నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Sunday, October 31, 2010

కేయూరాని న భూషయంతి పురుషం..(my view on art of communication)

ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద సంస్కృతంలో ఒక మంచి శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో వాక్చాతుర్యం అనేది ఒక నిజమైన, మరియు శాశ్వతమైన అలంకారంగా పేర్కొనబడింది... చంద్రహారాలూ, లేపనాలూ, పన్నీటి స్నానాలూ, పూల మాలలూ అలంకారాలు కాదూ, సంస్కారంతో కూడిన(contextual interpretation needed) వాక్కు సరైన అలంకారమౌతుందీ, వాక్కు అనే అలంకారమే లోకాలలోకెల్లా మంచి అలంకారం అని చెప్పబడింది...
కేయూరాని న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నా లంకృతామూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

భర్తృహరికి వాక్కు అనే అలంకారంతో పాటు, ఆచరణ అనే అసంక్రమిక ఆస్తి గురించి మనసులో తట్టలేదేమో.. అప్పటి పరిస్థితుల ప్రభావంలోనూ, దేశ కాల మాన స్థితిగతులలోనూ ఆచరణకి అంత ఆధరణ లేకనో అలా కాక తను ప్రేమతో ఇచ్చిన పండు చేతులు మారిన విధానంతో,  జీవితం అనే విషయంలో కన్నులు తెరిచి మోక్షపదం వైపు దృష్టి మరలిపోవటం వలననో మరి తెలియదు. కానీ అలంకారం అలంకారమే కానీ మనిషి కాదు, మనిషేంటో తెలియజేసేది అతని ఆచరణ, వ్యవహారం... simply speaking work and worth of human makes him what he/she really is. అందుకనే ఆంగ్లంలో కూడా చెబుతారు Actions speak louder than Voice అని... పై శ్లోకాన్ని విమర్శిస్తుందా అనేటట్లుండేది ఒక వేమన పద్యం

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ

హహహహ్!! ప్రస్తుత ప్రపంచం అంతా vacuumలో పెట్టిన ఇనుము అయస్కాంతం తనని attract చేసిన వైపు దూసుకుపోతున్నట్టు ప్రయాణిస్తుంటే, నీతులెన్ని చెప్పి ఏం లాభం లే, ఇటు తనకీ పనికిరావు, అటు వాటిని చదివేవాడికీ పనికిరావనేమో ప్రస్తుత  కాలపు రచయితలెవరూ అలాంటివి రాయటానికి పూనుకోవట్లేదు... 

ఏదేమైనా ఒకటి మాత్రం నిజం కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవటం అనేది, సౌండు బాక్సుల్లేని మ్యూజిక్ సిస్టం లాంటి పరిస్థితి. వాళ్ళ బుర్రలో/చేతల్లో చేవ ఎంతుందో మనకీ and/or వాళ్ళకీ తెలియకపోయినా తెలియాల్సిన అవసరం లేకుండానే, వాళ్ళ మాటల్తోనే చిలుక జోస్యం నుండి టీవీ యాంకరింగ్ వరకూ నిరాటంకంగా మరియు దగ'ధ్ధగా'యమానంగా సాగుతున్న జీవితాలు.. భర్తృహరి శ్లోకానికి ఉదాహరణలు.. :)

Friday, October 29, 2010

నేను నువ్వైన నా ప్రేమలో...

.........ఏ విషయాన్నైనా ఎంతో సులభంగా భావించగలిగిన మనిషి, తన నిజమైన ప్రేమ విషయంలో అలా భావించలేడు, పరిస్థితులు తనని వెక్కిరిసున్నా, వెక్కి వెక్కి ఏడుస్తాడే తప్ప, వెనక్కి మరలి ఆ విషయాన్ని మరచిపోలేడు... నిజమైన ప్రేమ మరుపుకి రావాలంటే పునర్జన్మమెత్తాలి (అదంటూ ఉంటే)..... మరి ఆమెకిదంతా అర్దం కాదెందుకనో............Thursday, October 28, 2010

ఏ బాధాతప్త హృదయుని శాపమో...!!

మనసుని మీటే స్వప్న స్వరాలెన్నో, వాటి సోయగాల లాలనలో ప్రియుడు తన నిజ ప్రదేశాన్ని వీడి ఎక్కడెక్కడో విహరిస్తాడు... ఆ ఊహా యుటోపియా లోకాల్లో ఎంత దూరం వెళ్ళినా, అది ఒక యుటోపియాగానే తనకి మిగిలిన కారణం గుర్తురాగానే, కన్నీరు మున్నీరౌతాడు... మాట పెగలని రోధనల సాక్షిగా, ఆవిరైపోయిన కన్నీరే ఆధారంగా, ఒంటరిదైపోయి మిన్నకుండి చూస్తున్న హృదయమే తన ఆసరాగా... :(


 

Wednesday, October 27, 2010

అదృష్టానిది సంకుచిత హృదయం ఫ్రెండూ...

నువ్వు అడిగిన సాయం ఎవరూ చెయ్యకపోవటం ఒంటరితనం కాదు ఫ్రెండూ... నీకు కావాల్సిన సాయం చెయ్యమని నిన్ను కూడా నువ్వు అడగలేని పరిస్థితి ఎదురైతే అది నిజమైన ఒంటరితనం.... అందుకే నీకు నీకంటే మంచి ఫ్రెండు కనీసం ఒకరన్నా ఉండాలి, ఏ ఎల్లోరా శిల్పం వల్లనో నువ్వొక శిలా విగ్రహమైపోతే, నువ్వడక్కుండానే ఒక ట్రాలీలో తీసుకెళ్ళి కనీసం నిన్ను నిమజ్జనం చెయ్యటానికైనా ఉండాలొకరు... కానీ అదృష్టానిది సంకుచిత హృదయం... నువ్వూ, నేనూ ఏమీ చెయ్యలేం ఫ్రెండూ......

Sunday, October 24, 2010

కాలమైనా చెబుతుందో లేదో??

...........................వాడెప్పుడూ అంతే, బాధ కలిగితే తట్టుకోలేడు, అప్పుడప్పుడూ ఒక్కడే కూర్చుని బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాడని ఎవరో చెబితే విన్నాను, ఏమి జరిగిందో తెలియదు.. కానీ వాడి మనసు మనసులో లేదు.. నవ్వులో జీవం లేదు.. మాటలో ఉండాల్సిన భావం కనిపించట్లేదు.. కనిపిస్తే ఎంతసేపట్లో తనని ఒంటరిగా వదిలేస్తామా అన్నట్లు మొహం పెడతాడు. కారణమేంటో చెప్పడు, ఎప్పుడూ అంతా దాచుకునే ఇంట్రావర్టేమో, మొహంలో భావాల్ని పులుముకుని కనిపిస్తాడు.. ఏమిట్రా అది సైకోలాగా అంటే, మొహం రెండు చేతుల్లో దాచేసి, ఎవరికీ తెలియకుండా తన అరచేతి చారల్నే, కన్నీటి ప్రవాహపు దారుల్లా భావిస్తాడు, మొండోడు, బండోడు, గుండే తనకి లేదంటాడు, దాని అవసరమూ లేదంటాడు... ఎప్పుడూ, ఎదురు చూస్తున్నానంటాడు, దేని కోసమో ఎవ్వరికీ చెప్పడు, కాలమైనా చెబుతుందో లేదో............................................

అసలు తెలుగులో నాకు తెలిసిన తెలుగెంతంటే..

ఉదయాన్నే టిఫిన్ చేద్దామని మెస్‌కి వెళ్ళినపుడు ఫ్రెండ్సుతో అలా అలా మాట్లాడుతుండగా, ఎవరికి ఎన్నెన్ని భాషలొచ్చు అనే విషయం చర్చలోనికొచ్చింది.. దానికి నా సమాధానంగా నాకు మూడు భాషలు తెలుసు తెలుగు యావరేజీ, ఇంగ్లీషు బిలో యావరేజీ, హిందీ బిలో పావర్టీ లైన్ అని చెప్పాను.. ఆ ఎక్స్ప్రెషన్‌కి అందరం నవ్వుకుంటుండగా.. నా ఫ్రెండొకడన్నాడు, "నువ్వు రాసిన కవితలు తెలుగు తెలిసినోళ్ళే అర్దం చేసుకోటానికి కష్టపడుతున్నారు, నీ తెలుగు యావరేజీయా" అని. దానికి సమాధానంగా, అలా అనే వాళ్ళు చిన్నప్పట్నుంచీ కాన్వెంట్సులో బాగా కేజీలు కేజీలు చదివి ఉంటారులే కాని, కవితలు రాయటానికి పరమోత్కృష్టమైన భాషా జ్ఞానమేమీ అవసరం లేదూ అని చెప్పి అసలు తెలుగు అనబడే తెలుగుకీ, నాకు తెలిసినపాటి తెలుగుకీ ఉన్న తేడాని అక్కడే ఈ క్రింది కవితతో వివరించాను, ఇది విన్న తర్వాత ఆయన వేరే శబ్దాలేమీ చెయ్యలేదు ఈ విషయం పైన...


వికసించే చిరునవ్వా..

నీ నైరాశ్యం నిమేషం, ఆనందం అనంతం, ఆశల భారాన్నీ.. భావాల బాధల్నీ.. ప్రక్కన పెట్టి, చిద్విలాసుడివై చిరునవ్వు నవ్వవోయి అని నాలోని రెండో మనిషి మొదటి మనిషిని ఊరడించిన సందర్భంలో లిఖితమైన ఈ కవనం, మీ కోసం...
 
 

Sunday, October 17, 2010

పందికేం తెలుసు పన్నీరు వాసన...

ఇంటర్మీడియట్లో ఏమీ తెలియని వయసులో ప్రేమకి ఎంతో విలువ  ఇచ్చే ప్రతివారూ, PG, Ph.D., లకి రాగానే, లవ్‌ని అదేదో గార్బేజీలో పడేయాల్సిన విషయంలాగా చూస్తారెందుకనో... ఏదో సామెత చెప్పినట్టూ పిగ్గీ బ్యాంకులో చిల్లర పోగు చేసుకుంటా డాడీ అనే పిల్లాడు పెరిగి, పందికేం తెలుసు పన్నీరు వాసన అన్నాడంట...

నాస్తికుల ఊర్లో గుడి పూజారిలా ఐపోయింది నా పరిస్థితి..!!

Love అంటే ఎందుకో వాళ్ళకి అంత అసహ్యమూ, insecurity లాంటివి... వాళ్ళకే కాదు వీళ్ళకీ చులకనే... I think "LOVE" is at wrong phase of యుగచక్రం... it doesn't have sustenance on this earth...  Its true irony from many people, they say some letter code and say that they feel better that than love... ఛా!! నాస్తికుల ఊర్లో గుడి పూజారిలా ఐపోయింది నా పరిస్థితి..

Monday, October 11, 2010

సక్సెస్...


success కాట్లకుక్కలా వచ్చి నిన్ను కాటేయాలంటే...  దాన్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి వదిలేసే భాద్యత నీ మీదే ఉంది... ఇంకెవరిచేతో రెచ్చగొట్టిస్తే అది వాళ్ళకోసం వెళిపోతుంది....

Sunday, October 10, 2010

ఆ ద్రవమంతా ఉపద్రవమై...

గుండె నిండా ప్రేయసిపై ప్రేమని నింపుకుని తనకి వ్యక్తపరచలేని స్థితిలో తను కనిపిస్తూ, ఏమీ మాట్లాడలేని ఆ పరిస్థితి, శరవేగంతో ప్రయాణిస్తున్న నీరు సుడిగుండమై, సహాయమందించమని చెయ్యి చాచి, వేస్తున్న గావుకేక గొంతు అంచుని దాటక ముందే ఆ ద్రవమంతా ఉపద్రవమై జలగర్భంలోనికి లాక్కుపోతున్న భావన కలుగుతుందెందుకో...

Saturday, October 9, 2010

నిరర్ధకమో...?

పల్లవించిన ప్రేమ పరవశించిన నా హృదయంలో ప్రేయసి ముద్రించు సుందర అద్దకమో, లేక ప్రేయసియే లేని ఓ ప్రశ్నార్ధకమో, అదీ కాక ఒక పరిపూర్ణ నిరర్ధకమో...??

Thursday, October 7, 2010

ఆమె జ్ఞప్తికి వస్తే...

