ఈ పోస్టుని చదవటానికి క్రింది లింకు పైన క్లిక్ చెయ్యండిIs it SOUL or సొల్లు |
(చంద్రమౌళి) అంతర్మధనం
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Monday, January 23, 2012
సోలా... సొల్లా
Thursday, December 15, 2011
నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్...
| అలా మాట్లాడుతూనే ఆమెని అడిగేశాను... ప్రేమించటమంటే ఎందుకని మీ అమ్మాయిలంతా, మీ మనసుకి నచ్చిన సోదిని వినే ఒక కౌన్ కిస్కా గొట్టాం గాడు దొరకటం మాత్రమే అనేటట్లు చూస్తారు? వాడు ఎలా ఉండాలో, ఎలా కనపడాలో, ఎలా ప్రవర్తించాలో ఇలా అన్నీ మీరు నిర్ణయించి మీకు నచ్చినట్లు చెయ్యాలని చూస్తారు? మీకుండే ఇన్ సెక్యూర్ ఫీలింగుని వాడి ఇనెబిలిటీకో లేక డిజెబిలిటీకో ముడిపెడతారు?... మౌనం వహించిందామె అది తుఫాను ప్రశాంతతా అనేటట్లుగా... శబ్ధారంభం సౌమ్యంగా అనిపించినా, సమాధానం ఘాటుగానే ఉంది. మీ అబ్బాయిలంతా ఎందుకలా అమ్మాయిల్ని ఏలియన్సుని చూసినట్లు చూస్తారు, మిమ్మల్ని ప్రేమించే అమ్మాయిల్ని మీ వెనక తిరిగే కుక్కలా హీనంగా భావిస్తారు, ఆమె శరీరానికే ఎందుకు విలువిస్తారు, ఆమె మనసన్నా, మాటన్నా అంత చులకనగా ఎందుకుంటుంది??? శబ్ధ తీవ్రత తుఫాను కాక అదేదో సునామీని తలపించింది... జాన్ గ్రే men are from mars and women from venus,అలాగే జాన్ మిల్టన్ తను కోల్పోయి పొందిన స్వర్గాలలోని అంతరాలు అర్ధమయ్యాయి, ఎందుకో మిల్టన్ జాన్ గ్రే కంటే చాలా అమాయకుడనిపించింది, నిజానికి నేను ఆ నవలలు చదవలేదు కానీ, అమ్మాయిల మనస్త్వత్వం ఎలా ఉంటుందో తెలిసే ఉత్తమ జాతి నేర్పరికి (ఇతరులని చూసి నేర్చుకునేవాడు), ఆ టైటిల్సులో పరమార్థం ఉడుకుతున్న బియ్యం మెత్తబడిందో లేదో దాన్ని తడమకుండానే చెప్పగలిగినంత సౌలభ్యం అనిపించింది... పాపం పైన ఆమె అడిగిన ప్రశ్నలు అందరి విషయంలో నిజం కాకపోయినా అందులో అతిశయోక్తి అతిగా లేదనిపించింది... ఆ మద్యన చూసిన ఆరెంజి సినిమాలో, తను ప్రేమించే ప్రేమకి నిర్వచనం కానీ పరమార్థం కానీ చెప్పుకోలేని కథానాయకుని పాత్రని సృష్టించిన రచయిత మనస్తత్వం చూశాను, అదే సినిమాలో ఇంకో పాత్ర ప్రేమంటే ఇదీ అని జీవిత కాలం భార్య పెట్టే పోరుని/సోదిని భరించగలిగే ఎబిలిటీని చాటి చెప్తాడు... స్వార్థం ఇష్టపడే కథానాయకుడంటే ప్రేక్షకుడికి ఇష్టం ఉండదు అలాగే అది నిజ జీవితం ఐతే అలాంటబ్బాయి అంటే ఏ అమ్మాయికీ ఇష్టం ఉండదు... మరి గొంతులో దుఃఖాన్ని దాచుకుని నవ్వుతూ రోజుకో పూలకుండీ కొనుక్కునే పాత్ర అంటే జనాలకి ఎందుకంత ఇష్టం... (వాళ్ళు జనాలు వాళ్ళనడిగి వేస్ట్ అని అంతరాత్మ వెకిలిగా సమాధానం ఇస్తుంది) నిరంతరం అనుసంధానమై ఉండే సౌకర్యం ఉండే ప్రపంచంలో అనుక్షణం విషయ సంగ్రహణ సామర్ధ్యం కలిగి ప్రతీ నిమిషం ఆర్ధికాభివృధ్ధి సాధించాలనుకునే జనాలకి, భోజనాలని ఈ మెయిల్లో పంపగలిగితే బాగుండు, పిల్లల్ని ప్రింటౌట్ తీసుకోగలిగితే బాగుండు, తన మెయింటెనెన్సూ, జాగ్రత్తలూ తీసుకోమని అడగని పరికరాలే తమ జీవిత బాగస్వాములైతే బాగుండు అని భావించే అభినవ అభివృధ్ధి పద ప్రపంచంలో పలువురు పలికే వాక్యం "ప్రేమా పేడకడి తట్టా".... ఎందుకీ ఎనాలిసిస్ నీకూ, దేనికిది రాస్తున్నావూ, ఎవరన్నా డబ్బులిస్తారా నీకూ, లేక పని లేదా, ఈ కాలంలో ఎవడన్నా ఇంటరెస్టు మాత్రం ఉందని ఏదైనా పని చేస్తాడా... ఇది నేను రాస్తున్న పోస్టుకొచ్చిన కితాబు... మనసులో ఏమి తోచక సమాధానంగా చెప్పాను, కేర్నాట్ ఇంజిన్ లోనికి వచ్చిన ఎనర్జీ బయటకెళ్ళటానికి సింకొకటి కావాలి, అది నాకు ఇదే అని చెప్పాను... మరేం చెప్పనూ జీవితమంతా, ఇంగ్లీషు వచ్చీ రాని మనిషి inception సినిమాని మొదటిసారి చూస్తున్నట్లుంటే ఆల్మోస్టు ఎవరైనా ఆ టైపులోనే సమాధానం చెబుతారు... ఎంత వెతికినా ఏం చూసినా, పాత సినిమాల్లో కనిపించే అందమైన ప్రేమ, స్వంత ఊహల్లో జనించేంతటి స్వఛ్ఛమైన ప్రేమ, నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్... ![]() |
Labels:
అంతర్మధనం
| Reactions: |
Sunday, November 20, 2011
బంగారు మోము ఛాయ...
| Reactions: |
Friday, September 30, 2011
కలైపోయావు కదా నా జీవితాన...
| Reactions: |
Wednesday, September 21, 2011
గురుత్వాకర్షణ...
| Reactions: |
Monday, September 5, 2011
అక్షరం
| అక్షరం గురించి వ్రాయమంటే ఏదో అలా అలా వచ్చిన కొన్ని పదాలని ఇలా మీ ముందు ఉంచాలనిపించింది... క్షరం అంటే నాశనం అక్షరం=నః క్షరం - అంటే నాశనం కానిది, నాశనమనేదే లేనిది; ఇది అక్షరానికి భాషాపరమైన అర్ధం. మనోభివృధ్ధి సాధించిన మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. తనదైన శైలిలో జీవించటానికి, తనదైన ఉన్నతమైన సంక్లిష్ట భావజాలాన్ని వ్యక్తీకరించటానికి అలాగే వ్యక్తీకరించబడినదాన్ని స్వీకరించటానికి తనకి అవసరమైన మాధ్యమం భాష, ఆ భాష అక్షరాల అమరిక. ప్రపంచమంతా నిభిడీకృతమై ఉన్న సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపదని అర్ధం చేసుకునేందుకు , ఆ సంపదని మానవాళి శ్రేయస్సుకి ఉపకరించేట్టు చేసేందుకు అవసరమైన అక్షర జ్ఞానం ఆవశ్యకత వర్ణింప శక్యం కానిది. ఆ అక్షర జ్ఞానం కలిగి ఉండటం అక్షరాస్యత, అది లోపించటం అనేది నిరక్షరాస్యత. ఒక నిరక్షరాస్యుడు తన అవసరాన్ని సరిగా వ్యక్త పరచలేని ఒక సామాన్య అవసరం నుండి ఉధ్ధండమైన ప్రయోగాలతో జనావళికి తన పరిశోధనా సేవలందించే శాస్త్రవేత్త ఉపయోగించే భాష్యం వరకూ అవసరమయ్యేదంతా ఆ అక్షరాస్యత నుండి పుణికి పుచ్చుకుచ్చుకోవాల్సిన జ్ఞాన సంపదే. అక్షరాలు పదాలనీ, పదాలు వాక్యాలనీ, వాక్యాలు విషయ సంపదనీ నేర్చుకునేందుకు దోహదం చేసి తద్వారా విచక్షణ అనేది అలవడేలా చేస్తుంది. విచక్షణ లేకుండా ప్రవర్తించే మనిషి మృగ సమానుడు. మనిషి స్వభావం ఎలాంటిదైనప్పటికీ దానిని మార్చి తనలో సమాజ హితునిగా పరివర్తన తీసుకురాగల మంత్రం అక్షర మంత్రం. అక్షరమనే మాతృక జ్ఞానమనే సంపద సాధించటానికి