నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Wednesday, August 25, 2010

సారీ, దీనికి పేరేం పెట్టాలో అర్దం కాలేదు..

ఏదో  చెప్పాలనుంది  నా  మనసుకి, వినే  ఓపిక  నీకుందా?? ప్రశ్నిస్తే  బదులీయక  మూగదయ్యింది  అంతరాత్మ.. దేనికో  ఈ  జీవితకాలపు  ఎదురుచూపులు  అనుకుందో  ఏమో... జీవిత  పరమార్ధపు  మూలకాలు  సంతోషం, ఆనందం  అని  కూడా  మర్చిపోయిందనుకుంటా. మనసుకి  తెలుసు  ఈ  అంతరాత్మ  పరమాత్మకొరకు  ఎంత  వెతికిందో, ఎక్కడైనా  కనిపిస్తాడేమో  అని.. ఆ  పరమాత్మకి  ఉన్న  వ్యాఖ్యానాలు, వివరణలు, కథలు, విశేషాలు  తప్ప  తన  అనుభవాలేమీ  లేవు  పాపం.   కోరికలకీ, అవసరాలకీ  ఉన్న  సారూప్యతలను, వ్యత్యాసాలనే  ఇటుకలూ, సున్నంగా  జీవితాలనే  కట్టడాలని  నిర్మించిన  ఆ  నిరాకారికి  లేదా  సాకారికి  వీటి  ఉనికికి  పరమార్ధం  ఏమిటో  వాటికి  తెలియచెయ్యాలనిపించలేదేమో. పెద్దలు  చెప్పిన  పేర్లు, లక్షణాలు  తప్ప పాపం  అంతరాత్మకీ, పరమాత్మకీ  వ్యత్యాసం  ఏమిటో  కూడాతెలియదు.. ఎందుకుంటుందో, ఎలా  ఉంటుందో  చెప్పగలిగేవారెవ్వరూ  లేరు. ఆదిలో  జీవ  భావావిష్కరణం  జరిగిందో, భావ  జీవావిష్కరణం  జరిగిందో  పాపం  ప్రశ్నార్ధకమే  ఐపోయింది  దానికి. భావం  లేని  జీవం  ఎలా  ఉద్భవిస్తుందో  తెలియకముందే  జీవం  లేని  భావం  ఉనికి  మరో  ప్రశ్న  అయ్యింది. ఇంతటి  సునిశితమైన  ప్రశ్నలకి  జావాబివ్వలేని  మనిషిని  ఎందుకు  ఉత్తమ  జీవ  జాతిగా  మనిషి  గుర్తిస్తాడు.. వేదం  వల్లిస్తుందనా, అదీ  మనిషే  చెప్పాడు  కదా, ఏం  మనిషి  కానివారు  చెప్పారా, ఎవరు  వారు?? ఎవరికి  బద్దులు?? ఇలా  ఏ  ప్రశ్నకీ  కారణం  కానీ  అవసరం  కానీ  లేకుండానే  కుప్పలు  తెప్పలు  ప్రశ్నార్ధకాలతో  నిండిపోయింది, వాటిని  తొలగించే  సమాధానం  ఒక్కటీ  దొరకలేదు.. మనసుకేం  చెప్పాలో  తెలియక  కిమ్మనకుండా  కూర్చుంది. అంతరాత్మకి  సమాధానాలిచ్చే  తెలివి  దానికి  లేదు. మనస్సుండే  లౌకిక  ప్రపంచానికీ, అంతరాత్మ  ఆస్వాదిస్తున్న  అలౌకిక  ప్రపంచానికీ  లంకెలు  దొరక్క  సతమతమయ్యే  మనసు, అంతరిక్షంలో  నిల్చుని  అనంతమైన 4phiRcube  ఘనపరిమాణమంతా  అంధకారాన్నే  అలుముకుని  ఉన్నట్లుగా  తలచి, గమనమెటో, గమ్యమేదో  తెలియకుండా  ఉంది. అసలా  గమనమూ  గమ్యమూ  ఎందుకో  కూడా  మనసు  కూడా  ప్రశ్నించేస్తుంది. మనసుకి  తనంటే  ఏంటో  తనకి  తెలిసిన  తర్వాతి  కాలం  నుండి  తనలో  జనించిన  కోరికలన్నిటికీ  రెక్కలు  తొడిగి, అనంతమైన  గగనసీమలో  ఉరకలు  పరుగులుగా  ఎగరేయాలనుకుంది. తన  కోరికలనే  గుర్రాలను  సంద్రంలో  ఎగసిపడే  అలలకి  పోటీగా  చెయ్యాలనుకుంది. కానీ  తానుండేది  ఒక  స్థబ్దు  శరీరం, తన  యజమాని  ఒక  నిశ్శబ్ద  అంతరాత్మ... ఇంకా  ఏమడుగుతుంది  మనసు  మాత్రం, ఎవరినని  అడుగుతుంది.. తన  శరీరంలానే  స్థబ్దమై, స్థానువై  అణువు  కూడా  చలించక.. మరణం  వరకూ  తన  ఋణమేదో  తీరనట్టు  అలానే  ఉండిపోయింది, ఉండిపోతుంది... తను  చలించాలంటే    తనది  కానిదేదో  తనని  కదిలించాలంతే....... :(

8 comments:

 1. bagundi . baga rasaru. enno questions kada.. mee questions chusaka naku chala questions vachhestunnai. naa manasukuda adigindi antharathmani , paramathma kalusthada ani... antharatma cheppindi..."paramathma nirakari ayina sakari ayina aakaram ichhindi maname ayithe,i mean paramathma manishi antharathma lo nunde putti unte,aa paramathma gunalu ga cheppukunevi (like prema, santhosham, samanthvam, kshamagunam..etc) manasulo mananam chesukuni mana antharathma sakshiga aacharanalo pedithe ade paramatha " ani. nenu kuda naku thochindi rasesanu . nachhithe chadavandi.

  ReplyDelete
 2. @praba: ప్రభగారూ చాలా చక్కగా చెప్పారండీ.. ప్రేమ, సంతోషం, సమానత్వం, క్షమాగుణం అన్నీ నిజంగా పరమాత్మ లక్షణాలే అండీ.. ఒక మనిషిగా నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలి... కానీ పరమాత్మ దేనికోసమో నాకు ఇప్పటికీ అర్దం కాదు... మన మస్తిష్కం లోన ఉద్భవించే విషయాలనే పరమాత్మ అనుకుందామా.. ఐతే ఏ కోరికలూ లేనివాడికి ఆ పరమాత్మ కూడా అవసరం లేదు..... వావ్.. పరమాత్మ కూడా అవసరం లేనివాడ్ని.. విషయ వర్గీకరణలో తేవటం పాపం లెండి.. అలా ఉంటే చాలా బాగుంటుంది.. అసలు వాడికి జీవమే అవసరం లేదు... ఆ స్థితి మహా అద్భుతం....

  ReplyDelete
 3. Mouli garu.. baga chepparu andi. naku mee antha basha gyanam ledu kani naa abhiprayam kuda metho share chesukovalanukuntunna ee vishayam lo endukante mee antharmadanam lo unna topic ippudu maa antharmadanam chesaru kada.:-). paramathma enduku ane prasnaki samadanam vethakalsindenemo kani meeru annaru ga "korkelu leni manishiki paramathma avasaram undadu.." ani, korkelu leni manishi untada? okavela unnadu anukunna paramathma (vethike)avasaram lenidi korkelu leni manishi ki kadu hrudayashuddi unnavadiki ani nenu anukuntanu...

  ReplyDelete
 4. @praba:
  బాగా చెప్పారండీ ప్రభ గారూ, హృదయ శుధ్ధి ఉన్నవాడికి పరమాత్మ అవసరం లేదన్నారు చాలా బాగుంది, కానీ మానవ దౌర్భాగ్యపు పరంపరలో ఆ శుధ్ధి అనేది పరస్పర వ్యక్తులా లేదా వ్యవస్థల యొక్క తులనాత్మక అవగాహనలో ఉంటుంది తప్ప... సంపూర్ణ శుధ్ధికి ఒక ప్రామాణికం ఏమీ లేదండీ, ఉండకూడదు కూడా.. ఎందుకంటే అనంతమైన ఊహా శక్తి ఉన్న మానవునికి ఆ హృదయశుధ్ధి పరిమితమైనదని అనిపిస్తే దానిని హృదయశుధ్ధిగానే స్వీకరించడు.

  కోరికలు లేనివాడు ఉంటాడా అని మీరడిగారు కదా... ఉంటాడండీ కానీ కనిపించడు, ఎందుకంటే ఆ స్థితి చేరుకొన్నాక అతనికి జీవించాలనే ఆశ ఉండదు, అందుకే కనిపించడు...

  మరణాన్ని అన్ని వ్యవస్థాల్ల గ్రంధాల్లోనూ నిరాశావహ విషయంగానే సూచించారు.. అందుకే ఆశావాహాన్ని మోహించిన మానవుడు.. దానికే సృజనాత్మకంగా పరమపదం, మోక్షం అని పేరు పెట్టాడు... ఆత్మలు వివిధ శరీరాలని మారటం, ఇంకా ఇలాంటి విషయాల పైన నాకు ఎలాంటి అనుభవం లేదు, కథలని నేను నమ్మశక్యంగా భావించట్లేదు.. మీరేమంటారు?

  ReplyDelete
 5. @Chandramouli Malleda chala baga chepparu antanu... mee bhava prakatana adbhutamga undi antanu... hrudayasuddiki parimithulu undakudadu ane bhavam oppukuntanu...
  kani srujanathmatha kaligina manishi nirasavaahanne "Moksham" annadu annaru , aaa.. nir'aasaa'vaham lo naku aasa kanipistundi , annni unna manishi kuda moksham ane peru tho inka denino vethakadam chustunnanu.. ihalokapu anandalani, korikalani tyajincheste bagavanthunni cherukogalanu ane aasa undemo anukuntunnanu Mouli garu...

  ReplyDelete
 6. @praba:
  మీ మెచ్చుకోలుకి నా ధన్యవాదాలండీ ప్రభగారూ, ఆశావహ లేదా నిరాశావహ దృక్పదం అనేది.. సామాజిక మరియు లౌకిక విషయ సంభందమండీ.. అలౌకిక తత్వంలో అవేమీ ఉండవని నా అభిప్రాయమండీ..

  నిజానికి మోక్షపదానికి నా మెడడు ఇచ్చే వివరణ ఎలా ఉంటుందంటే..

  "సుషుప్తి స్థాయిలో నిద్రానమై ఉన్న మనోఫలకం ఎలా ఐతే ఇహ పర అనే ఎటువంటి విషయాలకూ సంబద్దమై ఉండదో, అలా అనంతమైన సమయంపాటు నాకు నేను తెలియకుండా ఉండేతనం అని అర్దం", ఇహ ఆ స్థితిలో మంచికీ, చెడుకీ.. గొప్పకీ పేదకీ, "నా" అనే విషయానికి,కాని విషయానికి.. ఎలా ఎన్నో అనంతమైన విషయ విషయాలకి వేటికీ నేను అనేవాణ్ణి లొంగి ఉండాల్సిన పని ఉండదు. అందుకే అందరిలా ఈ భూ ప్రపంచం మీద పుట్టినందుకు మిగిలిన అందరిలా అద్భుత వరంలాగా భావించట్లేదు.. నాది కాని ఈ ప్రాపంచికాన్ని నేను ఎన్నాళ్ళు సాగదీయాలో అని ప్రశ్నించుకుంటున్నాను.

  మనిషి ఐనందుకు ప్రతి ఒక్కరికీ ఆయా దేశ, కాల, మాన, స్థితి, గతుల ఆధారంగా ఉండే లక్షణాలు, సంతోషాలు, బాధలు, కోరికలూ, ఇలా ఇవన్నీ నాకూ ఉన్నాయ్.. కానీ ఇవన్నీ స్వీకరించే స్థితిలో నా అంతరాత్మ లేదు.. కనీసం ఒక పదిహేనేళ్ళ అంతర్మధనంలో ఎన్నో తార్కిక ఆలోచనలో ఇప్పటికి నేనొచ్చిన శేష స్థాయిని ముందరి పేరాలో మీకు వివరించాను.. మీ అభిప్రాయమేమిటి?

  ReplyDelete
 7. @Chandramouli Malleda Okavidam ga nannu nenu abhinandinchukuntunna mouli garu.. endukante modatiroju idi chadivinapudu naku baga nachhindi ,kani.. mee sahithyame ekkuvaga aakattukundi mee bhavam kante. Mee manasuloni bhavam paramathmanu kalavalano leka nisabham ga undipovalano appudu naku ardamkaledu. Kani,ippudu mee manasu..medhadu.. Antharathmala ..antharmadanalu mee abhiprayallo telusukuni chadivinapudu daniloni bhavam naku chala spastam ga telustundi. ..opika ga mee samadhanalatho alanti avakasanni naku ichhinanduku meku dhanyavadalu..
  Na abhiprayam adigaru ga.. munduga mee peru leni antharmadanam (ee article) chala baga raasaru ani . Meeru annaru ga, “paramathma denikosamo naku ippatiki ardam kadu” ani ,na samadanam okate adi mee manasuki telusu. Jeevam leni vadiki paramathma avasaram ledantune ..”jeevam unna manishiki paramthma avsaram” ani cheppakane chebuthunnaru meeru.Adi telise mee manasu antharathma ni adugutundi. Kani asalu naku paramathme avasaram ledu jeevam leni sthithe mahaa adbhutham ,naku iha,paralatho sambandam vaddu anukuntunna mee antharathma ,paramathma denikosamo samadhanam em chepthundi? . kani meedi nisabha antharathma kaademo anipistundi naku, nisabha antharathme ayi unte, manishiki unde anni korikilatho, anadalatho unna mee manasu naku paramathma kalustada ani mee antharathma ni adugutunte, adi naku avasarame ledani cheptune undi ga. Mee sunisithamaina prasnalaki samadhanam kavalante meeru manase chalinchali anukuntunnaru,kani naku manasu chalinchala leka antharathme chalinchala anedi kuda inko prasna ga kanipistundi.
  Cheppalante idi na anthrmadanam kuda , naa manasu paramathma ni kavalanukundi, antharathma karanalu vethikindi. Meeru annare jeevithakalapu eduruchupulena ani.. ala samadhanala kosam prasnisthu jeevithakalam karigipothe.. paramathma anubhavalu pondalenemo ani na manasu antharathma ni dominate chestu paramathma lakshanalni saadhana chesukuntundi.. jeevithanni varam lane bhavisthundi..appudappudu antharathma kuda manasuki tana vadhana vipinchalani prayathnisthune undandi.. naku evvaru nisabham ga leremo anipisthundi. . edemaina antharmadanalani akshara roopam lo chala chakka ga chupincharu.

  ReplyDelete