విరహ గీతాలు పాడాల్సిన వయసురా నీది, మరి ఆ విషాద రాగాలేంటీ, ఒళ్ళంతా కళ్ళే ఐన మనిషికి కూడా నీకొచ్చినన్ని కన్నీళ్ళు వచ్చి ఉండవేమో... నీకు అర్ధం కాని విధంగా, నిన్ను అర్ధం చేసుకోని విధంగా జనం మారిపోయారని, కాలం మారిపోయిందని భావించాల్సిన అవసరం ఏంటిరా... మెతుకుల కోసం కళ అనుకునే వాడు ఫీలవ్వాలిరా భావుకత ఎదుటివాడికి నచ్చితేనే అందులో అర్ధం ఉందనీ... నీలాంటివాడు కాదు... ఎదుటి వాడు చచ్చిపోతున్నాడని నువ్వు గాలి పీల్చట్లేదు, ఎదుటి వాడికి ఆకలేస్తుందని నువ్వు భోజనం చేయట్లేదు... నీనుండి ఎదుటి వాడికైనా ఎదుటివాడి నుండి నీకైనా కావాల్సింది కోరుకోవాల్సిందీ, పలకరించే ఒక మనిషితనం, కష్టాల్లో ఆదుకునే తాహతు ఉంటే సాయం చేసే మానవత్వం... అమీబాలో లేనిదీ, పొరిఫెరా నుండి మొదలైందీ ఇదేరా... నీకో విషయం తెలుసా ప్రతి మనిషీ నీలాగనే అనుకుంటాడు భాద్యతల్నుండి దూరంగా ఉంటూ ఎప్పటికీ తెలియని నిద్ర పట్టేస్తే బాగుంటుందని... నొప్పి తెలియనిదే అనంత కాలపు ఆ నిద్ర నీకే కాదు ఎవరికీ రాదు... ఒక వేళ వచ్చినా నీ వాళ్ళు నీవు లేని నొప్పిని తట్టుకోవటం అంత సులభమని అనుకుంటున్నావా... బంధాలు విడిపోతున్న, విడిపోవటమే సమంజసమనుకుంటున్న సంస్కృతిని అలవర్చుకున్నవాళ్ళు అందులో ఎంతో కాలం మన గల్గుతారని అనుకుంటున్నావా?? అది కల్ల... ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ అంటూంటావ్ కదా, కానీ అన్ని రకాలుగా ఆ హ్యాపీనెస్ సంపాదించటానికి నువ్వు చేయాల్సిన త్యాగాలెన్నో ఎప్పుడైనా ఆలోచించావా.... న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలు ఒకడికి తెలియవని వాడు మోసే బరువు వాడికి తెలియకపోతుందనుకోవటం అమాయకత్వమౌతుందిరా... జీవిత పాఠశాలలో మేష్టార్లంతా మనుషులు కాదురా, వాళ్ళు చాలా రకాలు, వద్దంటున్నా నేర్పించేస్తుంటారు... నువ్వెవరైనా ఎలాంటి విధ్యార్ధివైనా సరే... పాపం నిన్ను శిక్షించారని రిపోర్టు చెయ్యటానికి కూడా ఆస్కారం లేకుండా దాక్కుని మరీ శిక్షిస్తారు వాళ్ళు... ఓ అనంత దూరపు బాటసారీ, నీ మిసిమి ఛాయని చూసి మురిసిపోకోయి అంటూ ప్రతి రోజూ మృత్యువు తను కనిపించకనే ప్రతి ఒక్కరినీ పలుకరిస్తుంది... దానిని గురించి భయపడేవాడిని వెక్కిరిస్తుంది, దానిని కోరుకునేవాడిపై జాలి పడుతుంది... ఓటమి గురుతెరగని గెలుపుందని నువ్వు నమ్మావంటే ఓ చంద్రం, జీవిత పాఠంలో ఓనమాలు కూడా నీకు రావనిరా అర్ధం, చేసుకోకురా నీ జీవితాన్ని వ్యర్ధం...(ఇలా నాలో నిద్రానమై ఉన్న ఒకానొక మనిషి ఒక్కసారిగా లేచి ఉత్కంఠభరితంగా ఇలా ఉపన్యసించాడు) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Tuesday, March 20, 2012
ఇంట్రోస్పెక్షన్ మరీ ఇలా ఉంటే కష్టం...
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
abbaa! Amazing..
ReplyDeletewell said!
ReplyDeleteధన్యవాదాలండీ SNKR గారూ...
ReplyDeleteధన్యవాదాలండీ రసజ్ఞ గారూ... :)
ReplyDelete