నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Sunday, May 29, 2011

వీడి కంటే ఎయిడ్సే నయం..

మనం అప్పుడప్పుడూ ఫ్రెండ్సుని కలవటానికని వాళ్ళ ఇంటికి వెళుతుంటాం కదండీ అలానే, మా ఫ్రెండొకడింటికి వెళ్ళానన్నమాట, చాలా రోజులకి సొంతూరు వెళ్ళి అక్కడి ఫ్రెండ్స్ ని కలవటం చాలా తృప్తినిస్తుంది కదండీ, వాళ్ళ నాన్నగారితో కూడా పరిచయం ఉండేసరికీ, లోపలికి వెళ్ళగానే ఎదురు పడి కుశల ప్రశ్నలు వేసే ఆయనతోనే సంభాషించాల్సి వచ్చింది. "ఏంట్రా అబ్బాయ్! ఎప్పుడు రాక ఊళ్ళోకి, నువ్వు బాగా చదువుకుంటావట కదా", అని ఆయనడిగాక సమాధానమేదో చెప్పి మా ఫ్రెండు గురించి అడిగే సరికి, "నువ్వు ఆ గాడిద కొడుకు గురించి వచ్చావా??", అన్నాడు, మనకి.. సారీ నాకు నోటి దురద ఎక్కువేమో "ఆహా లేదంకుల్ మీ అబ్బాయినే కలుద్దామని వచ్చాను", అని చెప్పే సరికి టంగ్ కర్చుకొని మొహం ముడుచుకోటం ఆయన వంతయ్యింది. ఎదవ ఎక్కడున్నాడో‌ ఏంటో, భోంచేసి బయటికెల్తే మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు, ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కలవదు. బ్యాలెన్సైపోతే ఇన్ కమింగు కూడా రాదంటాడ్రా వాడూ, అదేంటంటే వాడు బేవార్సుగా రోమింగులోనూ వాడి సిమ్‌ కార్డేమో ఫోన్ లోనూ ఉంటాయి కదా అందుకే రోమింగులో ఉన్నప్పుడు నిల్ బ్యాలెన్స్ ఐతే ఇన్ కమింగ్ కూడా రాదనీ , అదెవరో వాడి పాత గర్లు ఫ్రెండంట, వాడి ఫోన్ అందక నాలుగు సార్లు ఆమె ఇంటికొస్తే నాలుగో సారి పొరపాటున దొరికిపోయీ ఆమెకీ విషయం చెప్పి కన్విన్స్ చేసేశాడు, ఎదవ తెలివైనోడే అనుకో (ఆశ్చర్యం నా వంతైందిక్కడ), గర్లు ఫ్రెండు ఫోనుకి దొరకనోడు నాకెలా దొరుకుతాడురా ఆ అడ్డగాడిద".
    ఈయన పరిస్థితి ఏదో తేడాగా ఉందనిపించి, "ఏంటి అంకుల్ అసలేమయ్యింది వాడిని అలా తిడుతున్నారు", అని అనడిగాను. ఈ తరం కుర్రాళ్ళకి అసలు పేరెంట్సు ఫీలింగ్సేమీ వంటబట్టవారా వాడు ఒక్క మాటా వినడే, కనీసం వినిపించుకోడే. ఐనా నాకో విషయం అర్దం కాదూ అక్రమ సంభందాలూ, అనవసర సంభందాల వలన ఎయిడ్సొస్తుందని చెబుతుంటారు కదా, నాకేంట్రా సక్రమ సంభందంలోనే అంతకంటే డేంజరెస్ ఫెల్లో వీడు తగలడ్డాడూ. "అంకుల్ మీరు వాడ్ని మరీ ఇంత ధారుణంగా తిడుతున్నారేంటి అంకుల్, అసలేమైంది అంకుల్", అన్నాను. ఆయన వింటే కదా ఊహూ! ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు,"మొన్నటికి మొన్న వచ్చి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా డాడీ, అందుకే ఆ మొక్కలు పీకే పని కోసం వెళతానన్నాడు, ఆ ఉడతలు పట్టే నా---గాడు". అవేం మొక్కలని ఆయన్ని అడిగితే ఏవో మెడిసినల్ వేల్యూస్ ఉన్న మొక్కలంట అని చెప్పీ మళ్ళీ స్టార్ట్ చేశారాయన,"అసలు ఆ సినిమాకి 3ఇడియట్సు అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా, మొదటోడు బేవార్స్ వాడికి తల్లీ తండ్రీ ఇంకా భందువులు వీరెవరూ అక్కర్లేదు, వాడేది కావాలంటే అది చెయ్యొచ్చనుకుంటాడు, తెలివితేటలుంటే చాలా సొసైటీలో బతకడా వాడూ, పోనీ వాడు ఊరికే ఉన్నాడా పోయి పోయి మిగిలిన ఇద్దరినీ కెలికి మరీ ఏది నచ్చితే అదే చెయ్యమని నూరి పోశాడు . ఏటనుకుంటున్నాడ్రా వాడు నేను ఇలాగే ఉంటానూ అవసరమైతే బిల్డింగుల మీది నుండి దూకుతాను అంటే ఉద్యోగాలు ఏ కంపెనీ ఇస్తుంది రా (ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు), ఇంకొకడున్నాడు.. పోనీలే లేక లేక పుట్టాడని వాళ్ళయ్య వాడి కోసం మద్య తరగతి వాడయ్యుండీ కూడా ఇంజినీరింగ్ చదువుకోమంటే, ఊహూ నేను కుక్కలకీ,కోతులకీ ఫోటోలు తీస్తానంటాడు.. సినిమాలో చూపించనంత మాత్రాన వాడు తీసే ఫోటోలకి ఉద్యోగమెవడిచ్చేస్తాడురా, కంప్యూటర్ చదువులకున్న డిమాండు వాటికెక్కడుందీ, అందులో ఫెయిలైతే పెళ్ళిల్లకి ఫోటోలు తియ్యటానికి కూడా పనికిరాడు వాడు, ఒక వేళ పిలిచినా అక్కడ తిరిగే పిల్లినో, కుక్కనో ఫోటోలు తీస్తాడు". హమ్మ 3ఇడియట్సు మూవీ ఈయనికిలా అర్ధమయ్యిందా అనుకున్నాను, ఇంతకీ నీ ఒపీనియనేంటీ ఆ సినిమా పైన అని ఆయన అడిగే సరికీ చూద్దామనుకునే సరికి టికెట్లు దొరకలేదంకుల్, తర్వాత టైం దొరక్క చూడలేదని చెప్పాల్సొచ్చింది, ఆయన నన్నెక్కడ ఇరికిస్తాడో‌అని చెప్పి."చూశావా నీకు టైం దొరకదు, వాడైతే టైముకే దొరకడు", హిహిహిహిహిహిహిహ్(ఇది బస్ తప్పిపోయినలాంటి నా వెకిలి నవ్వు) అని నవ్వి, ఆయనకి సినిమా నచ్చిందా లేదా అని అడిగాను, ఆయనకి నచ్చిందని చెప్పగానే,"అదేంటి అంకుల్ చివరికి ఆ ముగ్గిర్నీ ఏదో ఆదర్శమూర్తుల్లా చూపించరు కదా మీకెలా నచ్చింది", అన్నాను, నీకెలా తెలుసు అని అడిగిన ఆయన ప్రశ్నకి తడుముకోకుండా, నాకున్న ఒక ఉత్సాహం  అప్పుకోలేని ఫ్రెండు ఒకడు  స్టోరీ చెప్పాడని సర్ది చెప్పేశాను. దానికాయన,"కమర్షియల్ యాంగిల్లో డబ్బుల కోసం కథని అలా డైవర్టు చేసినా, వాళ్ళవి వెధావాలోచనలనే  విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ముగ్గురు వెధవలు టైటిల్ని అలానే ఉంచారు", అన్నాడు, ఓరి  వీడి ఆప్టిమిజం తగలెయ్యా అనుకున్నాను నాలో నేను. మరి  మేం మాకు నచ్చింది చేస్తే ఏంటి ప్రోబ్లం అంకుల్, అందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న డెవలప్మెంటు ఉండేదా అని అడిగితే, అదంతా మాలాంటి పెద్దవాళ్ళు చేస్తే వచ్చిందిరా, కుర్ర కుంకలు మీకేం తెలుసని మీదికొచ్చాడు, అంటే పుట్టుకతోనే ఇలా ముసలివాడిగా పుట్టారా అని అడిగేసరికి మళ్ళీ నాలుక్కర్చుకున్నాడాయాన... "మీలాంటి పెద్దోల్ల వలనే ప్రపంచ యుధ్ధాలూ వచ్చాయ్, ఎయిడ్సులాంటి జబ్బులూ పెరిగాయి", అనే సరికి మండినట్టుంది ఆయనకి, ఏంట్రా పెద్దోల్లకే ఎదురు చెప్తావా ఏదో మంచోడివని నిన్నేమీ అనట్లేదు అని చెప్పి లుంగీ మడిచి, ముక్కు ఎగబీలుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడాయన(కోపంతో).
    హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటికొచ్చి నడుస్తుంటే, మా ఫ్రెండుగాడు కనిపించాడు.. కనిపించటమే తడువుగా వాడితో,"ఒరే ఎదవా స్టీల్‌ప్లాంటుకెళ్ళి  బ్లాస్ట్ ఫర్నేసులో దుమికినట్లు, నిండు ట్రాఫిక్ లో ఇరుక్కుని  ఎటు పోవాలో తెలియని బాతులాగా, ఇంటర్వ్యూకి ఇన్ షర్టు చేసుకుని వెళుతూ బురదగుమ్ములో పడినట్టూ... ఇంకా ఎలా ఎలాగో ఐపోయింది నీ గురించి మీ ఇంటికెళ్ళిన నా పరిస్థితి. నువ్వు సినిమాలు చూస్తే చూశావ్, ఇక నుండి మీ ఇంటికి వచ్చే ముందు నీకు ఈ మెయిల్ చేస్తా, దానికైనా రిప్లై ఇవ్వు , నువ్వు ఉన్నావో లేవో రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ లేటెస్టుగా నువ్వే సినిమా చూశావో చెప్పి పుణ్యం కట్టుకోరా.. నా టైం బాగుండి నువ్వేదో మంచి సినిమా చూశావ్, ఏ రక్త చరిత్రలాంటి సినిమానో చూసి ఉన్నట్లైతే నన్ను నలుగురు కలిసి తీసుకెళ్ళాల్సొచ్చేది, అని వాపోయి అక్కడినుండి ఉడాయించాను. అసలు విషయమేంటంటే వాళ్ళింట్లో అందరు తండ్రులూ వాళ్ళ కొడుకులు కలెకర్లవ్వాలని కల కనేవారంట, "అతి""కష్ట"పడి  చదివి  వాళ్ళంతా గుమాస్తా దగ్గర్నుండీ బిల్లు కలెక్టరు వరకూ రీచ్ అయ్యారు, వీడికి రీసెర్చి ఇష్టమనీ అందులోకి దూరేస్తే, ఆయన నాకీ సినిమా కథ చెప్పాడు.
   

Sunday, May 22, 2011

ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్‌కి ఎప్పుడూ కథలు చెప్పకూడదు..

"సమయం పది గంటలు కావస్తోంది, అప్పటికి ఖచ్చితంగా అరవై నిమిషాల వ్యవది ముందే ఆ రోడ్డుకి రెండు వరుసల అవతల ఉన్న స్కూల్ బెల్ గణగణమంటూ మ్రోగింది. అప్పుడే పదో అంతస్థులో అద్దాల కిటికీని కీచు మంటూ తెరచి తన కారు ముందుకు దుమికాడు హీరో...", నాకు ఇలాంటి కథలంటే ఇష్టం అని చెప్పాను వాడితో. ఏరా వీటిని థ్రిల్లర్స్ అంటారు, ఒక్క ముక్క చెప్పటానికి అంత స్టోరీ అవసరమా రా, అని బేలగా వాపోయాడు మా ఫ్రెండు నా వివరణాత్మకమైన ఇంటరెస్టు విని... కథ బాగుంది కదా కంటిన్యూ చేద్దామా అని అడిగాను వాడిని. "నువ్వొకడివిరా నాన్‌వెజ్ ఐటమ్సులో మనిషి బ్రెయిన్ తప్ప వేరొకటి రుచించదేం నీకూ", అన్నాడు.. తప్పించుకు పారిపోటానికి కూడా కుదరని విదంగా ఇద్దరం వెహికల్‌లో ఉన్నామాయే... ప్రపంచంలో జరుగుతున్న సోది కబుర్లు తప్పించి తనకి వేరే విషయాలు ఏవీ ఇష్టపడవాయే. "పెనం మీద కూర్చుని సోఫాసెట్లాగా ఫీలవ్వాలంటే కుదురుతుందా, కానీ మహాశయా తగలడండి తమ స్టోరీని, అన్నాడు". కథ మళ్ళీ మొదలైంది...
హీరో నేల మీదకి దూకగానే విలన్ గ్యాంగ్ వాడిని వల వేసి మరీ పట్టుకుంది... కానీ విషయమేంటంటే, వాళ్ళు పట్టుకుంది హీరోని కాదు, పదో అంతస్తు పిట్టగోడ మీద అంతకు ముందు రోజు హీరో తినేసి పడేసిన అరటి తొక్క మీద కాలేసి జారిన కమెడియన్ని వాళ్ళు పట్టుకున్నారు. "ఒరేయ్ నీ..." (ఈ పిలుపు కథలో బాగం కాదు, మా ఫ్రెండు పిలిచాడు), "ఏంట్రా", అన్నాను.. "మొదటి నుండీ హీరోయే వస్తున్నాడన్నావ్ కదరా, ఐనా ఎవడైనా కంపేరిజన్ కోసం పది గంటలకి ఆఫీసు ఓపెన్ చేస్తున్నారనో లేకపోతే షాప్ తెరుస్తున్నారనో చెబుతారు, నువ్వేంట్రా గంట ముందు ఎక్కడో ఉన్న స్కూల్ బెల్ మ్రోగిందని చెబుతున్నావ్" అన్నాడు వాడు. "మరి హీరో రాకపోతే, వచ్చేది కమెడియన్ ఐతే ఆ విషయం ముందే చెప్పాలి కదరా పాఠకులకీ లేదా ప్రేక్షకులకీ?" అని ప్రశ్నాస్త్రాన్ని నా మీదకి సంధించాడు", వాడికి సమాధానంగా, "నీలాంటోడే రామాయణం అని హెడ్డింగు చెబితే ద్రౌపది ఎక్కడ్నుంచొచ్చిందీ అన్నాడంట, పూర్తిగా వినరా గాడిదా", అన్నాను.. పాపం ఇది చదువుతున్న మీలాగే వాడికి కూడా బ్రెయిన్ అప్పటికే బొప్పి కట్టినట్టుంది, దిగాలు పడి, కళ కోల్పోయిన మొహంతో, "సర్లే, కంటిన్యూ..", అన్నాడు. నేను మళ్ళీ ప్రారంభించాను,"పట్టుబడిన కమెడియన్ని రక్షించటానికి హీరో ఒక పథకం వేయాలనుకున్నాడు.., హీరోకి కౌబాయ్ సినిమాలంటే ఇష్టం, అందుకే వాడి దగ్గర ఉన్న థర్డ్ హ్యాండు, అద్దం పగిలి, బఠానీల వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్న బెంజ్ కారు వదిలేసి గుర్రమెక్కి బయలుదేరాడు...", ఇంతలో మా ఫ్రెండు కండిషనేంటా అని ఒకసారి చూశా, పాపం మొహమాటస్తుడేమో, నా కథా హింస నుండి వాడికి సాయం చెయ్యమని వాడికి తెలిసిన దేవుళ్ళ పేర్లన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా బిక్క మొహం వేశాడు, ఇంకా కొద్దిసేపు నేను కంటిన్యూ చేస్తే ముందు  ఇలా, అటు తర్వాత  ఇలా ఐపోతాడేమో అని కథ ముగించేద్దామనే ఆలోచనతో, "అండ్ దెన్ దే లివ్డ్ హ్యాపీలీ టుగెదర్ ఫరెవర్" అని చెప్పేశాను..
   మూర్చపోటానికి సిధ్ధంగా ఉన్నవాడు కాస్తా, ఒక్కసారి కోపంగా పైకి లేస్తూ.... "ఎవర్రా హ్యాపీ బ్రతికారు? కమెడియనూ, విలన్ గ్యాంగా లేక గుర్రమూ,హీరోనా... స్కూలు బెల్లు బంట్రోతూ,వాళ్ళావిడానా లేక బొక్కి బెంజి కారూ, బఠాణీల వాడూనా..., నామానాన నేను అద్దం కదలని విండో సీట్లో కూర్చుని ఎప్పుడు ఊరొస్తుందా అని ఎదురు చూస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటే, కథ అని చావగొట్టావ్.. నీ--- ---", అని తిట్టాడు. "సారీరా నేను కథ చెబుతూ ఉంటే నువ్విలాక్లౌడ్ నైన్లో విహరిస్తూ వింటావనుకున్నారా, కానీ నువ్విలాఫీలౌతావనుకోలేదురా, ఐనా నువ్వు చిరాగ్గా ఉన్నావని, కథ అలా అర్ధాంతరంగా ఆపేశాను,  నిజానికి నేను హ్యాపీ ఫరెవర్‌గా ఉంటారని చెప్పింది కమెడియన్,హీరో ఇంకా విలన్, హీరోయిన్ పెయిర్స్ గురించి", అన్నాను. ఆ ది ఎండ్ స్టోరీ విని వాడుఇంత పని చెయ్యటానికి పూనుకున్నాడు, నేను తప్పించుకోవాలి కదా అందుకేఇలా మెరుపు వేగంతో పారిపోయాను, వేరే సీట్లోకి... కానీ వాడంటే కచ్చ ఉన్న మిగిలిన ఫ్రెండ్సంతా ఇలా రకరకాలుగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు..
ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్ కి కథ చెప్పకూడదు అని నేను మాత్రం డిసైడైపోయా....

Friday, May 6, 2011

ఆర్ట్ డ్రాయింగ్స్-4


I don't know if you may call them as 3 wonders of the world.... I know someone has sarcastic sense of calling me 8thWonder

You'll find several entities in this... try to be able to unveil them..

మా ఫ్రెండొకడడిగాడు, ఇంటర్నెట్టు, వెబ్‌డిజైన్ ఇలా ఎందుకంటారూ అని, ఇది గీసి చూపెడితే తల గోక్కుంటూ వెళ్ళిపోయాడు... మాటలతో చెప్పాల్సిందనుకుంటా...!! :)

బాగా సీరియస్‌గా ఈ పెపంచకంలో వాళ్ళకంటే ఎవరూ అస్సలు ఎందుకూ పనికిరారు వాళ్ళ వాళ్ళ వర్కులో అని ఎగస్ట్రా సీరియస్‌నెస్ చూపించే పిహెచ్.డి స్టూడెంట్సు మీద ప్రయోగించాలనుకునే కామిక్...

ఎవరండీ ఇక్కడ పెన్సిల్ చెక్కి చెత్త పోసేసిందీ...??

ఈ ఫేస్ చూసి, ఏంటా ఫేసూ నీ మొహంలా ఉంది అనొద్దేం, నేనింతే, నాకిలాగే గియ్యటం వచ్చు... కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాను మరీ...

సూర్యుడూ, భూమీ వానా వానా వల్లప్పా ఆడుకుంటూంటే, వాళ్ళ సరదాలకి మనమంతా ఈ భూమ్మీద చచ్చినట్టు పుట్టాల్సొచ్చిందన్నమాట...that is the GRAVITY of the situation...

చింపిరి జుట్టున్న అందమైన పెదాలు కలిగిన చిన్నది... It seems my fellow crazy boys are crazy about this kind of cra/la-zy girls.... hmmm may be beautiful too...

An un-accomplish-able wish.... తీరని కోరిక...

పక్షి బాగా ఫోజ్ కొడుతుంది కదా... చిన్నప్పుడు తాతగారి ఊళ్ళో కోళ్ళకి  ఆహారం వేసిన రోజులు గుర్తొచ్చి గీసిన బొమ్మ...

He said navvu(the smile) is naalugu(four) types harmful, I said smile is several types great

నువ్వు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళైతే, నా తాబేలు బేషుగ్గా ఎగురుతుంది మరి.... TheMe - tortoise in reality and flying in dreams...

I hate smokers....!! till their persistent good bye to smoking, (even if it is the most beautiful girl in the world)

If ego is your personal problem and divide and live is your principle.... then availability of a separate space for you is a national problem and survival of the fittest would become your sustenance principle..

Sunday, May 1, 2011

అంతర్జాలం....!!

Translation: When I just entered entered into the fuzzy network of internet and observed it, to my astonishment I found myself equivalent to a water molecule in a big ocean, by observing deeply I found that people who're more into it are seemed like aquatic animals who suffer hypoxia as if a fish is taken out of water when they have internet disconnected..... Is it the significance of something called development?