"ఏమని చెప్పాలీ, ప్రేమని చెప్పాలా, నేను తీవ్రంగా పని చేసుకుంటుంటే అది గాఢంగా నిద్ర పోతుంది... ఐనా నేను బిజీ, లవ్ అంటే టైం స్పెండ్ చెయ్యాలి, నాకు అస్సలు ఖాళీ లేదు....", ఇప్పటి కాలపు జనాల్లో ఎవరన్నా ఒకరు ప్రొపోజ్ చేస్తే వాళ్ళకి చెప్పులు చూపించకుండా చెప్పే మామూలు సమాధానం. నిజమే పాశ్చాత్య ధోరణి అనాలో, లేక పోటీ తత్వం అనాలో లేక, సంపాదన ధ్యాస అనాలో లేక, ఆధిపత్యం పై మితి మీరిన ఆశ అనాలో, లేక అతి వ్యక్తిత్వ లక్షణాలనాలో తెలీదు, కానీ ఎలాంటివైనా సరే ఈ పరిస్థితులన్నీ ప్రతి వ్యక్తినీ వెక్కిరిస్తున్నాయ్, తనకంటూ ఉండాల్సిన ఒక భాగస్వామి సహచర్యాన్ని గుర్తు చెయ్యగానే గుండెల్లో గగుర్పాటు, వెన్నులో చలి వచ్చేలా చేస్తున్నాయ్... ప్రతి వ్యక్తికీ తన వ్యక్తి పైన ఉండాల్సిన ప్రేమని నిద్రాణమయ్యేలా చేస్తున్నాయ్... ఈ విషయంలో ఎక్కువ చెబితే ప్రతి వ్యక్తికీ బోర్ కొడుతుంది, అలాగని విషయం తెలిసి తమ దారి మార్చేవారి సంఖ్య ఎప్పుడూ సున్నాకి పెరగదు... కానీ అభిప్రాయాన్ని వ్యక్తపరచటం, సహజ మానవ నైజం కనుక నేను వ్యక్తపరుస్తున్నాను...
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, April 19, 2012
ఏంటీ "ప్రేమా", నువ్వు అంత బేవార్సుగా పని లేకుండా ఉన్నావా???
Tuesday, April 17, 2012
ఢమాల్...
డాక్టర్కి ట్రీట్మెంటిచ్చి వచ్చేశాను అంటే నేను డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను అని అర్ధం అన్నమాట, ఆయనేంటో అలా హాశ్చర్యేపోయేశాడు... మన సంభాషనంతా ముళ్ళపూడి వారి జాఠర్ ఢమాల్ టైపాయే... అందుకే ఫ్ఫది లెక్కెట్టేలోపెల్లకపోతే పెయి"వేటు" పడుతుందని వెళ్ళిపొయ్యేశాడు.... |
Saturday, April 14, 2012
ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు...
ఎదుగుతున్న వృక్షాన్ని చూశావా మిత్రమా ఆదిలో అది కాండం నేడది విడివడిన కొమ్మలని నిశ్శబ్ధంగా చూసే ఆహార మాద్యమం మాత్రమే వృధ్ధిలో ఉన్న ప్రపంచాన్ని గాంచావా మిత్రమా, కొమ్మలుగా విడివడిన సంస్కృతులు, చిరుగాలికి రాలిపోయే పత్రపుఛ్ఛాల్లాంటి మనో ప్రవృత్తుల సముదాయమే అది అభివృద్ది చెట్టు యజమానికిష్టం, పండ్లు దొరుకుతాయి కాబట్టి కానీ వేర్పడిన కొమ్మలన్నిటికీ నీరందించే మొదలు గురించి కానీ, వేరు అనుభవించే బాధ గురించి కానీ తలపుకైనా రాని మనిషి వాడు, ప్రపంచాన్ని వాడుకునేవాడు... వేడుకునేలానే కనిపించేవాడు... వేరు పురుగులా చేరి పండ్లనే కాక మొదలుని కూడా తొలచేవాడు... అందుకే ఎప్పటికీ అడిగే ఒకే ఒక ప్రశ్న.... అనంతమైన నిశ్శబ్ధ నిశీది వంటి కాల గమనవై సాగే ఓ ప్రపంచమా... నీ పయనమెటు నువ్వు సాగే ప్రతి మలుపు నువ్వు మలచుకున్న దారే ఐతే, నువ్వు కావాలనుకునే గమ్యం గమనమా, లేక గమ్యమా నీ తరం నచ్చే దోవ నీది కాని దానికి నచ్చకుంటే నూతన తరం దానిని అసహ్యించుకుంటే... నీ గమనానికి అర్ధం లేదనుకునే వార్ధక్యం నీకో వరమా లేక శాపమా... మంత్రమై సాగిందట పౌరాణిక జీవితం, వేల ఏళ్ళు సాగేదట తపస్సనే యజ్ఞం... తంత్రమైపోయిందట రాజరికపు రణ జీవితం, బానిస శృంఖలాల జీవన వ్యవస్థలో యంత్రమై సాగుతుంది నా తరం, యంత్రానికి యంత్రమై, దాని మంత్రానికీ, తంత్రానికీ బానిసై... దాని ప్రతి ఆజ్ఞకి సై అంటూ... ఇంక నువ్వేమి చూస్తావో ఓ భవిష్యద్విధాతా... ఎలాంటి బలమో లేక ఎటువంటి భారమో... ఏదేమైనా మోయలేని ప్రతి తరాన్ని తిడుతుంది దాని ప్రక్క తరం... అందుకే చెబుతావా ఓ ప్రపంచమా, సాగే నీ పయణమెటో>>> |
Friday, April 13, 2012
Thursday, April 12, 2012
Tuesday, April 10, 2012
ఎవరివో నువ్వెవరివో...!!
అడుగుతున్నా అందరినీ ఎవరివో నువ్వెవరివో అని మబ్బులు అడ్డం వచ్చిన నిండు పున్నమి వెన్నలవా అందమైన రేకులు విచ్చిన గుళాబీ బాలవా లేక దారానికి గుచ్చిన సుగంధ పరిమళ మల్లెల మాలవా ఎవరివే నువ్వు ఓ చెలీ నా మనసుని దోచిన జాబిలీ |
Monday, April 9, 2012
ఎందుకో ఈ అతి నాగరికపుటలవాట్లు...
ఏం చేస్తున్నావురా అంటే... పెళ్ళి చూపుల కోసం బయోడేటా తయారు చేస్తున్నానన్నాడు వాడు, ఇంకేం, పనిలో పనిగా "స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్" దానితో పాటుగా రెండు మూడు "రెకోలు" కూడా తీసుకో అని చెబితే, కోపంతో కూడిన, వెటకారపు ఫేసొకటేసుకుని నాకేసి చూశాడు... మరి లేప్పోతే ఏంటో, బయోడేటాలూ లాంటి ఈ అతి నాగరికపుటలవాట్లు... పెళ్ళి చేస్తున్నారా లేక ఉద్యోగానికో, రీసెర్చికో ఎవర్నన్నా తీసుకుంటున్నారా... ప్రపంచం నిండా వీడిలాంటి టూ మచ్ మనుషులు ఎక్కువైపోతున్నారు... ఐనా ఈ రోజుల్లో పెళ్ళి ఐతే డబ్బుల కోసమో లేప్పోతే సొసైటీ తనని ఫీలయ్యేటట్టు చేస్తుందనో కాకపోతే ఇంకెందుకు చేసుకుంటున్నారులే... నాన్వెజ్ తినే చెవిటోడి ముందు శంఖమూదితే ఎముకనుకుని లాక్కుని పారిపోయాడనే సామెతలు ఊరికే పుడతాయా... ఐనా ఉన్న ట్రెండుతో మనం సర్దుకు పోవాలి, అది నచ్చకపోతే కొత్త ట్రెండ్ సృష్టించాలి, అంతే కానీ ఎవరో ఫాలో ఔతున్న ట్రెండుని మార్చాలనుకునేంత వెర్రితనం ఇంకోటుండదు... |
Friday, April 6, 2012
ఆయ్!! సన్నటోళ్ళారా...
కలవో, కల్పనవో లేక వైష్ణవ మాయవో, ఏ తీరున నిన్ను చేరాలీ అని ఒక obese person, slimnessని ప్రాధేయపడటం చూశాను, నాకు నవ్వాగలేదు... నేను నవ్వుతుంటే, మా ఫ్రెండన్నాడు అదేంటీ ఆ prayer అతనూ నువ్వూ కలిసి చెయ్యాలి కదా అని... ఈ సన్నటోళ్ళున్నారే, వీళ్ళకి సైకిలు పంపు పెట్టి లావుగా అయ్యేటట్టు గాలి కొట్టాలి.. అస్సలు సన్నంగా ఉండేవాళ్ళకి లావుపాటోళ్ళు చేసే సాయాన్ని వాళ్ళు నిజంగా గుర్తించట్లేదంటాన్నేను, హా!! ఔను ఇది నిజం... అంతే కదా, ఈ లావుగా ఉండేవాడిని చూడలేకే కదా ఆ సన్నంగా ఉండేవాడి గర్లుఫ్రెండు ఆ సన్నటోడు ఏవరేజిగా ఉన్నా వాడికి ఫ్లాట్ అయ్యేది... ఏ క్రికెట్టో ఆడుతున్నారనుకో వీళ్ళిద్దరూ, లావుగా ఉండేవాడు పరిగెత్తలేడు కాబట్టే కదా సన్నటోడు వాడిని రన్నౌట్ చెయ్యగలిగేది, అలాగే వాడు క్యాచ్ వదిలేయబట్టే కదా వీడు ఔటవ్వకుండా ఎక్కువ రన్స్ కొట్టగలిగేది... పోనీ వాళ్ళిద్దరూ భోజనానికెళ్ళారనుకోండి, లావుగా ఉన్నోడు డైటింగనో ఇంకేదో టింగనో పాపం వాడి దగ్గర ఉన్న ఫుడ్ కూడా సన్నటోడికే ఎక్కువ ఇచ్చేస్తాడు, మొన్ననే ఫేసుబుక్కులో చూసిన ఒక పిక్చర్లోలాగా ఏ ఎలుగు బంటో వెంట పడిందనుకోండి, లావుగా ఉండే వాడు పరిగెత్తలేడు కాబట్టి వాడే దొరికిపోతాడు, సన్నటోడు రక్షించబడతాడు... అబ్బబ్బబ్బా ఇలా చెబుతూ పోతే ఎన్నున్నాయో, మరి అలాంటప్పుడు సన్నంగా ఉన్నోళ్ళంతా వచ్చి రోజు లావుగా ఉన్నోళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టుకుని, గౌరవిస్తూ బ్రతకాలా లేదా?? ఆయ్!! సన్నటోళ్ళారా :) |
Monday, March 26, 2012
Tuesday, March 20, 2012
ఇంట్రోస్పెక్షన్ మరీ ఇలా ఉంటే కష్టం...
విరహ గీతాలు పాడాల్సిన వయసురా నీది, మరి ఆ విషాద రాగాలేంటీ, ఒళ్ళంతా కళ్ళే ఐన మనిషికి కూడా నీకొచ్చినన్ని కన్నీళ్ళు వచ్చి ఉండవేమో... నీకు అర్ధం కాని విధంగా, నిన్ను అర్ధం చేసుకోని విధంగా జనం మారిపోయారని, కాలం మారిపోయిందని భావించాల్సిన అవసరం ఏంటిరా... మెతుకుల కోసం కళ అనుకునే వాడు ఫీలవ్వాలిరా భావుకత ఎదుటివాడికి నచ్చితేనే అందులో అర్ధం ఉందనీ... నీలాంటివాడు కాదు... ఎదుటి వాడు చచ్చిపోతున్నాడని నువ్వు గాలి పీల్చట్లేదు, ఎదుటి వాడికి ఆకలేస్తుందని నువ్వు భోజనం చేయట్లేదు... నీనుండి ఎదుటి వాడికైనా ఎదుటివాడి నుండి నీకైనా కావాల్సింది కోరుకోవాల్సిందీ, పలకరించే ఒక మనిషితనం, కష్టాల్లో ఆదుకునే తాహతు ఉంటే సాయం చేసే మానవత్వం... అమీబాలో లేనిదీ, పొరిఫెరా నుండి మొదలైందీ ఇదేరా... నీకో విషయం తెలుసా ప్రతి మనిషీ నీలాగనే అనుకుంటాడు భాద్యతల్నుండి దూరంగా ఉంటూ ఎప్పటికీ తెలియని నిద్ర పట్టేస్తే బాగుంటుందని... నొప్పి తెలియనిదే అనంత కాలపు ఆ నిద్ర నీకే కాదు ఎవరికీ రాదు... ఒక వేళ వచ్చినా నీ వాళ్ళు నీవు లేని నొప్పిని తట్టుకోవటం అంత సులభమని అనుకుంటున్నావా... బంధాలు విడిపోతున్న, విడిపోవటమే సమంజసమనుకుంటున్న సంస్కృతిని అలవర్చుకున్నవాళ్ళు అందులో ఎంతో కాలం మన గల్గుతారని అనుకుంటున్నావా?? అది కల్ల... ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ అంటూంటావ్ కదా, కానీ అన్ని రకాలుగా ఆ హ్యాపీనెస్ సంపాదించటానికి నువ్వు చేయాల్సిన త్యాగాలెన్నో ఎప్పుడైనా ఆలోచించావా.... న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలు ఒకడికి తెలియవని వాడు మోసే బరువు వాడికి తెలియకపోతుందనుకోవటం అమాయకత్వమౌతుందిరా... జీవిత పాఠశాలలో మేష్టార్లంతా మనుషులు కాదురా, వాళ్ళు చాలా రకాలు, వద్దంటున్నా నేర్పించేస్తుంటారు... నువ్వెవరైనా ఎలాంటి విధ్యార్ధివైనా సరే... పాపం నిన్ను శిక్షించారని రిపోర్టు చెయ్యటానికి కూడా ఆస్కారం లేకుండా దాక్కుని మరీ శిక్షిస్తారు వాళ్ళు... ఓ అనంత దూరపు బాటసారీ, నీ మిసిమి ఛాయని చూసి మురిసిపోకోయి అంటూ ప్రతి రోజూ మృత్యువు తను కనిపించకనే ప్రతి ఒక్కరినీ పలుకరిస్తుంది... దానిని గురించి భయపడేవాడిని వెక్కిరిస్తుంది, దానిని కోరుకునేవాడిపై జాలి పడుతుంది... ఓటమి గురుతెరగని గెలుపుందని నువ్వు నమ్మావంటే ఓ చంద్రం, జీవిత పాఠంలో ఓనమాలు కూడా నీకు రావనిరా అర్ధం, చేసుకోకురా నీ జీవితాన్ని వ్యర్ధం...(ఇలా నాలో నిద్రానమై ఉన్న ఒకానొక మనిషి ఒక్కసారిగా లేచి ఉత్కంఠభరితంగా ఇలా ఉపన్యసించాడు) |
Monday, January 23, 2012
Subscribe to:
Posts (Atom)