నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Thursday, December 15, 2011

నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్...

అలా మాట్లాడుతూనే ఆమెని అడిగేశాను... ప్రేమించటమంటే ఎందుకని మీ అమ్మాయిలంతా, మీ మనసుకి నచ్చిన సోదిని వినే ఒక కౌన్ కిస్కా గొట్టాం గాడు దొరకటం మాత్రమే అనేటట్లు చూస్తారు?‌ వాడు ఎలా ఉండాలో, ఎలా కనపడాలో, ఎలా ప్రవర్తించాలో ఇలా అన్నీ మీరు నిర్ణయించి మీకు నచ్చినట్లు చెయ్యాలని చూస్తారు? మీకుండే ఇన్ సెక్యూర్ ఫీలింగుని వాడి ఇనెబిలిటీకో లేక డిజెబిలిటీకో ముడిపెడతారు?...


మౌనం వహించిందామె అది తుఫాను ప్రశాంతతా అనేటట్లుగా... శబ్ధారంభం సౌమ్యంగా అనిపించినా, సమాధానం ఘాటుగానే ఉంది. మీ అబ్బాయిలంతా ఎందుకలా అమ్మాయిల్ని ఏలియన్సుని చూసినట్లు చూస్తారు, మిమ్మల్ని ప్రేమించే అమ్మాయిల్ని మీ వెనక తిరిగే కుక్కలా హీనంగా భావిస్తారు, ఆమె శరీరానికే ఎందుకు విలువిస్తారు, ఆమె మనసన్నా, మాటన్నా అంత చులకనగా ఎందుకుంటుంది???


శబ్ధ తీవ్రత తుఫాను కాక అదేదో సునామీని తలపించింది... జాన్ గ్రే men are from mars and women from venus,అలాగే జాన్ మిల్టన్ తను కోల్పోయి పొందిన స్వర్గాలలోని అంతరాలు అర్ధమయ్యాయి, ఎందుకో మిల్టన్ జాన్ గ్రే కంటే చాలా అమాయకుడనిపించింది, నిజానికి నేను ఆ నవలలు చదవలేదు కానీ, అమ్మాయిల మనస్త్వత్వం ఎలా ఉంటుందో తెలిసే ఉత్తమ జాతి నేర్పరికి (ఇతరులని చూసి నేర్చుకునేవాడు), ఆ టైటిల్సులో పరమార్థం ఉడుకుతున్న బియ్యం మెత్తబడిందో లేదో‌ దాన్ని తడమకుండానే చెప్పగలిగినంత సౌలభ్యం అనిపించింది...

పాపం పైన ఆమె అడిగిన ప్రశ్నలు అందరి విషయంలో నిజం కాకపోయినా అందులో అతిశయోక్తి అతిగా లేదనిపించింది...

ఆ మద్యన చూసిన ఆరెంజి సినిమాలో, తను ప్రేమించే ప్రేమకి నిర్వచనం కానీ పరమార్థం కానీ చెప్పుకోలేని కథానాయకుని పాత్రని సృష్టించిన రచయిత మనస్తత్వం చూశాను, అదే సినిమాలో ఇంకో పాత్ర ప్రేమంటే ఇదీ అని జీవిత కాలం భార్య పెట్టే పోరుని/సోదిని భరించగలిగే ఎబిలిటీని చాటి చెప్తాడు... స్వార్థం ఇష్టపడే కథానాయకుడంటే ప్రేక్షకుడికి ఇష్టం ఉండదు అలాగే అది నిజ జీవితం ఐతే అలాంటబ్బాయి అంటే ఏ అమ్మాయికీ ఇష్టం ఉండదు... మరి గొంతులో‌ దుఃఖాన్ని దాచుకుని నవ్వుతూ రోజుకో పూలకుండీ కొనుక్కునే పాత్ర అంటే జనాలకి ఎందుకంత ఇష్టం... (వాళ్ళు జనాలు వాళ్ళనడిగి వేస్ట్ అని అంతరాత్మ వెకిలిగా సమాధానం ఇస్తుంది)


నిరంతరం అనుసంధానమై ఉండే సౌకర్యం ఉండే‌ ప్రపంచంలో అనుక్షణం విషయ సంగ్రహణ సామర్ధ్యం కలిగి ప్రతీ నిమిషం ఆర్ధికాభివృధ్ధి సాధించాలనుకునే జనాలకి, భోజనాలని ఈ మెయిల్లో పంపగలిగితే బాగుండు, పిల్లల్ని ప్రింటౌట్ తీసుకోగలిగితే బాగుండు, తన మెయింటెనెన్సూ, జాగ్రత్తలూ తీసుకోమని అడగని పరికరాలే తమ జీవిత బాగస్వాములైతే బాగుండు అని భావించే అభినవ అభివృధ్ధి పద ప్రపంచంలో పలువురు పలికే వాక్యం "ప్రేమా పేడకడి తట్టా"....


ఎందుకీ ఎనాలిసిస్ నీకూ, దేనికిది రాస్తున్నావూ, ఎవరన్నా డబ్బులిస్తారా నీకూ, లేక పని లేదా, ఈ కాలంలో ఎవడన్నా ఇంటరెస్టు మాత్రం ఉందని ఏదైనా పని చేస్తాడా... ఇది నేను రాస్తున్న పోస్టుకొచ్చిన కితాబు...


మనసులో ఏమి తోచక సమాధానంగా చెప్పాను, కేర్నాట్ ఇంజిన్ లోనికి వచ్చిన ఎనర్జీ బయటకెళ్ళటానికి సింకొకటి కావాలి, అది నాకు ఇదే అని చెప్పాను... మరేం‌ చెప్పనూ జీవితమంతా, ఇంగ్లీషు వచ్చీ రాని మనిషి inception సినిమాని మొదటిసారి చూస్తున్నట్లుంటే ఆల్మోస్టు ఎవరైనా ఆ టైపులోనే సమాధానం చెబుతారు...


ఎంత వెతికినా ఏం చూసినా, పాత సినిమాల్లో కనిపించే అందమైన ప్రేమ, స్వంత ఊహల్లో జనించేంతటి స్వఛ్ఛమైన ప్రేమ, నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్...Monday, September 5, 2011

అక్షరం

  అక్షరం గురించి వ్రాయమంటే ఏదో అలా అలా వచ్చిన కొన్ని పదాలని ఇలా మీ ముందు ఉంచాలనిపించింది...
                                            

క్షరం  అంటే నాశనం
అక్షరం=నః క్షరం  - అంటే నాశనం కానిది, నాశనమనేదే లేనిది; ఇది అక్షరానికి భాషాపరమైన అర్ధం.
మనోభివృధ్ధి సాధించిన మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. తనదైన శైలిలో జీవించటానికి, తనదైన ఉన్నతమైన సంక్లిష్ట భావజాలాన్ని వ్యక్తీకరించటానికి అలాగే వ్యక్తీకరించబడినదాన్ని స్వీకరించటానికి తనకి అవసరమైన మాధ్యమం భాష, ఆ భాష అక్షరాల అమరిక. ప్రపంచమంతా నిభిడీకృతమై ఉన్న సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపదని అర్ధం చేసుకునేందుకు , ఆ సంపదని మానవాళి శ్రేయస్సుకి ఉపకరించేట్టు చేసేందుకు అవసరమైన అక్షర జ్ఞానం ఆవశ్యకత వర్ణింప శక్యం కానిది. ఆ అక్షర జ్ఞానం కలిగి ఉండటం అక్షరాస్యత, అది లోపించటం అనేది నిరక్షరాస్యత.

    ఒక నిరక్షరాస్యుడు తన అవసరాన్ని సరిగా వ్యక్త పరచలేని ఒక సామాన్య అవసరం నుండి ఉధ్ధండమైన ప్రయోగాలతో జనావళికి తన పరిశోధనా సేవలందించే శాస్త్రవేత్త ఉపయోగించే భాష్యం వరకూ అవసరమయ్యేదంతా ఆ అక్షరాస్యత నుండి పుణికి పుచ్చుకుచ్చుకోవాల్సిన జ్ఞాన సంపదే. అక్షరాలు పదాలనీ, పదాలు వాక్యాలనీ, వాక్యాలు విషయ సంపదనీ నేర్చుకునేందుకు దోహదం చేసి తద్వారా విచక్షణ అనేది అలవడేలా చేస్తుంది. విచక్షణ లేకుండా ప్రవర్తించే మనిషి మృగ సమానుడు. మనిషి స్వభావం ఎలాంటిదైనప్పటికీ దానిని మార్చి తనలో సమాజ హితునిగా పరివర్తన తీసుకురాగల మంత్రం అక్షర మంత్రం.
   
    అక్షరమనే మాతృక జ్ఞానమనే సంపద సాధించటానికి ఉపయోగపడితే, జ్ఞానం విద్వత్తు  జనించేందుకు ఉపకరిస్తుంది. విధ్య కలిగిన వాడు లోకమెల్లా  పూజింపబడతాడు అనే పెద్దల సూక్తి నిత్య సత్యం. అక్షరాన్ని గురించి ఇలా ఎన్ని అక్షర సత్యాలు చెబుతున్నా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కూరగాయలు తరిమే కత్తి ని ప్రావీణ్యత లేని వాడు దానిని ఉపయోగించినా లేదా హత్యలు చేయాలనే వాడు ఉపయోగించినా అది రక్తం కళ్ళ చూస్తుంది. అక్షరం అనే సాధనం‌ చాలా ఉన్నతమైనదీ మరియు ఎంతో శక్తివంతమైనదీనూ. చిన్ననాటి నుండీ సమాజ శ్రేయస్సుకి సంభందితమైనపోకడలని అలవర్చుకున్న మనిషి  చేతిలో  అక్షరం ఏనాటికైనా ఒక మహాద్భుతాన్ని  చూపుతుంది. కాలి నడక నుండి గాలి నడక వరకూ అభివృధ్ధి సాధించిన మనిషి గొప్పతనం, కొండంత నుండి గోరంతవరకూ చేరుకున్న ఉపకరణాల పరిమాణం వాటి ఉపయుక్తం ఇలా చెప్పగా కోకొల్లలవి. కరడు గట్టినట్లు రహస్యాలను దాచుకున్న  ప్రకృతి మానవుని ముందు చేతులొగ్గి వాటిని బయట పెట్టటానికి కారణం, మనిషి తాను సంపాదించిన జ్ఞానాన్ని పంచుకోగలిగే మరియు దాచుకోగలిగే సాధానంగా, మాధ్యమంగా ఉపయోగించబడుతున్న అక్షరం మన మనిషుల ఉనికికే తలమానికం, ప్రతిభకే ఆలవాలం. దురుపయోగంలో ఉన్న అక్షర జ్ఞానం దాని పర్యవసానాన్ని సమాజ చీడ పురుగుగా మార్చటం ఖాయం.
   
    ఏది ఏమైనా మనిషిని మనిషిగా నిరూపించగలిగే అక్షరం ఒక అమోగమైన సాధనం, కానీ అది సాధనం మాత్రమే, నిన్ను మనిషిగా చూపించలేక మృగంగా నువ్వు మారితే అది నీలోని అక్షర దోషం తప్ప అక్షరంలో స్వయంగా దాగి ఉన్న దోషం కాదది. అనిర్వచనీయమైన వాడి అందుకు సరిపడ వేడిని కలిగున్న అక్షరంతో పాటుగా దానిని ఉపయోగించే దారి అనే జ్ఞానాన్ని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విధ్యావంతుడైన మనిషిగా నిలదొక్కుకోగలిగే సామర్ధ్యాన్ని  అందరూ పెంపొందించుకోవాలని ఆశిధ్ధాం.

Friday, August 5, 2011

జాలేస్తుంది కూడానూ...!?!?!?!

"హా!! ఏంట్రా అలా చూసి, ఎందుకో కొద్దిగా నచ్చగానే ప్రేమ పుట్టేస్తుందా, ఇప్పటికి నువ్వు పుట్టి పట్టుమని పాతిక నిండుంటాయ్ తెలుసా... పదేళ్ళ క్రితం ఇదే రోజు ఏ పరిస్థితిలో ఉన్నావో కనీసం వీసమెత్తైనా గుర్తుందా నీకు. ఉండదు, ఎందుకో తెలుసా... నీకు భాద్యత అంటే తెలియదు కనక, నువ్వు తినే అన్నం ముద్దలో ఉండే  ఒక్కో మెతుకుని ప్రశ్నించి చూడరా, అవి కలగలసి నీ నోటిని చేరేందుకు కారణమైన వాళ్ళ శ్రమ, ఆశ, ఆవేదన ఏమైనా నీకు తెలుస్తాయా", వాడిని వాయించేస్తుంది అంతరాత్మ.. పాపం దాని తప్పేముందనీ, దాని విద్యుక్త ధర్మాన్ని అది నిర్వర్తించింది. శరీరం పై కొన్ని ఏళ్ళొచ్చాక, మనసు ఎవరి సలహాలనీ స్వీకరించటానికి సహకరించదనుకుంటా. దీన్నే పోజిటివ్‌గా ఆత్మవిశ్వాసమనీ, నెగెటివ్‌గా బలుపు అనీ పిలుస్తుంటారు... సినిమాలో అపరిచితుడికి పలు పర్సనాలిటీలు ఉన్నట్లు వాడికి కూడా ఇంటర్నల్ డిఫెండర్ ఒకడున్నాడు మరి.... "అంటే ప్రేమనేది స్పాంటేనియస్‌గా పుట్టకూడదా?? ఒకమ్మాయ్ నచ్చటానికి కొలమానాలు, కారణాలు, లాంటివి లేకపోతే అది ప్రేమ అవ్వదా?? అన్నం పెట్టే అమ్మా, నాన్నలైనా అలా ప్రశ్నిస్తారో లేదో కానీ నువ్వు బాగా టూ మచ్ చేస్తున్నావ్ అంతరాత్మా", అంటూ అదేదో‌ సినిమాలో బ్రహ్మనందంలాగా వాపోయాడు, తన అంతరాత్మ ఇంకా ఫోర్స్ చేస్తే తానెక్కడ మారిపోవాల్సొస్తుందేమో అని అనుకుంటా?... పాపం వాడి బంధువుల్లో చాలా మంది వాడికి క్లాసు పీకేవాళ్ళే ఎక్కువ, వీడి బ్యాడ్ ఫేట్ కొద్దీ చిన్నప్పుడు వీడి లెక్కల మాష్టారు ప్రతిక్షేపించటం అనే పదాన్ని బాగా నేర్పినట్లున్నాడు, అందుగ్గాను ఆ తొక్కలో మైండ్ ఎప్పుడూ ఎవరో ఒకరిని వీడికి ఎగెయినిస్టుగా ప్రతిక్షేపించి, సరిగ్గా టైం చూసుకుని వాడి లోపల ఒక కోర్ట్ సీనో, లేక ఎఫ్.బీ.ఐ దర్యాప్తు బృందాన్నో ఏర్పాటు చేస్తుంది... పాపం ఎప్పుడూ ముద్దాయి వీడే... ఏంటో‌ వాడి మైండు వాడికి క్లాసు పీకినప్పుడల్లా, వాడిని చూడగానే, చీకేసిన తాటి టెంకెకి రంగురాళ్ళద్దినట్టుండే జుట్టూ, ఫేసూతో పాటు అవతారమంతా, పెళ్ళైపోయి పెళ్ళామెప్పుడుదిలేస్తాదా అని ఎదురు చూసే మగడిలా తయారవుతుంది.. ఇమ్యూనిటీ పూర్తిగా లేని బబుల్ బేబీ సిండ్రోం‌ ఉండేవాడు కూడా వీడిలాగా దీనంగా మొహం పెట్టడేమో... వీడి ఉత్సాహం ఏంటో తెలీదు కానీ, ఒక రోజు ఎవరో ఒక కొత్తగా పెళ్ళైన ఆసామిని అడిగాడంట, ఎలా ఉందండీ మీ వైవాహిక జీవితం? అని, ఆయన దానేకోమో బహు బేషుగ్గా ఉందోయ్ అంటే, వీడికి డౌటొచ్చీ మీరు నిజంగానే పెళ్ళి చేసుకున్నారా?? అని అడిగేశాడంట. తర్వాతేమైందీ అనే కదా మీ ప్రశ్న, ఏముంటుందీ, వాడు వీడిని హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఒకటి పీకాడు... ఇదేనేమో కూలిచ్చి కొట్టించుకోటం అంటే... నిజంగా ఇలాంటి అమాయకపు లేదా మొండి స్నేహరత్నాల్ని చూశాక అనిపిస్తుంది... వాళ్ళ సాంప్రదాయాల్ని రక్షించట్లేదని పెద్దవాళ్ళ సణుగుళ్ళూ, ఆధునిక సమాజానికి తగినట్లు ఉండనివ్వట్లేదని చిన్నవాళ్ళ గొణుగుళ్ళు... ఇవి కాకుండా ఎమోషనల్‌గా ఏమున్నాయి మన మానవ సమాజంలో అని..... 
    హా రీడరూ నీ ఎమోషన్ నాకు అర్దమైంది, పట్టెడన్నాన్ని తడిమి చూస్తే పుట్టెడు బియ్యం ఉడికినట్టా, దానిని కలుపని తెడ్డుకున్న అడ్డేదో‌ తెలిసా నీకు అంటారు కదా... ఏం‌ చేస్తామండీ, జీవమనే ఉచ్చు చిచ్చు నీ పుచ్చుని పట్టి లాగు విధంబులనంతముల్ అన్నట్లుగా, కళ్ళకి గంతలు కట్టుకుని జీవితమనే ఏనుగుని వెతుకుతూ ఉండే సమాజమంతా జీవితాన్ని పలువిధాలుగా వివరిస్తుంటే, గంతలు తీసి దూరం నుండి చూస్తున్న నాకు వాళ్ళలాంటోళ్ళందరినీ చూసి నవ్వొస్తుంది మరి.... నాకు తెలిసిన వాళ్ళలో ఆ ఏనుగంటే ఇష్టం లేని వాళ్ళని కూడా దాన్ని కొలవటానికి తీసుకుపోతుంటే జాలి వేస్తుంది కూడానూ....

అర్ధం లేని చిత్రాలలా... :)

Thursday, August 4, 2011

తొక్కలో లైఫ్...

గాలి బాగా వీచిందని, నేల విడిచి సాము చెయ్యటానికి నువ్వేమైనా కాగితమ్ముక్కనుకున్నావా... భాద్యత గల సగటు మనిషివి, అలా ఉరకలేస్తావేం పెట్రేగి పోటెత్తుతున్న గంగానదిలాగాఅని వారించాడు. భాద్యతలంటే అవేమైనా లంకెల బిందెలా, బరువున్నా నెత్తిన వేసుకుని మొయ్యటానికీ, మూసుకుని నీ పనేదో‌ చూసుకో లేకపోతే మూతి పల్లు రాలుతాయ్...  పాపం లేని పెద్దరికాన్ని మీదేసుకున్నాడేమో అని తనలో‌ తానే ఫీలైనట్లున్నాడు, ఏం‌ మాట్లాడకుండానేవెళ్ళిపోయాడు నెమ్మదిగా బుద్ది చెప్పతలచిన మనిషి... జీవితం మీద ఆశ అనే జబ్బు పట్టుకున్న మనిషిలా కనిపించాడు తను.. ఆలోచనల్లో ఉన్న రెండో మనిషిని ఎలా తిట్టేసినా పర్వాలేదు, కానీ నిజ జీవితంలో ఎవరినైనా అలా తిడితే, పాపం ఎంత హర్టవుతారో ఏమో... అందుకేనేమో వీలైనంతగా సమాజానికి దూరంగా దాక్కుంటున్నాడు ఆ తిట్టేసిన మనిషి, కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే చందంలో... సంఘజీవి అంటే సంఘంతో కలిసి జీవించేవాడని అర్ధం కానీ, ఆ సంఘం పెట్టే షరతులన్నీ ఒప్పుకుని బ్రతికేవాడు సంఘజీవి ఎలా ఔతాడు?, ఇలా వాడి మనోబావాలు కోకొల్లలు... అన్ని భావాల్లోనూ జీవితమనే పదం మీద వాడు ఇంటూ గుర్తు వేస్తాడే కానీ ప్లస్ గుర్తు వెయ్యడు.. వాడిని పాపం ప్రతివాళ్ళూ కెలుకుతూనే ఉంటారు, దానికి ఉసూరుమంటూ... 'ఐనా సమాజాన్ని మనం అర్ధం చేసుకోవాల్సిందే తప్ప ఆ పిచ్చి కుక్క మనల్నెందుకు అర్ధం చేస్కుంటుంది లే' అనుకుంటాడు... తనకి అసలు పెద్దోళ్ళంటేనే పడదు, పెద్దరికాన్ని ప్రదర్శించే ప్రతి జీవీ తిట్టటానికే పుట్టాడనుకుంటాడేమో... వాళ్ళ మాటల్లో వినే ఆ నాలుగైదు వాక్యాలు కూడా ఎప్పుడూ పెద్దగా మారవు, "నువ్వు గాలి పీల్చినప్పుడు లేని బాధ, మీ అయ్య నిన్ను కడుపు నిండా మేపుతున్నప్పుడు లేని బాధ, ఈ సమాజం కట్టిన డబ్బులతో కట్టిన రోడ్లపై నువ్వు నడుస్తున్నప్పుడు లేని బాధ, నువ్వు విచ్చలవిడిగా బేవార్సిగా చిందులేస్తూ ఆడుకుంటున్నప్పుడు లేని బాధ..... బాధ్యతలు నీ చేతికొచ్చేసరికి పొడుచుకొచ్చిందా..." అంటూ "రుణం తీర్చు తరుణం వస్తే, తప్పించుకుపోతున్నావా, తెప్ప తగులబెట్టేస్తున్నావా" లాంటి పాటల్ని వినిపించేస్తున్నారు పాపం వాడికి... పోనీ వీడు తగ్గుతాడా వాళ్ళతో ఏకీభవిస్తాడా అంటే, వీడి సమాధానం ఇలా ఉంటుంది, "ఔను నేను బేవార్సే, నేను భాద్యతల్లేని సోమరిపోతునే, గాలికి నువ్వేమైనా డబ్బులు కడుతున్నావా?? కడితే కట్టేవ్ మూసుకుని నువ్వు పీల్చుకో... నన్ను కన్నందుకు పెనాల్టీగా మా అయ్య నన్ను పోషిస్తున్నాడు, ఆయన మంచి మనసుతోనే పోషించినా, మీలాంటి వరస్టు ఫెలోస్ అంతా కలిసి ఆ అయ్యల జాబితాల్లో అందరినీ వాళ్ళ కొడుకుల్ని ఎదవల క్రింద ట్రీట్ చేసేలా చేస్తారు, నువ్వు చెప్పేటట్లు జీతమొస్తేనే అది జాబ్ ఔతుందా, నీలాంటి పెద్ద డాష్ డ్యాష్ గాళ్ళంతా పొగిడితేనే పిల్లల్ని కన్న నాన్నలందరికీ పుత్రోత్సాహం రావాలా, ముందు సుమతీ శతకం రాసినోడ్ని తన్నాలి పట్టుకుని, అందరూ ఇచ్చిన డబ్బుల్తో వేసిన రోడ్లో యాక్సిడెంటైనోడికి ఒకడికి కనీసం రూపాయి సాయం చెయ్యలేదు నీలాంటోళ్ళు నిండి ఉన్న బోడి సమాజం, తొక్కలో సమాజం... మీలాంటి చాదస్తపు ఎదవలుండే జన సమూహాన్ని కూడా సమాజమంటారా, నచ్చని రోమన్ ఆచారాలతో జీవితకాలం రోమ్‌ నగరంలో  రోమన్‌లాగా బ్రతికే కంటే మెసపటోనియాలో ఇసుకని పిండి వచ్చే నీటితో  ఆ ఎడారి నేలలో బ్రతికేయటం మేలు వీలైనంత వేరం సమాజ శృంఖలాల నుండి తప్పించుకుని స్వేచ్ఛగా పోవచ్చు... నాకు చెప్పటం నీ భాద్యతని నువ్వు భావిస్తే, అది నాకు అక్కరలేదు... నన్ను ఇలానే వదిలెయ్..."
ఇది వీడి వరస..

కానీ మూసపోతల సమాజ పోకడలు వీడిని వదుల్తాయా.... ఏమో??? , గాలి వీస్తే కాగితం ముక్క ఎగిరిపోతుంది, కానీ పేపర్ వెయిట్‌తో సహా ఎగరటం దానికి సాధ్యం కాదు.... సమాజపు కట్టుబాట్లనే ఆ పేపర్ వెయిట్లున్నా ఆ కాగితం ఎగరాలంటే ఏ టోర్నెడోలు రావాలో, ఎలాంటి టోర్పెడోల సాయం కావాలో... జీవితమంటేనే‌ విసిగి వేసారిన ఆ మనసుకి ఇవన్నీ ఒక పట్టాన పడతాయో లేవో... ఆనందం, సంతోషం లాంటివాటి కోసం ఎన్నెన్నో చెయ్యాల్సొస్తుందని వాటిని కూడా విస్మరించేస్తున్నాడు... వాడికీ వాడి దగ్గరున్న బెంచీకీ తేడా ఏమీ లేదని వాడిని చూసి వెటకారంగా నవ్వుకునే వాళ్ళకేసి చూసి, బెంచీతోనే మాట్లాడుతూ ఆ జీవిత రోగంతో బాధ పడుతున్న మనుషులకీ, దూరంగా ఎక్కడో కొండల్లో దావానలంలో చిక్కుకుపోయిన ముళ్ళ తుప్పలకీ ఏమీ తేడా లేదని నవ్వుకుంటున్నాడు.... ఇది చదివిన మీరు ఎవరిని సమర్ధిస్తారో నాకు తెలీదు, నా అభిప్రాయాన్ని మాత్రం అడగద్దు...

Monday, July 11, 2011

రానీకోయ్...

ఆ మార్పు రానీకోయ్ రానీకోయ్, తెచ్చి నీలో మనిషితనం పోనీకోయ్..


Sunday, June 26, 2011

సోది... మళ్ళీ...


నిజం, ఆ సిట్యుయేషన్ చాలా నిజం... వాడు ఆడుతున్నంత వరకూ, ఫెదరరైనా, నాధల్ ఐనా... చేతాకాని వాళ్ళు అనిపించేలా ఉంటుంది... నీ కోర్టులో బాల్ పడితే... ఔను అప్పుడు తెలుస్తుంది..... ఎలా ఆలోచించాలో, ఏంటో... పరిస్థితుల్ని ఎదుర్కోవటం ప్రతి ఒక్కరికీ అలవాటైన విషయం కాదు... గాలి వీచని దుర్గంద భూయిష్ట సంద్రం రోజూ కలలోకొచ్చేవాడికి... సుగంధ శోభిత గగన సదృశం నుండి నొప్పి తెలియని మెత్తని నేల మీద పడేస్తే... అది కూడా తట్టుకోలేడేమో... కాలం వేసే ఆ గాళానికి చిక్కని ఆ మనసేదో... అలాంటిదసలుంటుందా?... నీ సైజు పెరుగుతున్నావని సంబర పడకురా ఎదిగిన నీ వయసు పెట్టే పాట్లు నీకేం‌ తెలుసు అన్నాడంట ఒక పెద్దాయన... కలలు నేలమీద ఉండవు, నేల మీదుండేది కల కాదు, మరి జీవితం నచ్చని వాడు ఏం చేయాలి, ఎప్పుడు చూసినా ఆ నిజం చిరాకు పెట్టే జీవితం ఎందుకు ఎదొర్కుంటున్నాడో, దానికి అర్దమే లేని వాడు ఏం‌ చెయ్యాలి?? భావగర్భితమైన తన ఆక్రోశాన్నంతా వెదజల్లాలా? ఏమో?? ఏం‌ చెయ్యాలో...

Sunday, May 29, 2011

వీడి కంటే ఎయిడ్సే నయం..

మనం అప్పుడప్పుడూ ఫ్రెండ్సుని కలవటానికని వాళ్ళ ఇంటికి వెళుతుంటాం కదండీ అలానే, మా ఫ్రెండొకడింటికి వెళ్ళానన్నమాట, చాలా రోజులకి సొంతూరు వెళ్ళి అక్కడి ఫ్రెండ్స్ ని కలవటం చాలా తృప్తినిస్తుంది కదండీ, వాళ్ళ నాన్నగారితో కూడా పరిచయం ఉండేసరికీ, లోపలికి వెళ్ళగానే ఎదురు పడి కుశల ప్రశ్నలు వేసే ఆయనతోనే సంభాషించాల్సి వచ్చింది. "ఏంట్రా అబ్బాయ్! ఎప్పుడు రాక ఊళ్ళోకి, నువ్వు బాగా చదువుకుంటావట కదా", అని ఆయనడిగాక సమాధానమేదో చెప్పి మా ఫ్రెండు గురించి అడిగే సరికి, "నువ్వు ఆ గాడిద కొడుకు గురించి వచ్చావా??", అన్నాడు, మనకి.. సారీ నాకు నోటి దురద ఎక్కువేమో "ఆహా లేదంకుల్ మీ అబ్బాయినే కలుద్దామని వచ్చాను", అని చెప్పే సరికి టంగ్ కర్చుకొని మొహం ముడుచుకోటం ఆయన వంతయ్యింది. ఎదవ ఎక్కడున్నాడో‌ ఏంటో, భోంచేసి బయటికెల్తే మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు, ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కలవదు. బ్యాలెన్సైపోతే ఇన్ కమింగు కూడా రాదంటాడ్రా వాడూ, అదేంటంటే వాడు బేవార్సుగా రోమింగులోనూ వాడి సిమ్‌ కార్డేమో ఫోన్ లోనూ ఉంటాయి కదా అందుకే రోమింగులో ఉన్నప్పుడు నిల్ బ్యాలెన్స్ ఐతే ఇన్ కమింగ్ కూడా రాదనీ , అదెవరో వాడి పాత గర్లు ఫ్రెండంట, వాడి ఫోన్ అందక నాలుగు సార్లు ఆమె ఇంటికొస్తే నాలుగో సారి పొరపాటున దొరికిపోయీ ఆమెకీ విషయం చెప్పి కన్విన్స్ చేసేశాడు, ఎదవ తెలివైనోడే అనుకో (ఆశ్చర్యం నా వంతైందిక్కడ), గర్లు ఫ్రెండు ఫోనుకి దొరకనోడు నాకెలా దొరుకుతాడురా ఆ అడ్డగాడిద".
    ఈయన పరిస్థితి ఏదో తేడాగా ఉందనిపించి, "ఏంటి అంకుల్ అసలేమయ్యింది వాడిని అలా తిడుతున్నారు", అని అనడిగాను. ఈ తరం కుర్రాళ్ళకి అసలు పేరెంట్సు ఫీలింగ్సేమీ వంటబట్టవారా వాడు ఒక్క మాటా వినడే, కనీసం వినిపించుకోడే. ఐనా నాకో విషయం అర్దం కాదూ అక్రమ సంభందాలూ, అనవసర సంభందాల వలన ఎయిడ్సొస్తుందని చెబుతుంటారు కదా, నాకేంట్రా సక్రమ సంభందంలోనే అంతకంటే డేంజరెస్ ఫెల్లో వీడు తగలడ్డాడూ. "అంకుల్ మీరు వాడ్ని మరీ ఇంత ధారుణంగా తిడుతున్నారేంటి అంకుల్, అసలేమైంది అంకుల్", అన్నాను. ఆయన వింటే కదా ఊహూ! ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు,"మొన్నటికి మొన్న వచ్చి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా డాడీ, అందుకే ఆ మొక్కలు పీకే పని కోసం వెళతానన్నాడు, ఆ ఉడతలు పట్టే నా---గాడు". అవేం మొక్కలని ఆయన్ని అడిగితే ఏవో మెడిసినల్ వేల్యూస్ ఉన్న మొక్కలంట అని చెప్పీ మళ్ళీ స్టార్ట్ చేశారాయన,"అసలు ఆ సినిమాకి 3ఇడియట్సు అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా, మొదటోడు బేవార్స్ వాడికి తల్లీ తండ్రీ ఇంకా భందువులు వీరెవరూ అక్కర్లేదు, వాడేది కావాలంటే అది చెయ్యొచ్చనుకుంటాడు, తెలివితేటలుంటే చాలా సొసైటీలో బతకడా వాడూ, పోనీ వాడు ఊరికే ఉన్నాడా పోయి పోయి మిగిలిన ఇద్దరినీ కెలికి మరీ ఏది నచ్చితే అదే చెయ్యమని నూరి పోశాడు . ఏటనుకుంటున్నాడ్రా వాడు నేను ఇలాగే ఉంటానూ అవసరమైతే బిల్డింగుల మీది నుండి దూకుతాను అంటే ఉద్యోగాలు ఏ కంపెనీ ఇస్తుంది రా (ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు), ఇంకొకడున్నాడు.. పోనీలే లేక లేక పుట్టాడని వాళ్ళయ్య వాడి కోసం మద్య తరగతి వాడయ్యుండీ కూడా ఇంజినీరింగ్ చదువుకోమంటే, ఊహూ నేను కుక్కలకీ,కోతులకీ ఫోటోలు తీస్తానంటాడు.. సినిమాలో చూపించనంత మాత్రాన వాడు తీసే ఫోటోలకి ఉద్యోగమెవడిచ్చేస్తాడురా, కంప్యూటర్ చదువులకున్న డిమాండు వాటికెక్కడుందీ, అందులో ఫెయిలైతే పెళ్ళిల్లకి ఫోటోలు తియ్యటానికి కూడా పనికిరాడు వాడు, ఒక వేళ పిలిచినా అక్కడ తిరిగే పిల్లినో, కుక్కనో ఫోటోలు తీస్తాడు". హమ్మ 3ఇడియట్సు మూవీ ఈయనికిలా అర్ధమయ్యిందా అనుకున్నాను, ఇంతకీ నీ ఒపీనియనేంటీ ఆ సినిమా పైన అని ఆయన అడిగే సరికీ చూద్దామనుకునే సరికి టికెట్లు దొరకలేదంకుల్, తర్వాత టైం దొరక్క చూడలేదని చెప్పాల్సొచ్చింది, ఆయన నన్నెక్కడ ఇరికిస్తాడో‌అని చెప్పి."చూశావా నీకు టైం దొరకదు, వాడైతే టైముకే దొరకడు", హిహిహిహిహిహిహిహ్(ఇది బస్ తప్పిపోయినలాంటి నా వెకిలి నవ్వు) అని నవ్వి, ఆయనకి సినిమా నచ్చిందా లేదా అని అడిగాను, ఆయనకి నచ్చిందని చెప్పగానే,"అదేంటి అంకుల్ చివరికి ఆ ముగ్గిర్నీ ఏదో ఆదర్శమూర్తుల్లా చూపించరు కదా మీకెలా నచ్చింది", అన్నాను, నీకెలా తెలుసు అని అడిగిన ఆయన ప్రశ్నకి తడుముకోకుండా, నాకున్న ఒక ఉత్సాహం  అప్పుకోలేని ఫ్రెండు ఒకడు  స్టోరీ చెప్పాడని సర్ది చెప్పేశాను. దానికాయన,"కమర్షియల్ యాంగిల్లో డబ్బుల కోసం కథని అలా డైవర్టు చేసినా, వాళ్ళవి వెధావాలోచనలనే  విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ముగ్గురు వెధవలు టైటిల్ని అలానే ఉంచారు", అన్నాడు, ఓరి  వీడి ఆప్టిమిజం తగలెయ్యా అనుకున్నాను నాలో నేను. మరి  మేం మాకు నచ్చింది చేస్తే ఏంటి ప్రోబ్లం అంకుల్, అందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న డెవలప్మెంటు ఉండేదా అని అడిగితే, అదంతా మాలాంటి పెద్దవాళ్ళు చేస్తే వచ్చిందిరా, కుర్ర కుంకలు మీకేం తెలుసని మీదికొచ్చాడు, అంటే పుట్టుకతోనే ఇలా ముసలివాడిగా పుట్టారా అని అడిగేసరికి మళ్ళీ నాలుక్కర్చుకున్నాడాయాన... "మీలాంటి పెద్దోల్ల వలనే ప్రపంచ యుధ్ధాలూ వచ్చాయ్, ఎయిడ్సులాంటి జబ్బులూ పెరిగాయి", అనే సరికి మండినట్టుంది ఆయనకి, ఏంట్రా పెద్దోల్లకే ఎదురు చెప్తావా ఏదో మంచోడివని నిన్నేమీ అనట్లేదు అని చెప్పి లుంగీ మడిచి, ముక్కు ఎగబీలుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడాయన(కోపంతో).
    హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటికొచ్చి నడుస్తుంటే, మా ఫ్రెండుగాడు కనిపించాడు.. కనిపించటమే తడువుగా వాడితో,"ఒరే ఎదవా స్టీల్‌ప్లాంటుకెళ్ళి  బ్లాస్ట్ ఫర్నేసులో దుమికినట్లు, నిండు ట్రాఫిక్ లో ఇరుక్కుని  ఎటు పోవాలో తెలియని బాతులాగా, ఇంటర్వ్యూకి ఇన్ షర్టు చేసుకుని వెళుతూ బురదగుమ్ములో పడినట్టూ... ఇంకా ఎలా ఎలాగో ఐపోయింది నీ గురించి మీ ఇంటికెళ్ళిన నా పరిస్థితి. నువ్వు సినిమాలు చూస్తే చూశావ్, ఇక నుండి మీ ఇంటికి వచ్చే ముందు నీకు ఈ మెయిల్ చేస్తా, దానికైనా రిప్లై ఇవ్వు , నువ్వు ఉన్నావో లేవో రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ లేటెస్టుగా నువ్వే సినిమా చూశావో చెప్పి పుణ్యం కట్టుకోరా.. నా టైం బాగుండి నువ్వేదో మంచి సినిమా చూశావ్, ఏ రక్త చరిత్రలాంటి సినిమానో చూసి ఉన్నట్లైతే నన్ను నలుగురు కలిసి తీసుకెళ్ళాల్సొచ్చేది, అని వాపోయి అక్కడినుండి ఉడాయించాను. అసలు విషయమేంటంటే వాళ్ళింట్లో అందరు తండ్రులూ వాళ్ళ కొడుకులు కలెకర్లవ్వాలని కల కనేవారంట, "అతి""కష్ట"పడి  చదివి  వాళ్ళంతా గుమాస్తా దగ్గర్నుండీ బిల్లు కలెక్టరు వరకూ రీచ్ అయ్యారు, వీడికి రీసెర్చి ఇష్టమనీ అందులోకి దూరేస్తే, ఆయన నాకీ సినిమా కథ చెప్పాడు.
   

