"సమయం పది గంటలు కావస్తోంది, అప్పటికి ఖచ్చితంగా అరవై నిమిషాల వ్యవది ముందే ఆ రోడ్డుకి రెండు వరుసల అవతల ఉన్న స్కూల్ బెల్ గణగణమంటూ మ్రోగింది . అప్పుడే పదో అంతస్థులో అద్దాల కిటికీని కీచు మంటూ తెరచి తన కారు ముందుకు దుమికాడు హీరో...", నాకు ఇలాంటి కథలంటే ఇష్టం అని చెప్పాను వాడితో. ఏరా వీటిని థ్రిల్లర్స్ అంటారు, ఒక్క ముక్క చెప్పటానికి అంత స్టోరీ అవసరమా రా, అని బేలగా వాపోయాడు మా ఫ్రెండు నా వివరణాత్మకమైన ఇంటరెస్టు విని... కథ బాగుంది కదా కంటిన్యూ చేద్దామా అని అడిగాను వాడిని. "నువ్వొకడివిరా నాన్‌వెజ్ ఐటమ్సులో మనిషి బ్రెయిన్ తప్ప వేరొకటి రుచించదేం నీకూ", అన్నాడు.. తప్పించుకు పారిపోటానికి కూడా కుదరని విదంగా ఇద్దరం వెహికల్‌లో ఉన్నామాయే... ప్రపంచంలో జరుగుతున్న సోది కబుర్లు తప్పించి తనకి వేరే విషయాలు ఏవీ ఇష్టపడవాయే. "పెనం మీద కూర్చుని సోఫాసెట్లాగా ఫీలవ్వాలంటే కుదురుతుందా, కానీ మహాశయా తగలడండి తమ స్టోరీని, అన్నాడు". కథ మళ్ళీ మొదలైంది...
హీరో నేల మీదకి దూకగానే విలన్ గ్యాంగ్ వాడిని వల వేసి మరీ పట్టుకుంది... కానీ విషయమేంటంటే, వాళ్ళు పట్టుకుంది హీరోని కాదు, పదో అంతస్తు పిట్టగోడ మీద అంతకు ముందు రోజు హీరో తినేసి పడేసిన అరటి తొక్క మీద కాలేసి జారిన కమెడియన్ని వాళ్ళు పట్టుకున్నారు. "ఒరేయ్ నీ..." (ఈ పిలుపు కథలో బాగం కాదు, మా ఫ్రెండు పిలిచాడు), "ఏంట్రా", అన్నాను.. "మొదటి నుండీ హీరోయే వస్తున్నాడన్నావ్ కదరా, ఐనా ఎవడైనా కంపేరిజన్ కోసం పది గంటలకి ఆఫీసు ఓపెన్ చేస్తున్నారనో లేకపోతే షాప్ తెరుస్తున్నారనో చెబుతారు, నువ్వేంట్రా గంట ముందు ఎక్కడో ఉన్న స్కూల్ బెల్ మ్రోగిందని చెబుతున్నావ్" అన్నాడు వాడు. "మరి హీరో రాకపోతే, వచ్చేది కమెడియన్ ఐతే ఆ విషయం ముందే చెప్పాలి కదరా పాఠకులకీ లేదా ప్రేక్షకులకీ ?" అని ప్రశ్నాస్త్రాన్ని నా మీదకి సంధించాడు", వాడికి సమాధానంగా, "నీలాంటోడే రామాయణం అని హెడ్డింగు చెబితే ద్రౌపది ఎక్కడ్నుంచొచ్చిందీ అన్నాడంట, పూర్తిగా వినరా గాడిదా", అన్నాను.. పాపం ఇది చదువుతున్న మీలాగే వాడికి కూడా బ్రెయిన్ అప్పటికే బొప్పి కట్టినట్టుంది, దిగాలు పడి, కళ కోల్పోయిన మొహంతో, "సర్లే, కంటిన్యూ ..", అన్నాడు. నేను మళ్ళీ ప్రారంభించాను,"పట్టుబడిన కమెడియన్ని రక్షించటానికి హీరో ఒక పథకం వేయాలనుకున్నాడు .., హీరోకి కౌబాయ్ సినిమాలంటే ఇష్టం, అందుకే వాడి దగ్గర ఉన్న థర్డ్ హ్యాండు, అద్దం పగిలి, బఠానీల వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్న బెంజ్ కారు వదిలేసి గుర్రమెక్కి బయలుదేరాడు ...", ఇంతలో మా ఫ్రెండు కండిషనేంటా అని ఒకసారి చూశా, పాపం మొహమాటస్తుడేమో, నా కథా హింస నుండి వాడికి సాయం చెయ్యమని వాడికి తెలిసిన దేవుళ్ళ పేర్లన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా బిక్క మొహం వేశాడు, ఇంకా కొద్దిసేపు నేను కంటిన్యూ చేస్తే ముందు ఇలా, అటు తర్వాత ఇలా ఐపోతాడేమో అని కథ ముగించేద్దామనే ఆలోచనతో, "అండ్ దెన్ దే లివ్డ్ హ్యాపీలీ టుగెదర్ ఫరెవర్" అని చెప్పేశాను..
మూర్చపోటానికి సిధ్ధంగా ఉన్నవాడు కాస్తా, ఒక్కసారి కోపంగా పైకి లేస్తూ.. .. "ఎవర్రా హ్యాపీ బ్రతికారు? కమెడియనూ, విలన్ గ్యాంగా లేక గుర్రమూ,హీరోనా... స్కూలు బెల్లు బంట్రోతూ,వాళ్ళావిడానా లేక బొక్కి బెంజి కారూ, బఠాణీల వాడూనా..., నామానాన నేను అద్దం కదలని విండో సీట్లో కూర్చుని ఎప్పుడు ఊరొస్తుందా అని ఎదురు చూస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటే, కథ అని చావగొట్టావ్.. నీ--- ---", అని తిట్టాడు. "సారీరా నేను కథ చెబుతూ ఉంటే నువ్విలా క్లౌడ్ నైన్లో విహరిస్తూ వింటావనుకున్నారా, కానీ నువ్విలా ఫీలౌతావనుకోలేదురా, ఐనా నువ్వు చిరాగ్గా ఉన్నావని, కథ అలా అర్ధాంతరంగా ఆపేశాను, నిజానికి నేను హ్యాపీ ఫరెవర్‌గా ఉంటారని చెప్పింది కమెడియన్,హీరో ఇంకా విలన్, హీరోయిన్ పెయిర్స్ గురించి", అన్నాను. ఆ ది ఎండ్ స్టోరీ విని వాడు ఇంత పని చెయ్యటానికి పూనుకున్నాడు, నేను తప్పించుకోవాలి కదా అందుకే ఇలా మెరుపు వేగంతో పారిపోయాను, వేరే సీట్లోకి... కానీ వాడంటే కచ్చ ఉన్న మిగిలిన ఫ్రెండ్సంతా ఇలా         రకరకాలుగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు..
ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్ కి కథ చెప్పకూడదు అని నేను మాత్రం డిసైడైపోయా.... |
No comments:
Post a Comment