ఉపయోగపడితే, జ్ఞానం విద్వత్తు జనించేందుకు ఉపకరిస్తుంది. విధ్య కలిగిన వాడు లోకమెల్లా పూజింపబడతాడు అనే పెద్దల సూక్తి నిత్య సత్యం. అక్షరాన్ని గురించి ఇలా ఎన్ని అక్షర సత్యాలు చెబుతున్నా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కూరగాయలు తరిమే కత్తి ని ప్రావీణ్యత లేని వాడు దానిని ఉపయోగించినా లేదా హత్యలు చేయాలనే వాడు ఉపయోగించినా అది రక్తం కళ్ళ చూస్తుంది. అక్షరం అనే సాధనం చాలా ఉన్నతమైనదీ మరియు ఎంతో శక్తివంతమైనదీనూ. చిన్ననాటి నుండీ సమాజ శ్రేయస్సుకి సంభందితమైనపోకడలని అలవర్చుకున్న మనిషి చేతిలో అక్షరం ఏనాటికైనా ఒక మహాద్భుతాన్ని చూపుతుంది. కాలి నడక నుండి గాలి నడక వరకూ అభివృధ్ధి సాధించిన మనిషి గొప్పతనం, కొండంత నుండి గోరంతవరకూ చేరుకున్న ఉపకరణాల పరిమాణం వాటి ఉపయుక్తం ఇలా చెప్పగా కోకొల్లలవి. కరడు గట్టినట్లు రహస్యాలను దాచుకున్న ప్రకృతి మానవుని ముందు చేతులొగ్గి వాటిని బయట పెట్టటానికి కారణం, మనిషి తాను సంపాదించిన జ్ఞానాన్ని పంచుకోగలిగే మరియు దాచుకోగలిగే సాధానంగా, మాధ్యమంగా ఉపయోగించబడుతున్న అక్షరం మన మనిషుల ఉనికికే తలమానికం, ప్రతిభకే ఆలవాలం. దురుపయోగంలో ఉన్న అక్షర జ్ఞానం దాని పర్యవసానాన్ని సమాజ చీడ పురుగుగా మార్చటం ఖాయం. ఏది ఏమైనా మనిషిని మనిషిగా నిరూపించగలిగే అక్షరం ఒక అమోగమైన సాధనం, కానీ అది సాధనం మాత్రమే, నిన్ను మనిషిగా చూపించలేక మృగంగా నువ్వు మారితే అది నీలోని అక్షర దోషం తప్ప అక్షరంలో స్వయంగా దాగి ఉన్న దోషం కాదది. అనిర్వచనీయమైన వాడి అందుకు సరిపడ వేడిని కలిగున్న అక్షరంతో పాటుగా దానిని ఉపయోగించే దారి అనే జ్ఞానాన్ని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విధ్యావంతుడైన మనిషిగా నిలదొక్కుకోగలిగే సామర్ధ్యాన్ని అందరూ పెంపొందించుకోవాలని ఆశిధ్ధాం. |
Labels:
అంతర్మధనం
| Reactions: |
Friday, August 5, 2011
జాలేస్తుంది కూడానూ...!?!?!?!
"హా!! ఏంట్రా అలా చూసి, ఎందుకో కొద్దిగా నచ్చగానే ప్రేమ పుట్టేస్తుందా, ఇప్పటికి నువ్వు పుట్టి పట్టుమని పాతిక నిండుంటాయ్ తెలుసా... పదేళ్ళ క్రితం ఇదే రోజు ఏ పరిస్థితిలో ఉన్నావో కనీసం వీసమెత్తైనా గుర్తుందా నీకు . ఉండదు, ఎందుకో తెలుసా... నీకు భాద్యత అంటే తెలియదు కనక, నువ్వు తినే అన్నం ముద్దలో ఉండే ఒక్కో మెతుకుని ప్రశ్నించి చూడరా, అవి కలగలసి నీ నోటిని చేరేందుకు కారణమైన వాళ్ళ శ్రమ, ఆశ, ఆవేదన ఏమైనా నీకు తెలుస్తాయా ", వాడిని వాయించేస్తుంది అంతరాత్మ.. పాపం దాని తప్పేముందనీ, దాని విద్యుక్త ధర్మాన్ని అది నిర్వర్తించింది. శరీరం పై కొన్ని ఏళ్ళొచ్చాక, మనసు ఎవరి సలహాలనీ స్వీకరించటానికి సహకరించదనుకుంటా . దీన్నే పోజిటివ్‌గా ఆత్మవిశ్వాసమనీ , నెగెటివ్‌గా బలుపు అనీ పిలుస్తుంటారు... సినిమాలో అపరిచితుడికి పలు పర్సనాలిటీలు ఉన్నట్లు వాడికి కూడా ఇంటర్నల్ డిఫెండర్ ఒకడున్నాడు మరి.... "అంటే ప్రేమనేది స్పాంటేనియస్‌గా పుట్టకూడదా?? ఒకమ్మాయ్ నచ్చటానికి కొలమానాలు, కారణాలు, లాంటివి లేకపోతే అది ప్రేమ అవ్వదా?? అన్నం పెట్టే అమ్మా, నాన్నలైనా అలా ప్రశ్నిస్తారో లేదో కానీ నువ్వు బాగా టూ మచ్ చేస్తున్నావ్ అంతరాత్మా![]() ", అంటూ అదేదో సినిమాలో బ్రహ్మనందంలాగా వాపోయాడు , తన అంతరాత్మ ఇంకా ఫోర్స్ చేస్తే తానెక్కడ మారిపోవాల్సొస్తుందేమో అని అనుకుంటా?... పాపం వాడి బంధువుల్లో చాలా మంది వాడికి క్లాసు పీకేవాళ్ళే ![]() ఎక్కువ, వీడి బ్యాడ్ ఫేట్ కొద్దీ చిన్నప్పుడు వీడి లెక్కల మాష్టారు ప్రతిక్షేపించటం అనే పదాన్ని బాగా నేర్పినట్లున్నాడు, అందుగ్గాను ఆ తొక్కలో మైండ్ ఎప్పుడూ ఎవరో ఒకరిని వీడికి ఎగెయినిస్టుగా ప్రతిక్షేపించి , సరిగ్గా టైం చూసుకుని వాడి లోపల ఒక కోర్ట్ సీనో, లేక ఎఫ్.బీ.ఐ దర్యాప్తు బృందాన్నో ఏర్పాటు చేస్తుంది... పాపం ఎప్పుడూ ముద్దాయి వీడే ... ఏంటో వాడి మైండు వాడికి క్లాసు పీకినప్పుడల్లా, వాడిని చూడగానే, చీకేసిన తాటి టెంకెకి రంగురాళ్ళద్దినట్టుండే జుట్టూ, ఫేసూతో పాటు అవతారమంతా, పెళ్ళైపోయి పెళ్ళామెప్పుడుదిలేస్తాదా అని ఎదురు చూసే మగడిలా తయారవుతుంది.. ఇమ్యూనిటీ పూర్తిగా లేని బబుల్ బేబీ సిండ్రోం ఉండేవాడు కూడా వీడిలాగా దీనంగా మొహం పెట్టడేమో... వీడి ఉత్సాహం ఏంటో తెలీదు కానీ, ఒక రోజు ఎవరో ఒక కొత్తగా పెళ్ళైన ఆసామిని అడిగాడంట, ఎలా ఉందండీ మీ వైవాహిక జీవితం ? అని, ఆయన దానేకోమో బహు బేషుగ్గా ఉందోయ్ అంటే, వీడికి డౌటొచ్చీ మీరు నిజంగానే పెళ్ళి చేసుకున్నారా?? అని అడిగేశాడంట. తర్వాతేమైందీ అనే కదా మీ ప్రశ్న, ఏముంటుందీ, వాడు వీడిని హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఒకటి పీకాడు ... ఇదేనేమో కూలిచ్చి కొట్టించుకోటం అంటే... నిజంగా ఇలాంటి అమాయకపు లేదా మొండి స్నేహరత్నాల్ని చూశాక అనిపిస్తుంది... వాళ్ళ సాంప్రదాయాల్ని రక్షించట్లేదని పెద్దవాళ్ళ సణుగుళ్ళూ , ఆధునిక సమాజానికి తగినట్లు ఉండనివ్వట్లేదని చిన్నవాళ్ళ గొణుగుళ్ళు ... ఇవి కాకుండా ఎమోషనల్‌గా ఏమున్నాయి మన మానవ సమాజంలో అని..... హా రీడరూ నీ ఎమోషన్ నాకు అర్దమైంది, పట్టెడన్నాన్ని తడిమి చూస్తే పుట్టెడు బియ్యం ఉడికినట్టా, దానిని కలుపని తెడ్డుకున్న అడ్డేదో తెలిసా నీకు అంటారు కదా... ఏం చేస్తామండీ, జీవమనే ఉచ్చు చిచ్చు నీ పుచ్చుని పట్టి లాగు విధంబులనంతముల్ అన్నట్లుగా, కళ్ళకి గంతలు కట్టుకుని జీవితమనే ఏనుగుని వెతుకుతూ ఉండే సమాజమంతా జీవితాన్ని పలువిధాలుగా వివరిస్తుంటే, గంతలు తీసి దూరం నుండి చూస్తున్న నాకు వాళ్ళలాంటోళ్ళందరినీ చూసి నవ్వొస్తుంది మరి.... నాకు తెలిసిన వాళ్ళలో ఆ ఏనుగంటే ఇష్టం లేని వాళ్ళని కూడా దాన్ని కొలవటానికి తీసుకుపోతుంటే జాలి వేస్తుంది కూడానూ.... |
Labels:
అంతర్మధనం
| Reactions: |
అర్ధం లేని చిత్రాలలా... :)
Labels:
అంతర్మధనం
| Reactions: |
Thursday, August 4, 2011
తొక్కలో లైఫ్...
గాలి బాగా వీచిందని, నేల విడిచి సాము చెయ్యటానికి నువ్వేమైనా కాగితమ్ముక్కనుకున్నావా... భాద్యత గల సగటు మనిషివి, అలా ఉరకలేస్తావేం పెట్రేగి పోటెత్తుతున్న గంగానదిలాగా అని వారించాడు. భాద్యతలంటే అవేమైనా లంకెల బిందెలా, బరువున్నా నెత్తిన వేసుకుని మొయ్యటానికీ, మూసుకుని నీ పనేదో చూసుకో లేకపోతే మూతి పల్లు రాలుతాయ్ ... పాపం లేని పెద్దరికాన్ని మీదేసుకున్నాడేమో అని తనలో తానే ఫీలైనట్లున్నాడు, ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు నెమ్మదిగా బుద్ది చెప్పతలచిన మనిషి... జీవితం మీద ఆశ అనే జబ్బు పట్టుకున్న మనిషిలా కనిపించాడు తను.. ఆలోచనల్లో ఉన్న రెండో మనిషిని ఎలా తిట్టేసినా పర్వాలేదు, కానీ నిజ జీవితంలో ఎవరినైనా అలా తిడితే, పాపం ఎంత హర్టవుతారో ఏమో... అందుకేనేమో వీలైనంతగా సమాజానికి దూరంగా దాక్కుంటున్నాడు ఆ తిట్టేసిన మనిషి, కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే చందంలో... సంఘజీవి అంటే సంఘంతో కలిసి జీవించేవాడని అర్ధం కానీ, ఆ సంఘం పెట్టే షరతులన్నీ ఒప్పుకుని బ్రతికేవాడు సంఘజీవి ఎలా ఔతాడు?, ఇలా వాడి మనోబావాలు కోకొల్లలు... అన్ని భావాల్లోనూ జీవితమనే పదం మీద వాడు ఇంటూ గుర్తు వేస్తాడే కానీ ప్లస్ గుర్తు వెయ్యడు.. వాడిని పాపం ప్రతివాళ్ళూ కెలుకుతూనే ఉంటారు, దానికి ఉసూరుమంటూ... 'ఐనా సమాజాన్ని మనం అర్ధం చేసుకోవాల్సిందే తప్ప ఆ పిచ్చి కుక్క మనల్నెందుకు అర్ధం చేస్కుంటుంది లే' అనుకుంటాడు... తనకి అసలు పెద్దోళ్ళంటేనే పడదు, పెద్దరికాన్ని ప్రదర్శించే ప్రతి జీవీ తిట్టటానికే పుట్టాడనుకుంటాడేమో... వాళ్ళ మాటల్లో వినే ఆ నాలుగైదు వాక్యాలు కూడా ఎప్పుడూ పెద్దగా మారవు, "నువ్వు గాలి పీల్చినప్పుడు లేని బాధ, మీ అయ్య నిన్ను కడుపు నిండా మేపుతున్నప్పుడు లేని బాధ, ఈ సమాజం కట్టిన డబ్బులతో కట్టిన రోడ్లపై నువ్వు నడుస్తున్నప్పుడు లేని బాధ, నువ్వు విచ్చలవిడిగా బేవార్సిగా చిందులేస్తూ ఆడుకుంటున్నప్పుడు లేని బాధ..... బాధ్యతలు నీ చేతికొచ్చేసరికి పొడుచుకొచ్చిందా..." అంటూ "రుణం తీర్చు తరుణం వస్తే, తప్పించుకుపోతున్నావా, తెప్ప తగులబెట్టేస్తున్నావా" లాంటి పాటల్ని వినిపించేస్తున్నారు పాపం వాడికి... పోనీ వీడు తగ్గుతాడా వాళ్ళతో ఏకీభవిస్తాడా అంటే, వీడి సమాధానం ఇలా ఉంటుంది, "ఔను నేను బేవార్సే , నేను భాద్యతల్లేని సోమరిపోతునే , గాలికి నువ్వేమైనా డబ్బులు కడుతున్నావా?? కడితే కట్టేవ్ మూసుకుని నువ్వు పీల్చుకో... నన్ను కన్నందుకు పెనాల్టీగా మా అయ్య నన్ను పోషిస్తున్నాడు, ఆయన మంచి మనసుతోనే పోషించినా, మీలాంటి వరస్టు ఫెలోస్ అంతా కలిసి ఆ అయ్యల జాబితాల్లో అందరినీ వాళ్ళ కొడుకుల్ని