ఏం చేస్తున్నావురా అంటే... పెళ్ళి చూపుల కోసం బయోడేటా తయారు చేస్తున్నానన్నాడు వాడు, ఇంకేం, పనిలో పనిగా "స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్" దానితో పాటుగా రెండు మూడు "రెకోలు" కూడా తీసుకో అని చెబితే, కోపంతో కూడిన, వెటకారపు ఫేసొకటేసుకుని నాకేసి చూశాడు... మరి లేప్పోతే ఏంటో, బయోడేటాలూ లాంటి ఈ అతి నాగరికపుటలవాట్లు... పెళ్ళి చేస్తున్నారా లేక ఉద్యోగానికో , రీసెర్చికో ఎవర్నన్నా తీసుకుంటున్నారా... ప్రపంచం నిండా వీడిలాంటి టూ మచ్ మనుషులు ఎక్కువైపోతున్నారు... ఐనా ఈ రోజుల్లో పెళ్ళి ఐతే డబ్బుల కోసమో లేప్పోతే సొసైటీ తనని ఫీలయ్యేటట్టు చేస్తుందనో కాకపోతే ఇంకెందుకు చేసుకుంటున్నారులే... నాన్వెజ్ తినే చెవిటోడి ముందు శంఖమూదితే ఎముకనుకుని లాక్కుని పారిపోయాడనే సామెతలు ఊరికే పుడతాయా... ఐనా ఉన్న ట్రెండుతో మనం సర్దుకు పోవాలి, అది నచ్చకపోతే కొత్త ట్రెండ్ సృష్టించాలి, అంతే కానీ ఎవరో ఫాలో ఔతున్న ట్రెండుని మార్చాలనుకునేంత వెర్రితనం ఇంకోటుండదు... |
biodata/recommendations/references లేకుండా పెళ్ళిల్లు ఎప్పుడూ జరగలేదు (I mean arranged marriages లో).అబ్బాయి చదువు-సంధ్య, జీతం-బెత్తం, ఉద్యోగం వివరాలు ఇవన్ని పెద్దవారు చూసేవారు కదా ఒకప్పుడు కూడా.ఇంకా DOB వివరాలకి జాతకాలు ఉండేవి.ఒకప్పుడు కూడా references check చెయ్యడం/recommendations అవీ ఉండేవీ. అబ్బాయి గురించే కాక అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడమనే వారు కదా? ఇప్పుడు అన్ని చక్కగా biodata లోనే ఉంటాయి అన్ని వివరాలు. అందుకని ఏమీ మారలేదు సుమండీ!తెలుసుకోండి!పెళ్ళి అనేది ఇప్పుడూ, ఎప్పుడూ జీవితాంతం కలిసి ఉండే తోడు కోసమే.అంతే కాని society కోసమో, డబ్బు కోసమో చేసుకుంటే that is something else!!!
ReplyDelete(ఎమిటీ లెక్చర్ అని తిట్టుకోకండే!)
@జలతారు వెన్నెల
Deleteనేను బేసిగ్గా అరేంజిడు మ్యారేజీలకి వ్యతిరేకినండీ... నాకు తెలిసినవాళ్ళ ఏ పెళ్ళి సంభందాలలోనూ, ఇష్టాల కంటే ఎక్కువగా ఆస్తులకీ, అంతస్తులకీ, కట్నాలకీ, పొజిషన్లకీ ఇంకా ఎన్నో ఇలాంటివాటికే ఇంపోర్టెన్సు ఇవ్వటం చూశానండీ, ఎందుకో నాకు అవేమీ నచ్చలేదు... మీ ఒపీనియన్ ఇంకా ఇంటరెస్ట్ మీరు ఉఠంకించిన విషయాలపైన కరడు గట్టి ఉంటే నేనేమీ ఆర్గ్యూ చెయ్యలేను కానీ, మీరు మామూలుగా ఆలోచించగలిగేవారే ఐతే, ఒక జీవితాంతపు తోడుని వెతుక్కోవాల్సిన విధానానికి ఉండాల్సిన లక్షణాలా అక్కడ పేర్కొన్నవి, గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి...
ఏమో నాకైతే యాంత్రికంగా సాగుతున్న ఈ వివాహ వ్యవస్థ మీద కూడా ఒక రకమైన ఏహ్య భావం కలుగుతుందండీ, ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ మనో భావాల్ని దెబ్బ తీయాలని కాదు
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ :)
alaa emi ledandi. Biodatalu avi marriage bureau ke kada adugutaaru ani aa. Example cheppanu. Antekaani inkemi kaadu. Society chaalaa maarindi. Inkaa maarutundi ani naa nammakam.
Delete