నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Tuesday, July 27, 2010

సెక్స్ & సమాజం...


click to read this post in white background

    సెక్స్, ఇంటర్‌కోర్స్, తెలుగులో రతి క్రీడ ఇంకో పదం కామ కేళి... ఈ పదాలు వినపడితే ఒక సగటు టిపికల్ ఇండియన్, అవి పలికేవాడ్ని ఒక ఇడియట్‌గా, బేవార్సిగా, పనికిమాలినవాడిగా పరిగణించే సందర్భాలు చాలా ఉంటాయ్..
  
    సెక్సనేది సామాజికంగా అందరికీ తెలిసిందే, ఫిజియొలాజికల్‌గా ఆలోచిస్తే ఒక కాఫీ తాగాలనే ఆలోచన, ఒక పాఠం చదవాలనే ఆలోచన, ఒక మంచి ప్రదేశాన్ని చూసి రావాలనే ఆలోచన .. etc. వీటి కన్నా వేరైతే కాదు సెక్సనేది. మరి ఎందుకని మన దేశంలో సెక్సంటే, దాని గురించి మాట్లాడకూడని విషయంగా పరిగణిస్తారు?, ఇతర దేశాల వాళ్ళలా  దాన్ని సాధారణమైన ఫిజియోలజీ అవసరాలలా ఎందుకు సెక్సుని ఒక సగటు ఇండియన్ భావించడు?, పబ్లిక్లో తనకంటూ ఒకింత ఇమేజున్న ఏ మనిషీ సెక్సు గురించి మాట్లాడాలనే ఆలోచన వచ్చినంతనే ఎందుకు జంకుతాడు?..
   
    నేను హిస్టోరియన్ని కాదు కాబట్టి సాంప్రదాయ పధ్ధతుల ఆవిర్భావం గురించి చెప్పలేను, కానీ పై పేరాలో ఉన్న ప్రశ్నలు అడగటానికి గల పర్యవసానాలు ఎందుకు మంచివని నాకనిపించాయో చెబుతాను. బేసిగ్గా మనం ప్రతి రోజూ నిర్వహించే పనులు రెండు రకాలు, మనకి మనం ఆలోచించి ఎవరి సహాయమూ లేదా అవసరమూ లేకుండా చేసే పని.. రెండోది ఆలోచన మనదే ఐనా మనతో పాటు వేరే మనుష్యులు కూడా ఉండి నిర్వహించవలసినవి. మనిషి శరీరానికి ఉండే సామాన్య అవసరాలలో తనకి తానుగా నిర్వహించకోగలిగేవి ఆలోచించటం, గాలి పీల్చటం, తినటం, నిద్రపోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం ఇలాంటివి అలాగే తనకి ఇతరుల సహాయం అవసరమయ్యే విధంగా ఉండే కార్యాలలో సంపాదించటం, మాట్లాడటం, ఇలా ఈ కోవలో కూడా చాలానే ఉన్నాయ్.. అందులో సెక్స్ ఒకటి.. నిజానికి తను స్వయంగా తాను నిర్వహించుకునే విషయాలకున్నంతటి అవసర తీవ్రత.. ఇతరుల సహాయంతో తను చేసే ఏ ఇతర పనులలోనూ ఉండదు, ఒక్క సెక్సులో తప్ప.. ఏం ఒప్పుకోరా? :) ఒక్కసారి ఉదయాన్నే లేచి బాత్రూముకెళ్ళాల్సిన పరిస్థితికి మీరు మాత్రమే కాకుండా ఇంకొక మనిషి ఆవసరం అనేది ఆ పనికి ఉంటే!?!?!..(వద్దూ, ఆపూ, ఊహించుకోలేకపోతున్నాం!!), ఓకే ఓకే వర్ణనలు ఆపేసి విషయానికొద్దాం.. ఇలా మన శరీరం తనకున్న స్వయం అవసరాలన్నిటిలో ప్రత్యుత్పత్తికి వేరే వారి అవసరాన్ని ప్రకృతి పరంగా ఏర్పరుచుకుంది. ఇతర అవసరాలకి భాగస్వామి అవసరం ఉన్నా, అలాగే సెక్సుకి కూడా భాగస్వామి అవసరం లేకపోయినా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.. రెండో‌ ఊహే కనక నిజమైతే ప్రతి మనిషీ తన దేహమే దేశమై తిరుగుతూ జీవిస్తాడన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు.
   
    సంఘజీవనం గడిపే మనిషికి పబ్లిగ్గా సెక్సు అనే పదానికి తత్సంభందిత కార్యానికి సంభందించి సిగ్గు లాంటివి గట్రా ఆవిర్భవించటానికి గల కారణాన్ని సాంఘికంగా మరియు మానసికంగా ఆలోచిస్తే, శరీరం అవసరంగా భావించే సెక్సు అనే ఫీలింగుని తలదన్నే విధంగా మానసిక అవసరాలైనటువంటి ప్రేమ, అభిమానం, భాద్యత, సమాజం అంటే భయం లాంటి ఫీలింగ్సన్నీ కలగలసి, భాగస్వామి అవసరముండే సెక్సుకి ఇవన్నీ అవధులు, అవరోధాలుగా ఏర్పడి వాటిని దాటి వెళ్ళేందుకు పధ్ధతులూ అవీ గట్రా ఏర్పడి.. చివరకి ఆ పధ్ధతికి వ్యతిరేకమైన ధోరణిలో వచ్చే మాట కూడా ఒక నేరంలాగా భావించబడే స్థాయికి సమాజ జీవిన విధానం చేరిందని నా అభిప్రాయం..
   
    బయొలాజికల్‌గా ఆలోచిస్తే, మనిషి ఇంట్యూషన్ నుండి వచ్చిన పధ్ధతుల వలన.. ఎవరు ఎవరితో సెక్సు చెయ్యాలనేది నిర్ణయింపబడిన విధానంలో జీన్సు ట్రాన్సఫర్ అనేది  స్వపరాగ ధోరణిలో కాక పరపరాగ ధోరణిలో జరగటం వలన సమాజ స్థితి అభివృధ్ధి పథంలో ఉంది.. లేకుంటే సెక్సు యొక్క విచ్చలవిడితనంలో జీన్ లీచింగ్ జరిగి మనకి అవసరమయ్యే ఎన్నో మంచి జీన్సుని కోల్పోయి ఉండేవాళ్ళం.. మన ఆలోచనా పరిధి మరియు మన సాధన, మన వ్యాది నిరోధక శక్తి ఇలా చాలా విషయాలలో ఇప్పటి స్ట్రెంగ్తు మనకి బహుశా ఉండేవి కావు.
   
    ఎప్పుడో సాంప్రదాయ యుగంలో ఏర్పడిన కొన్ని మంచి అలవాట్లు సామాజిక భాద్యతల మూసలో తరువాతి తరాలకి చేరవేయబడుతూ మనకి (సామాజికంగా)చాలా మంచి చేశాయని చెప్పొచ్చు. అంతే కానీ అపోహాపూరితమైన వివరణలకి లోబడి దాని గురించి అభిప్రాయాలని ఏర్పరుచుకోటం సరికాదని నా అభిప్రాయం.
   
    ఇది చదివాను.. తెలిసినదాని  ప్రకారం ఇప్పుడు సెక్సు ఎవరితో ఐనా, ఎలాంటివారితో ఐనా, ఎక్కడైనా ఇంకా ఎప్పుడైనా ఓకేనా?? ఇలాంటి వ్యంగ్యమైన ప్రశ్నాస్త్రం మీ మదిలో మెదులుతుందని నాకు తెలుసు. దానికి సమాధానంగా నేను చెప్పేదేంటంటే, ఒక మనిషిగా, నాగరికుడిగా, మన సమాజపు మరియు ప్రపంచ పౌరుడిగా "రెండో మనిషి"కి ఇబ్బంది కాకుండా నువ్వేమైనా చెయ్యి... ;)

23 comments:

  1. వెరైటీ అంశాలని ఎంచుకుంటున్నావు. నీ పోస్టింగులలో ఈ మధ్య కాలంలో చాలా పరిణితి కనిపిస్తుంది మౌళీ.....గో ఎహెడ్

    ReplyDelete
  2. Please change the template very difficult to read.

    ReplyDelete
  3. @Dileep M:
    సారీ దిలీప్‌గారూ.. నేను టెంప్లేట్ మార్చను

    ReplyDelete
  4. template chadavataniki chala ibbandi ga vundi.

    ReplyDelete
  5. @Anonymous:
    Dear Anonymous మీకు టెంప్లేట్ ఇబ్బందిగా ఉంటే.. మీరు గనక ఫైర్‌ఫాక్సు వాడుతున్నట్లైతే... అందులో view పైన క్లిక్ చేసి Page styleకి వెళితే అక్కడ Basic page style మరియు No style అని రెండు ఆప్సన్లుంటాయి.. అందులో No style క్లిక్ చేసి.. మీ కళ్ళు బైర్లు కమ్ముతుండే తెల్ల బ్యాగ్గ్రౌండులో నల్లక్షరాలని చూసి, చదివేయొచ్చు...

    ReplyDelete
  6. Mouli,

    Discussing about sex became a taboo after british came to India. They brought their victorian values with them. Before it was quite common to discuss the topic in public, including kama sutra. Hope that helps.

    Hemanth

    ReplyDelete
  7. @Hemanath:
    బ్రిటీష్ వారి ఆగమనం ముందు, సెక్సు గురించి మాట్లాడుకునేవారు అనేది మీరు చెప్పినట్లు నిజమే కావచ్చు.. కానీ వాల్ల victorian values ఏంటో నాకైతే అర్దం కాలేదు.. పైగా వాటి వలన discussion about sex అనేది ఎలా effect అయ్యిందనే విషయం అస్సలర్దం కాలేదండీ..

    ReplyDelete
  8. పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడితే పిల్లలు వింటారు. అందుకే చదువుకున్నవాళ్లు పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడరు. కాలేజిలో అమ్మాయిలకి వినిపించేలా డబల్ మీనింగ్ లు మాట్లాడే స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్లని చూస్తే పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడకపోవడమే మేలు అనిపిస్తుంది. .

    ReplyDelete
  9. Dear readers and Mouli..
    after all sex is physiological need which is source process of globe..
    being hypocritical in the context and concept of sex in public and in home environment leads the next generation into a kind of illusion and will lead them to know wat it is.. than facing other kind scenarios of our own successors its always advisable to make it an open forum to talk about... where several grow up factors and emotions will mix up together in dealing with this sensitive topic.. its better dealing it well in advance , before the consequences end up at a conspiracy... in our society... lets take concern when we interact with younger people and society.. let us take the chance to make concepts clear as our role to play.. will lead to better understanding levels abt this serious hypocracy among different set of people..
    end of the day.. society means we the people...
    cheers to mouli.. rock on....
    aditya

    ReplyDelete
  10. నిజమే వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో ఎవరితోనయినా శృంగారం జరపవచ్చు.

    సెక్స్ గురించి మీ ధోరణి బావుంది కానీ టెంప్లేట్ గురించి మీ ధోరణి బావోలేదు. మీ టెంప్లేట్ చక్కగా చూడాలంటే ఎవరికివారు పైన మీరు చెప్పినట్లుగా అంత కష్టపడాలన్నమాట! సరే, మీ టెంప్లేట్ మీ ఇష్టం కానీ ఎక్కువమంది చదువరులకు ఇబ్బంది కలిగించనిది ఎన్నుకోవడం బావుంటుంది. మొదటినుండీ చూస్తున్నాను - మీ టెంప్లేట్ ఎన్నికలు అన్నీ కళ్ళకు ఇబ్బందిగా వుండి చదవడానికి శ్రమ అవుతోంది. నాకయితే పైన మీరు చెప్పినంతంగా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకొని కష్టపడి చదివేంత ఓపిక లేదు. ఒక్క రీడర్ చదవనంత మాత్రాన మీకు నష్టం కూడా ఏమీలేదులెండి.

    ReplyDelete
  11. @aditya:
    Thank you for your comment Aditya. Probably those ought to be done tasks, which you told about are the matter of less possibility at least in the present generation or just after it. Whether you agree or not some things are farer than they appear in reality... and the distance is relative, in terms of time..

    ReplyDelete
  12. @శరత్ 'కాలమ్':
    నేనైతే అలా చెప్పలేదండీ.. అలా ఎందుకు జనాలు ఒప్పుకోరో చెప్పటానికి ప్రయత్నించాను... మన భారతీయ సాంప్రదాయంలో జనాల నమ్మకం ప్రకారం ఒక మనిషికీ, పశువుకీ మద్యనున్న తేడాని చెప్పటానికి, ఈ విషయాన్నే ఈ విషయాన్నే ప్రస్తావిస్తారు.. మరి మనిషెందుకు పశువులాగా ఉండకూడదూ అని పాయింటు లాగారనుకోండీ, మీ పాయింటుకి సమాధానం ఇచ్చే తెలివితేటలు నా దగ్గర లేవు కాబట్టి, గడ్డికి పోటీ ఎక్కువైపోతుంది కాబట్టి అని చెప్పేసి, దులిపేసుకుని వెళిపోతానండీ..


    ఇక నా టెంప్లేట్ విషయానికొస్తే, మీకో మనవి.. నాకు డార్కు బ్యాగ్గ్రౌండు మీద లైట్ అక్షరాలంటే ప్రాణం.. నేను వెబ్ డిజైనింగు ప్రాక్టీస్ చెయ్యటం ప్రారంభించినప్పట్నుంచీ.. ఐతే ట్రాన్సపరెంటు లేదా డార్కు బ్యాగ్గ్రౌండులే వాడుతున్నానండీ.. నాకవి ఎందుకు నచ్చుతాయంటే, స్క్రీన్ మొత్తం తెల్లగా ఉండి కళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, నల్లగా ఉంటూ కళ్ళకి ప్రశాంతతని కలుగజేస్తుంది...
    మీకింకో విషయం చెప్పాలి నేను మీ బ్లాగు చదివేటప్పుడు కాంపిజ్లో ఉండే స్క్రీన్ నెగెటివి ఆప్సన్ ఎనేబుల్ చేసి చదువుతాను..