ఎదవల క్రింద ట్రీట్ చేసేలా చేస్తారు, నువ్వు చెప్పేటట్లు జీతమొస్తేనే అది జాబ్ ఔతుందా, నీలాంటి పెద్ద డాష్ డ్యాష్ గాళ్ళంతా పొగిడితేనే పిల్లల్ని కన్న నాన్నలందరికీ పుత్రోత్సాహం రావాలా, ముందు సుమతీ శతకం రాసినోడ్ని తన్నాలి పట్టుకుని, అందరూ ఇచ్చిన డబ్బుల్తో వేసిన రోడ్లో యాక్సిడెంటైనోడికి ఒకడికి కనీసం రూపాయి సాయం చెయ్యలేదు నీలాంటోళ్ళు నిండి ఉన్న బోడి సమాజం, తొక్కలో సమాజం... మీలాంటి చాదస్తపు ఎదవలుండే జన సమూహాన్ని కూడా సమాజమంటారా, నచ్చని రోమన్ ఆచారాలతో జీవితకాలం రోమ్ నగరంలో రోమన్‌లాగా బ్రతికే కంటే మెసపటోనియాలో ఇసుకని పిండి వచ్చే నీటితో ఆ ఎడారి నేలలో బ్రతికేయటం మేలు వీలైనంత వేరం సమాజ శృంఖలాల నుండి తప్పించుకుని స్వేచ్ఛగా పోవచ్చు... నాకు చెప్పటం నీ భాద్యతని నువ్వు భావిస్తే, అది నాకు అక్కరలేదు... నన్ను ఇలానే వదిలెయ్..."ఇది వీడి వరస.. కానీ మూసపోతల సమాజ పోకడలు వీడిని వదుల్తాయా.... ఏమో??? , గాలి వీస్తే కాగితం ముక్క ఎగిరిపోతుంది, కానీ పేపర్ వెయిట్‌తో సహా ఎగరటం దానికి సాధ్యం కాదు.... సమాజపు కట్టుబాట్లనే ఆ పేపర్ వెయిట్లున్నా ఆ కాగితం ఎగరాలంటే ఏ టోర్నెడోలు రావాలో, ఎలాంటి టోర్పెడోల సాయం కావాలో... జీవితమంటేనే విసిగి వేసారిన ఆ మనసుకి ఇవన్నీ ఒక పట్టాన పడతాయో లేవో... ఆనందం, సంతోషం లాంటివాటి కోసం ఎన్నెన్నో చెయ్యాల్సొస్తుందని వాటిని కూడా విస్మరించేస్తున్నాడు... వాడికీ వాడి దగ్గరున్న బెంచీకీ తేడా ఏమీ లేదని వాడిని చూసి వెటకారంగా నవ్వుకునే వాళ్ళకేసి చూసి, బెంచీతోనే మాట్లాడుతూ ఆ జీవిత రోగంతో బాధ పడుతున్న మనుషులకీ, దూరంగా ఎక్కడో కొండల్లో దావానలంలో చిక్కుకుపోయిన ముళ్ళ తుప్పలకీ ఏమీ తేడా లేదని నవ్వుకుంటున్నాడు.... ఇది చదివిన మీరు ఎవరిని సమర్ధిస్తారో నాకు తెలీదు, నా అభిప్రాయాన్ని మాత్రం అడగద్దు... |
Labels:
అంతర్మధనం,
మనో భావాలు
| Reactions: |
Subscribe to:
Posts (Atom)



తెలుసా... పదేళ్ళ క్రితం ఇదే రోజు ఏ పరిస్థితిలో ఉన్నావో కనీసం వీసమెత్తైనా గుర్తుందా నీకు
. ఉండదు, ఎందుకో తెలుసా... నీకు భాద్యత అంటే తెలియదు కనక, నువ్వు తినే అన్నం ముద్దలో ఉండే ఒక్కో మెతుకుని ప్రశ్నించి చూడరా, అవి కలగలసి నీ నోటిని చేరేందుకు కారణమైన వాళ్ళ శ్రమ, ఆశ, ఆవేదన ఏమైనా నీకు తెలుస్తాయా
", వాడిని వాయించేస్తుంది అంతరాత్మ.. పాపం దాని తప్పేముందనీ, దాని విద్యుక్త ధర్మాన్ని
. దీన్నే పోజిటివ్‌గా ఆత్మవిశ్వాసమనీ
, నెగెటివ్‌గా బలుపు
అనీ పిలుస్తుంటారు... సినిమాలో అపరిచితుడికి పలు పర్సనాలిటీలు ఉన్నట్లు వాడికి కూడా ఇంటర్నల్ డిఫెండర్ ఒకడున్నాడు మరి.... "అంటే ప్రేమనేది స్పాంటేనియస్‌గా పుట్టకూడదా??
