మన్మధుడు సినిమాలో నాగార్జునలాగా.. బయలుదేరి.. ఒక ఆటో, రెండో ఆటో, మూడో ఆటో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కి వెళూతూనే ఉన్నాను.. ఇరుకు సందుల్లాంటి రహదారులు కాస్తా, వెడల్పుగాసాగాయి.. ఎండ వేడిని కొలవటానికి దర్మామీటరు లేదు కానీ ఆటోకి డబ్బులెంతయ్యాయో చెప్పటానికి దానికో "అధర్మా"మీటరుంది... దాని అంకెలపై టెంకెలు విసరా అనుకుంటూ విసవిసా బయటకొచ్చి చూస్తే... ఎటు చూసినా.. మేడలే.. నేనున్నది నా దేశంలోనేనా అనిపించింది.. ఆటోలకి అంత సీన్ లేదని తెలిసి ఒకసారి నవ్వుకున్నాను.. ఎందుకు వెళుతున్నానో చెప్పను కానీ.. ప్రశాంతంగానే నడుస్తున్నాను... అప్పుడే కనిపించింది.. ఒక పెద్ద అద్దాల మేడ... అందులోంచి... రెక్కలమీద తారు ఒలికిపోయిన రాజహంసలా.. రాత్రి రంగుని పులుముకున్న వస్త్రాలు ధరించిన ఒక సుందరి దర్శనమిచ్చింది.... నా దగ్గరగా చేరి గోముగా బుగ్గని తడుముతూ... ఐ... ల.....వ్... ఇది పూర్తి కాకుండానే... ఠంగున ఒక మొట్టికాయ తగిలింది.. తీరా చూసుకుంటే అది నేను పడుకున్న మంచం తాలూకా ఐరన్ రాడ్డు.. తలపై బొడిపెని తడుముకుంటూ.. నిద్ర లేచి చూస్తే.. ఉదయం ఐదు గంటలు... అయ్యో మళ్ళీ కలలోనే వచ్చావా.. వస్తే వచ్చావ్ ఎడ్రస్సన్నా ఇచ్చి వెళ్ళాల్సిందని ఫీలయ్యాను.. ఆ కలేదో ఒక గంట ముందొచ్చుంటే స్వప్నశాస్త్రం ప్రకారం నిమమయ్యుండేదేమో.. అవ్వకూడదనేమో లేటుగా వచ్చింది.. మనుషులు టీజ్ చేస్తే ఓకే.. బేవార్సిగా పనీ పాటా లేని ఫేట్ కూడా టీజింగూ, ర్యాగింగూ చేసెయ్యటమేనంట..... ఏంటీ ఇది చదివుతుంటే నేను ఎటకారంగానే కనపడుతున్నానా... ఏం చేస్తాం దిస్ ఈజ్ యువర్ డే.. :)
ఏం చేస్తాంలే డిలీట్ బటన్ నొక్కినంత ఈజీ కదా.. గాలి మేడ కూలటం కూడానూ... పాపం ఎవరో నన్ను మిస్సైపోయిన ఆ మిస్సు.. ( హే అమెని లక్కీఫెలో అనిగానీ, తృటిలో "నేను" అనే ప్రమాదం నుండి తప్పించుకుందని కానీ అన్నావంటే బాగోదు మళ్ళీ..)
say to me "NEXT TIME BETTER DREAM" :)
ఎడ్రస్సన్నా ఇచ్చి వెళ్ళాల్సిందని ఫీలయ్యాను అన్నారు అడ్రస్ ఇచ్చి వెళితే జీవితాతం ఫీల్ అవుతారు .మీరు ఒక్క సారి telugukingdom.net చూసి మీ అభిప్రాయం చెప్పగలరు
ReplyDeleteఇట్లు
జ్యోతి
నాకు I love you చెప్పే అమ్మాయ్ ఎడ్రస్ ఇస్తే తప్పేముందండీ.. కనీసం డ్రీం గర్లు కూడా కనుకరించట్లేదు.. హహ్హహాహ్హహ్.
ReplyDeleteజ్యోతిగారూ మీ telugukingdom.net చాలా బాగుందండీ... ప్లేసులు, పర్సన్స్ ఇలా కనుక్కోగలగటం చాలా మంచి సైట్.. ఎంతో ఉపయోగకరంగా ఉంది.. మీరు అందులో వెబ్ మాస్టరా.. ఐతే మీకు హ్యాట్సాఫ్ అండీ.. నా బ్లాగ్పోస్టుమీద కామెంట్ రాసినందుకు చాలా ధన్యవాదాలండీ..