    రీజన్ ఇదే కానీ నేనేమీ మోనార్కునీ, సీతయ్యనీ కాదండీ.. జనాలు అడుగుతున్నా టెంప్లేట్ మార్చకపోవటానికీ... మరీ బ్లాగు చదవనని అలిగితే ఎలాగండీ బాబూ.. కావాలంటే మీకో లాలీపాప్ కొనిపెడతాను.. చదవండి ప్లీజ్ ;)

    ReplyDelete
  13. టాపిక్ ఎమో కాని, నేను ఇటు తొంగి చూడని కారణం టెంప్లెటే, కళ్ళు బైర్లు కమ్మేలాగా ఉన్నది, డార్క్ బ్యాక్‌గ్రౌండే అనుకుంటే, మాళ్ళీ దాని వెనుక ఎర్రగా రోజా పూలు, చదవాలీ అన్నా, కళ్ళు వద్దు, వద్దు అంటుంటే ఏమి చదువుతాం? మన ఇష్టా ఇష్టాలు కన్నా పాఠకుడి సౌకర్యం ముఖ్యం అని నా భావన.వెనకాల ఆ రోజాలు అన్నా తీసేస్తే కాస్త గుడ్డిలో మెల్ల.

    ReplyDelete
  14. ^ Sharat & Taara(k)

    why cant you use firefox and
    view this blog with different
    background colors & no roses !

    you have to add a simple add-on
    and a simple style (only once..)
    & whenever you visit this blog
    it automatically turns into your
    own choice of colors :)

    guidance available here :
    http://userstyles.org/stylish/

    ReplyDelete
  15. @తార:
    పాఠకుడు చాలా ఇంపోర్టెంటేనండీ కానీ.. నా బేసిక్ టేస్టుని వదులుకోవాలంటే.. ఊహూ.. ఒక పేద్ద లాలీపాప్ కొని మీ టెంప్లేట్ బాదితులందరికీ దాన్నే పంచిపెడతాను దయ చేసి నా బ్లాగు చదవండయ్యా.. మీకు చదవటానికి కష్టంగా ఉంటే నో స్టైల్ మోడ్‌లో(నాకు కళ్ళు బైర్లు కమ్మేటట్లుండే మోడ్) చదివేసెయ్యండీ.. ఐనా ఇలాంటి చిన్న చిన్న కారణాలు మన బ్లాగ్ఫ్రెండ్షిప్ని ఆపేస్తాయా చెప్పండీ..? :)

    ReplyDelete
  16. @ranjani:
    రంజని గారూ మీకు మరలా మరలా నా శత వందనాలండీ.. నా బ్లాగ్విజిటర్సుకి వ్యూఓపదేశం చేసి వారి మార్గాన్ని సులభతరం చేసినందులకు.. మీకు విజయీ భవ విజయీ భవ..

    ReplyDelete
  17. @Chandramouli Malleda గారు,@ranjani గారు,
    నాకు లాలీపాప్ వద్దు కాని, ఒక 512MB RAM కొనిపెట్టండి చాలు, మీ బ్లాగ్ కి రాగానే నా ఫైర్ ఫాక్స్ తట్టుకొలేకపోతున్నది మరి.

    ReplyDelete
  18. ఫైరుఫాక్సులో స్టైలిష్ ఏడ్-ఆన్ వాడి చూడండి :) అదనపు RAM
    అవసరం ఉండదు. నేను 10 సంవత్సరాల క్రితం కొన్న కంప్యూటరుని
    1GB RAM తో , CRT మానిటరుతో వాడుతున్నా !

    ReplyDelete
  19. మీకు 1GB ఐనా ఉన్నది, నాకు 256MB నే,

    ReplyDelete
  20. ఎంతో మంది చెబుతున్నా మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చక పొవడం ........ కాకి పిల్ల కాకికి ముద్దు..

    ReplyDelete
  21. కాకి "పిల్లకాకి"కి ముద్దు నా ?

    ReplyDelete
  22. @Anonymous & @Anonymous:
    ఔనండీ.. కాకిపిల్ల కాకికి ముద్దు.. పిల్లకాకికి కాకి కూడా ముద్దే.. మీరు పేరు వ్రాయలేదెందుకనో.. ఐనా నా బ్లాగుని విజిట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు...

    ReplyDelete