ఒకమ్మాయ్ నచ్చటానికి కొలమానాలు, కారణాలు, లాంటివి లేకపోతే అది ప్రేమ అవ్వదా??
అన్నం పెట్టే అమ్మా, నాన్నలైనా అలా ప్రశ్నిస్తారో లేదో కానీ నువ్వు బాగా టూ మచ్ చేస్తున్నావ్ అంతరాత్మా
", అంటూ అదేదో సినిమాలో బ్రహ్మనందంలాగా వాపోయాడు
, తన అంతరాత్మ ఇంకా ఫోర్స్ చేస్తే తానెక్కడ మారిపోవాల్సొస్తుందేమో అని అనుకుంటా?... పాపం వాడి బంధువుల్లో చాలా మంది వాడికి క్లాసు పీకేవాళ్ళే 
ఎక్కువ, వీడి బ్యాడ్ ఫేట్ కొద్దీ చిన్నప్పుడు వీడి లెక్కల మాష్టారు ప్రతిక్షేపించటం అనే పదాన్ని బాగా నేర్పినట్లున్నాడు, అందుగ్గాను ఆ తొక్కలో మైండ్ ఎప్పుడూ ఎవరో ఒకరిని వీడికి ఎగెయినిస్టుగా ప్రతిక్షేపించి
, సరిగ్గా టైం చూసుకుని వాడి లోపల ఒక కోర్ట్ సీనో, లేక ఎఫ్.బీ.ఐ దర్యాప్తు బృందాన్నో ఏర్పాటు చేస్తుంది... పాపం ఎప్పుడూ ముద్దాయి వీడే
ఫేసూతో పాటు అవతారమంతా, పెళ్ళైపోయి
పెళ్ళామెప్పుడుదిలేస్తాదా అని ఎదురు చూసే మగడిలా తయారవుతుంది.. ఇమ్యూనిటీ పూర్తిగా లేని బబుల్ బేబీ
సిండ్రోం ఉండేవాడు కూడా వీడిలాగా దీనంగా మొహం పెట్టడేమో... వీడి ఉత్సాహం ఏంటో తెలీదు కానీ, ఒక రోజు ఎవరో ఒక కొత్తగా పెళ్ళైన ఆసామిని అడిగాడంట, ఎలా ఉందండీ మీ వైవాహిక జీవితం
? అని, ఆయన దానేకోమో బహు బేషుగ్గా
ఉందోయ్ అంటే, వీడికి డౌటొచ్చీ మీరు నిజంగానే పెళ్ళి చేసుకున్నారా?? అని అడిగేశాడంట. తర్వాతేమైందీ అనే కదా మీ ప్రశ్న, ఏముంటుందీ, వాడు వీడిని హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఒకటి పీకాడు
, ఆధునిక సమాజానికి తగినట్లు ఉండనివ్వట్లేదని చిన్నవాళ్ళ గొణుగుళ్ళు
... ఇవి కాకుండా ఎమోషనల్‌గా ఏమున్నాయి మన మానవ సమాజంలో అని.....
మరి.... నాకు తెలిసిన వాళ్ళలో ఆ ఏనుగంటే ఇష్టం లేని వాళ్ళని కూడా దాన్ని కొలవటానికి తీసుకుపోతుంటే జాలి వేస్తుంది కూడానూ....
వెళ్ళిపోయాడు నెమ్మదిగా బుద్ది చెప్పతలచిన మనిషి... జీవితం మీద ఆశ అనే జబ్బు పట్టుకున్న మనిషిలా కనిపించాడు తను.. ఆలోచనల్లో ఉన్న రెండో మనిషిని ఎలా తిట్టేసినా పర్వాలేదు, కానీ నిజ జీవితంలో ఎవరినైనా అలా తిడితే, పాపం ఎంత హర్టవుతారో ఏమో... అందుకేనేమో వీలైనంతగా సమాజానికి దూరంగా
దాక్కుంటున్నాడు ఆ తిట్టేసిన మనిషి, కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే చందంలో... సంఘజీవి అంటే సంఘంతో కలిసి జీవించేవాడని అర్ధం కానీ, ఆ సంఘం పెట్టే షరతులన్నీ ఒప్పుకుని బ్రతికేవాడు సంఘజీవి ఎలా ఔతాడు?, ఇలా వాడి మనోబావాలు కోకొల్లలు... అన్ని భావాల్లోనూ జీవితమనే పదం మీద వాడు ఇంటూ గుర్తు వేస్తాడే కానీ ప్లస్ గుర్తు వెయ్యడు.. వాడిని పాపం ప్రతివాళ్ళూ కెలుకుతూనే
ఉంటారు, దానికి ఉసూరుమంటూ... 'ఐనా సమాజాన్ని మనం అర్ధం చేసుకోవాల్సిందే తప్ప ఆ పిచ్చి కుక్క మనల్నెందుకు అర్ధం చేస్కుంటుంది లే' అనుకుంటాడు... తనకి అసలు పెద్దోళ్ళంటేనే పడదు, పెద్దరికాన్ని ప్రదర్శించే ప్రతి జీవీ తిట్టటానికే పుట్టాడనుకుంటాడేమో... వాళ్ళ మాటల్లో వినే ఆ నాలుగైదు వాక్యాలు కూడా ఎప్పుడూ పెద్దగా మారవు, "నువ్వు గాలి పీల్చినప్పుడు లేని బాధ, మీ అయ్య నిన్ను కడుపు నిండా మేపుతున్నప్పుడు లేని బాధ, ఈ సమాజం కట్టిన డబ్బులతో కట్టిన రోడ్లపై నువ్వు నడుస్తున్నప్పుడు లేని బాధ, నువ్వు విచ్చలవిడిగా బేవార్సిగా
చిందులేస్తూ ఆడుకుంటున్నప్పుడు
లేని బాధ..... బాధ్యతలు నీ చేతికొచ్చేసరికి పొడుచుకొచ్చిందా..." అంటూ "రుణం తీర్చు తరుణం వస్తే, తప్పించుకుపోతున్నావా, తెప్ప తగులబెట్టేస్తున్నావా" లాంటి పాటల్ని వినిపించేస్తున్నారు పాపం వాడికి... పోనీ వీడు తగ్గుతాడా వాళ్ళతో ఏకీభవిస్తాడా అంటే, వీడి సమాధానం ఇలా ఉంటుంది, "ఔను నేను బేవార్సే
, నేను భాద్యతల్లేని సోమరిపోతునే
, గాలికి నువ్వేమైనా డబ్బులు కడుతున్నావా?? కడితే కట్టేవ్ మూసుకుని నువ్వు పీల్చుకో... నన్ను కన్నందుకు పెనాల్టీగా మా అయ్య నన్ను పోషిస్తున్నాడు, ఆయన మంచి మనసుతోనే పోషించినా, మీలాంటి వరస్టు ఫెలోస్ అంతా కలిసి ఆ అయ్యల జాబితాల్లో అందరినీ వాళ్ళ కొడుకుల్ని ఎదవల క్రింద ట్రీట్ చేసేలా చేస్తారు, నువ్వు చెప్పేటట్లు జీతమొస్తేనే అది జాబ్ ఔతుందా, నీలాంటి పెద్ద డాష్ డ్యాష్ గాళ్ళంతా పొగిడితేనే పిల్లల్ని కన్న నాన్నలందరికీ పుత్రోత్సాహం రావాలా, ముందు సుమతీ శతకం రాసినోడ్ని తన్నాలి పట్టుకుని, అందరూ ఇచ్చిన డబ్బుల్తో వేసిన రోడ్లో యాక్సిడెంటైనోడికి ఒకడికి కనీసం రూపాయి సాయం చెయ్యలేదు నీలాంటోళ్ళు నిండి ఉన్న బోడి సమాజం, తొక్కలో సమాజం... మీలాంటి చాదస్తపు ఎదవలుండే జన సమూహాన్ని కూడా సమాజమంటారా, నచ్చని రోమన్ ఆచారాలతో జీవితకాలం రోమ్ నగరంలో రోమన్‌లాగా బ్రతికే కంటే మెసపటోనియాలో ఇసుకని పిండి వచ్చే నీటితో ఆ ఎడారి నేలలో బ్రతికేయటం మేలు వీలైనంత వేరం సమాజ శృంఖలాల నుండి తప్పించుకుని స్వేచ్ఛగా పోవచ్చు... నాకు చెప్పటం నీ భాద్యతని నువ్వు భావిస్తే, అది నాకు అక్కరలేదు... నన్ను ఇలానే వదిలెయ్..."