నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Wednesday, June 30, 2010

చిన్ని హృదయం..!!

అతిశయాన్ని అతికించినట్లుండే‌ ప్రేయసిని తన మానసోల్లాసమైన మృదు కవితా పద బందాలతో వర్ణించి, ఇతరాతిశయాలన్నింటినీ తన ముందు దిగదుడుపుగా భావించే ఆ ప్రియునికి.. ఆమె ఉలుకూ, పలుకూ లేకుంటే....!!  నిజమే ఏమౌతుందో అతని చిన్ని హృదయం..Share

Tuesday, June 29, 2010

పాంచాలీ పంచ లవర్ విసర్జకీ..!!

దుర్యోధనుడు కనుక ఇరవై ఒకటో శతాబ్ధంలో ఉండి, పాంచాలి అనే అమ్మాయికి లవ్ ప్రొపోజ్ చేసి ఫెయిలైతే ఆ డైలాగులు... బహుశా ఇలా ఉండొచ్చేమో.. దుర్యోధనుడి fans ఎవరైనా ఉంటే హర్టవ్వద్దు ప్లీజ్..


"పాంచాలీ పంచ లవర్‌విసర్జకీ.. ఏటే ఏటేటే.. నీ ఎర్ర బస్సు తప్పి పోయిన తొక్కటాట్టహాసమూ.. ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక.. కిడ్నీలని వెన్ను పూసతో గుచ్చినట్లు.. నీ ఎకిలి నవ్వులే నా చెవిలో మార్మ్రోగుచున్నవే.. అహో బేవార్సి బచ్చాల తిలకుండనై రోజుకి ఇరవై గంటలు పడుకునే బద్దక ధవుళేయుండనై .. స్నేహ, గురు, బందు మిత్ర పరివారమంతయూ బూతులు తిడుతున్ననూ దులుపుకొని పోగలుగు నిస్సిగ్గరినై.. ఎదవెవరన్న వేయి మందిలో మొదట చేయెత్తు ధైర్యశాలినై, వెర్రిబాగులతనములో సహస్ర వీరతాళ్ళ సమన్వితుడనై.. అమానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక ఒళ్ళు బలిసి పగులబడి నవ్వుటయా?

అహో! తన విసర్జక లవర్లలో నన్నూ ఒకడిగా భావింపక, సమ్మానింపక లవర్ధర్మ పరిశ్చక్తయై.. లజ్జా విముక్తయై.. ఆ బంధకి  నన్నేల గేళి చెయ్యవలె..

ఔనులే! లవర్నొదిలేసిన lassకి లజ్జేమి! సిగ్గేమి!

పంచ లవర్ విసర్జక పాతకి యని ఎరింగియూ నేనేల ట్రై చేయవలె?

ఎదవకి ఇంత కంటే గొప్ప ఫిగరు దొరకదని సరిపెట్టుకుందునా? ఐనా అది ఒప్పుకొనునా?

ఐననూ నేనసలు ఎందుకు ప్రేమించవలె? ప్రేమించితిని పో!

దీనినెందుకు గాంచవలె? గాంచితిని పో !

ప్రేమించ డిసైడెందుకు అవ్వవలే? డిసైడైతిని పో!

నేనెందుకు ప్రొపోజ్ చెయ్యవలె? చేసితిని పో!

అదలా ఎర్ర బస్సు తప్పోయిన తొక్కటాట్టహాసమెందుకు చేయవలె? చేసినది పో!

దానికి నేనెందుకు ఫీలవ్వవలె?

హతవిధీ! హతవిధీ! హతవిధీ! అవమాన జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నవి మామా!

పాంచాలి కృతావమాన మానసుడనై .. అవమానాతిమాన వర్జితుడనై .. మర్యాధిక్రమనయయి మేల్కొనుండుటయా? ముసుగు తన్ని నిద్ర పోవుటయా?

ఛీ! ఛీ! ఆడుదానిపై పగ సాధింపలేక ముసుగు తన్ని నిద్రపోయాడని అపఖ్యాతి ఆపై వేరొకటియా! ఇప్పుడేది కర్తవ్యం! మేల్కొనుటయా? నిద్ర పోవుటయా?"Share

Monday, June 28, 2010

అడియాసలకి ఆప్తుడనై...!!

జీవన సంద్రంలో నా ప్రేమ అడియాసల అలల తాకిడి దాటికి తట్టికోలేక అగాధపు అంచుల్లో అందని లోతుల్ని చేరి నాకు నువ్వొక కలగానే మిగిలిపోతే, నీ కోసం ఆర్తితో చేసే నా పిలుపిదే కదా..
Share

విఫలమైన డార్విన్ సిధ్ధాంతం:(Unlocking The Mystery Of Life):


1993లో ఫిలిప్ జాన్సన్ అనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుడు కొంత మంది మిగిలిన శాస్త్రవేత్తలు మరియు ఫిలాసఫర్లతో ఒక మీటింగ్ పెట్టాడు. అందులో చాలా పతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి, హార్వర్డ్ యూనివర్సిటీలాంటి వాటి ప్రతినిధులు కూడా ఉన్నారు.. వాళ్ళందరికీ ఉదయించిన ప్రశ్నేంటంటే.. డార్విన్ చెప్పిన థియరీ ఆఫ్ ఇవల్యూషన్ ఎంతవరకూ కరెక్టూ అని.. వాళ్ళకా ప్రశ్న ఉదయించటానికి వేర్వేరు కారణాలున్నాయంట..
మనమెవరం, మనం దేని నుండి వచ్చాం, మనకీ మన చుట్టూ ఉండే ప్రపంచానికీ ఉండే సంబంధం ఏంటి, ఎలాంటిది.. ఇంతటి వైవిధ్యమైన, బహుముఖమైన ప్రకృతిలో ఉన్న జీవజాలమంతా ఎలా ఉద్భవించి, ఎలా మార్పు చెందుతుంది.. దీనికి గల కారణం ఏంటి ?? ప్రకృతిలో యధేచ్చగా ఉండే సహజ కారణాల వలననే ఈ జీవపరిణామాలన్నీ సంతరించుకున్నాయా లేక ఏదైనా ఒక తెలివైన కారణం కానీ అదృశ్య హస్తం కానీ వీటి వెనుక ఉండి ఉంటుందా??
డాక్టర్ పాల్ నెల్సన్: "అందరం కలిసి ఒక్కో‌రకమైన అభిప్రాయంతో ఇక్కడికి వచ్చాం.. ఈ చర్చలో అందరి అభిప్రాయాలూ కలగా పులగమై జీవ పరిణామాన్ని గురించి ఒక క్రొత్త అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నామని చెప్పాలి"
డాక్టర్ స్టీఫెన్ సి మేయర్: "లైఫ్‌కి ఉండే ప్రాధమికమైన అద్భుతమేదో తెలుసుకునేందుకు ఈ చర్చ ఒక నాంది పలికిందని చెప్పాలి"
బయోకెమిస్ట్: మైఖేల్ బీహీ : "సహజమైన ప్రకృతి బలాల నుండే ఈ పరిణామ క్రమం అనేది ఏర్పడి ఉండవచ్చు"
ఇవల్యూషనరీ బయాలజిస్టు:డీన్ కెన్యన్: "కెమిస్ట్రీ ఒక్కటే జీవ పరిణామానికి కారణం కాదు"

మిగిలిన కొంతమంది.. జన్యు పదార్ధమైన DNA గురించి మాట్లాడారు.
    అసలు "జీవపరిణామ క్రమం" అనే ఒక విషయాన్ని గురించి పరిశోధన ఆరంబించినవారు బ్రిటిష్ నేచురలిస్ట్ చార్ల్స్ డార్విన్
1831లో ఇరవై రెండేళ్ళ డార్విన్ బ్రిటిష్ రాజ్యం తలపెట్టిన ఐదేళ్ల expeditionలో హెచ్.ఎం.ఎస్ బీగిల్ అనే నావపై ఉత్తర అమెరికా తీరం వెంబడి ప్రయాణాన్ని కొనసాగిస్తూ గేలపోగాస్ దీవులలో తన పరిశోధనలు జరిపాడు..

ఆ దీవులో డార్విన్‌కి అతి వైవిద్యమైన వివిద జాతుల జంతువులు పక్షులు కనిపించాయి. కొన్ని నెలల కాలం పాటు వాటి ఆకృతులు అలవాట్లపై డార్విన్ తన పరిశోధన గావించి వెళ్ళేటప్పుడు తనతో కొన్ని శాంపిల్సుని కూడా తీసుకెళ్ళాడు.. ఇరవైఐదేళ్ళ తర్వాత తను చూసిన విషయాలన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. 1855లో "జాతుల ఆవిర్భావం"(Origin of Species) అనే నామధేయంతో ఒక పుస్తకాన్ని వ్రాసి విడుదల చేశాడు. ఆ పుస్తకం శాస్త్ర పరమైన విషయాలలో నాటకీయమైన పరిణామాలు రూపు దిద్దుకోవటానికి నాంది పలికిందని చెప్పొచ్చు. డార్విన్ అర్దం చేసుకున్నదాని ప్రకారం జీవ జాలమంతా దిశా నిర్ధేశం లేని సహజ కారణాల వలననే ఆవిర్భవించింది.. సమయం, క్రమం ఇలా జరిగే విషయాలని "సహజ ఎంపిక(Natural Selection)"గా పేర్కొన్నాడు.

డార్విన్‌కి కనీసం రెండు వేల నాలుగొందల కాలం నాటి జ్ఞానులైనటువంటి ప్లేటో వంటివారంతా, జీవం అనేది దిశా నిర్దేశం చెయ్యబడిన అదృశ్య శక్తి యొక్క ప్రభావం వలన ఉద్భవించి, పరిణామ క్రమం చెందిందని భావించేవారు. కానీ డార్విన్ ఇచ్చిన సిధ్ధాంతంతో ఆ భావనకి తెర పడింది.. జీవ పరిణామక్రమాన్ని గురించి డార్విన్ మాత్రమే మొట్టమొదటిసారిగా మాట్లాడలేదు, కానీ శాస్త్రీయంగా పరిణామ క్రమాన్ని వివరించినవాడు మాత్రం డార్వినే.. డార్విన్ ఈ విషయాన్ని సోదాహరణంగా వివరించేందుకు గాను ఫించ్ పక్షుల ముక్కులలో వచ్చే మార్పుని ఒక ఆసరాగా తీసుకున్నాడు.. గేలపోగస్ దీవులలో పదమూడు రకాల ఫించ్ పక్షుల జాతులు నివసిస్తుంటాయి, అవి వాటి శరీరపు పరిమాణము మరియు ముక్కుల ఆకృతిలలో వ్యత్యాసాలు కలిగి ఉంటాయి.

తొమ్మిది వేర్వేరు రకాల ఫించ్ పక్షుల శాంపిల్స్ తో డార్విన్ ఇంగ్లండు వెనుదిరిగాడు. ఆయా రకాల ఫించ్ పక్షుల ముక్కు ఆకృతులలో ఉన్నటువంటి వ్యత్యాసాలకి సహజ ఎంపికే కారణమని చెప్తాడు డార్విన్. వర్షాలు బాగా కురిసే కాలంలోచెట్ల గింజల్ని తిని పెరిగే ఫించ్ పక్షులు వంకర ముక్కులను కలిగి ఉంటాయి అదే కరువు కాలంలో మిగిలిపోయిన గట్టి పదార్ధాలను ఉపయోగించుకునే వాటిలో సూది మొన కలిగిన ఫించ్ పక్షులు ఉంటాయి. ఇలా పరిస్థితులకనుగుణంగా వ్యవహరించ గలిగే శరీర వ్యవస్థని జీవ శాస్త్ర వేత్తలు ఫంక్షనల్ ఎడ్వాంటేజ్ గా పిలుస్తారు. కరువు కాలంలో పొట్టి ముక్కులు గలిగిన ఫించ్ పక్షులు తమ తర్వాతి తరాలను తయారు చెయ్యటంలో కృతకృత్యులు కాకపోగా, సూదిగా పొడుగ్గా ఉండే ముక్కులున్న ఫించ్ పక్షులు బాగా వృధ్ధి చెందుతాయి. సహజ ఎంపిక అనేది చాలా శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన విషయం..

దీనివలన సమయానుగుణంగా బలహీనమైన,లోపాలు గల్గిన జీవ జాతుల ప్రదేశంలో కొత్తవి మరియు ఉపయుక్తమైన లక్షణాలు కలిగినవీ ఐనటువంటి జీవ జాతులు ఆవిర్భవించి మనుగడ సాగిస్తాయి, అది కూడా ఎటువంటి తెలివైన దిశా నిర్దేశం కలిగినటువంటి శక్తి అవసరం లేకుండానే.. ఈ శోధనలో సహజ ఎంపిక అనేది ఆ తెలివైన శక్తికి ఒక సబ్‌స్టిట్యూట్‌లాగా పని భావించబడింది. ప్రపంచంలో ఎంతోమందిని డార్విన్ సిధ్ధాంతాలు ఒప్పించినప్పటికీ, డార్విన్ సిధ్ధాంతాలను వ్యతిరేకించే వర్గానికి చెందిన శాస్త్రజ్ఞులు లేకపోలేదు. వీళ్ళందరూ జీవ అంతర్భాగంలో విషయాలపైన డార్విన్ సిధ్ధాంతాలు ఎలా వివరిస్తాయనే విషయం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.. కొన్ని మితమైన వైవిద్యాలను మార్పులను వాటికి గల కారణాలను సహజ ఎంపిక సిధ్ధాంతం చక్కగా వివరిస్తుంది. కానీ ఫించ్ ముక్కుని గురించి చెప్పింది ఫించ్ మొత్తం శరీరం గురించి చెప్పేందుకు సరిపోదు, అలాగే ఏ జీవి యొక్క అవయవం గురించైనా వివరించేందుకు ఉపయుక్తమైన ఈ సిధ్ధాంతం ఆజీవి సర్వాంగ స్వరూపాన్నీ, సవివరంగా తెలియచేసేందుకు పనికిరాదు.

"ఈ సహజ ఎంపిక అనే కార్యక్రమం ప్రకృతికి అనుగుణంగా ఉపయుక్తమైన విషయాలనే తీసుకున్న ఒక శక్తివంతమైన ప్రక్రియ.. కానీ ఇది ఒక్క రోజులో జరిగిపోయే విషయం కాదు.." ~ చార్ల్స్ డార్విన్

1988నుండి డాక్టర్ మైఖేల్ బీహి అనే శాస్త్రజ్ఞుడు క్లిష్టమైన జీవ వ్యవస్థల పైన ఈ సహజ ఎంపికాసిధ్ధాంతం ఎలా పని చేస్తుందో కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.
మైఖేల్ బీహీ: "చిన్నప్పుడు స్కూల్లో కానీ, తర్వాత కాలేజీలో కానీ చదువుకున్నప్పుడు డార్విన్ సిద్దాంతాలను పాఠాలుగా వివరించేవారు.. ఆ తర్వాత డార్విన్ సిద్దాంతంపైన ఎటువంటి సందేహాలు కలగటానికి ఆస్కారం అగుపించలేదు, కానీ ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ డెంటెన్ అనే శాస్త్రవేత్త రచించిన'విపత్కర స్థితిలో డార్విన్ సిద్దాంతం' అనే పుస్తకం నేను చదవటం తటస్థించింది.. అందులో రచయిత డార్విన్ సిద్దాంతం వివరించలేని ఎన్నో శాస్త్రీయ వాదనలను వివరించారు. వాటి గురించి నేనెప్పుడూ వినలేదు అంతే కాకుండా ఆ వాదనలు నన్ను ఒప్పించే విధంగా ఉన్నాయి. అటు తర్వాత జీవ పరిణామం పైన నా ఆసక్తి పెరిగి చాలా ప్రయోగాలు చేశాక వాటి ఆధారంగా, డార్విన్ సిద్దాంతాలు జీవాన్ని సంపూర్ణంగా వివరించలేదని నేను భావించాను."

ఒకానొక కాలంలో కణం అనేదాన్ని ఒక జీవ పదార్ధాన్ని తనలో దాచుకుని ఉన్న పొరతో కూడిన ప్రాధమిక విషయంగా భావించేవారు, కానీ గత ఏభై ఏళ్ళలో కణాలపైన విస్తృతమైన పరిశోధనలు అనేకం జరిగాయ్.

అతి ప్రాధమిక మరియు స్వల్ప పరిమాణ స్థాయికి వెళ్ళి చూసినట్లైతే, కణాలు వాటిలో ఉన్న విభాగాలు, అణు యంత్రాలను కూడా చూడొచ్చు అనటంలో అతిశయోక్తి లేదు.. ఇలాంటివాటి గురించి డార్విన్‌ సిద్దాంతం వివరించే అవకశమే లేదు .

మామూలు జీవన విధానంలోనే మనం చాలా విషయాలని చేస్తూంటాం నడవటం, చూడటం, వినటం, ఊపిరి పీల్చటం ఇలా ఎన్నో.. వీటి వెనక ఉన్న ఎన్నో సంక్లిష్టమైన కారణాలకి సైద్దాంతిక వివరణలని డార్విన్ సిద్దాంతం విపులీకరించలేదనే చెప్పాలి..

southern methodist University 1992: తొంభైవ దశాబ్దంలో బీహీ, కణాలలో ఉండే సహజ అణు యంత్రాల అమరిక మరియు విధుల కు డార్విన్ సిద్దాంతాల వివరణకూ మద్య తనకి ఉన్న కొన్ని సందేహాలని ఎకడమిక్ కౌన్సిల్స్ లోనూ ఇంకా కాన్ఫరెన్సుల్లోనూ వివరించారు.

బ్యాక్టీరియాలో ని ఫ్లాజెల్లమ్‌ని పరిశీలించిన డాక్టర్.బీహీ అతి సంక్లిష్టమైన దాని విడి బాగాలైన మోటార్ ప్రోటీన్లు, షాఫ్ట్ ఇంకా ప్రొపెల్లర్ లాంటివి అతికిస్తే తప్ప వచ్చేవి కావు అంటారు.. మరి నేచురల్ సెలెక్షన్ దీన్ని ఎలా వివరిస్తుందని ప్రశ్నిస్తారు..

ఫ్లాజెల్లం: ఫ్లాజెల్లం అనేది బ్యాక్టీరియాలలో‌సహజంగా కనిపించ చాలక యంత్రం లాంటిది.. కణంలో జరిగే రసాయనిక చర్యల ద్వారా విడుదలయ్యే ప్రోటాన్ల కారణంగా విడుదలయ్యే శక్తితో తిరిగే అత్యంత efficient జీవయంత్ర భాగమని చెప్పొచ్చు దీన్ని.. ఒకవైపుకి లక్ష rpm స్పీడ్‌తో తిరిగే ఈ ఫ్లాజెల్లం అతి తక్కువ సమయంలోనే, ఆ వ్యతిరేక దిశలో అంతే వేగంతో దిశని మార్చుకుని తిరగగల సమర్ధవంతమైన భాగమిది.. అంతే కాకుండా మన నిజ జీవితంలో చూసే మోటార్ల లాగానే దీనికి కూడా చాలా విడి భాగాలుగా గల్గిన ప్రోటీన్లు ఎన్నో కావాలి..

ఫ్లాజెల్లం యొక్క పనితనాన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు దాని అమరికకీ సహజ ఎంపికకీ గల సంభందాన్ని అన్వేషించటం ప్రారంభించారు.. ఎంత ఆలోచించినా ఎన్ని ప్రయోగాలు చేసినా వారికి సహజ ఎంపిక అనే ప్రక్రియ ఆ ప్రోటీన్ల అమరికలో ఎలా సహాయపడుతుందో ఎటువంటి ఆధారాలూ దొరకలేదు.

దీన్ని అర్దం చేసుకునేందుకు జీవ అణు యంత్రాల పని తనాన్ని చెప్పే అనివార్య సంక్లిష్టతనిirreducible complexity పరిశోదించాల్సి ఉంది.. మైక్ డీజీ అనే ఆయన ఈ "అనివార్య సంక్లిష్టత" అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. దీనిని వివరించేందుకు ఎలుకని పట్టే యంత్రాన్ని ఉదాహరణగా తీసుకోవటం జరిగింది.. ఆ ఎలుక భందన యంత్రంలో కొన్ని భాగాలు ఉంటాయ్..

స్ప్రింగు, సన్నని రాడ్డు, వీటిని అతికించే ఇంకొక రాడ్డు, బేస్మెంట్.. ఇలా అన్నమాట, వాటిలో ఏ భాగం లేకున్నా ఆ యంత్రం పని చెయ్యదు.. అవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి.. ఇలాగే ఫ్లాజెల్లంలో రమారమి నలభై వివిద ప్రోటీన్లు కలిసి ఒకేసారి పని చేస్తేనే అది మొత్తం పని చేసి బ్యాక్టీరియాని నడిపించగల్గుతుంది..

అందులో ఏ ప్రోటీన్ మిస్సైనా ఫ్లాజెల్లం పనిచెయ్యటం మానెయ్యటమే లేదా తయారు కాకపోవటమో జరుగుతుంది.. జీవపరిణామ సిధ్ధాంతమేదైనా.. అది సహజ ఎంపిక కూడా కావచ్చు, ఇలా నలభైకి పైగా వేర్వేరు ప్రోటీన్లు కలిసి ఎందుకు పని చేశాయ్.. ఏ ఒక్కటి లేకున్నా పని చెయ్యని ఆ యంత్రాన్ని అతి నెమ్మదైన జీవపరిణామక్రమం ఎలా ఏకీకృతం చేసింది.


ఇలాంటి ప్రశ్నల ఆసరాగా అనివార్య సంక్లిష్టత సహజ ఎంపికకి సరైన సవాలునే విసిరింది.. డార్విన్ సిధ్ధాంతం ప్రకారం అతి సంక్లిష్టమైన కన్ను లేదా ముక్కూ లాంటి అవయువాలు కూడా కాలగమనంలో ఏర్పడతాయి.. అది కూడా చిన్న చిన్న మార్పులను సంతరించుకుంటూ.. కానీ ఆ మార్పులు జీవులకి ఏదైనా ఒక ఉపయోగాన్ని అందించగలిగితేనే జీవుల మనుగడతో ఆ లక్షణాలు కూడా మనగల్గుతాయి..

అసలు ఫ్లాజెల్లం అనేదే లేని బ్యాక్టీరియాలలో కాలానుగుణంగా ఎలాంటి మార్పులు చెంది అది ఉద్భవించి ఉండవచ్చు.. సహజ ఎంపికకీ దానికీ ఉన్న సంభందాన్ని ఎలా వివరించాలి? ఒక వేళ ఫ్లాజెల్లం తయారయ్యేందుకు కావాల్సిన భాగాలన్నీ వేరెక్కడి నుండో‌ఎంతో కాలానికి ఒక దగ్గరకి చేరి వాటిని బ్యాక్టీరియా ఉపయోగించుకోగల్గిందని చెప్పినా..

వాటి అమరిక ఎలా సాధ్యమౌతుందని క్రొత్త ప్రశ్న ఉదయించింది శాస్త్రజ్ఞులలో.. 1996లో మైఖేల్ బీహీ "డార్విన్స్ బ్లాక్‌ బాక్స్" అనే ఒక పుస్తకాన్ని రచించి విడుదల చేశాడు. అందులో ఆయన డార్విన్ యొక్క సహజ ఎంపిక సిధ్ధాంతాన్ని ఉటంకిస్తూ, ఆ సిధ్ధాంతం బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లం ఆవిర్భావాన్నే కాక మరి ఏ ఇతర అనివార్య సంక్లిష్ట జీవ అణు వ్యవస్థలనూ వివరించలేదని చెప్పాడు..


ఇలాంటి వ్యవస్థలను బీహీ intellgent design తెలివైన అమరికగా పేర్కొన్నాడు.. 75 సైంటిఫిక్ జర్నల్సుతో పాటుగా ప్రపంచంలో లీడ్‌లో ఉన్న కొన్ని వార్తా పత్రికలు కూడా ఈ పుస్తకాన్ని పరిశీలించారు..

కొంత మంది బీహీని పొగడగా ఇంకొంతమంది అతని పరిశోధనని అశాస్త్రీయమని పెదవి విరిచారు.. బీహీని విమర్శించేవాళ్ళేమంటారంటే ఫ్లాజెల్లంకి కావాల్సిన విడి భాగాలు ముందుగానే సహజ ఎంపిక ద్వారా క్రోడీకరించ బడ్డాయనీ, ఆ తర్వాత అమర్చ బడ్డాయనీ చెబుతారు..


కొంత మంది బీహీని పొగడగా ఇంకొంతమంది అతని పరిశోధనని అశాస్త్రీయమని పెదవి విరిచారు.. బీహీని విమర్శించేవాళ్ళేమంటారంటే ఫ్లాజెల్లంకి కావాల్సిన విడి భాగాలు ముందుగానే సహజ ఎంపిక ద్వారా క్రోడీకరించ బడ్డాయనీ, ఆ తర్వాత అమర్చ బడ్డాయనీ చెబుతారు.. ఈ థియరీని co-option అంటారు.. కానీ అవి ఎలా క్రోడీకరించబడినా వాటి సంక్లిష్టమైన అమరిక గురించిన విషయం మాత్రం నేచురల్ సెలెక్సన్ ఎలా చెప్పగలదని ఇంకో వాదన ఉంది.. ఇలాంటి మరికొన్ని ప్రశ్నలని co-option సిధ్ధాంతం ఎదుర్కుని నిలబడలేకపోయింది. నూట అరవై ఏళ్ళ క్రితం శాస్త్రజ్ఞులకి "అనివార్య సంక్లిష్టత" గురించి తెలియదు.

ఏదైనా జీవ అణువు కొద్ది మార్పులతో ఏర్పడకుండా ఉన్నట్లు ఆదారాలు ఉంటే నా సిధ్ధాంతానికి ఆ రోజు తెర పడ్డట్లే అని డార్వినే వివరించాడు.. రెండు అతి ప్రాధమిక ప్రశ్నలు మన భూమ్మీదున్నాయి.. రెండోది, అప్పటికే ఉన్న జీవుల నుండి క్రొత్త జీవులు (అంటే రెక్కలు కల్గిన పక్షులు సరీసృపాలనుండి ఆవిర్భవించినట్టుగా అన్నమాట) ఎలా ఆవిర్భవించాయి? అలా మొదటిది అసలు భూమ్మీద జీవమనేది ఎలా ఆవిర్భవించింది అనేవి? ఎన్నాళగానో మనల్ని వేధిస్తున్నాయి..

డార్విన్ మొదటి ప్రశ్నకి సమాధానాన్ని వెతికేందుకు తన జీవితంలో చాలా కాలాన్ని వెచ్చించాడు.. డార్విన్ జీవోద్భవం మరియు పరిణామ క్రమాలను కొమ్మలున్న చెట్టుతో పోల్చాడు.. చిన్న ఏక కణ జీవులను మొదలుగా తీసుకుని వాటి నుండి మిగిలిన జీవ జాతులన్నీ ఆవిర్భవించినట్లుగా భావించాడు.. అవి ఎలా రూపాంతరం చెందాయో అర్దం చేసుకునేందుకు ప్రయత్నించాడు ,

సంక్లిష్టమైన జీవుల దగ్గర నుండి ఏక కణ జీవులవద్దకొచ్చేటప్పటికి అటు తర్వాత,నిర్జీవ పదార్దం నుండి జీవ పదార్దం ఎలా ఉద్భవించిందో అర్దం కాలేదు ఆయనకి.. జీవ జాతుల ఆవిర్భావం(origin of species) పుస్తకంలో ఆయన ఆ ప్రశ్నని లేవనెత్తలేదు కూడా..

జోసెఫ్ హుకర్ అనే ఒక సహోద్యోగికి ఆయన రాసిన ఉత్తరంలో మాత్రమే డార్విన్‌కి ఈ విషయం మీదుండే అభిప్రాయాలు తేటతెల్లమైనాయి. ప్రాధమిక కణాలు భూమి యొక్క ప్రైమోర్డియల్ వాటర్లో రసాయన మార్పుల కారణంగా ఏర్పడి ఉండొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.. 1920వ ద్విదశాబ్ద కాలంలో అలెగ్జాండర్ ఓపెరన్ అనే రష్యన్ శాస్త్రవేత్త , డార్విన్ అభిప్రాయలకి బలం చేకూర్చే విపులమైన సిధ్ధాంతాన్ని ప్రతిపాదించాడు ..దానికి రసాయన పరిణామ క్రమమని పేరు.. ఆ తర్వాతి త్రిదశాబ్దంలో చాలా మంది శాస్త్రజ్ఞులు ఈ అభిప్రాయాల ఆధారంగా తమ పరిశోధనలు సాగించారు.. వీరిలో డీన్ కెన్యన్ని ప్రముఖంగా చెప్పొచ్చు.. అరవైలలో నెలకొని ఎంపిరికల్ ప్రిన్సిపల్సన్నింటినీ గమనించిన తర్వాత..