Sunday, May 22, 2011

ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్‌కి ఎప్పుడూ కథలు చెప్పకూడదు..

"సమయం పది గంటలు కావస్తోంది, అప్పటికి ఖచ్చితంగా అరవై నిమిషాల వ్యవది ముందే ఆ రోడ్డుకి రెండు వరుసల అవతల ఉన్న స్కూల్ బెల్ గణగణమంటూ మ్రోగింది. అప్పుడే పదో అంతస్థులో అద్దాల కిటికీని కీచు మంటూ తెరచి తన కారు ముందుకు దుమికాడు హీరో...", నాకు ఇలాంటి కథలంటే ఇష్టం అని చెప్పాను వాడితో. ఏరా వీటిని థ్రిల్లర్స్ అంటారు, ఒక్క ముక్క చెప్పటానికి అంత స్టోరీ అవసరమా రా, అని బేలగా వాపోయాడు మా ఫ్రెండు నా వివరణాత్మకమైన ఇంటరెస్టు విని... కథ బాగుంది కదా కంటిన్యూ చేద్దామా అని అడిగాను వాడిని. "నువ్వొకడివిరా నాన్‌వెజ్ ఐటమ్సులో మనిషి బ్రెయిన్ తప్ప వేరొకటి రుచించదేం నీకూ", అన్నాడు.. తప్పించుకు పారిపోటానికి కూడా కుదరని విదంగా ఇద్దరం వెహికల్‌లో ఉన్నామాయే... ప్రపంచంలో జరుగుతున్న సోది కబుర్లు తప్పించి తనకి వేరే విషయాలు ఏవీ ఇష్టపడవాయే. "పెనం మీద కూర్చుని సోఫాసెట్లాగా ఫీలవ్వాలంటే కుదురుతుందా, కానీ మహాశయా తగలడండి తమ స్టోరీని, అన్నాడు". కథ మళ్ళీ మొదలైంది...
హీరో నేల మీదకి దూకగానే విలన్ గ్యాంగ్ వాడిని వల వేసి మరీ పట్టుకుంది... కానీ విషయమేంటంటే, వాళ్ళు పట్టుకుంది హీరోని కాదు, పదో అంతస్తు పిట్టగోడ మీద అంతకు ముందు రోజు హీరో తినేసి పడేసిన అరటి తొక్క మీద కాలేసి జారిన కమెడియన్ని వాళ్ళు పట్టుకున్నారు. "ఒరేయ్ నీ..." (ఈ పిలుపు కథలో బాగం కాదు, మా ఫ్రెండు పిలిచాడు), "ఏంట్రా", అన్నాను.. "మొదటి నుండీ హీరోయే వస్తున్నాడన్నావ్ కదరా, ఐనా ఎవడైనా కంపేరిజన్ కోసం పది గంటలకి ఆఫీసు ఓపెన్ చేస్తున్నారనో లేకపోతే షాప్ తెరుస్తున్నారనో చెబుతారు, నువ్వేంట్రా గంట ముందు ఎక్కడో ఉన్న స్కూల్ బెల్ మ్రోగిందని చెబుతున్నావ్" అన్నాడు వాడు. "మరి హీరో రాకపోతే, వచ్చేది కమెడియన్ ఐతే ఆ విషయం ముందే చెప్పాలి కదరా పాఠకులకీ లేదా ప్రేక్షకులకీ?" అని ప్రశ్నాస్త్రాన్ని నా మీదకి సంధించాడు", వాడికి సమాధానంగా, "నీలాంటోడే రామాయణం అని హెడ్డింగు చెబితే ద్రౌపది ఎక్కడ్నుంచొచ్చిందీ అన్నాడంట, పూర్తిగా వినరా గాడిదా", అన్నాను.. పాపం ఇది చదువుతున్న మీలాగే వాడికి కూడా బ్రెయిన్ అప్పటికే బొప్పి కట్టినట్టుంది, దిగాలు పడి, కళ కోల్పోయిన మొహంతో, "సర్లే, కంటిన్యూ..", అన్నాడు. నేను మళ్ళీ ప్రారంభించాను,"పట్టుబడిన కమెడియన్ని రక్షించటానికి హీరో ఒక పథకం వేయాలనుకున్నాడు.., హీరోకి కౌబాయ్ సినిమాలంటే ఇష్టం, అందుకే వాడి దగ్గర ఉన్న థర్డ్ హ్యాండు, అద్దం పగిలి, బఠానీల వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్న బెంజ్ కారు వదిలేసి గుర్రమెక్కి బయలుదేరాడు...", ఇంతలో మా ఫ్రెండు కండిషనేంటా అని ఒకసారి చూశా, పాపం మొహమాటస్తుడేమో, నా కథా హింస నుండి వాడికి సాయం చెయ్యమని వాడికి తెలిసిన దేవుళ్ళ పేర్లన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా బిక్క మొహం వేశాడు, ఇంకా కొద్దిసేపు నేను కంటిన్యూ చేస్తే ముందు  ఇలా, అటు తర్వాత  ఇలా ఐపోతాడేమో అని కథ ముగించేద్దామనే ఆలోచనతో, "అండ్ దెన్ దే లివ్డ్ హ్యాపీలీ టుగెదర్ ఫరెవర్" అని చెప్పేశాను..
   మూర్చపోటానికి సిధ్ధంగా ఉన్నవాడు కాస్తా, ఒక్కసారి కోపంగా పైకి లేస్తూ.... "ఎవర్రా హ్యాపీ బ్రతికారు? కమెడియనూ, విలన్ గ్యాంగా లేక గుర్రమూ,హీరోనా... స్కూలు బెల్లు బంట్రోతూ,వాళ్ళావిడానా లేక బొక్కి బెంజి కారూ, బఠాణీల వాడూనా..., నామానాన నేను అద్దం కదలని విండో సీట్లో కూర్చుని ఎప్పుడు ఊరొస్తుందా అని ఎదురు చూస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటే, కథ అని చావగొట్టావ్.. నీ--- ---", అని తిట్టాడు. "సారీరా నేను కథ చెబుతూ ఉంటే నువ్విలాక్లౌడ్ నైన్లో విహరిస్తూ వింటావనుకున్నారా, కానీ నువ్విలాఫీలౌతావనుకోలేదురా, ఐనా నువ్వు చిరాగ్గా ఉన్నావని, కథ అలా అర్ధాంతరంగా ఆపేశాను,  నిజానికి నేను హ్యాపీ ఫరెవర్‌గా ఉంటారని చెప్పింది కమెడియన్,హీరో ఇంకా విలన్, హీరోయిన్ పెయిర్స్ గురించి", అన్నాను. ఆ ది ఎండ్ స్టోరీ విని వాడుఇంత పని చెయ్యటానికి పూనుకున్నాడు, నేను తప్పించుకోవాలి కదా అందుకేఇలా మెరుపు వేగంతో పారిపోయాను, వేరే సీట్లోకి... కానీ వాడంటే కచ్చ ఉన్న మిగిలిన ఫ్రెండ్సంతా ఇలా రకరకాలుగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు..
ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్ కి కథ చెప్పకూడదు అని నేను మాత్రం డిసైడైపోయా....