక సామాన్య అవసరం నుండి ఉధ్ధండమైన ప్రయోగాలతో జనావళికి తన పరిశోధనా సేవలందించే శాస్త్రవేత్త ఉపయోగించే భాష్యం వరకూ అవసరమయ్యేదంతా ఆ అక్షరాస్యత నుండి పుణికి పుచ్చుకుచ్చుకోవాల్సిన జ్ఞాన సంపదే. అక్షరాలు పదాలనీ, పదాలు వాక్యాలనీ, వాక్యాలు విషయ సంపదనీ నేర్చుకునేందుకు దోహదం చేసి తద్వారా విచక్షణ అనేది అలవడేలా చేస్తుంది. విచక్షణ లేకుండా ప్రవర్తించే మనిషి మృగ సమానుడు. మనిషి స్వభావం ఎలాంటిదైనప్పటికీ దానిని మార్చి తనలో సమాజ హితునిగా పరివర్తన తీసుకురాగల మంత్రం అక్షర మంత్రం. అక్షరమనే మాతృక జ్ఞానమనే సంపద సాధించటానికి ఉపయోగపడితే, జ్ఞానం విద్వత్తు జనించేందుకు ఉపకరిస్తుంది. విధ్య కలిగిన వాడు లోకమెల్లా పూజింపబడతాడు అనే పెద్దల సూక్తి నిత్య సత్యం. అక్షరాన్ని గురించి ఇలా ఎన్ని అక్షర సత్యాలు చెబుతున్నా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కూరగాయలు తరిమే కత్తి ని ప్రావీణ్యత లేని వాడు దానిని ఉపయోగించినా లేదా హత్యలు చేయాలనే వాడు ఉపయోగించినా అది రక్తం కళ్ళ చూస్తుంది. అక్షరం అనే సాధనం చాలా ఉన్నతమైనదీ మరియు ఎంతో శక్తివంతమైనదీనూ. చిన్ననాటి నుండీ సమాజ శ్రేయస్సుకి సంభందితమైనపోకడలని అలవర్చుకున్న మనిషి చేతిలో అక్షరం ఏనాటికైనా ఒక మహాద్భుతాన్ని చూపుతుంది. కాలి నడక నుండి గాలి నడక వరకూ అభివృధ్ధి సాధించిన మనిషి గొప్పతనం, కొండంత నుండి గోరంతవరకూ చేరుకున్న ఉపకరణాల పరిమాణం వాటి ఉపయుక్తం ఇలా చెప్పగా కోకొల్లలవి. కరడు గట్టినట్లు రహస్యాలను దాచుకున్న ప్రకృతి మానవుని ముందు చేతులొగ్గి వాటిని బయట పెట్టటానికి కారణం, మనిషి తాను సంపాదించిన జ్ఞానాన్ని పంచుకోగలిగే మరియు దాచుకోగలిగే సాధానంగా, మాధ్యమంగా ఉపయోగించబడుతున్న అక్షరం మన మనిషుల ఉనికికే తలమానికం, ప్రతిభకే ఆలవాలం. దురుపయోగంలో ఉన్న అక్షర జ్ఞానం దాని పర్యవసానాన్ని సమాజ చీడ పురుగుగా మార్చటం ఖాయం. ఏది ఏమైనా మనిషిని మనిషిగా నిరూపించగలిగే అక్షరం ఒక అమోగమైన సాధనం, కానీ అది సాధనం మాత్రమే, నిన్ను మనిషిగా చూపించలేక మృగంగా నువ్వు మారితే అది నీలోని అక్షర దోషం తప్ప అక్షరంలో స్వయంగా దాగి ఉన్న దోషం కాదది. అనిర్వచనీయమైన వాడి అందుకు సరిపడ వేడిని కలిగున్న అక్షరంతో పాటుగా దానిని ఉపయోగించే దారి అనే జ్ఞానాన్ని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విధ్యావంతుడైన మనిషిగా నిలదొక్కుకోగలిగే సామర్ధ్యాన్ని అందరూ పెంపొందించుకోవాలని ఆశిధ్ధాం. |
Friday, August 5, 2011
జాలేస్తుంది కూడానూ...!?!?!?!
| "హా!! ఏంట్రా అలా చూసి, ఎందుకో కొద్దిగా నచ్చగానే ప్రేమ పుట్టేస్తుందా, ఇప్పటికి నువ్వు పుట్టి పట్టుమని పాతిక నిండుంటాయ్ హా రీడరూ నీ ఎమోషన్ నాకు అర్దమైంది, పట్టెడన్నాన్ని తడిమి చూస్తే పుట్టెడు బియ్యం ఉడికినట్టా, దానిని కలుపని తెడ్డుకున్న అడ్డేదో తెలిసా నీకు అంటారు కదా... ఏం చేస్తామండీ, జీవమనే ఉచ్చు చిచ్చు నీ పుచ్చుని పట్టి లాగు విధంబులనంతముల్ అన్నట్లుగా, కళ్ళకి గంతలు కట్టుకుని జీవితమనే ఏనుగుని వెతుకుతూ ఉండే సమాజమంతా జీవితాన్ని పలువిధాలుగా వివరిస్తుంటే, గంతలు తీసి దూరం నుండి చూస్తున్న నాకు వాళ్ళలాంటోళ్ళందరినీ చూసి నవ్వొస్తుంది |
Thursday, August 4, 2011
తొక్కలో లైఫ్...
| గాలి బాగా వీచిందని, నేల విడిచి సాము చెయ్యటానికి నువ్వేమైనా కాగితమ్ముక్కనుకున్నావా... ఇది వీడి వరస.. కానీ మూసపోతల సమాజ పోకడలు వీడిని వదుల్తాయా.... ఏమో??? , గాలి వీస్తే కాగితం ముక్క ఎగిరిపోతుంది, కానీ పేపర్ వెయిట్‌తో సహా ఎగరటం దానికి సాధ్యం కాదు.... సమాజపు కట్టుబాట్లనే ఆ పేపర్ వెయిట్లున్నా ఆ కాగితం ఎగరాలంటే ఏ టోర్నెడోలు రావాలో, ఎలాంటి టోర్పెడోల సాయం కావాలో... జీవితమంటేనే విసిగి వేసారిన ఆ మనసుకి ఇవన్నీ ఒక పట్టాన పడతాయో లేవో... ఆనందం, సంతోషం లాంటివాటి కోసం ఎన్నెన్నో చెయ్యాల్సొస్తుందని వాటిని కూడా విస్మరించేస్తున్నాడు... వాడికీ వాడి దగ్గరున్న బెంచీకీ తేడా ఏమీ లేదని వాడిని చూసి వెటకారంగా నవ్వుకునే వాళ్ళకేసి చూసి, బెంచీతోనే మాట్లాడుతూ ఆ జీవిత రోగంతో బాధ పడుతున్న మనుషులకీ, దూరంగా ఎక్కడో కొండల్లో దావానలంలో చిక్కుకుపోయిన ముళ్ళ తుప్పలకీ ఏమీ తేడా లేదని నవ్వుకుంటున్నాడు.... ఇది చదివిన మీరు ఎవరిని సమర్ధిస్తారో నాకు తెలీదు, నా అభిప్రాయాన్ని మాత్రం అడగద్దు... |
Monday, July 11, 2011
Sunday, June 26, 2011
సోది... మళ్ళీ...
నిజం, ఆ సిట్యుయేషన్ చాలా నిజం |
Thursday, June 2, 2011
Subscribe to:
Posts (Atom)




