అలా.. అలా.. మాట్లాడుతూనే.. నాకు తెలీకుండానే అనేశాను.. "నన్ను ప్రేమించొచ్చు కదా" అని.. అన్నాక నాలుక కరుచుకున్నా... పూర్తి స్థాయి నిశ్శబ్దానికి అది పరాకాష్ట ఔతుందేమో అనుకున్నా.. కానీ కాలేదు... (నేనేమన్నా క్షమించరాని పాపమో, నేరమో ఐతే చేసెయ్యలేదు కదా..)... అదంతే కొన్నిసార్లు అలా ఔతూ ఉంటుంది...