ఎదుగుతున్న వృక్షాన్ని చూశావా మిత్రమా ఆదిలో అది కాండం నేడది విడివడిన కొమ్మలని నిశ్శబ్ధంగా చూసే ఆహార మాద్యమం మాత్రమే వృధ్ధిలో ఉన్న ప్రపంచాన్ని గాంచావా మిత్రమా, కొమ్మలుగా విడివడిన సంస్కృతులు, చిరుగాలికి రాలిపోయే పత్రపుఛ్ఛాల్లాంటి మనో ప్రవృత్తుల సముదాయమే అది అభివృద్ది చెట్టు యజమానికిష్టం, పండ్లు దొరుకుతాయి కాబట్టి కానీ వేర్పడిన కొమ్మలన్నిటికీ నీరందించే మొదలు గురించి కానీ, వేరు అనుభవించే బాధ గురించి కానీ తలపుకైనా రాని మనిషి వాడు, ప్రపంచాన్ని వాడుకునేవాడు... వేడుకునేలానే కనిపించేవాడు... వేరు పురుగులా చేరి పండ్లనే కాక మొదలుని కూడా తొలచేవాడు... అందుకే ఎప్పటికీ అడిగే ఒకే ఒక ప్రశ్న.... అనంతమైన నిశ్శబ్ధ నిశీది వంటి కాల గమనవై సాగే ఓ ప్రపంచమా... నీ పయనమెటు నువ్వు సాగే ప్రతి మలుపు నువ్వు మలచుకున్న దారే ఐతే, నువ్వు కావాలనుకునే గమ్యం గమనమా, లేక గమ్యమా నీ తరం నచ్చే దోవ నీది కాని దానికి నచ్చకుంటే నూతన తరం దానిని అసహ్యించుకుంటే... నీ గమనానికి అర్ధం లేదనుకునే వార్ధక్యం నీకో వరమా లేక శాపమా... మంత్రమై సాగిందట పౌరాణిక జీవితం, వేల ఏళ్ళు సాగేదట తపస్సనే యజ్ఞం... తంత్రమైపోయిందట రాజరికపు రణ జీవితం, బానిస శృంఖలాల జీవన వ్యవస్థలో యంత్రమై సాగుతుంది నా తరం, యంత్రానికి యంత్రమై, దాని మంత్రానికీ, తంత్రానికీ బానిసై... దాని ప్రతి ఆజ్ఞకి సై అంటూ... ఇంక నువ్వేమి చూస్తావో ఓ భవిష్యద్విధాతా... ఎలాంటి బలమో లేక ఎటువంటి భారమో... ఏదేమైనా మోయలేని ప్రతి తరాన్ని తిడుతుంది దాని ప్రక్క తరం... అందుకే చెబుతావా ఓ ప్రపంచమా, సాగే నీ పయణమెటో>>> |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, April 14, 2012
ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు...
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
మీ బ్లాగ్ పేరు లాగే మీ అంతర్మధనం ఎంత బాగా వ్యక్తపరిచారండి!
ReplyDeleteఅసలు పోలిక వృక్షానికి,ప్రపంచమా నీ పయనమేటో..అంటూ, తరతరాలలో మార్పులనీ ఎంత బాగా చెప్పారండి..
ఈ లైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి.
"మంత్రమై సాగిందట పౌరాణిక జీవితం, వేల ఏళ్ళు సాగేదట తపస్సనే యజ్ఞం...
తంత్రమైపోయిందట రాజరికపు రణ జీవితం, బానిస శృంఖలాల జీవన వ్యవస్థలో
యంత్రమై సాగుతుంది నా తరం, యంత్రానికి యంత్రమై, దాని మంత్రానికీ, తంత్రానికీ బానిసై... దాని ప్రతి ఆజ్ఞకి సై అంటూ..."
మీకు నిజంగా kudos అండి!
@జలతారు వెన్నెల
Deleteమీ అభిమానానికి నేను మనస్పూర్తిగా కృతజ్ఞతాలు తెలుపుకుంటున్నానండీ, చాలా చాలా ధన్యవాదాలండీ :)