ప్రేయసిని చూసిన క్షణంలో, ఆమె ఆలోచనలలో మునిగి తేరుకోని ఆనందపు లోతులో ఉన్న సమయంలో.. ఆమె గురించిన ప్రతి విషయం ప్రియుణ్ణి ప్రభావితం చేస్తుంది.. ఆమె తలపే వివశుణ్ణి చేస్తుంది.. ఆమె చూపే కొత్త శక్తినిస్తుంది.. తనలోనే లేని శక్తి తన ప్రియుణికి ఎలా తన వలన ఎలా వస్తుందో తెలియక ఆ ప్రేయసి అవాక్కైనా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.. మనసుతో చదివితే కవితలో భావాలు, గుళాభీ రేకుల మృదుత్వాన్ని, మల్లె పూల సువసనని, అంతు లేని ఆనందాన్ని కలిగిస్తుంటాయి... మరి ఆ భావాల్ని నాకోసం నేను పలికించుకుని, నేను అంతగా అనందించగలిగాను... కానీ ఆ అనందం ఊహే అని తెలిసినందుకు దుఃఖించాలో లేక కనీసం ఊహైనా ఐనందుకు సంతోషించాలో ఏమో...!! నా ప్రేయసి నా ఊహల్లోనే ఉంటే.. ఈ నిజ ప్రపంచంలో ఎందుకు వెతుకుతున్నానో.. ఇక్కడ ఎందుకు జీవిస్తున్నానో...... మళ్ళీ ఏమో? ఎందుకో?... మరి ఎప్పుడౌతుందో ఆమె నా చిరునామా?!?!?!......... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Wednesday, July 21, 2010
కావా నా చిరునామా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment