"హా!! ఏంట్రా అలా చూసి, ఎందుకో కొద్దిగా నచ్చగానే ప్రేమ పుట్టేస్తుందా, ఇప్పటికి నువ్వు పుట్టి పట్టుమని పాతిక నిండుంటాయ్ తెలుసా... పదేళ్ళ క్రితం ఇదే రోజు ఏ పరిస్థితిలో ఉన్నావో కనీసం వీసమెత్తైనా గుర్తుందా నీకు . ఉండదు, ఎందుకో తెలుసా... నీకు భాద్యత అంటే తెలియదు కనక, నువ్వు తినే అన్నం ముద్దలో ఉండే ఒక్కో మెతుకుని ప్రశ్నించి చూడరా, అవి కలగలసి నీ నోటిని చేరేందుకు కారణమైన వాళ్ళ శ్రమ, ఆశ, ఆవేదన ఏమైనా నీకు తెలుస్తాయా ", వాడిని వాయించేస్తుంది అంతరాత్మ.. పాపం దాని తప్పేముందనీ, దాని విద్యుక్త ధర్మాన్ని అది నిర్వర్తించింది. శరీరం పై కొన్ని ఏళ్ళొచ్చాక, మనసు ఎవరి సలహాలనీ స్వీకరించటానికి సహకరించదనుకుంటా . దీన్నే పోజిటివ్‌గా ఆత్మవిశ్వాసమనీ , నెగెటివ్‌గా బలుపు అనీ పిలుస్తుంటారు... సినిమాలో అపరిచితుడికి పలు పర్సనాలిటీలు ఉన్నట్లు వాడికి కూడా ఇంటర్నల్ డిఫెండర్ ఒకడున్నాడు మరి.... "అంటే ప్రేమనేది స్పాంటేనియస్‌గా పుట్టకూడదా?? ఒకమ్మాయ్ నచ్చటానికి కొలమానాలు, కారణాలు, లాంటివి లేకపోతే అది ప్రేమ అవ్వదా?? అన్నం పెట్టే అమ్మా, నాన్నలైనా అలా ప్రశ్నిస్తారో లేదో కానీ నువ్వు బాగా టూ మచ్ చేస్తున్నావ్ అంతరాత్మా![]() ", అంటూ అదేదో సినిమాలో బ్రహ్మనందంలాగా వాపోయాడు , తన అంతరాత్మ ఇంకా ఫోర్స్ చేస్తే తానెక్కడ మారిపోవాల్సొస్తుందేమో అని అనుకుంటా?... పాపం వాడి బంధువుల్లో చాలా మంది వాడికి క్లాసు పీకేవాళ్ళే ![]() ఎక్కువ, వీడి బ్యాడ్ ఫేట్ కొద్దీ చిన్నప్పుడు వీడి లెక్కల మాష్టారు ప్రతిక్షేపించటం అనే పదాన్ని బాగా నేర్పినట్లున్నాడు, అందుగ్గాను ఆ తొక్కలో మైండ్ ఎప్పుడూ ఎవరో ఒకరిని వీడికి ఎగెయినిస్టుగా ప్రతిక్షేపించి , సరిగ్గా టైం చూసుకుని వాడి లోపల ఒక కోర్ట్ సీనో, లేక ఎఫ్.బీ.ఐ దర్యాప్తు బృందాన్నో ఏర్పాటు చేస్తుంది... పాపం ఎప్పుడూ ముద్దాయి వీడే ... ఏంటో వాడి మైండు వాడికి క్లాసు పీకినప్పుడల్లా, వాడిని చూడగానే, చీకేసిన తాటి టెంకెకి రంగురాళ్ళద్దినట్టుండే జుట్టూ, ఫేసూతో పాటు అవతారమంతా, పెళ్ళైపోయి పెళ్ళామెప్పుడుదిలేస్తాదా అని ఎదురు చూసే మగడిలా తయారవుతుంది.. ఇమ్యూనిటీ పూర్తిగా లేని బబుల్ బేబీ సిండ్రోం ఉండేవాడు కూడా వీడిలాగా దీనంగా మొహం పెట్టడేమో... వీడి