ఊహాలోకమే నిజమై, నిజమైన ఈ లోకమే ఊహల్లోకి జారిపోతే?... ఎంత బాగుంటుందో!!..  ప్రేయసి జ్ఞాపకాలే తన ఊపిరి ఐనట్లుగా భావించే ఈ ప్రియుని ఆరాధన, ఆమెని ఎప్పటికి చేరుతుందో, ఎలా చేరుతుందో.. అలా చేరేటప్పటికి, ఎవరో కవిగారు చెప్పినట్లు 'నువ్వు వలచావని తెలిపేలోగా నివురైపోతానేమో'; నీకు నేను మాటై తెలపాలా, నా కన్నుల్లో భావాలు నీకు తెలియవా అని మనసు పొరలు దాటి బయటకి రాని వేదన, కన్నులకు తన గోడు మొర పెట్టుకుంటే, కరిగినపోయిన ఆ కళ్ళే, కన్నీళ్ళై నేలని తాకాయి... నువ్వెంత వెతికినా కనిపించని లోతులకి ఇంకిపోయాయి...
 

Wednesday, October 6, 2010

ఆవేదన..

............నా జీవితం తెరచిన తెల్లకాగితపు పుస్తకం, దానిపై తన పేరు రాసి సొంతం చేసుకోమంటే, వాళ్ళంతా కాగితాలు చింపి నలిపి వెళ్ళిపోతున్నారు మిత్రమా............
 

Monday, October 4, 2010

తలుపు తియ్యని నా మనసులో...

ప్రేమని వ్యక్తపరచాలనుకునే అబ్బాయికి, అంతర్లీనంగా ఎన్ని సంఘర్షణలో... పాపం అందులో కూడా ఆశావాదం గెలవటానికి తను పడే పాట్లు, మనసులోనే దైవానికి చేసే విన్నపాలు, ఏమి జరుగుతుందో అనిపించే భయాలు... ఇన్ని కలగలిపిన ప్రేమని జయప్రదం చేసుకోవటం అనే విషయాన్ని.. ఒక జీవితపు ఖర్చులా భావిస్తారెందుకో చాలా మంది..

Sunday, October 3, 2010

హ్యాపీ బర్త్ డే to మి

ఈ రోజు నా బర్త్ డే, మన బ్లాగ్ కమ్యూనిటీస్‌లో నాకు ఫ్రెండ్సు చాలా తక్కువ... నా బర్త్ డే సందర్భంగా కొత్త స్నేహాలని అహ్వానించాలని నా అభిలాష.. మరి నాతో ఫ్రెండ్సిప్ చేస్తారా ఎవరైనా?

Saturday, October 2, 2010

ఆర్య ఆట :)

నేను ఆర్యా ఆట(గులకరాయిని గ్లాసులో వెయ్యటం లేదా.. గ్లాసుని డస్టు బిన్లో వెయ్యటం లాంటివి) ఆడే ప్రతిసారీ, నా లవ్ సక్సెస్ అనే చూపెడుతుంది.. (అంటే అది వేస్తున్న కంటెయినర్లో కాకుండా ప్రక్కన పడితే నా లవ్ సక్సెస్ ఔతుంది అనుకుంటా లెండీ).... ఏంటో లవ్ సక్సెస్ అనే చూపించినా.. లవర్ దొరకదే... this is too much కదా??

Friday, October 1, 2010

బాబ్రీ వివాదాస్పదమైనప్పుడు తాజమహల్ ఎందుక్కాదూ?

తాజ్‌మహల్ కట్టడం భగ్నప్రేమకి చిహ్నమని భావించే కట్టడమని చరిత్రలో ఉన్నా.. కొన్ని ఆధారాలు నిజమైనట్లైతే, అది కూడా వివాదంలో అయోధ్య కంటే వేరే కాదనే చెప్పొచ్చు... ఆ విధంగా ఐతే దాని మీద ఎందుకు వివాదం చెలరేగలేదూ... వి.హెచ్.పీకీ, ఆర్.ఎస్.ఎస్ కీ దాని గురించి తెలియదా, లేకుంటే తెలిసిన దానిలో నిజం లేదా లేకుంటే వాళ్ళు రాముని తప్ప శివుని పూజించరా?
Base for argument: CLICK HERE