ఒక మూడేళ్ళ క్రితం అంటే నేను ఎమ్మెస్సీలో ఉండగా ఈ ఆర్టు గీశాను.. ఈ ఆర్టుని HCUలో F హాస్టల్లో నా రూమ్‌కి నేమ్ బోర్డు లాగా ఒక పది నెలలు కంటే ఎక్కువ కాలమే మెయింటెయిన్ చేశాను.. నాకు బాగా నచ్చటం వలన స్క్యాన్ తీసి యానిమేషన్ బిల్డ్ చేశాను. లవ్ సింబల్ ప్రక్కనే పాములా ఉండే L ఇంకా కన్నులా ఉండే i.. టోటల్‌గా "లవ్లీ" మరలా లవ్ సింబల్‌ని చూస్తే అందులో బ్లూ M, బ్లాక్ O, ఇంకా రెడ్ కలర్ U తో పాటు ప్రక్కనే L, i మొత్తం ఆ బొమ్మని ఇంగ్లీషులో రెండుసార్లు చదివితే.. లవ్లీ మౌళీ(Lovely Mouli) అనేటట్లుగా కనపడుతుంది... నా పేరు శివుని పేరన్నమాట.. శివునికి ఆభరణాలు నాగుపాము ఇంకా చంద్రుడు... అదీ కాక మూడో కన్ను ఉంటుంది శివునికి బొమ్మలో i మద్యలో ఉన్న కన్ను శివుని త్రినేత్రాన్ని గుర్తుకు తెస్తుంది.. ఈ విధంగా ఇటు ఆంగ్లాన్నీ, అటు పురాణాన్నీ కలిపి చిత్రించానన్నమాట.. మీకు నచ్చిందా? :) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, September 12, 2010
నా పేరు, యానిమేషన్లో...
Subscribe to:
Post Comments (Atom)
Chandramouli Malleda గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు
ReplyDeleteహారం
HCU lO ilaaMTi "kattulea" uMTaayaa eamiTi?
ReplyDelete@భాస్కర రామి రెడ్డి:
ReplyDeleteహల్లో భాస్కర రామిరెడ్డి గారూ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు
@agnaata:
హల్లో అజ్ఞాతగారూ "kattulea" అంటే ఏంటో నాకు అర్దం కాలేదండీ.. మరలా చెప్పగలరా..