"An Inconvenient Truth" సినిమా, పారామౌంటువాళ్ళు తీశారు, గ్లోబల్ వార్మింగు వార్నింగుని పట్టించుకోని వాళ్ళకి, ఇది నిజంగా చెమటలు పట్టించే మూవీ..??, ఈ క్రింది లింకులో మీరు ఆ సినిమా మొత్తం చూడొచ్చు... అంతా బాగానే ఉంది కానీ.. సినిమాటిక్ ఉత్కంఠని ఏర్పరచటానికి కొద్ది అతి చేశారని చెప్పొచ్చు... An Inconvenient truth movie ఆస్కార్ అవార్డు కూడా లభించిన ఈ సినిమా మీద, విమర్శలు కూడా తక్కువేమీ లేవు... సినిమా రక్తి కట్టాలని, కొన్ని కొన్ని అసంబద్దమైన విషయాలని చొప్పించారని, అలాగే.. ఐస్ కరగటానికీ.. గ్లోబల్ వార్మింగుకీ.. గ్రీన్ హౌస్ గ్యాసెస్‌కీ మద్యనున్న సంబంధాలని వివరించే.. రేఖాపటాలలో శాస్త్రీయత లేదని.. ఇలా పలు రకాల విమర్శలున్నాయ్... ఈ క్రింది లింకులో వీడియో చూస్తే మీకే అర్దం ఔతుంది Criticism on An Inconvenient truth movie కానీ ఎన్ని రకాలుగా చూసినా, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుండటమూ అబద్దం కాదు, అలాగే సినిమాలో చూపించినంత వేగంగా కాకపోయినా.. చాలా ఏళ్ళలోపు ఐనా సరే వాటి ఎఫెక్ట్సు.. తప్పవనే చెప్పాలి... అంతెందుకు.. ఇప్పడు వాతావరణంలో ఉన్న మొత్తం క్లోరో ఫ్లోరో కార్బన్సుని వాతావరణంలోకి విడుదలవ్వకుండా మానేసినా ఇప్పటికే ఉన్నవి, ఇంకో ఏభై సంవత్సరాలు ఉండొచ్చని సమాచారం.. వాతావరణం పరిస్థితి చూడబోతే... మన తర్వాతి, తర్వాతి తరం పిల్లలందరూ స్పేస్ ట్రావెలింగ్ సూట్సులాంటివాటితో సహజంగా పుట్టేటట్టుగా జెనెటిక్ ఇంజినీరింగు చెయ్యాల్సిన పని మా బయాలజిస్టుల మీద పడేట్టుంది.... మనమొకటి తలిస్తే.. జరిగేది ఎలా జరుగుతుందో మనమూ చూద్దాం...... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Monday, September 6, 2010
An ఇన్‌కన్వీనియంట్ ట్రూత్ A small review...
Labels:
InResponse2,
science
Subscribe to:
Post Comments (Atom)
Yes some what it is excarated.But nothing wrong in in creating such hype for sustainable development and future generations energy needs.
ReplyDelete@అరుణాంక్:
ReplyDeleteమీరు చెప్పింది ముమ్మాటికీ నిజమండీ అరుణాంక్‌గారూ, అలాంటి hype సినిమా వరకూ పర్వాలేదు... అది సినిమా కానప్పుడు... as a person in the field of science.. I never accept...