నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Monday, May 31, 2010

మిన్ను విరిగి మీద పడితే....

చెట్టు మొదలు నుండి ఆకాశాన్ని చూసిన నాకు, తాను ఎలా కనిపిస్తుందో తెలియని నా ప్రేయసి గుర్తొచ్చింది, తనపై నాకున్నది ఆకాశాన్ని మించిన ప్రేమ అనిపించింది.. ఆ ఆలోచనలో ఈ కవిత్వం ఉదయించింది.. కానీ ఆ ప్రేయసి ఎవరో కనిపించలేదు.. ఎప్పటికైనా కన్నిపిస్తుందో లేదో తెలీదు..
Sunday, May 30, 2010

చనిపోయిన చిరునవ్వే సమాధానమేమో...


....ప్రేమ నన్నొదిలి దూరంగా వెళిపోతుంటే, తను నాకు బహూకరించిన శూన్యం కనిపిస్తూ ఉంది, కారణమేమిటో తెలీదు కానీ శూన్యం కూడా చాలా అందంగా ఉంది.. ఎంతైనా నా ప్రేమ నాకు ఇచ్చిన బహుమానం కదా.. పాపం నన్ను ప్రేమించే ఒక హృదయంతో తాను పెనవేసుకుపోయి ప్రేమాన్నౌత్యం ఎలా ఉంటుందో చూపాలనుకుందేమో.. ఆ హృదయమేదీ ఎప్పటికీ దొరకక.. బరువెక్కిన నా హృదయానికి వీడ్కోలు చెబుతూ వెడలిపోయిం .. ప్రేమించే హృదయం లేదని ప్రేమే నన్నొదిలెళ్ళీపోతే.. ప్రేమే లేని చోటుకి ఒక ప్రేమించే హృదయం ఎలా చేరుతుందో... ఎందుకు చేరాలని అడిగితే.. మౌనమే నా భాషగా చనిపోయిన చిరు నవ్వుని సమాధానంగా ఇవ్వాలేమో.....

Saturday, May 29, 2010

నా మనసులో మాట...

ఈ మద్యనే.. భూమికి దినం పెట్టకుండా ఉండేందుకు ఆపవలసిన మరియు చెయ్యవలసిన కార్యక్రమాలను ఉటంకిస్తూ.. సంవత్సరంలో ఒక్కసారికి మాత్రమే, అదీ మాటల్లో మాత్రమే మనమంతా గుర్తు చేసుకునే "ఎర్త్  డే" సంధర్బంగా నేను తయారు చేసిన ఆర్ట్ ఇది.. అసందర్భమే ఐనా మీ అందరితో ఇప్పుడు పంచుకోవాలనిపించింది.. ఈ చిత్రంలో నేను చెప్పాలనుకుందేమంటే..

రంగు రంగుల మన భూతలమంతా మన అంతూ పంతూ లేని కాలుష్యపు చర్యల ద్వారా వినాశనానికి సిద్ధమౌతూ ఉంది.. భూతలన్నంతా చుట్టూతా ఆక్రమించుకున్న పచ్చ మరియు, నల్ల రంగులు green house వాయువులుగా పరిగణించవచ్చు.. భూమికి పై భాగంలో కనిపిస్తున్న పంజా.. ఆ వాయువులు మానవాళిపై కలుగజేసే ఉత్పాతాన్ని ప్రతిక్షేపిస్తున్నాయ్.. వీటిన్నంటికీ దూరంలో ఉండే ఎర్ర రంగు.. gree  house వాయువులు, పరావర్తనం కాకుండా ఆపి ఉంచిన infra-red rays వేడిమిగా రూపాంతరం చెంది global warmingకి సిద్ధపడి ఉన్నట్లు చూపించాను.. అందులో చిందరవందరగా వెదజల్లబడినట్లుండే ఆకారాలు నా పేరుని టైప్ చేసి అలా మార్చటం జరిగింది.. ఇది అస్తవ్యస్తమయ్యే మానవాళి.. జీవిన విధానాలకి.. ప్రతిబింబాలుగా చిత్రీకరించటం జరిగింది.. చివరగా చెప్పొచ్చేదేంటంటే.. "Happenings in thoughts may be nearer than they appear..." మనం కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా... ఇప్పటి వరకూ జరిగినదాని వలన వచ్చే పర్యవసానాలు ఇది వరకే చూస్తూ ఉన్నాం...
     నా భావి తరాలకి క్షమాపణలతో నా జాలిని తెలియజేస్తున్నాను.. ఎందుకంటే ఈ మెసేజ్ ద్వారా నా బ్లాగు చూసే వందమందిలో కనీసం ఒక్కరిని కూడా.. ఎక్కువ సమయం మార్చలేనని నాకు తెలుసు కాబట్టి... ఒక వేళ ఇది చదువుతున్న మీరు కాలుష్య నివారణకి చర్యలు చేపడుతున్నట్లైతే... మీకివే జోహార్లు.. అందుకోండి మిత్రమా..  Friday, May 28, 2010

కొన్ని వింతలూ, విశేషాలూ

ప్రపంచంలోని సహజ అద్భుతాలు
నడిచే రాళ్ళు
www.FunAndFunOnly.org

గత కొన్ని దశాబ్దాలుగా ఆ desert of Death Valleyలో ఉన్న రాళ్ళు, వాటి  కదలికలతో శాస్త్రీయతని వాదోపవాదాలు వచ్చే స్థాయికి తీసుకొచ్చాయి..


వందల కొద్దీ పౌండ్ల బరువున్న కొన్ని రాళ్ళు ఒకే సారి మూకుమ్మడిగా కొన్ని వందలకొద్దీ గజాల దూరం జరిగిపోతుంటాయి..

 
బలమైన గాలులు మరియు వాటికి తోడుగా మంచుతో కూడిన జారిపోయే నేల ఈ చర్యకి కారణమని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతారు

ఐనా వాళ్ళు చెప్పిన కారణాలు ఆ రాళ్ళు ఒకేసారి వేర్వేరు దిశలవైపు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేదానికి కారణాలు ఇవ్వలేకపోయాయి

వాళ్ళ లెక్కల అంచనాలు కూడా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయాయి, ఎందుకంటే కొన్ని రాళ్ళని కదిలించాలంటే వందమైళ్ళకంటే ఎక్కువ వేగం కలిగిన గాలి కావాలంట..

నిలువపోత లావా

www.FunAndFunOnly.org


చిక్కనైన లావా(శిలా ద్రవం) బయటికి వచ్చి ప్రవహిస్తూండగా చల్లారే సమయంలో, అది ఒక షణ్ముకాకృతి దాల్చిన ఇటుకలు అవేవో మనిషి తయారు చేసినట్టు తయారవుతూ ఉంటాయ్..దీనికి ఒక ఉదాహరణ ఐర్లాండ్ తీరాన ఉన్నటువంటి
the Giant's Causeway (పైన చూపబడింది),
అన్నింటికన్నా పెద్ద ఆకృతి పేరు మాత్రం Devil's Tower in Wyoming.
నీలి బిలములు

www.FunAndFunOnly.org


జలాంతర్భాగంలో అతి లోతైన బిలాలు కొన్ని కనుక్కున్నారు.. అవి వ్యక్తపరచే రంగుని బట్టి వాటి నామధేయం నీలి బిలాలుగా స్థిరపడింది..అవి కొన్ని వందల కొద్దీఅడుగుల లోతుంటాయ్, ఈ ప్రదేశాలలో ఆమ్లజని శాతం తక్కువగా ఉన్నట్లుగా కనుక్కున్నారు..కొన్ని నీలి బిలాలలో పురాతన శిలాజాలున్నట్లుగా గుర్తించారు.. ఆ లోతుల్లో అవి చాలా భద్రంగా, అందంగా ఉంటాయ్.
ఎరుపు పాటు పోట్లు

www.FunAndFunOnly.org


వీటినే శైవలపు పూత లేదా పరుపు అని అభివర్ణించినా ఆశ్చర్యపడనక్కర్లేదు, ఇవి అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో తీరం వెంబడి అగుపిస్తాయి.. ఎర్ర రంగులో..ఇందులో చాలా రకాలు హానికారకాలు కావు, కానీ కొన్ని శైవలాలు అపాయకారులుగా గుర్తించటం జరిగింది..మంచు వలయాలు

www.FunAndFunOnly.org


నీటిలోని వలయాకృతి గల్గిన గమనాల ప్రభావం మూలంగా ఈ మంచు వలయాలు ఏర్పడతాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారుఇవి 500మీటర్ల వ్యాసంతో కూడా గమనించినట్లు పేర్కొన్నారు.. కొన్ని ఒకటొకటిగా కనిపిస్తే.. ఇంకొన్ని గుంపుగా కనిపించాయంట

భీకరాకృతుల మేఘాలు
www.FunAndFunOnly.org

వాటి పేరుకి తగ్గట్టుగానే ఆకృతిలో కూడా భయం గొల్పే విధంగా ఉంటాయీ మేఘాలు.. తుఫాను రాకడలను లేదా ఘోరమైన వాతావరణానికి ఇవి సంకేతాలన్నా ఆశ్చర్యపడనవసరం లేదు..వీటిలో మంచు శాతం అధికంగా ఉంటుంది.. ఇవి కొన్ని వందల మైళ్ళ దూరం వరకూ వ్యాపించి ఉంటాయిఅవి అంత భీకరంగా కనిపించినప్పటికీ వాటిని తుఫాను గురించి హెచ్చరించే విషయసూచికలుగానే పరిగణిస్తారు.మంటల ఇంద్ర ధనుస్సు

www.FunAndFunOnly.org


కొన్ని సందర్భాల్లో సూర్య కిరణాలు, మరియు నీటియావిరితో కూడిన మేఘాలు ఒక ప్రత్యేకమైన కోణంలో ఉండినపుడు బల్లపరుపుగా ఉండే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది..మేఘాల్లో ఉండే అసంపూర్ణ ఘనీభవ స్థితిలో ఉండే మంచు ముక్కల కాంతి వక్రీభవనాల వలన ఇది  ఏర్పడి వివిధ వర్ణాలుగా వెదజల్లబడుతుంది పైగా కొన్ని కోణాల్లో‌మాత్రమే ఈ ఇంద్రధనుస్సు నేల మీదున్న వారికి కనిపిస్తుంది

ముంపు బిలాలు

www.FunAndFunOnly.org


ప్రపంచంలోని అతి భయం గొల్పే సహజసిధ్దమైన సంఘటనలలో ఈ ముంపు బిలాలు ఏర్పడటం ఒకటిగా చెప్పొచ్చు.


కాల గమనంలో నేల లోపలి పొరలు క్షయించి ఒక్కసారిగా మట్టిని లోపలి తీసుకుంటాయి.

చాలా ముంపు బిలాలు సహజంగా ఏర్పడగ, కొన్ని మాత్రం మానవ తప్పిదాల కారణంగా ఏర్పడుతుంటాయి.


భూగర్బ జలాల స్థాయి తగ్గే కొలదీ.. ఏర్పడుతున్న కాళీ ప్రదేశాన్ని పూరించటానికి నేల కృంగినపుడు ఇలాంటి బిలాలు ఏర్పడటం బహు సహజం
.

నగర ప్రదేశాలలో ఏర్పడ్డ కొన్ని బిలాలు కొన్ని వందల అడుగుల లోతు ఉన్నవి కూడా ఉన్నాయి.. ఇవి చాలా భవన సముదాయాలని బలి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
పెనిటెంట్స్

www.FunAndFunOnly.org


వీటికి ఈ పేరుని మెక్సికోలోని మత గురువులు పెట్టారు,
మంచి మెరుపుతో కూడిన సహజమైన మరియు దారైన మొన తేలిన మంచు కత్తుల వలె బహు కోణాలలో ఉంటాయివి.

 
ఇవి ఎత్తైన ప్రదేశాలలో, అదీ అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయ్.. మనిషి కంటే ఎత్తుగా పెరిగి చాలా వైశాల్యాన్ని ఆక్రమించి ఉంటాయి
ద్వికుంభాకార మేఘాలు

www.FunAndFunOnly.org


ఎప్పుడైనా గుర్తు తెలియని ఎగిరే వస్తువుల గురించి అద్భుతంగా భావించారా.. ఇవి అలానే కనిపిస్తుంటాయ్?


సాంప్రదాయ విమాన చోదకులు వీటిపై గిరికీలు కొట్టేందుకు సాహసించకున్నా, మరరహిత విమాన చోదకులు మాత్రం వీటిని వదలరనే చెప్పాలి.


వాటి ఆకృతులు కొన్ని సార్లు మాయాపూరితంగానూ, లేదా కృత్రిమంగా చెక్కిన బొమ్మల లాగానో ఉంటూంటాయ్.

మామూలుగా విపరీతమైన వేగంతో వీస్తున్న గాలి తనతో పాటుగా తీసుకెళుతున్న మేఘాలు ఏదైనా కొండలు లేదా ఎత్తైన ప్రదేశాలు అడ్డు తగిలినపుడు ఆయా మేఘాలు ఈ ఆకృతులను సంతరించుకుంటాయి.
కాంతి స్థంభాలు

www.FunAndFunOnly.org


ఆకాశంలో నిలువుగా ఉంచబడిన స్తూపాకార కాంతివంతమైన స్థంభాల వలె కనిపించే ఆకృతులను కాంతి స్థంభాలుగా పేర్కొంటారు,
అవేవో గాలికి అంటుకున్న అగ్నులలాగా కనిపిస్తూ ఉంటాయి..


సూర్య కిరణాలు కానీ లేదా కృత్రిమ దీపాల కాంతికానీ వాతావరణంలో ఉండే మంచు బిందువులుచే పరావర్తనం చెందించినపుడు ఇవి ఏర్పడుతుంటాయి.Sundogs(సూర్య శునకాలు)

www.FunAndFunOnly.org

సూర్య శునకాలు కూడా కాంతి స్థంభాలవలెనే మంచు బిందువులలోంచి కాంతి ప్రసరించినపుడు ఏర్పడతాయి.

కానీ వీటి ఆకృతులు చూపరులకి ముచ్చట గొలుపుతూ ఉంటాయి.


ఆకాశంలో సూర్యుడు ఉండే దూరాన్ని ఆధారంగా చేసుకుని సూర్యశునకాల ఆకృతులు మార్పులు చెందుతూ ఉంటాయి.


ఈజిప్టు మరియు గ్రీకు నాగరికతల కాలం నుండి కూడా ఈ సూర్యశునకాల ప్రస్తావన ఉన్నట్లు చరిత్ర చెబుతుంది.అగ్ని సుడిగుండాలు


www.FunAndFunOnly.org


వాతావరణంలో గాలి వాలు ఒక ప్రత్యేకమైన కోణాల్ని సంతరించుకున్నప్పుడు దమనకాండ జరిగితే ఈ అగ్నిసుడిగుండాల ఏర్పడటాన్ని చూడవచ్చు.


వీటి పుట్టుకకు కొన్ని సార్లు భూకంపాలు, పిడుగులు  కూడా కారణం కావచ్చు.. ఇవి కొన్నిసార్లు నమ్మశక్యం కాలేని ప్రమాదాలని తెచ్చి పెడతాయి మంటలు ఏర్పడిన ప్రదేశాలనుండి అగ్ని కానీ దాని వేడిమి కానీ చేరలేని ప్రదేశాల్ని కూడా చేరి విద్వంశాల్ని సృష్టిస్తుంటాయ్.


ఇవి ఆకాశంలో ఒక మైలు ఎత్తుకు ఎగసి గంటకి వందమైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంటాయి.. ఇవి ఏర్పడిన సమయం నుండి ఇరవై నిమిషాల పైగా వాటి ప్రభావాన్ని చూపగల్గుతూ ఉంటాయి..

 
నారింజ రంగు చంద్రుడు

www.FunAndFunOnly.org


ఎప్పుడైనా చంద్రుడు నారింజ పండు రంగులో ఆకాశంలో వ్రేళ్ళాడుతూ కనిపించాడా, అలా బలే అందంగా ఉంటాడు కదా. ఆ సమయంలో మీరు బాగా గమనించినట్లైతే చంద్రుడేదో మనకి అందేస్తాడేమో అనేంత తక్కువ ఎత్తులో కనిపిస్తుంటాడు.


కానీ ఎందుకలా జరుగుతుందీ? అసలు చంద్రుడికి రంగేదైనా ఉందా?


చంద్రుడు వాలుగా తన కాంతిని ప్రసరించేటప్పుడు, ఆ కాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉండి.. ఆ ప్రయాణంలో మిగిలిన కాంతి తరంగాల్ని కోల్పోయి ఎరుపు, నారింజ రంగుల్ని మాత్రం మిగుల్చుకుంటుందన్నమాట..

 
ఆకరి చిత్రాన్ని మీరు గమనించినట్లైతే, అందులో చక్కగా చూపబడిన చంద్రుని నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుందో కనిపిస్తుంది


ఆ వేర్వేరు రంగుల్ని సంతరించుకున్న ఎత్తు పల్లపు ప్రదేశాల్ని గమనించినట్లైతే చంద్రుని చరిత్రలో జరిగిన సంఘటనలు, సౌర పదార్ధపు తాడనలు, పదార్ధ చలనాలు వంటి విషయాలు బోదపడతాయి.

Wednesday, May 26, 2010

ప"లుక్కే" ప్లాటినమాయెనా....

రామదాసు రాముని కోసం గానం చేస్తే...  ఒక ప్రేమదాసు తన ప్రేమదాసి కోసం చేస్తున్న పేరడీ గానం ఇది..

 

Tuesday, May 25, 2010

నిద్రించే పగటికి జోలపాట పాడే చందమామ వచ్చిన వేళ.....

ప్రేమ ఎవరికి ఏమైనా.. ఎలాంటిదైనా.. నాకు ప్రేమ ప్రేమే.. అది ఒక అద్భుతం.. అనంతం.. అజరామరం..

Monday, May 24, 2010

దోమలకి ఎయిడ్సు ఎందుకు రాదంటే...!! :)

ఒరేయ్ దోమలకి ఎయిడ్సెందుకు రాదురా... మా ఫ్రెండు గాడు క్లాసైపోయిన తర్వాత అడిగాడు.. వెనకాల మా ఫ్రెండింకొకడు.. ఆ ప్రశ్న నేల మీద పడితే ఏదో అద్దం పగిలినట్టు పగిలిపోతుందన్నట్లుగా ఠక్కున సమాధానం చెప్పాడు.. "దోమలు మనుషులతో లైంగిక సంపర్కం జరపలేవు కాబట్టి" అని.. మీరూహిస్తున్నట్లుగానే సమాధానం విని నవ్వకున్నవాళ్ళు నవ్వుకున్నారు.. తిట్టుకున్నవాళ్ళు తిట్టుకున్నారు.. వాడిచ్చిన యాధృచ్చిక సమాదానం ఎంత ఫన్నీ/వల్గర్‌గా ఉన్నా.. మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఉదయించే ఉంటుంది..


            ఔను మరీ..!! మంగళ షాపుకి వెళ్ళి ఎయిడ్సువాడి బ్లేడు తగిలితేనో.. లేక హాస్పిటల్లో ఎయిడ్సు రోగి రక్తం తగిలిన సూది మనకి గుచ్చితేనో వ్యాపించగల్గే ఎయిడ్సు.. మన tiny dracula అదేనండీ దోమ.. కుడితే ఎందుకు వ్యాపించదూ???.. మీలో ఎంత మందికి దీనికి సరైన సమాదానం తెలుసో నాకు తెలియదు కానీ.. నాకు తెలిసింది నేను చెబుతాను..


           HIV తను పని చెయ్యగలగాలంటే ఉండాల్సిన పరిస్థితులలో అత్యవసరమైనది ఎవరంటే మనిషి మాత్రమే.... "ఎందుకలాగా..!!??"... అంటూ యమలీలలో సుబ్బరాయశర్మకి వచ్చినట్టుగా మీకు డౌటొచ్చుండొచ్చు.. ఔను దానికి ఒక కారణం ఉంది.. దోమ జీర్ణాశయంలోకి వెళ్ళిన HIV దాని జీర్ణరసాల నుండి తప్పించుకోగల్గినా.. అది అందులో జీవించగల్గే ఆసరా లేదన్నమాట.. అంటే మలేరియా పరాన్నజీవిలాగా దోమ శరీరంలో HIVకి చుట్టాలెవరూ లేరన్నమాట.... నాకు తెలుసు.. HIVకి మాత్రమే ఉండే చుట్టాలు ఎవరూ అని మీకు డౌటొచ్చేసిందని..    చుట్టాలు అనే కంటే.. ఐడెంటిటీ కార్డు చూపెడితేనే లోపలకి రానిచ్చేవాళ్ళు అంటే బాగుంటుంది...
ఔను HIVకి glycoprotein160 (gp160=gp120+gp40 two proteins of 160kilodaltons of molecular weight both together) ఇంకా మనిషి తెల్ల రక్తకణ (T-helper ఇంకా Tc)పొరలో CD4 (cluster of differentiation to help in antigen processing in collaboration with APCs) అనే మెంబ్రేన్‌ ప్రోటీన్ మాలిక్యూల్... ఈ రెండూ కలిసీ.. "మీది తెనాలే మాది తెనాలే మనది తెనాలే" టైపులో డ్యాన్సులేసి మరీ ఆడుకుని.. చివరకి CD4 తన కణపు పొరని HIVతో కలిపేసీ.... రావమ్మా మహా లచ్చిమీ రావమ్మా నీ ఎడంకాలూ ముందెట్టీ రావమ్మా అని మరీ సాదరంగా అహ్వానించి మరీ.. మనిషిని పీల్చి పిప్పిచేసేందుకు రంగం సిద్దం చేస్తుంది.. పాపం CD4 ఎందుకు ఇలా చేస్తుందీ HIV dangerous అని దానికి తెలియదా.. లేక ఎవరన్నా లంచమిస్తారా... మీ డౌటిదే కదా..


          అసలు విషయం ఏంటంటే ముందే చెప్పుకున్నాం‌ కదా CD4 యాంటీజెన్ ప్రోసెసింగులో ఉపయోగపడుతుందనీ........ అంటే 'అనగనగా ఒక రోజు' సినిమాలో బ్రహ్మానందమేమో.........  "పోలీసంటే ఎలా ఉండాలి.. వెదవెవడు, జంటిల్మనెవడు.. మొహం చూడగానే స్నిఫ్ఫర్ డాగ్ లాగా పట్టేయాలి.. ఐ వాంటు టు టాక్ టు నెల్లూరి పెద్దారెడ్డి రైట్ నౌ.." అని కబుర్లు చెబుతాడు గుర్తుందా.. అలాగే.... వచ్చింది మనోడా లేక బయటోడా అనేది చూసుకునే భాద్యత CD4 అతికించి ఉన్న కణానిదే అన్నమాట(ఇక్కడ CD4 ఒక scrutiny enabled  gateway అనుకోవాలి)... ఐనా fake identity కార్డూ ఇంకా కమల్‌హాసన్ సినిమాలోలాగా మాస్కూ HIV వేసుకుంటే... పాపం CD4 మాత్రం ఏమి చేస్తుంది.. మేఘసందేశంలో జయసుధలాగానో లేకుంటే కార్తీకదీపంలో శారదలాగానో అమాయకంగా హారతి పట్టేస్తుంది... నెక్స్టు సీను ఏం‌ జరిగింది..  ఇలా అడుగుతారని తెలుసు...... అంతా చెప్పాలంటే పెద్ద పుస్తకమౌతుంది... నెట్లో సెర్చి చెయ్యండి.. కానీ దోమల వలన ఎయిడ్సు వ్యాప్తి కోటిలో ఒకరికన్నా ఉంటుందని statistics వాళ్ళు చెబుతారు.. కారణమేంటంటే.. ఏ పరిస్థితిలోనైనా దోమ పీల్చిన రక్తం ఎయిడ్సు రోగి రక్తకణాలు healthy individualలోనికి వెళితే అప్పుడు ఎయిడ్సు వచ్చే అవకాశం ఉంది.. కానీ చాలా తక్కువ(this possibility is almost ruled out, ఐనా ఎవరు చూశారూ... జెనెరేషన్‌కొక రంగు మార్చే జీవి ఆ HIV) .. I'm not giving references.. if you want.. you've to search through net...


Have a nice day..

ఛా'yeah' చిత్రములు... మా అందమైన, పెద్దదైన, గొప్పదైన హెచ్.సి.యులో తీసినవిGive Sunshine...


Give me some more rays....

Floraaaa...


శిలీంధ్రాలు.. some specific fungi..All yellow is not dirty fellow I think...The one I can say.. yeah.. WoW...!!


Hey darling.. take my kisses.. you're so hot


Peacock on the Rock far away in Meadows..


మేఘాల ష్యామ్యానా... మేఘాలున్నాయి కానీ ఘుమఘుమలేవీ..


Laila's impact made a sunny morning to this gloomy... but beautiful..

At the junction of lakeview guest house..

Beautiful.. dusky.. rainy sky.. from NRS..

Sun's saying.. bye bye dudes..


వానా వానా వల్లప్పా... నేనీ ఫోటో తీస్తున్నప్పటికే.. నా మీద నాలుగైదు రూపాయ కాసంత చినుకులు పడ్డాయి.. ఫోటో తీసేసి.. పరిగెట్టుకుంటూ రూముకెళిపోయా..

Fincing...అదే ఫింగర్+డ్యాన్సింగ్

Saturday, May 22, 2010

నాకిష్టం ఫ్లవరు.. కానీ నాకు లేదు లవరు.. :)

ప్రేమ ఎంత గాఢమైనదైనా... దాని విఫలం ఏ ఆత్మహత్యతోనో... హత్యతోనో కాక.. ఇలా సరదా ఎక్సుప్రెషన్‌తో "ఎండై"తేనే బాగుంటుంది... అఫ్‌కోర్స్ పిల్లికి ఎటకారం.. ఎలకకి వెగటు కారం అనేటట్టుంది.. అదే వినేవాడికి వెటకారంగానూ.. తన లవ్ గురించి చెప్పే లవ్ ఫెయి'ల్యూర్' హీరోకి వెగటుగానూ ఉంటుందనుకోండీ... సరే తన బాధని ఎలా వెళ్ళబుచ్చుతున్నాడో చూద్దాం..

Friday, May 21, 2010

BSNL:బాయ్ సాబ్ నహీ లగేగా..

బీప్.. బీప్... అంటూ మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది.. ఏంటా అని చూశాడు మా ఫ్రెండు... పాపం గర్లు ఫ్రెండు మెసేజీ కోసం ఎదురు చూస్తున్నాడేమో (ఈ విషయం నాకైతే తెలీదు జస్ట్  నా guess అంతే ).. నిరాశతో కూడిన నిర్లిప్తత అలుముకున్న ఆగ్రహపూరిత వర్ణం దాల్చింది తన మొహం.. ఏంటి మేటర్ అని అడిగితే అప్పుడు తనే తిరిగి నన్ను ప్రశ్నించాడు..
ఐశ్వరాయ్ ఎవరు అని.. ??
నేను మనోడ్ని తేడాగా చూస్తూ... ఏదో చెణుకు విసిరేలోపే తనే  మళ్ళీ స్టార్టు చేశాడు
డి1: actor
డి2: politician
అప్పుడర్దమైంది నాకు ఇందాక మెసేజ్ చదవగానే తన మొహంలో భావజాలాలు అలా ఎందుకు ప్రస్ఫుటమయ్యాయో..  ఎందుకంటే నాదీ అదే network (BSNL)..
పాపం ఆ మెసేజీతో పాటు ఇంకొన్ని మెసేజీలను... అంటే.. రజనీకాంత్ ఎవరు.. చార్మినార్.. హైదరాబాద్లో ఉందా.. కేరళలో ఉందా.. లేక మీ పక్కింట్లో‌ఉందా.. ఇలాంటివన్నమాట..
చూపించి తన బాదని నాతో చెప్పి వాపోయాడు.. (నాతో చెప్పి మాత్రం ఏం లాభం.. జోగీ జోగీ రాసుకుంటే‌ బూడిదే కదా రాలేది)..


                అస్సలు మా ఫ్రెండుకి ఉన్న అసలు బాద ఇది కాదంట.. ఫుల్ సిగ్నల్ ఉన్న ఏరియాలో సెకెండు ఫ్లోరు పిట్టగోడెక్కి స్థంభం పట్టుకుని ఫోన్ చేసినా.. (ఆ చేసిన ఫోను మనోడి ఫోన్‌కి ప్రక్కనే ఉన్నా).. మీరు కాల్ చేస్తున్న subscriber బాత్రూమ్‌కెళ్ళారు.. లాంటి సిల్లీ రిప్లైలు వస్తాయి కానీ ఫోన్ అందదు.. కానీ సిగ్నల్ ఒక్క డిజిట్ మాత్రమే ఉన్న ల్యాబ్లోకైనా సరే వాడు పంపించే యాడ్ మెసేజీలు వెతుక్కుంటూ వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ వాపోయాడు... పాపం (ఈ జాలి నాక్కూడా వర్తిస్తుంది). నాకైతే డౌటే.. శాటిలైట్ నెట్‌వర్కుతో పాటు బీఎస్సెన్నోళ్ళకి అబ్రకదబ్ర, తావీద్ మహిమ లాంటి మంత్ర శక్తులేవో ఉండుంటాయి, లేప్పోతే సిగ్నలున్న దగ్గర ఫోనే వెళ్ళంది అది లేని దగ్గరకి మెసేజెస్ ఎలా వెళతాయ్...


               పోనీలే దేవుడి దయ వలన మేసేజీలో ప్రశ్నలిచ్చి సమాదానం ఇవ్వాలో వద్దో అనే చాయిస్ మనకే వదిలేస్తున్నాడు.. అలా కాకుండా.. సమాదానం తెలిసి కూడా రిప్లై చెయ్యలేదో.. నీ బుర్ర వేయి వ్రక్కలగుగాక అని పంపట్లేదు కదా అని సర్ది చెప్పాను..


ఆ మద్యన ఎవరో అంటే విన్నాను BSNL అంటే...
బి  : బాయ్
ఎస్: సాబ్
ఎన్: నహీ
ఎల్: లగేగా
అంట... బాగా సరిపోయింది...(అంటే బాయ్ సాబ్ కాని వాళ్ళు లగేగానా అని అడగొద్దు)


            ఈ లోపు ఇంకో మెసేజ్ వచ్చింది.. దాని తాత్పర్యం.... సారీ  సారాంశం ఏంటంటే... ఎవరో పూజ అంట.. ఫ్రెండ్సు కోసం ఎదురు చూస్తూ ఉందంట.. తనతో మనం ఫ్రెండ్సిప్ చెయ్యొచ్చంట.. మెసేజీ కేవలం ఐదు రూపాయలేనంట.. మనోడు మళ్ళీ ఆవేదనా పూరిత బిక్క మొహం వేసుకుని.. ఏం‌ చెయ్యమంటావ్ మౌళీ... ఐదు రూపాయలు పోతే పోయాయ్.. బూతులు రాసి మరీ ఎస్సెమ్మెస్ పంపేయనా అన్నాడు... దానికి నేనన్నానూ.. అయ్యో బూతుల్ని  వాళ్ళు లైట్‌గా తీసుకుంటారూ.. ఒక ఐదు వేలు అప్పుంటే అడుగు..  అన్నాను.. మా వాడు ఒక చిరుమందహాసాన్ని జవాబుగా ఇచ్చిన తర్వాత ఆ సంభాషణ ముగిసింది..

Thursday, May 20, 2010

నిర్జీవ లబ్..డబ్..లు

తనని ఆడించీ.. పాడించీ.. లాలించీ.. బుజ్జగించీ.. ఎన్నో ఆశలు రేపిన తన ప్రేయసి.. తననే పూర్తిగా మర్చిపోతే... ఏమౌతాయో ఆ ప్రియుని గుండె చప్పుళ్ళు..

Wednesday, May 19, 2010

పుత్రోత్సాహము...

"పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు,
జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.."

వ్యాఖ్యానం: సుమతీ శతకంలో బద్దెన అంటారూ.. నాయనా నీ గురించి మీ నాయనకి పక్కోడు చెబితే తప్ప నీ విషయంలో ఆయనకి సంతోషం రాదురా.. పుడుతూ పుడుతూ నలుగురు వందిమాదిగల్ని నీతో పాటు పట్టుకురా.. లేప్పోతే.. మీ నాన్న నీ గురించి ఎప్పుడూ సంతోషించడూ అని..

                  అసలు విషయాన్ని దాచేసి నాకు నచ్చింది తాత్పర్యంగా చెబుతున్నాననా మీ ఫీలింగు, ఔను మరి మూస పద్దతిలో తాత్పర్యం ఇదే అని చెప్పినంత మాత్రాన ఎలా ఒప్పుకుంటారు.. తనని ఎంతో ప్రేమించే తండ్రి, తన ప్రతిభ పైన చుట్టు ప్రక్కలవాళ్ళ కితాబు కోసం ఎందుకు ఎదురు చూస్తాడు.. ఆయన మైండు అంత వీక్ మైండా..  ఐనా బద్దెన చెప్పింది ప్రపంచంలో ఎనభై శాతం మంది ఎలా వర్తిస్తారు అనేది.. కానీ ప్రపంచ గమన నిర్ధేశకత్వాన్ని మార్చేది ఆ మిగిలిన ఇరవై శాతం మంది అనేది.. శాస్త్రీయంగా విశదీకరించబడింది..
                   

                    అందుకే ప్రతి తండ్రీ ఆలోచించాల్సిందేంటంటే.. తన పిల్లలు ఫస్టు ర్యాంకర్‌తో పోటీ పడుతున్నారా లేదా అనేది కాదు.. కీ షీట్‌తో పోటీ పడుతున్నారా లేదా అనేది చూడాలి, తన పిల్లలు మిగిలిన వాళ్ళ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారా లేదా అని కాదు, తమ పిల్లల స్థానం కంటే ఉన్నత స్థానం ఉంద లేదా వాళ్ళు ఉన్నతంగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి.. You may say that best result is the output of rationale which is in turn the result of divisive or comparitive study.. but your fellow being is always a multi-dimensional variable with infinitismally low probability of consistency's expectency within him/her with whom an ideal rationale is not appropriately calculated.. so take infinite by you to meet the best.. but not a variable or constant, that's temporarily or permanantly fixed. Remember that the statement saying a variable equivalent to infinite is an absolute hallucination.

Tuesday, May 18, 2010

పాదుకులమయ్యా స్వామీ...!!

ఒక సారి మా ఫ్రెండు నన్ను తిరుపతి కొండకి తీసుకెళ్ళాడు.. హ్యాపీగా బస్సు మీద వెళదామనుకుంటే.. మావాడు మెట్లదారి ప్రోగ్రాం పెట్టాడు.. పోనీలే కాలు నొప్పి పెడతాయి అంతేలే అనుకుంటే.. చెప్పులు తీసేసి.....  అని అన్నమయ్య సినిమా గుర్తు చేశాడు.. దేవుడికి ఇవన్నీ అవసరమా అని మనసులో అనుకుంటూ, ఒకసారి అనుభవమైతే నాకు కూడా తెలిసొస్తుందిలే అని నడిచి వెళ్ళాను.. కొండమీదికెళ్ళి దర్శనమయ్యి తర్వాతి రోజు క్రిందకొచ్చేదాకా చెప్పులేసుకోలేదు.. వాడికేమో కానీ నాకైతే.. గర్భగుడిలోకెళ్ళటానికి ఎంతో‌ సేపటి ముందే దేవుడు దర్శనమిచ్చేసి.. నా కాలుకేసి చూసి మాయలోడు సినిమాలో బ్రహ్మానందంకేసి ఆలీ చూసే చూపు గుర్తొచ్చేది..  దైవ దర్శనానికి వెళుతున్నాం కదా అందుకే మనసులో కోపం కానీ.. శరీరంలో బాదని కానీ వ్యక్తపరచలేదు.. ఆ రోజు నాకు నా మీద కంటే నా చేతి సంచిలో దాచిన చెప్పుల మీద చాలా జాలేసేసింది.. వాటిని కొన్నప్పటి నుండి అరిగిపోయే వరకూ వాడినా మిగిలిన వస్తు సముదాయంలా కాక వాటిని దేవుడికి దూరంగా ఉంచేస్తాం.. అవేం చేశాయని పాపం.. వాటికే గనక ప్రాణముండి మానవుల్లా ఆలోచించగల్గితే... వాటి ప్రార్ధన క్రింది కవిత రూపంలో ఉంటుందని నా భావన...

Monday, May 17, 2010

కాలేవా నా జీవితాన సగ భాగానిగా ఐనా...

అన్నింటికీ నిన్ను చేర అవకాశమిచ్చావ్ కదా.. మరి నేనేం పాపం చేశానే అనే ప్రియుణ్ణి చూస్తుంటే.. జాలెయ్యటంతో పాటుగా, నవ్వు కూడా వస్తుంది.. ఏమంటారూ..?? :)

 

Sunday, May 16, 2010

అంతలుసైపోయాయేమో కన్నీళ్ళు..

..........................................ఎందుకలా జరిగిందంటే నేనేమని చెప్పను, ఏమీ చెప్పలేను.. నిజమే కన్నీళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ.. గుండెనే కదిలించేంత బాదైనా ఉండాలి, లేదా పొట్ట చెక్కలయ్యే సంతోషమన్నా ఉండాలి అవి బయటకి రావాలంటే.. పాపం మనసు పాడే విరహ గీతాలకి అవి ఎంత లోకువైపోయాయో.. బావోద్వేగాలు చేసే రాపిడిలో ఎంత అలసిపోయాయో.. నిదురించిన మస్తిష్కపు లోతుల్లో కలల ప్రభంజనం కంటితో చేస్తున్న కలహంలో.. పావులై.. మూసుకున్న కనురెప్పల అంచులలోంచి పెల్లుభికి…రాలిపోయాయి….....

సండేనాటి మండే ఎండా మజాకా...

ఈ మండే ఎండాకాలంలో
సండే నాడు గుండెలు మండుతుంటే
తడి తుండు గుండుపై వేయించి
మానని పుండంటి ఉక్కపోతని చూడ
రండి రండంటూ  గండర గండడిలా రెచ్చిపోతున్న
సూర్యుని తాపంలో పండంటి మల్లెపూచెండు కూడా మాడిపోతుంటే
ఎంచక్కా ఏసీ రూములో దిండేసుకుని పండే వాణ్ణి చూసి...... మీరేమంటారు..

Saturday, May 15, 2010

సుషుప్తి...

మానస వీణ తంత్రులను మీటి.. హృదయంలో రసరాగాలను పలికించి.. శృంగార కేళీ నాట్య విన్యాసంలో ఓలలాడించే ప్రేయసి ఉంటే... తన రాగోల్లాసాల సంగీత సరిగమల గమకాలు ఈ విధంగానే ఉంటాయని.. నా చిన్ని రొమాంటిక్ ఊహ..

చంద్రజలం..

నా పాత బ్లాగులో పోస్టు చేసిన ఆర్టికల్.. కాకుంటే అది అందరికీ అందుబాటులో లేదు.. అందుకే మళ్ళీ ఇక్కడ రీ-ఇటరేట్ చేస్తున్నా..

Friday, May 14, 2010

ముగ్ధ మందారం...

ఏంటో కవితలంటే ప్రేమ, ప్రేమంటే అమ్మాయ్, మళ్ళీ అమ్మాయంటే కవితలు.. ఇవన్నీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా సాగుతుంటాయి.. ఐనా ఒకటి నిజం.. ఏదో చదివి అర్దం చేసుకున్న కవితలకీ.. రోడ్డు మీద వెళుతూ అలా ఒకసారి చూసిన ఎడ్వెర్టైజ్‌మెంటుకీ పెద్ద తేడా ఉండదు.. కవితంటే.. ఫీలయ్యి రాసేది.. చదువుతూ ఫీలయ్యేది.. అప్పుడే.. ఆకాశమంత ఎత్తునుండి దించి.. కత్తితో నరికి అందులో నీటిని తాగినప్పడు కొబ్బరి ఎంత నచ్చుతుందో కవిత అంత నచ్చుతుంది...  ఫీలవకుండా చదివేసిన కవిత.. పైన ప్లాస్టిక్ రేపర్ తియ్యకుండా మింగేసిన స్వీట్‌ తియ్యగా ఎలా ఉండదో అలాగే ఉంటుంది.. ఏమో మీ భావాలు నాతో ఏకీభవించాలని లేదు కదా.. 
నింగికేసి చూస్తూ ఊహా సుందరిని గురించి ఆలోచిస్తూంటే.. అలా అలా కొన్ని కవితా వరుసలు వచ్చేశాయ్... అవే క్రింద బొమ్మలో ఉన్నాయ్.. చూసి చెప్పగలరు మీ అభిప్రాయాన్ని..Thursday, May 13, 2010

లూజ్ ప్యాంట్...

ప్యాంట్ లూజవుతుంటే.. జనాలకి స్లిమ్‌ ఔతున్నారని చాలా సరదాగా ఉంటుంది కానీ.. ఆ ప్యాంటుని మడత పెట్టి తొడుక్కుని, బెల్టు తప్పని సరిగా వాడాల్సి రావటం మాత్రం.. చాలా బాదాకరమైన విషయం.. కొత్త బ్రాం"డెడ్" ప్యాంటు కొనుక్కుందామంటే పావు ఫెల్లోషిప్ దానికే పొయ్యాల్సుంటుంది.. పోనీ ఈ స్లిమ్‌నెస్ పర్మినెంటుగా ఉంటుందా అంటే.. సాఫ్టువేర్ ఫీల్డులాగా ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు.. కొన్ని సార్లనిపిస్తుంది జంతువులే బెటరూ, వాటికి సిగ్గూ అలాంటివి గట్రా ఏమీ ఉండవు.. బట్టలేసుకున్నా వేసకోకపోయినా పర్వాలేదు.. అడిగేవారెవరూ ఉండరు కదా అని.. ఐనా నాగరి"కథ" జరుగుతూ ఉన్న పంధా కూడా చక్రీయంగానే(cyclicగా) ఉంది.. అంటే మనిషి ఆవిర్భవించినప్పుడు బట్టలు లేవు తనకి.. తర్వాత సిగ్గెక్కువై బట్టలు వేసుకున్నాడు.. కొత్త పుంతలు తొక్కుతున్న మన సమకాలీన నాగరికతని చూస్తుంటే పూర్వ నాగరిక సమాజానికి దగ్గరలో ఉంది జనాల వేషధారణలో..  దీనర్దం మనం మళ్ళీ  మన ఆరంభానికి సిద్దమౌతున్నామనా.. ఏమో!!.. ఇంతకీ ఎక్కడ స్టార్టు చేశానూ.. హా.. లూజు ప్యాంటూ.. బెల్టూ.. అవి వేసుకునే ఒక మని"హి".. [హి (he) not she షి హిహిహిహిహిహిహి].. ఔను ఫన్నీగానే ఉంటుంది.. ఈ రోజుల్లో "మనీ" ఇంకా ఒక "షి" (she), హి (he)తో పాటుగా ఉంటే‌ కానీ అతనిని 'మని''షి'గా చూడట్లేదు జనాలు.. ఆ రెండూ లేదా ఏ ఒక్కటి లేకున్నా అతనిని.. జంగమ జీవ పదార్దాలనుండి తీసేసి స్థావర ఆవారా లాగా చూస్తున్నారు.. ఏంటో కదా.. నేనంటే అన్నానంటారు కానీ నిజాలు నిజాలే కదా...  :)

Thursday, May 6, 2010

(వాయు) ఆకాశ హర్మ్యం...

మన్మధుడు సినిమాలో నాగార్జునలాగా.. బయలుదేరి.. ఒక ఆటో, రెండో‌ ఆటో, మూడో‌ ఆటో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కి వెళూతూనే ఉన్నాను.. ఇరుకు సందుల్లాంటి రహదారులు కాస్తా, వెడల్పుగాసాగాయి.. ఎండ వేడిని కొలవటానికి దర్మామీటరు లేదు కానీ ఆటోకి డబ్బులెంతయ్యాయో చెప్పటానికి దానికో "అధర్మా"మీటరుంది... దాని అంకెలపై టెంకెలు విసరా అనుకుంటూ విసవిసా బయటకొచ్చి చూస్తే... ఎటు చూసినా.. మేడలే.. నేనున్నది నా దేశంలోనేనా అనిపించింది.. ఆటోలకి అంత సీన్ లేదని తెలిసి ఒకసారి నవ్వుకున్నాను.. ఎందుకు వెళుతున్నానో చెప్పను కానీ.. ప్రశాంతంగానే నడుస్తున్నాను...  అప్పుడే కనిపించింది.. ఒక పెద్ద అద్దాల మేడ... అందులోంచి... రెక్కలమీద తారు ఒలికిపోయిన రాజహంసలా.. రాత్రి రంగుని పులుముకున్న వస్త్రాలు ధరించిన ఒక సుందరి దర్శనమిచ్చింది.... నా దగ్గరగా చేరి గోముగా బుగ్గని తడుముతూ... ఐ... ల.....వ్... ఇది  పూర్తి కాకుండానే... ఠంగున ఒక మొట్టికాయ తగిలింది.. తీరా చూసుకుంటే అది నేను పడుకున్న మంచం తాలూకా ఐరన్ రాడ్డు.. తలపై బొడిపెని తడుముకుంటూ.. నిద్ర లేచి చూస్తే.. ఉదయం ఐదు గంటలు... అయ్యో మళ్ళీ కలలోనే వచ్చావా.. వస్తే వచ్చావ్ ఎడ్రస్సన్నా ఇచ్చి వెళ్ళాల్సిందని ఫీలయ్యాను.. ఆ కలేదో ఒక గంట ముందొచ్చుంటే స్వప్నశాస్త్రం‌ ప్రకారం నిమమయ్యుండేదేమో.. అవ్వకూడదనేమో లేటుగా వచ్చింది.. మనుషులు టీజ్ చేస్తే ఓకే.. బేవార్సిగా పనీ పాటా లేని ఫేట్ కూడా టీజింగూ, ర్యాగింగూ చేసెయ్యటమేనంట..... ఏంటీ ఇది చదివుతుంటే నేను ఎటకారంగానే కనపడుతున్నానా... ఏం చేస్తాం దిస్ ఈజ్ యువర్ డే.. :)
         ఏం చేస్తాంలే డిలీట్ బటన్ నొక్కినంత ఈజీ కదా.. గాలి మేడ కూలటం కూడానూ... పాపం ఎవరో నన్ను మిస్సైపోయిన ఆ మిస్సు.. ( హే అమెని లక్కీఫెలో అనిగానీ, తృటిలో "నేను" అనే ప్రమాదం నుండి తప్పించుకుందని కానీ అన్నావంటే బాగోదు మళ్ళీ..)
say to me "NEXT TIME BETTER DREAM" :)

Wednesday, May 5, 2010

Fine arts of SNschool

నిన్న మా యూనివర్సిటీలో performing arts ‌(Sarojini Naidu School of Performing Arts, University of Hyderabad) వాళ్ళు పెట్టిన arts exhibitionకి వెళ్ళాను.. అక్కడ వాళ్ళు తయారుచేసిన మరియు గీసిన కొన్ని కళా ఖండాలని మీ ముందుంచుతున్నాను.. good artwork..
This is not their artwork... this is my photography.. while I was entering the department I found this view and clicked.. so you got a "The Scintillating Sun, the son of Milky way.. scattering his photons for all of us.."

He must have "gained" a good amount of skill by making rope of "loss"

Rope pole.. looks good 


 Its better stopping one's journey instead of carrying this bag.. what do you say?


It seems this beauty is quite flexible, lazy and tired enough. The culprit, oh sorry the sculptor really made her feeling painful by twisting her like that.. I pity you gal..
 

The artist has really shown his handiness in making the curtain look transparent 
All the broken fans are carved there on that board, this art is nearly 1cm thick.. artist must have worked smartly hard.. 
 Maintaining transparency on a hard copy (canvas) is not easy for me.. I can make it easily in computer.. but he did on canvas.. hats off to you dear.. 
 He could hide the beauty but not nakedness of those naked beauties.. but front-ground of floral ornamentation is awesome..


 
 Here artist has shown enough skill in representing different stages of some work very nicely in this picture 
 Nice and imaginative.. he hid the guy in the middle more than girls.. what can we say.. its world of girl domination


 Cool dude relaxing like anything.. I don't know if he is suffering too..


 ...
I feel the defect in this sculpture work.. fingers smaller than palm.. (I can say say sorry I don't have change.. hhehehe)


 One never feels it as if its an art when he looks at it just for the first time.. seems to be too real.. but its an art..


 
 I certainly wanna live at such an area.. but where does it exist on the earth.. Oops..!!, I've to find his imagination to live in.. :)


 
 Help.. Help.. bachaavo.. bachaavo..


 
 Hey girl, you have to move only with your soul.. not with wall.. :) :) :)


 
Hey darling, are you searching for me there in.. Oh, sorry I am here towards your backside.. just have a look back.. 
Huh..!!:-| We're saved, its just iron made and non-living.. 
Colourful dog, hey you doggy what's that look like a donkey.


 
It don't know if this artist does like witchcraft.. beware of him..


 
 కుక్క బొమ్మ ఉయ్యాల్లో... వీడి creativity తగలెట్ట... బొమ్మలు కూడా shitతే తెలిసుండేది వాడికి, ఉతుక్కోటం ఎంత కష్టమో.. 
 They didn't recognise the art in the flooring they made but I could find cheer
girls in it.. don't ask me for heads.. Its too yummy.. but only to look... the artist must be fatty like me.. but I'm not a cooky lover but still I admire them..


 
art is fine that's the artist is in fine arts department but still, ఒరేయ్ తల మాసినోడా.. ఆటోలో రూపాయి కాయిన్ బాక్సేంటిరా.. నువ్వు వెళ్ళే దారమ్మటా వైరివ్వటానికి BSNL ఏమన్నా మీ అబ్బ సొమ్మనుకున్నావా.. criticism could be of this range..


 From the terrace of SNschool

Sun set is good naa... its nature's art, no credit to no one.. (little to my heart)