జీవావిర్భావానికి కావాల్సిన నిర్జీవ అణువులు ఎలా ఏర్పడతాయో అనే జిజ్ఞాస ఏర్పడిందని ఆయన అంటారు , కానీ దానిని వివరించాలంటే కణం జీవనికి సంభందించిన ప్రతి అణువూ ఎలా ఏర్పడిందో వివరించే సవాలు కెన్యన్ ముందుంది..జీవి జీవ క్రమంలో ప్రోటీన్లు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి.. ఒక్క జన్యు విషయ సంగ్రహణ తప్ప కణంలో జరిగే ప్రతి విషయాన్నీ ప్రోటీన్లే నిర్వహిస్తాయి.. అతి చిన్న కణాలు కూడా కొన్ని వేల రకాల ప్రోటీన్లతో నిర్మితమైన్ ఉంటాయనీ.. ఆ వైవిద్యమంతా వివిధ రకాలుగా అమర్చబడిన ఎమైనో ఆసిడ్లు మరియు ప్రోటీన్ల త్రిపరిమాణాకృతి పై ఆధారపడి ఉందని శాస్త్రజ్ఞులు అర్దం చేసుకున్నారు..

కొన్ని ప్రోటీన్ల వేరే అణువులతో కలిసి రసాయన చర్యని ఉత్ప్రేక్షించే ఎంజైములుగా పని చేస్తే, ఇంకొన్ని రకాలు కణ త్వచం మరియు కణ కవచంలాంటి నిర్మిత వ్యవస్థలలో తమ ఉనికిని కలిగి ఉంటాయి.. ప్రతి ప్రోటీనూ ఇరవై రకాల ఎమైన ఆసిడ్ల గొలుసుగా ఏర్పడి ముడుచుకు పోవటం వలన దానికే వీలైన ఒక ప్రత్యేక త్రిపరిమాణాకృతి కలిగి ఉంటాయి..

అలాగే ఆయా ప్రోటీన్లకి ఏదో ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది.. ఎమైనోఆసిడ్ల వరుస క్రమంలో ఏదైనా తేడాలొస్తే ఆ ప్రోటీన్ తయారవ్వకుండా వినాశనం చెందటమే కాకుండా అది ఆయా కణ జీవ నిర్వహణలకి విఘాతమవుతుంది. గ్యారీ స్టాండన్ మరియు కెన్యన్, వీరిద్దరూ కలిసి రు "బయోకెమికల్ ప్రీ డెస్టినేషన్" అనే ఒక పుస్తాకాన్ని వ్రాశారు..

అందులో కెన్యన్ "జీవం జీవరసాయనికంగా ఎమైనోఆసిడ్ల మద్యనున్న ఆకర్షణవలన రూపొంది ఉండొచ్చు" అని వ్రాశాడు.. ఒక ఇరవై సంవత్సరాలుగా ఆ పుస్తకం మంచి జీవార్భావ సంభందిత విషయాల్లో, సందేహాల్లో మంచి సవాలుగా నిల్చిన పుస్తకంగా పేర్కొనవచ్చు.

కానీ పుస్తకం ప్రచురణకొచ్చిన ఐదు సంవత్సరాలలోనే కెన్యన్ తను ప్రతిపాదించిన కెమికల్ ఇవల్యూషన్ విషయాలపైన తనే సందేహాలను వ్యక్త పర్చారు.. దానికి కారణమేంటంటే జన్యు పదార్దపు ప్రేరణ కానీ ఉనికి కానీ లేకుండా మొట్టమొదటి ప్రోటీన్ ఎలా ఏర్పడించి,

అందులో ఎమైనో ఆసిడ్లకి అలాగే అమరాలని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఎదురు కావటమే.. ఎమైనో ఆసిడ్ల లక్షణాలు వాటి నిర్మాణాన్ని ఆధారంగా చూస్తే, డీ.ఎన్.ఏ లేకుండా ప్రోటీన్లు ఏర్పడటం అనే విషయం పైన కెన్యన్‌కి సందేహం ఏర్పడింది..

డీ.ఎన్.ఏ (డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ యసిడ్)లో ఉండే నాలుగు రకాల బేస్‌లు బిలియన్ల కొద్దీ ఎరేంజయ్యి ఉంటాయి.. ఈ వరుస క్రమాన్నే జీవ భాష (language of life)గా పేర్కొంటారు..

ఇప్పుడు కెన్యన్ ముందున్న రెండు సవాళ్ళేంటంటే ఐతే మొదటిగా ఆవిర్భవించిన ప్రోటీన్‌కి జన్యు జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి లేదా ప్రోటీన్లు నిర్జన్యు ఆదారితంగా కూడా ఏర్పడగలవని నిరూపించాలి .. చివరకి తను రెండిట్లో దేనినీ నిరూపించలేడని తెలుసుకున్నాడు. ఆయన జరిపిన ఎన్నో పరిశోధనల్లో ఎమైనో ఆసిడ్లకి స్వీయ సంకలిత శక్తి లేదని.. జన్యు పదార్దం యొక్క ఆవశ్యకతని నిరూపించే ఎన్నో శాస్త్రీయమైన వాదనలు ఎదుర్కొన్నాక .. అసలు జన్యు పదార్దం ఎలా ఏర్పడిందనే విషయాన్ని వదిలేసి ప్రోటీన్ల వెనక పరిగెడుతున్నామనే ఆలోచన వచ్చిందని తాను భావించాడు.. అసలు జన్యు పదార్దంలో దాగున్న జీవ భాషావిర్భావ ఉనికిని గురించి తెలిస్తే జీవార్భావం గురించి మనకి ఒక తెలివైన అవగాహన వస్తుందనే అభిప్రాయాన్ని కూడా కెన్యన్ వ్యక్తపరిచాడు.. 1970ల కాలానికి, మొదటి కణం తయారీకి కావాల్సిన విషయ పరిజ్ఞానమంతా దానంతట అదే దొరికిందనే వాదనల్ని శాస్త్రజ్ఞులంతా వ్యతిరేకించారు.. "to be or not to be?" అనే రెండు లైన్ల ర్యాండమ్‌గా రావటం అనేది ఎంతో కష్టమైన విషయమైనప్పుడు బిలియన్ల కొద్దీ, జన్యువిషయ పరిజ్ఞానం కలిగిన డీ.ఎన్.ఏ అలా ఎలా ఏర్పడగలదని వాదనలు వినిపించారు, ఒక ఏక కణ జీవి నుండి తీసిన జన్యు క్రమం అంతా కలిసి ఒక పెద్ద పుస్తకమంతవుతుంది ..
ఇంకొక వాదనేంటంటే అసంకల్పితంగా ఏర్పడుతున్న రసాయన మార్పులపై సహజ ఎంపిక అనేది పని చేసి మొదటి జీవి ఆవిర్భవించి ఉండొచ్చని భావిస్తుంటారు.. కానీ నిర్వచనా పూర్వకంగా ఆలోచిస్తే సహజ ఎంపిక అనేది జీవార్భావం ముందు ఉండే సమస్యే లేదు..

అది స్వయం ప్రత్యుత్పత్తి చేసుకోగలిగే కణాల నుండే పని చేసే అవకాశం ఉంది.. డీ.ఎన్.ఏ లేకుండా స్వయంప్రత్యుత్పత్తి క్రియ లేదు.. తద్వారా సహజ ఎంపిక జరిగే అవకాశం లేదు.. కాబట్టి డీ.ఎన్.ఏ ఆవిర్భవానికి సహజ ఎంపిక సిధ్ధాంతాన్ని వాడటం అసంబధ్ధమౌతుంది.. కెన్యన్ కెమికల్ ఇవల్యూషన్ని వ్యతిరేకించిన కొన్ని సంవత్సరాల కాలంలో జీవ జన్యు సంబంధమైన విషయ ప్రక్రియలు విస్తృతంగా పరిశోధించబడి, "ప్రతిభాపూర్వక అమరిక" సిధ్ధాంతావిర్భావానికి నాంది పలికింది..

కణ కేంద్రకంలో ఉండే, డీ.ఎన్.ఏ లో transcriptionఅనే క్రియ ద్వారా mRNA రూపొంది , అది nuclear pore complexes ద్వారా cytoplasmలోనికి వచ్చి, అక్కడ ఉండే ribosome సంక్లిష్టం సహాయంతో ప్రోటీన్ల నిర్మాణం జరుగుతుంది.. ఆ పని పూర్తైన తర్వాత గాల్జీ సంక్లిష్టంలో అది దాని కర్మానుగుణంగా మడవబడిన తర్వాత..

దాని గమ్య నిర్ధేశాన్ననుసరించి ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ దానిని ఆ ప్రదేశానికి చేరుస్తుంది.. డీ.ఎన్.ఏ నిర్మాణ వ్యవస్థని సవివరంగా వివరించి నోబెల్ బహుమతి పొందిన వాళ్ళలో ఒకరైన ఫ్రాన్సిస్ క్రిక్ తన కొటేషన్లో.. "బయాలజిస్టులు గుర్తు పెట్టుకోవాల్సిందేంటంటే.. వాళ్ళు చూసిందేదైనా, పరిణామ క్రమంలో ఆవిర్భవించిందే కానీ కృత్రిమంగా ఏర్పరిచింది కానీ మలిచింది కానీ కాదూ" అని అంటాడు..డార్విన్ చెప్పిన సహజ ఎంపిక సిధ్ధాంతం "తెలివైన అమరిక"(intelligent desgin)అనే ఒక కారకాన్ని వదిలేసిందనే చెప్పాలి.. ఈజిప్టులో ఉండే చెక్కబడిన రాళ్ళని చూసి అవి మృత్తికా క్షయం వలన అలా ఏర్పడ్డాయనో లేక వేరే సహజ పధ్ధతిలో ఏర్పడ్డాయనో అనగలమా.. సైన్సు అందించే methodological evidenceలో ఎవరైన సహజమైన విషయాన్నే ఆధారంగా తీసుకుంటున్నారు కానీ ప్రతి వలన వచ్చేవిగా భావించబడే విషయాలని ఆధారాలుగా తీసుకోవట్లేదు..

డెమ్‌స్కీ రచించిన డిజైన మరియు ఇన్ఫరెన్స్ అనే పుస్తకం.. డిజైన్ రీజనింగుని అర్దం చేసుకోవటంలో ప్రముఖ పాత్ర వహించింది.. ఆయన ప్రకారం ప్రతి డిజైన్ వెనుకు ఒక భావం ఉంటుంది అందులో ఉండే ప్యాటర్న్ మనకి ప్రత్యేకమైన ఏదో ఒక విషయాన్ని విశదీకరిస్తుంది..

ఆయన వివరించిన small probability మరియు specification అనేది informationతో సమానంగా భావించబడుతుంది.. ఆ విషయం(information)ఏదైనా కానీ అంటే మనం వ్రాసే అక్షరాలే ఐనా, సాఫ్టు వేరే ఐనా, రేడియో సిగ్నల్సైనా.. అలాగే ఎలక్ట్రో మాగ్నెటిక్ ట్రాన్స్మిషన్ వలన వచ్చే ఇన్ఫర్మేషన్ ఒక ప్రత్యేకమైన రకపు ప్రతిభని వెతకటంలో సహాయపడింది..

మూడు దశాబ్దాలకి పైగా ఖగోళ శస్త్రజ్ఞులు రోధసీలో ఉండే దాగి ఉండే జీవాన్ని లేదా ప్రతిభనీ గురించి వెతుకుతున్నారు .. మామూలుగా ఐతే నక్షత్రాలు మరియు ఇతర రోధసీ పదార్ధాలు చేసే సిగ్నల్సు మాత్రమే అందుతాయి.. వాళ్ళెప్పుడూ జీవ సంభందిత సౌంజ్ఞలను అందుకోలేదని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతారు..

కానీ కొందరి కల్పనలు లేదా అనుమానాల ప్రకారం ఒక ప్రత్యేకమైన సౌంజ్ఞలు కూడా అందాయి.. అవి రోధసీలో ఉండే ఏ ఇతర ఎలక్ట్రో మాగ్నెటిక్ సిగ్నల్సు లాగనో కాక రోదసి ఉండే జీవజాలం విశ్వ భాష ఐన గణితంలో ప్రధాన సంఖ్యలు ఉండే ప్యాటర్న్స్ లో మనకందించే సిగ్నల్ లాగ ఉందని భావించబడింది.. కానీ స్వల్ప రోధసీలాంటి జీవజాలంలో చాలా ఇన్ఫర్మేషన్ని మన శాస్త్రజ్ఞులు కనుగొన్నారు..

ఇంకే పద్దతిలోనూ డి.ఎన్.ఏ లో పట్టగలిగినంత చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ వేరే ఏ పధ్ధతిలోనూ అంత ఎక్కువగా పట్టదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.. మనిషి యొక్క పూర్తి జన్యు పదార్దం మూడు బిలియన్ల కంటే ఎక్కువ ఇండివిడ్యువల్ అక్షరాలను కలిగి ఉంటుంది.. బిల్‌గేట్స్ ఒకానొకాసమయంలో డీ.ఎన్.ఏ ని సాఫ్టువేర్ డీజైన్ మరియు పని చేసే విధానాలతో పోల్చాడు..

జీవజాలం యొక్క ఇన్ఫర్మేషన్ మరియు మిగిలిన పనితనం దానితో మనకుండే అనుభవం ఆధారంగా చూస్తే అది ఒక ప్రతిభాపూర్వక కారకం వలననే అది ఆవిర్భవించిందని ఒప్పుకుంటాం.. అది సరే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి వచ్చింది??

గత పదిహేనేళ్ళగా స్టీవెన్ మేయర్ అనే ఫిలాఫర్ మరియు శాస్త్రవేత్త ఈ విషయాన్ని వివరించేందుకు పరిశోధనలు చేస్తున్నారు...

ఇప్పటి వరకూ మనకుండే అవగాహన మేరకు సహజ ఎంపిక కానీ, లేదా ర్యాండమ్‌ ఎరేంజిమెంటు సిధ్ధాంతం కానీ జీవార్భావానికి కారణాలు కావని తేలింది.. కానీ మన ప్రస్తుత అవగాహనా పరిధి మేరకు చూస్తే ఈ ఇన్ఫర్మేషన్‌కి కారణం ఇంటెలిజెన్సని తేటతెల్లమౌతుంది..

కాలిఫోర్నియాలో జరిగిన మీటింగులో చర్చలోకొచ్చిన విషయాల్లో, జీవ శాస్త్రాన్ని ఎన్నో ఏళ్ళుగా శాసించిన కొన్ని సిధ్ధాంతాలని తిరగతోడటం సంభవించింది..

వాళ్ళందరూ ఒప్పుకోగలిగిన క్రొత్త సిధ్ధాంతం పేరు "ఇంటెలిజెంట్ డిజైన్".. మనం పరిశీలించే సత్యాల ఆధారంగా ఏర్పడిందే ఈ ఇంటలిజెంట్ డిజైన అనే సిధ్ధాంతం..

మంచి శాస్త్రీయతకి నిర్వచనం కూడా సత్యాలను పరిశీలించటమే.. చాలా మంది భావించే విధంగా ఈ ఇంటెలిజెంట్ డిజైన్ మీద మత సంభందమైన వాదాలు రావచ్చని భావించినా సైన్సు వాటిపై ఎప్పుడూ అధారపడి పని చేయదు..

దీని ఆధారంగా చూస్తే విశ్వమంతా రేషనల్‌గానూ, అర్దవంతంగానూ కనిపిస్తుంది, ఏదో‌మహోన్నతమైన ప్రతిభ వీటి ఆవిర్భావం వెనక దాగున్నట్లుగా..

నూటేభై ఏళ్ళ క్రితం చార్లెస్ డార్విన్ తన సిధ్ధాంతం ద్వారా జీవశ్త్రాన్ని శాసించారు.. ఈ రోజు ఆ సిధ్ధాంతం చాలా పెద్ద సవాలునెదురుకుంది..

పంతొమ్మిదో శతాబ్దపు శాస్త్రవేత్తలు.. రెండే అంశాలు ఈ విశ్వంలో ప్రాధమిక స్థాయిలో ఉన్నాయని భావించేవాఅరు అవి..

పదార్దం మరియు శక్తి(matter and energy).. ఈ ఇరవై ఒకటో శతాబ్దపు శాస్త్రవేత్తలు గుర్తించాల్సిన మూడో‌ప్రాధమికాంశం ఇన్ఫర్మేషన్..

డీ.ఎన్.ఏ లో మనం గమనించేది ఒక ఆర్టిఫేక్ట్ ఆఫ్ మైండ్ లేదా ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు.. ఇంటెలిజెంట్ డిజైన్ ఆధారంగా...

Share