ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద సంస్కృతంలో ఒక మంచి శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో వాక్చాతుర్యం అనేది ఒక నిజమైన, మరియు శాశ్వతమైన అలంకారంగా పేర్కొనబడింది... చంద్రహారాలూ, లేపనాలూ, పన్నీటి స్నానాలూ, పూల మాలలూ అలంకారాలు కాదూ, సంస్కారంతో కూడిన(contextual interpretation needed) వాక్కు సరైన అలంకారమౌతుందీ, వాక్కు అనే అలంకారమే లోకాలలోకెల్లా మంచి అలంకారం అని చెప్పబడింది... కేయూరాని న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా భర్తృహరికి వాక్కు అనే అలంకారంతో పాటు, ఆచరణ అనే అసంక్రమిక ఆస్తి గురించి మనసులో తట్టలేదేమో.. అప్పటి పరిస్థితుల ప్రభావంలోనూ, దేశ కాల మాన స్థితిగతులలోనూ ఆచరణకి అంత ఆధరణ లేకనో అలా కాక తను ప్రేమతో ఇచ్చిన పండు చేతులు మారిన విధానంతో, జీవితం అనే విషయంలో కన్నులు తెరిచి మోక్షపదం వైపు దృష్టి మరలిపోవటం వలననో మరి తెలియదు. కానీ అలంకారం అలంకారమే కానీ మనిషి కాదు, మనిషేంటో తెలియజేసేది అతని ఆచరణ, వ్యవహారం... simply speaking work and worth of human makes him what he/she really is. అందుకనే ఆంగ్లంలో కూడా చెబుతారు Actions speak louder than Voice అని... పై శ్లోకాన్ని విమర్శిస్తుందా అనేటట్లుండేది ఒక వేమన పద్యం అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను హహహహ్!! ప్రస్తుత ప్రపంచం అంతా vacuumలో పెట్టిన ఇనుము అయస్కాంతం తనని attract చేసిన వైపు దూసుకుపోతున్నట్టు ప్రయాణిస్తుంటే, నీతులెన్ని చెప్పి ఏం లాభం లే, ఇటు తనకీ పనికిరావు, అటు వాటిని చదివేవాడికీ పనికిరావనేమో ప్రస్తుత కాలపు రచయితలెవరూ అలాంటివి రాయటానికి పూనుకోవట్లేదు... ఏదేమైనా ఒకటి మాత్రం నిజం కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవటం అనేది, సౌండు బాక్సుల్లేని మ్యూజిక్ సిస్టం లాంటి పరిస్థితి. వాళ్ళ బుర్రలో/చేతల్లో చేవ ఎంతుందో మనకీ and/or వాళ్ళకీ తెలియకపోయినా తెలియాల్సిన అవసరం లేకుండానే, వాళ్ళ మాటల్తోనే చిలుక జోస్యం నుండి టీవీ యాంకరింగ్ వరకూ నిరాటంకంగా మరియు దగ'ధ్ధగా'యమానంగా సాగుతున్న జీవితాలు.. భర్తృహరి శ్లోకానికి ఉదాహరణలు.. :) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, October 31, 2010
కేయూరాని న భూషయంతి పురుషం..(my view on art of communication)
Labels:
philosophy,
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
Your interpretation is excellent!
ReplyDelete@సుజాత:
ReplyDeleteదన్యవాదాలండీ సుజాతగారూ :)