click here to view post in white background నిన్న ఎలా జరిగిందో ఈ రోజు అలాగే జరిగింది.. లాటిన్ భాషలో అనుకుంటే రెండు సార్లు వండిన ఒకే పదార్దపు పొట్లాం కొనుక్కోవటం తప్పితే.. అంతా అలానే జరిగింది, ఐనా బ్రెయిన్‌కేమయిందో ఏమో.. పదికీ, ఏభైకీ తేడా తెలియనంత పోయిందా మతీ. ఏదేమైనా నీకు నిజంగా చాలా ఎక్కువైంది. ప్రపంచమేదీ నీది కాదని అంటావ్.. మరెందుకు ఆ ఆలోచన. ఒక మనిషి ఆర్తనాదం అతి దీనంగా వినిపించినా కించిత్ కూడా నీ అంతర్వాహిణిలోకి పరిగ్రహించక, పరిగణించక నిర్లోపభూయిష్టంగా తత్కర్మానుష్ఠానుడివై యుండియూ హృదయ చలనశీలుడివవ్వవే. తామరాకుపై నీటి బొట్టులా అని భగవద్గీత ప్రభోదామృతాసేవనములో తరించిన వానివలె మసలెదవే, ఒక చిన్న కార్య సారూప్యత ఎలా అలా చేసింది. ముసుగులో గుద్దులాట సంగ్రామమా, సరస సల్లాపమా, లేక శృంగారమా ఏమనుకోవాలి. బయటకొచ్చి బయటకే వెళ్తావు, ఇంటనుండీ ఇంటనే ఉంటావు. బయటకి బయట బయటా కాదూ లోపలకి లోపటల లోపలా కాదు. మూగ భాషకి లిపి తయారు చేసి పంచుదామనా.. నీకు తెలీదేమో మనసులు నిరక్షరాస్యులు, వాటికి చదవటం రాదు. మనసు భాష లిపి తయారు చేసే బదులు, కళ్ళు మూసుకుని బ్రెయిలీ నేర్చుకో, అలాగైనా మూసిన కనులు నీ స్థబ్దు మనసుని కదిలించక మిన్నకుంటుందేమో....... నీ గుండెకి రక్త పంపిణీ తప్ప స్పందించే పని ఉండదు, స్పందించినా అది హృదయాగ్ని పర్వతమై ఆ వేడికి నీరు ఆవిరై చల్లబడి నీ కన్నీళ్ళ ఎత్తి పోతల జలపాతాలవుతాయి తప్ప నీ హృదయ స్పందన కారణం ప్రశ్నార్ధకమూ, నిరర్ధకమూనూ. అరవై అప్లికేషన్లోపెన్ చేసి ఆపరేటింగ్ సిస్టంని అరగంట హ్యాంగైపోయేట్టు చేసే, నువ్వెందుకు హ్యాంగైపోయావ్. హేతువవ్యక్తమై యున్న నీ మృతకారకమృతంబెరుగునా తమ జనకేయా? మధనపడిన ఊరడిల్లునా మనసెల్ల, బాధలు పరఢవిల్లి నీ ఉల్లమునెల్ల లొల్లి లొల్లి చేయవా? మతిసుతులు లేని మనసున పేరుకొన్నట్టి ప్రీతిపాత్రతని వధించి, మృత జీవనుడివై చరించుమురా.. ఎందుకన నీది కాని నిధి నీదగునా, నీదైనది వేరొకరి వశమగునా.. అందునా నీవెవరో, నీదేదో నీవెరుంగువానివా???!! |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, July 29, 2010
'అనంత'ర్మధనం..
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment