ఆ చిట్ట చివరి బండరాయి మీదెక్కి, గొంతెత్తి అరిచాడా అబ్బాయ్, ".....దేవుడా ఎందుకు పుట్టించావు నన్నీ ప్రపంచంలో.. నా తల్లిదండ్రులనే వాళ్ళని చూసుకునేందుకు నా కంటే సమర్ధవంతమైన ఆత్మ నీకు దొరకలేదా.. దేనికోసం నేను జీవించాలి నేనిష్టపడని ఈ లోకంలో.. అసలు నువ్వే ఉన్నావా.. లేవా.. నాకు నీ స్వర్గమూ వద్దూ, నీ నరకమూ వద్దు, ఆ రెంటిలో ఏదెప్పుడు ఎదురౌతుందో తెలియని ఈ భూమి అసలు వద్దే వద్దు.. నువ్వు నాకు సంజాయిషీ చెబుతావా లేదా.." పాపం కన్నీళ్ళపర్యంతమై చేస్తున్న ఆ రోధనాపూరిత ఆక్రందనకి ప్రక్కనే ఉన్న జంట పక్షులు భీతిల్లి ఎగిరిపోయాయి.. బండల మీదుగా వీస్తున్న కొండగాలి తనకేమీ తెలియనట్లు ఆక్రోశంతో ఊగిపోతున్న ఆ మనిషిని చల్లబరిచేందుకు ప్రయత్నిస్తుంది. అనుదైర్ఘ్య తరంగాలు అలసిపోయేంత దూరం వెళ్ళిన ఆ శభ్దం తమ కర్ణేంద్రియాలను చేరిన జీవులన్నీ ఉలిక్కిపడి తేరిపార చూశాయ్.. తన ప్రశ్నకి సంజాయిషీ కానీ, సమాదానం కానీ రావనే అనుమానం నిజమైందేమో.. అంతెత్తునుండి దూకేశాడా మనిషి... తనకి అక్కర్లేని భూమి నుండి తను కోరుకోని స్వర్గాన్నే చేరాడో, నరకాన్నే చేరాడో... చివరకి ఉన్నాడోలేడోఅని తను అనుమానించిన ఆ దేవున్నే చేరాడో...
ప్రాపంచికాలన్నిటీనీ వదలేసినా... ఆ ప్రేమపూరితమైన అనంత స్వరూపుడగు దేవుణ్ణి మాత్రం ఎందుకు నమ్మాడో ఆ జీవి
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Monday, April 26, 2010
Saturday, April 24, 2010
ఒక గాలి తీత సంఘటన (one tyre puncture story) :)
టైం రాత్రి పది కావస్తుంది.. బాగా దాహంగా ఉందీ, ఏదన్నా తాగుదామని షాప్‌కి వెళ్ళి ఒక కూల్‌డ్రింక్ టిన్ తీసుకుంటూ ఉండగా వినిపించొందొక సంభాషణ.. "అంకుల్ ఆ క్రీం రేట్ ఎంత" షాప్‌కీపర్‌ని ఉద్దేశించి అడిగిందొక బ్యూటీఫుల్ అమ్మాయ్. "అంకులా..., అలా పిలిస్తే నాకు నారాజ్ ఔద్ది.., నాకింకా పెళ్ళి కూడా కాలేదు తెలుసా", అన్నాడా షాపాయన, involuntary reaction లాగా నేనాయన్ని అడిగేశాను "ఇంకా ఎన్నో పెళ్ళి కాలేదు?" అని(ఆ షాపాయన నాకు తెలిసినోడే.. దగ్గర దగ్గర ఒక నలభై పైబడి ఉంటాయాయనకి)... ఆ ప్రశ్నకి ఆ అమ్మాయి కిసుక్కున నవ్వింది.. పాపం ఆ నవ్వుకి ఆయన ఫేస్ ఆముదం తాగినట్టు పెట్టేసి నన్నొకసారి కొరకొరా చూసి.. ఆమెతో అన్నాడు, "నేను అంకుల్‌నే, కానీ అలా పిలిస్తే ఫీలౌతాను" అని... ఆమె మరొకసారి కిసుక్కున నవ్వేసి, షాపాయనకి "బై అన్నయ్యా.." అని చెప్పి వెళ్ళిపోయింది... ఆమె వెళ్ళిపోవటం లేటు, నేను కూడా జంపు (కూల్ డ్రింకు డబ్బులు ముందే ఇచ్చేశాను లే).. అక్కడే ఉంటే ఎక్కడ నా మీద పడి ఏడుస్తాడోఅని చెప్పి.. ఈ సారి ఆ షాపుకి వెళ్ళినప్పుడు.. కాస్టు, ఎక్ష్స్పైరీ డేట్ అన్నీ కరెక్టుగా చూసుకుని కొనాలి... నా మీద కోపంతో ఆయన ఎక్సుపైరీ డేట్ ఐపోయినవి అమ్మినా అమ్ముతాడు....
Tuesday, April 13, 2010
గ్రహపాటు..
దెబ్బ తగిలి బావురుమంటూ ఉట్టి మీద నుండి కట్టెల మీదుగా గోడమీదకెక్కింది ఆ బావురు పిల్లి... పాలు తాగటం పిల్లి అలవాటు, దాన్ని తరిమి కొట్టటం ఆ ఇంటి తల్లి అలవాటు.. దీన్ని చూడటం నా పొరపాటు, ఇక్కడ రాయటం మీ దృష్టిలో నా అగచాటు... మరి చదవటం .. hmmmm hmmm.. మీ గ్రహపాటు...
Subscribe to:
Posts (Atom)