నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Saturday, November 27, 2010

వెకిలి నవ్వొకటి

............నన్ను నేను మరచానని చెబితే... పంచభూతాలన్నీ నన్ను తమలో కలిపేసేందుకు ఆత్రత చూపించాయ్, వాటివైపు వెళ్ళలేక, అలాగే ఉండలేక సతమతమయ్యే నన్ను చూసి ఓ వెకిలి నవ్వొకటి నవ్వుకున్నాయ్........


Saturday, November 20, 2010

చలనాశక్య పావునైతినే....

విరహగీతం విరసగీతమై
విరిజల్లు జడివానగా మారుతున్నట్లు
వికటాట్టహాసం చేసే వికృత
విధి వంచనలో
చలనాశక్య పావునైతినే..

Tuesday, November 16, 2010

ఎందుక్కాదూ?

చెల్లా చెదురైన భాష సంస్కరణ  వ్యాసునికే సాధ్యం కావచ్చు
జ్ఞానలవ ధుర్విధగ్ధున్ని రంజింపచేయటం భర్తృహరికి సాధ్యం కావచ్చు
ఉపమాలంకారానికే అలంకారం కాగలగటం కాళిదాసుకి సాధ్యం కావచ్చు
ఇన్ని అసాధ్యాలు సుసాధ్యాలైతే మరి ప్రేమలో నా గెలుపెందుకు సాధ్యం కాదూ

Thursday, November 11, 2010

Wall-E బావుంది.. :)

Wall-E సినిమా చూశారా, చాలా బాగుంది. భూమ్మీది వనరులన్నీ పూర్తిగా వాడేయబడి, పచ్చదనం అంతా మాయమైపోయే తరుణంలో, నివాసయోగ్యం కాని ఈ ప్రదేశం నుండి మిగిలి ఉన్న జనాల్నందర్నీ ఒక స్పేష్ షిప్‌లో నింపి అంతరిక్షంలోకి పంపించేస్తారు.. అక్కడి నుండి వాళ్ళ సామాన్య అవసరాలన్నీ రోబోట్లే చూసుకుంటూంటాయ్. భూమ్మీద ఉన్న డెబ్రిస్ అంతటినీ క్లీన్ చేసే భాధ్యత మన వాల్-ఇ అనే రోబోట్ చూసుకుంటుంది.. దాని దైనందిన జీవన విధానంలో ఆ చిన్ని రోబో చేసే పనులన్నీ నవ్వు తెప్పించటంతో పాటు, హృదయాన్ని కదిలించేలా.. బాగుంటాయ్. మొక్కలేమన్నా పెరిగే అనుకూలమైన మార్పు వాతావరణంలో వచ్చిందేమో అని పరీక్షించటానికి వచ్చే ఈవా అనే రోబోతో మన వాల్-ఈ కి లవ్ స్టార్టవుతుంది. భూమ్మీద దొరికిన ఒక్కగానొక్క మొక్కని స్పేష్‌షిప్‌కి తీసుకెళుతుంది ఈవా, దాని కోసం వాల్-ఈ కూడా వెళుతుంది.. ఇలా ఈ సంఘటనలతో భవిష్య-దర్పణాన్ని చూపించటంతో పాటుగా, మనుషులకి ఎలిమెంట్ ఆఫ్ ది హార్టు, వ్యాపారవేత్తలకి కమర్షియల్ ఎలిమెంటు ఐన రొమాన్సు, లవ్ లాంటివాటిని చక్కగా పొందుపరచి రూపొందించిన మంచి యానిమేషన్ మూవి Wall-E.


hey I got something to play

please don't hit my face

Hey Evaa, I got hold of your hand, hmm but you are un-conscious

We're for life Eva

I love you so much evaa

I too love you so much my dear Wall-E

Hey dear see that marvelous beauty, that we couldn't ever find in our virtual screens...

Space dance performance by Wall-E & Eva

Spaceship captain asks computer to define dance, it says,"Dance, where a series of movements involving two partners where speed and rhythm match harmoniously with music"






Sunday, November 7, 2010

ఓh Goడ్...!!

జీవితమెందుకు దేవుడా అని ప్రశ్నించాలంటే మనిషి నెగెటివ్‌గానే ఆలోచించాలా? నిరాశ ఉంటేనే తప్ప మనిషికి మోక్షం గుర్తు రాకూడదా, ఏమో... దేవుడున్నాడా? అంటే వచ్చే ప్రతి సమాధానమూ ప్రశ్నార్ధకంతోనే అంతమౌతుంది హహహ.. ఆశావాదినీ, నిరాశావాదినీ ఇద్దరినీ ఒకేలా చూడగలిగేది ఇద్దరే అనుకుంటా.. ఒకటి ఏమీ తెలియని పసి పిల్లలు, ఇంకొకటి అన్నీ మర్చిపోయిన పిచ్చివాళ్ళు... హహ.. నిజానికి ప్రశ్నల్ని సరిగా సంధించగలిగితే అవి ఫుల్‌స్టాపుల్ని చీల్చి చెండాడి ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి... అవి ఆశకీ, నిరాశకీ... జీవితానికీ, నిర్జీవితానికీ... ఇలాంటి అన్నిటికీ అతీతమైన స్థితికి మనల్ని లాక్కుపోతాయి... ఈ క్రింది కవితలో దేవున్నే నిందిస్తూ సంధించిన పదాలే ఆ స్థితికి నిదర్శనం...



Thursday, November 4, 2010

నిన్ను లతలు పెనవేస్తున్న ఆ తరుణం...

"సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తాన...." అన్నట్లుగా అద్భుతంగా కనిపించిందీ వృక్ష-లతా కౌగిళి ఒకానొక సాయం సంధ్యవేళ... అంత దగ్గిరగా పెనవేసుకుపోయిన ఆ దృశ్యాన్ని తిలకించగలిగే ఏ జీవికైనా ఆనందం అతిశయమై హృదయం స్పందించి తీరుతుంది(హృదయం ఉన్నట్లైతే)... రియలిస్టులకి(అంటే నా దృష్టిలో హృదయం లేనివాళ్ళు అని అర్దం), ఆ తీగకి చెట్టు అనేది ఆధారం మాత్రమే, చెట్టు ఆధారం ఇవ్వలేనిదైతే తీగ దానిని అసరా చేసుకోదు అని అంటారు వాళ్ళు... అనంతమైన ఆనందాన్నిస్తాను ఆస్వాదిస్తావా అని ప్రకృతి అడిగితే, నాకదేమీ అక్కర్లేదు.. బాగా బతికేదీ, బ్రతికించేదీ ఏదైనా ఉంటే నా మొహాన పడేయ్ లేకుంటే మూసుకుని కూర్చో అని ప్రకృతికి కూడా చెప్పేవాళ్ళు ఆ రియలిస్టులు... వాళ్ళకి ప్రేమ కూడా ఒక అవసరం ఆధారంగానే పుడుతుంది... వేసుకునే బట్టలకీ, తినే ఆహారానికీ ఇచ్చినంత ఇంపోర్టెన్సు మాత్రమే దేనికైనా సరే ఇచ్చే ముముక్షువులూ, స్థితప్రజ్ఞులూ వారే... వాళ్ళకి living ఒక passion, feelings  ఒక lesion... వాళ్ళ విషయంలో వాళ్ళని తప్పు పట్టేందుకు మీకు ఒక్క అవకాశం కూడా లభించదు, ప్రపంచమంతా వాళ్ళ తత్వంతోనూ, వాళ్ళతోనూ నిండి ఉంది.. మీకు రియలిస్టులు ఒక వేళ నచ్చితే ప్రేమించానని చెప్పొద్దు, వాళ్ళకది పట్టదు, వాళ్ళది నమ్మరు... నేను పోస్టు చేసిన కవితకీ పైన చెప్పిన సోదికీ సంభందమేంటని అడగద్దు, ఎందుకంటే‌ అడిగినా నేను చెప్పను, ఒక వేళ మీరు ఏదైనా interpret చేసుకుంటే, మిమ్మల్ని రియలిస్టని అనేస్తాను... నాకు తెలిసి నా వరకూ, ప్రపంచంలో అంతకంటే పెద్ద తిట్టు ఇంకొకటి లేదు.... ;)