నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Monday, August 30, 2010

నిన్న సాయంత్రం, ఔట్ ఆఫ్ ఇన్ సిలికో... ఎంజాయ్‌డ్ స్మాల్ ట్రెకింగ్ :)

ఈ మద్యన వర్షాలు తెగ పడుతున్నాయి కదా, వాటి దెబ్బకి క్యాంపస్లో చిన్న చిన్న గోతులు కూడా చెఱువుల్లా తయారవుతున్నాయ్, కానీ చాలా అందంగా కనిపిస్తాయ్, నిన్న ఆదివారం కదాని సాయంత్రం అలా అలా చక్కర్లు కొట్టొద్దామని సౌత్ క్యాంపస్ దారిలో ఉన్న చిన్న చెక్ డ్యాం దగ్గరకి వెళ్ళే సరికి అబ్బో ఆ ప్రదేశమంతా ఎంత బాగుందో!!, మీరే చూడండి..

చెక్‌డ్యాం కి వెళ్ళే దారిలో చిన్న వాటర్‌బాడీ, దీనికే లేకని పేరు పెట్టారో గుర్తు లేదు

ప్రకృతి ఇంతందంగా ఉంటుంది కదా మరి కవులెందుకో అమ్మాయిల్ని ఇంత అందంతో పోలుస్తారు.. ప్చ..

జీరోఫైట్..

no caption just see and enjoy


ఎందుకనో కొన్నిటిని వివరిస్తే వాటి అందం తెలియదు, అందుకేనేమో నోటికీ, చెవులకీ కంటే కళ్ళకే ప్రాముఖ్యత ఎక్కువ.. :)

చిన్నవే ఐనా వీటి ప్రపంచం వీటిదే.. వీటి అందం వీటిదే... ఆస్వాదించే హృదయం మనకుంటే చాలు

The way downhill towards the other side

రాళ్ళల్లో, నీళ్ళల్లో రాసాము ఇద్దరి పేర్లు.. ఈ పాట గుర్తొస్తుంది...

If you observe correctly, it looks like Pisces symbol (I don't believe in astrology)



ఈ మొక్కల్ని చూస్తే జెలసీగా ఉంది, అవి హ్యాపీగా స్నానం చేస్తున్నాయి.. నేనందులో చెయ్యలేను

Blog author, The Me, rocking on rock throne

లేత గడ్డిని చాటు చేసుకుంటూ, రాతిపై నాచు మొక్కలని పుట్టించే ఆ అర సెంటీ మీటర్ నీటి పొరలో కూడా నాకు అందం కనిపించింది, మీకు కనిపించకపోతే... సారీ నేనేం చెయ్యలేను...

ఏవేవో అలంకరించిన చింపిరి జుట్టు బుర్రలాగా ఉందా... బట్ నాకు చాలా బాగుంది...

నీలో నేనొదిగిపోనా నా ప్రియతమా అంటూ... అల్లుకుపోయిన తీగె మొక్క... ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలెవరైనా ఉన్నారంటారా.. నాకైతే తెలీదు

Sign of edges of concrete jungle... showing sunset as the symbol of killing down of nature, to make it experience its own sunset..... ఏంటో ఏదేదో మాట్లాడేస్తున్నాను.. ఐనా నిజమే చెప్పాను కదా..?!‌ :)

check dam entrance

మలేషియాలో ఉండేవి  పెట్రోనాస్ టవర్సైతే ఇవి పిట్టరోనాస్ టవర్సులాగా ఉన్నాయ్..


Algal bloom, part of the the pond ecosystem

రాళ్ళల్లో నీళ్ళు మరియు నీళ్ళల్లో రాళ్ళు.. బాగు బాగు..

Give sunshine, give some more rays అని అడిగితే ఇంకొన్ని ఇచ్చాడు.. సూరీడు..

నిజమే నీరెప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది..

నేల జారుతూంటే అడుగులో అడుగు వేసుకుంటూ, అలా అలా వెళ్ళిపోయా.. :)

మృత్తికా క్షయానికి ఉదాహరణ... అఫ్‌కోర్సు ఒకరకమైన అందానికి ఆలవాలం..


నా మొబైలెక్కడ తడిపేసి పాడు చేసుకుంటానో అని మా ఫ్రెండు భయపడుతూ భయపెట్టాడు కూడా..

చాలా మంది వీక్షకులొచ్చారు లెండి...

ఈ ఫోటో కాళ్ళకి తియ్యలేదు.. నీళ్ళకి తీశాను..

జల తరంగంలా, జల జలా ప్రవహిస్తున్న నీరు..

తేడాగా అడుగేశావో.. వాకింగ్ కాస్తా స్కేటింగైపోతుంది..

హమ్మయ్య ఈ చివరికి వచ్చేశాను..

wow nice water walls.. oh sorry.. water falls

అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా అందరికీ అందేదీ ఈ పూచే కొమ్మ అని ప్రకృతిని చూసి అనాలనిపించే సందర్భాల్లో ఇదొకటంటాను..

జనాల జలక్‌ఆలాటలు..

blog author at water falling wall

This is what I call the beauty.. natural glossy look...

జారుతూ, షికారుకెళ్ళే పాల పొంగుల ఓ గంగమ్మా అన్నట్లుగా ఉంది..

Another beauty..

Water entering into field...

ఈ స్పీడెంతుంటుందంటే.... వయసు వేడిలో ఉండే కుర్రదాని మనసు దుడుకుదనంతో దీన్ని పోల్చాలంటాను..

ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది, అందుకే వాటర్ యూనివర్సల్ సాల్వెంటయ్యింది..

కొండా కోనల్లో లోయల్లో.. రాయీ రప్పలో వాగుల్లో... (స్వాతికిరణం ట్యూన్)

నీరు పల్లానికే ప్రవహిస్తుంది, ఫిలాసఫీ అదే చెబుతుంది, థెర్మోడైనమిక్ సెకెండ్ లా కూడా అదే చెబుతుంది..

యూనివర్సిటీ ఎంప్లీయీస్ బోనాల పండగ సెలబ్రేషన్..

ఓమ్సు లాలోని రెసిస్టెన్సు మార్కింగ్సు.. ఈ వైర్లలో చూడాలంటే.. వాటి ప్రతిబింబాన్ని నీటిలో చూడాలని ఈ ఫోటో తీస్తే కానీ అర్దం కాలేదు..

ఇందులో బింబం, ప్రతిబింబం రెండూ ఉన్నాయ్, బాగుంది కదా.. బింబం బింబం అంటే గమ్మీ బేర్సులోని "బింబాలా బింబోలో బీం బాం" అనే మంత్రం గుర్తొచ్చేస్తోంది...

The Dusky sunset of nature has resemblance with beauty getting into the sleep

పచ్చదనమే పచ్చదనమే.. భూమాతా నీ ఒళ్ళంతా పచ్చదనమే అని పాడాలని ఉన్నా.. అది నిజం కాదు కదా :(


అక్కడ బతుకమ్మ గుడి ఉందనుకుంటా.. పైన ఆ మేఘం చూడండీ.. భళే భళే.. ట్రెయిన్ దూసుకెళుతున్నట్టూ, దాని నుండే ఆ పొగ వస్తున్నట్టూ ఉంది కదా... బ్యూటీఫుల్

ఇది నేచురల్లా,కాదా? బోర్నా, మేడ్‌ఆ అని అడక్కండి నాక్కూడా అంత క్నోలెడ్జీ లేదు...

గాల్లో వ్రేళ్ళాడుతున్నట్లున్నాయ్ కదా..

I'm sure, one won't find such a natural beauty in concrete jungle

ఆ షేపేదో కార్టూన్ బొమ్మలాగా అనిపించీ అలా ఫోటో‌ తీశ్శాను..

The bluish beautiful evening..

No George... Only Bush....

See the natural ones how they've grown as if they've been mowed or something like that..

Another hanging flowers' beauty..

WoW!!


ME


Tensionless under Hi-Tension power tower..

Deep in the Evening.. ఊడల్లేని చింత చెట్టు.. సారీ అవి మర్రి చెట్టుకుంటాయి కదా... దెయ్యాలేమన్నా దొరుకుతాయేమో అని ఫోటో తీశా.. భయపడినట్టున్నాయ్... కనబడ్లా..

నేనే.. పోస్ట్ ఇక్కడితో ఐపోయిందని చెప్పటానికి, కొసమెరుపుగా ఒక దిష్టి చుక్క... అంతే..