నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Tuesday, September 28, 2010

నా (అ)ధర్మ సందేహా(శా)లు...

  1. కోరికలు లేని మనిషే చివరికి, దైవత్వాన్ని సంతరించుకోగలడని పురాణపురుషులందరూ చెబుతారు కదా, మరి దేవతలు అమరత్వం కోసం, క్షీరసాగర మధనం, తరువాయి బాగంలో అమృత సేవనం ఎందుకు చేసినట్టూ... దేవతలకి కోరికలుండొచ్చా??, 
  2. అమృతం తాగిన దైవ స్వరూపుడే అమరత్వాన్ని సంతరించుకోగలిగితే, మరి, వానరుడై, అమృతపానం చేయని ఆంజనేయుడూ, నరులైనట్టి పరశు రాముడూ, అస్వథ్ధామా ఎలా మృత్యుంజయులయ్యారూ??,
  3. మత గ్రంధాల్లో ఉండే ప్రతి వాక్యానికీ రెండేసి, మూడేసి రకాలుగా వ్యాఖ్యానాలూ, వివరణలూ ఉంటూ... ప్రశ్నించే ప్రతి విషయానికీ మసి పూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నిస్తారు.. ఏం ఆ గ్రంధాలని వ్రాసేవాళ్ళకి తిన్నగా రాయటం రాదా? లేక పైత్యమా?
  4. మన ఇండియన్సు చాలా మందికి వేరే ఏ దేశం ఏదైనా సాధిస్తే.. మా తాతలు ఎప్పుడో‌ నేతులు తాగారని.. వెన్ను చరుచుకునే అలవాటుంది.. డియర్ రీడర్ మీరు అందులో భాగమా, వేరేనా??
  5. మనిషి తనకి తెలివి ఉన్నంత మాత్రాన తనని తాను అన్ని జీవులకంటే సుపీరియర్ అని ఎందుకనుకుంటాడు... తను కూడా చచ్చిపోతాడు, చావంటే భయపడతాడు, చావకుండా ఉండేందుకు అన్ని జీవుల వాటి వాటి విధానాల్లో అవి ప్రయత్నించినట్లే తాను తన దారిలోనే ప్రయత్నిస్తాడు... జీవించటం కూడా, పెంచుతాడు, పెరుగుతాడు, సంపాదిస్తాడు, కంటాడు, ఆటవిక న్యాయంలాగానే దోచుకుంటాడు, పొట్ట ఆకలే కాకుండా చాలా ఆకల్లతో కొట్టుమిట్టాడుకుంటూంటాడు.. మరి ఎందుకు తను సుపీరియర్.. నాలాగా టైప్ చెయ్యటం రాదని, నీలా చదవటం తనకి రాదని ఒక చింపాంజీ ఏమీ ఫీలవ్వదు కదా... మరి ఎందుకు నువ్వూ, నేనూ దానికంటే గొప్ప... ??
  6. ..................

Thursday, September 23, 2010

అదియూ ధిక్కారమాయే.. చీత్కారమాయే...

నా వైఖరికి నేను బాగా అప్పున్న సమయంలో టైప్ చేసిన కవిత ఇది.. తన ఉనికినే ఎప్పుడూ రహస్యంగా ఉంచే దేవుడు కూడా తనకి సహాయం చెయ్యడని తలచిన మనిషి, బహుశా ఇలా భావించే అవకాశం లేకపోలేదు..
 
 

Tuesday, September 21, 2010

కన్నుల పండుగ

నా కన్నుల పండుగవైన నీకోసం అంటూ, తన ప్రేయసికి చెబుతున్న ఈ ప్రియుడు...

 

Sunday, September 19, 2010

చెవిటివాని ముందు శంఖమే...

గరళం నా భోజనమైనంత మాత్రాన అమృతం నాకు విషమంటావా
కష్టం నా బాటైనంత మాత్రాన దుఃఖం నా మిత్రుడే అంటావా
ప్రేయసి నాకు లేనంత మాత్రాన ప్రేమకి నేనర్హుణ్ణేనంటావా
నష్టం నన్నిష్టపడినంత మాత్రాన మరణమే నా శరణమంటావా
నువ్వేమంటావో అనేయ్ నా అంతః శత్రువా,
నీ ప్రతి మాటా నాకు చెవిటివాని ముందు శంఖమే ...

Wednesday, September 15, 2010

సంక్రాంతి :)

ప్రస్తుతం వర్షాల విసురుకి అతివృష్టి భయం పట్టుకుంది జనాలకి, కానీ వాటిని సమయానుగుణంగా సద్వినియోగం చేసుకునేవారికి, వీటి వలన వచ్చే దిగుబడు ఒక సంక్రాంతి కలగా కనపడుతుంది... ఆ ఆలోచనకి స్వప్నదర్పణ చిత్తరువు, నేను మూనిరుడు సంక్రాంతి మీద రాసిన ఈ కవిత. ఓ లుక్కేయండి మరి...


Sunday, September 12, 2010

నా పేరు, యానిమేషన్లో...

ఒక మూడేళ్ళ క్రితం అంటే నేను ఎమ్మెస్సీలో ఉండగా ఈ ఆర్టు గీశాను.. ఈ ఆర్టుని HCUలో F హాస్టల్లో నా రూమ్‌కి నేమ్ బోర్డు లాగా ఒక పది నెలలు కంటే ఎక్కువ కాలమే మెయింటెయిన్ చేశాను.. నాకు బాగా నచ్చటం వలన స్క్యాన్ తీసి యానిమేషన్ బిల్డ్ చేశాను. లవ్ సింబల్ ప్రక్కనే పాములా ఉండే L ఇంకా కన్నులా ఉండే i.. టోటల్‌గా "లవ్లీ" మరలా లవ్ సింబల్‌ని చూస్తే అందులో బ్లూ M, బ్లాక్ O, ఇంకా రెడ్ కలర్ U తో పాటు ప్రక్కనే L, i మొత్తం ఆ బొమ్మని ఇంగ్లీషులో రెండుసార్లు చదివితే.. లవ్లీ మౌళీ(Lovely Mouli) అనేటట్లుగా కనపడుతుంది...

నా పేరు శివుని పేరన్నమాట.. శివునికి ఆభరణాలు నాగుపాము ఇంకా చంద్రుడు... అదీ కాక మూడో కన్ను ఉంటుంది శివునికి బొమ్మలో i మద్యలో ఉన్న కన్ను శివుని త్రినేత్రాన్ని గుర్తుకు తెస్తుంది.. ఈ విధంగా ఇటు ఆంగ్లాన్నీ, అటు పురాణాన్నీ కలిపి చిత్రించానన్నమాట.. మీకు నచ్చిందా? :) 

Saturday, September 11, 2010

పెన్నాన్‌హ్యాండ్ డ్రాయింగ్..

ఏదో ఆలోచిస్తుండగా, ఆ ఆలోచనల్ని బొమ్మలో చూపించాలని ఇలా గీసేశాను, కానీ నా ఆలోచన కంటే, నా బ్లాగ్ పాఠకుల ప్రజ్ఞాశక్తి అద్భుతమని భావించి, ఈ బొమ్మకి అర్దాన్ని మిమ్మల్ని, మీ భావాలతోనే వివరించమని అడుగుతున్నాను... రాస్తారా మరి వ్యాఖ్యల్ని.. :)

 

Friday, September 10, 2010

జఘన లోలకపు గజగామిని...

నీ నడుమే అందం, నడకే నాట్యం అనేటట్టుగా.. ఆమె నడిస్తే, ఆ నడకలో ఉండే అందానికి నా లే-మ్యాన్ ల్యాంగ్వేజీలో నాకు తెలిసిన మూడు నాలుగు రకాల పదాలు, ఏదో చెప్పేయాలని ఇలా ఇలా ఈ కవితలా మీ ముందుకి ఉబికి వచ్చేశాయ్... వాటికీ తెలీదు అంతటి అందాన్ని వర్ణించటానికి, నా హ్యాండీక్యాప్ ల్యాంగ్వేజే కాదూ, మాంచి హ్యాండ్సమ్‌ ల్యాంగ్వేజీ కూడా సరిపోదని.. భాషలో తప్పుల్ని చూడక... భావంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ..

 

Wednesday, September 8, 2010

ఏమీ లేదు...

ప్రేమకీ, కన్నీళ్ళకీ ఉన్న అనుబంధం ఏనాటిదో, ఎన్నాళ్ళదో.... కొన్నిసార్లనిపిస్తుంది.. ఆ రెండూ నిజమైన ప్రేమికులని... ఒకసారి పులుల అంతరించటం గురించి విన్నప్పుడనిపించింది, "నిజమే పులుల్ని కాపాడుకోటానికి కనీసం కొన్ని అవకాశాలు ఉన్నాయ్"... నిజమైన ప్రేమ మాత్రం పుస్తకాల్లోనీ, సినిమాల్లోనే దొరుకుతుంది... 

Tuesday, September 7, 2010

నా మీద నేను తయారు చేసుకున్న కార్టూన్లు

ఆ మద్యన కొన్నాళ్ళ క్రితం, సరదాగా ఏమన్నా చెయ్యాలనిపించి కొన్ని కార్టూన్లని తయారు చేశా... అవి కార్టూన్లు కాబట్టి, సరదాగా నవ్వేస్తారని (నవ్వొస్తే) ఆశిస్తున్నాను..
 
హే టామ్‌ ఆ క్లాంపు నాకోసమా, జెర్రీ కోసమా.. సోరీ, నేను పరిగెట్టలేను కాబట్టి జెర్రీని నీకోసం పట్టుకోలేను, బన్నీని కానీ స్పైక్‌ని కానీ అడుగు... ఐనా వెజిటేరియన్ అలవాటు చేసుకోవచ్చు కదా.. తొక్కలో ఫెల్లో.. 

Monday, September 6, 2010

An ఇన్‌కన్వీనియంట్ ట్రూత్ A small review...

"An Inconvenient Truth" సినిమా, పారామౌంటువాళ్ళు తీశారు, గ్లోబల్ వార్మింగు వార్నింగుని పట్టించుకోని వాళ్ళకి, ఇది నిజంగా చెమటలు పట్టించే మూవీ..??,  ఈ క్రింది లింకులో మీరు ఆ సినిమా మొత్తం చూడొచ్చు... అంతా బాగానే ఉంది కానీ.. సినిమాటిక్ ఉత్కంఠని ఏర్పరచటానికి కొద్ది అతి చేశారని చెప్పొచ్చు...
An Inconvenient truth movie


ఆస్కార్ అవార్డు కూడా లభించిన ఈ సినిమా మీద, విమర్శలు కూడా తక్కువేమీ లేవు... సినిమా రక్తి కట్టాలని, కొన్ని కొన్ని అసంబద్దమైన విషయాలని చొప్పించారని, అలాగే.. ఐస్ కరగటానికీ.. గ్లోబల్ వార్మింగుకీ.. గ్రీన్ హౌస్ గ్యాసెస్‌కీ మద్యనున్న సంబంధాలని వివరించే.. రేఖాపటాలలో శాస్త్రీయత లేదని.. ఇలా పలు రకాల విమర్శలున్నాయ్... ఈ క్రింది లింకులో వీడియో చూస్తే మీకే అర్దం ఔతుంది
Criticism on An Inconvenient truth movie

కానీ ఎన్ని రకాలుగా చూసినా, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుండటమూ అబద్దం కాదు, అలాగే సినిమాలో చూపించినంత వేగంగా కాకపోయినా.. చాలా ఏళ్ళలోపు ఐనా సరే వాటి ఎఫెక్ట్సు.. తప్పవనే చెప్పాలి... అంతెందుకు.. ఇప్పడు వాతావరణంలో ఉన్న మొత్తం క్లోరో ఫ్లోరో కార్బన్సుని వాతావరణంలోకి విడుదలవ్వకుండా మానేసినా ఇప్పటికే ఉన్నవి, ఇంకో ఏభై సంవత్సరాలు ఉండొచ్చని సమాచారం.. వాతావరణం పరిస్థితి చూడబోతే... మన తర్వాతి, తర్వాతి తరం పిల్లలందరూ స్పేస్ ట్రావెలింగ్ సూట్సులాంటివాటితో సహజంగా పుట్టేటట్టుగా జెనెటిక్ ఇంజినీరింగు చెయ్యాల్సిన పని మా బయాలజిస్టుల మీద పడేట్టుంది.... మనమొకటి తలిస్తే.. జరిగేది ఎలా జరుగుతుందో మనమూ చూద్దాం......

Saturday, September 4, 2010

రెండు చెప్పులూ రేటెంతా..?

చిన్నప్పుడొకసారి చెప్పులు కొందాం అని షాపుకి వెళ్ళి మంచి చెప్పులున్నాయా అని అడిగాను, ఆ ఉన్నాయీ అన్నాడు షాపువాడు, ఐతే రెండు చెప్పులివ్వండి అని అడిగాను, వాడు పగలబడి నవ్వుతూ, మేం జతలు అమ్ముతాం అన్నాడు, నాకు అర్దం కాక క్లియర్‌గా చెబుదామని, కుడి కాలికి ఒకటి ఎడమ కాలికి ఒకటి ఇమ్మని అడిగాను.. వాడు మళ్ళీ పగలబడి నవ్వి నవ్వు ఆపకుండానే చెప్పులిచ్చి డబ్బులు తీసుకున్నాడు.. నేను ఇంటికొచ్చి  విషయం చెప్పి , వాడు నవ్వినందుకు మా అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చేశాను, ఓదార్చాల్సిన మా అమ్మ కూడా ఏంటో, పకపకా నవ్వేసింది.. పోనీ అమ్మ ఒక్కతే నవ్వితే ప్రోబ్లం లేదు.. ఆ విషయం చెప్పిన అందరూ నవ్వుతూ నన్ను వెక్కిరించటం స్టార్ట్ చేశారు.. నేనైతే రెండు రోజులు ఎవరితో మాట్లాడలేదు.. హా!! నేనేం తప్పు మాట్లాడాననీ... చెప్పులు రెండు కాళ్ళకీ ఇవ్వమని వాడిని క్లియర్‌గా అడిగితే తప్పా..??

ఎన్నాళ్ళో...

పోజిటివ్‌గా ఆలోచిస్తే, యుగాలైనా ప్రేమకి చావు లేదనే అనుకోవాలేమో.....

 

Friday, September 3, 2010

నిన్నేమన్నాననిరా కన్నా?

మనందరికీ తల్లిలాంటి భూమిని, కాలుష్యపు కోరల్లో ఇరికించేసున్నాం.. భూమాతకే మనతో మాట్లాడాలనిపిస్తే... బహుశా ఈ క్రింది కవితలో భావం ఆమె మాటలో ప్రస్ఫుటమవ్వచ్చేమో?