మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, April 24, 2010
ఒక గాలి తీత సంఘటన (one tyre puncture story) :)
టైం రాత్రి పది కావస్తుంది.. బాగా దాహంగా ఉందీ, ఏదన్నా తాగుదామని షాప్‌కి వెళ్ళి ఒక కూల్‌డ్రింక్ టిన్ తీసుకుంటూ ఉండగా వినిపించొందొక సంభాషణ.. "అంకుల్ ఆ క్రీం రేట్ ఎంత" షాప్‌కీపర్ని ఉద్దేశించి అడిగిందొక బ్యూటీఫుల్ అమ్మాయ్. "అంకులా..., అలా పిలిస్తే నాకు నారాజ్ ఔద్ది.., నాకింకా పెళ్ళి కూడా కాలేదు తెలుసా", అన్నాడా షాపాయన, involuntary reaction లాగా నేనాయన్ని అడిగేశాను "ఇంకా ఎన్నో పెళ్ళి కాలేదు?" అని(ఆ షాపాయన నాకు తెలిసినోడే.. దగ్గర దగ్గర ఒక నలభై పైబడి ఉంటాయాయనకి)... ఆ ప్రశ్నకి ఆ అమ్మాయి కిసుక్కున నవ్వింది.. పాపం ఆ నవ్వుకి ఆయన ఫేస్ ఆముదం తాగినట్టు పెట్టేసి నన్నొకసారి కొరకొరా చూసి.. ఆమెతో అన్నాడు, "నేను అంకుల్‌నే, కానీ అలా పిలిస్తే ఫీలౌతాను" అని... ఆమె మరొకసారి కిసుక్కున నవ్వేసి, షాపాయనకి "బై అన్నయ్యా.." అని చెప్పి వెళ్ళిపోయింది... ఆమె వెళ్ళిపోవటం లేటు, నేను కూడా జంపు (కూల్ డ్రింకు డబ్బులు ముందే ఇచ్చేశాను లే).. అక్కడే ఉంటే ఎక్కడ నా మీద పడి ఏడుస్తాడోఅని చెప్పి.. ఈ సారి ఆ షాపుకి వెళ్ళినప్పుడు.. కాస్టు, ఎక్ష్స్పైరీ డేట్ అన్నీ కరెక్టుగా చూసుకుని కొనాలి... నా మీద కోపంతో ఆయన ఎక్సుపైరీ డేట్ ఐపోయినవి అమ్మినా అమ్ముతాడు....
Labels:
గాలి తీత
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment