ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దిన వేడుకలు జరిగాయ్, అందులో బాగంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సయ్యీద్ ఈ హస్నైన్ విద్యార్థి మరియు ఉద్యోగ సమూహాన్నుద్దేశించి ప్రసంగించారు. అందులో బాగంగా అరవై ఏళ్ళకి పైగా అభివృధ్ధి చెందిన స్వతంత్రానంతర భారతావని గురించి చెబుతూ, అదే పడిలో విశ్వవిద్యాలయం అభివృధ్ధి గురించి కూడా చెప్పారు. నేషనల్ ఎక్రెడిషన్ కమిటీ తొంభై ఏడు శాతం ఇచ్చిన మార్కింగుని, అలాగే ఇటీవల జరిగిన ఒక ఇంటర్నేషనల్ ర్యాంకింగులో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆసియాలో మొప్పై నాల్గవ స్థానాన్ని పొంది ఉండగా ఇండియాలో ఉన్న మరి ఏ ఇతర యూనివర్సిటీ కూడా కనీసం తొంభై లోపు ర్యాంకులో లేదని నొక్కి వక్కానించారు, భవిష్యత్తులో ప్రపంచపు మొదటి పది యూనివర్సిటీల వరుసలో ఉంచే ప్రయత్నాలు చేసేందుకు సిధ్ధంగా ఉన్నామన్నారు. యూనివర్సిటీకి ప్రస్తుతం ఉన్న 64Mbps ఇంటర్నెట్ లైను 1Gbps లైనుగా పెంచటం జరుగుతుందని చెప్పారు. భారతావని గురించి మాట్లాడుతూ, మన దేశాన్ని ఇండియా, భారత్ అనే రెండు పేర్లని కాలానుగుణంగా మారుతున్న వ్యవస్థీకృతమైన మార్పులనుద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య మరియు విద్యా రంగాలలో అభివృధ్ధిని ఇండియా లక్షణాలగానూ, ఏ విషయం ఎంత అభివృధ్ధి చెందినా, అది చేరని ఎంతో మంది ప్రజలు వాళ్ళ పరిస్థితులను భారత్ అనే పేరున్న దేశపు లక్షణాలుగానూ అభివర్ణిస్తూ, ఇండియా మరియు భారత్‌ల మద్య వ్యత్యాసం కాలచక్రంలో అధికమౌతుందే కానీ తగ్గట్లేదని వాపోయారు. అభివృధ్ధి పధంలో నడవటంతో పాటు ఈ వ్యత్యాసాన్ని సమసిపోయేట్టు చేయటం మనందరి భవిష్యత్కార్యాచరణ ప్రణాళికలో బాగం కావాలని పిలుపునిచ్చి తమ సందేశాన్ని ముగించారు.
కార్యక్రమంలో తరువాయి బాగంగా విద్యార్ధుల నృత్య, నాటకాదులను తిలకించిన మీదట.. స్వతంత్ర పర్వదిన కార్యక్రమం స్వీట్ పంపకంతో ముగిసింది..
 |
vc with registrar |
 |
parade march fast by campus school students |
 |
Dance performance of campus school students |
 |
gathering of employees and students of University of Hyderabad |
 |
Dance performance of campus school students |
 |
Employees and students |
 |
Another picture of Dance performance of campus school students |
 |
Another picture Dance performance of campus school students |
 |
Another picture of Dance performance of campus school students |
 |
a person carves a rock into Islamic prayer |
 |
a person carves a rock into Islamic prayer (pic2) |
 |
Another person makes it into Jesus |
 |
Another person makes it into Jesus (pic2) |
 |
The other person makes it to Lord krishna's statue |
 |
When all above three see it, they start quarreling about the changes made |
 |
Then a patriot makes it into Gandhi statue, which all three accept. This explains the National integrity of the people that in turn tell us that India is a place of where exists Unity in Diversity |
 |
జై హింద్ |
|
No comments:
Post a Comment