ఉత్సాహం ఏంటో తెలీదు కానీ, ఒక రోజు ఎవరో ఒక కొత్తగా పెళ్ళైన ఆసామిని అడిగాడంట, ఎలా ఉందండీ మీ వైవాహిక జీవితం ? అని, ఆయన దానేకోమో బహు బేషుగ్గా ఉందోయ్ అంటే, వీడికి డౌటొచ్చీ మీరు నిజంగానే పెళ్ళి చేసుకున్నారా?? అని అడిగేశాడంట. తర్వాతేమైందీ అనే కదా మీ ప్రశ్న, ఏముంటుందీ, వాడు వీడిని హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఒకటి పీకాడు ... ఇదేనేమో కూలిచ్చి కొట్టించుకోటం అంటే... నిజంగా ఇలాంటి అమాయకపు లేదా మొండి స్నేహరత్నాల్ని చూశాక అనిపిస్తుంది... వాళ్ళ సాంప్రదాయాల్ని రక్షించట్లేదని పెద్దవాళ్ళ సణుగుళ్ళూ , ఆధునిక సమాజానికి తగినట్లు ఉండనివ్వట్లేదని చిన్నవాళ్ళ గొణుగుళ్ళు ... ఇవి కాకుండా ఎమోషనల్‌గా ఏమున్నాయి మన మానవ సమాజంలో అని..... హా రీడరూ నీ ఎమోషన్ నాకు అర్దమైంది, పట్టెడన్నాన్ని తడిమి చూస్తే పుట్టెడు బియ్యం ఉడికినట్టా, దానిని కలుపని తెడ్డుకున్న అడ్డేదో తెలిసా నీకు అంటారు కదా... ఏం చేస్తామండీ, జీవమనే ఉచ్చు చిచ్చు నీ పుచ్చుని పట్టి లాగు విధంబులనంతముల్ అన్నట్లుగా, కళ్ళకి గంతలు కట్టుకుని జీవితమనే ఏనుగుని వెతుకుతూ ఉండే సమాజమంతా జీవితాన్ని పలువిధాలుగా వివరిస్తుంటే, గంతలు తీసి దూరం నుండి చూస్తున్న నాకు వాళ్ళలాంటోళ్ళందరినీ చూసి నవ్వొస్తుంది మరి.... నాకు తెలిసిన వాళ్ళలో ఆ ఏనుగంటే ఇష్టం లేని వాళ్ళని కూడా దాన్ని కొలవటానికి తీసుకుపోతుంటే జాలి వేస్తుంది కూడానూ.... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, August 5, 2011
జాలేస్తుంది కూడానూ...!?!?!?!
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
తెలుసా... పదేళ్ళ క్రితం ఇదే రోజు ఏ పరిస్థితిలో ఉన్నావో కనీసం వీసమెత్తైనా గుర్తుందా నీకు
. ఉండదు, ఎందుకో తెలుసా... నీకు భాద్యత అంటే తెలియదు కనక, నువ్వు తినే అన్నం ముద్దలో ఉండే ఒక్కో మెతుకుని ప్రశ్నించి చూడరా, అవి కలగలసి నీ నోటిని చేరేందుకు కారణమైన వాళ్ళ శ్రమ, ఆశ, ఆవేదన ఏమైనా నీకు తెలుస్తాయా
", వాడిని వాయించేస్తుంది అంతరాత్మ.. పాపం దాని తప్పేముందనీ, దాని విద్యుక్త ధర్మాన్ని
. దీన్నే పోజిటివ్‌గా ఆత్మవిశ్వాసమనీ
, నెగెటివ్‌గా బలుపు
అనీ పిలుస్తుంటారు... సినిమాలో అపరిచితుడికి పలు పర్సనాలిటీలు ఉన్నట్లు వాడికి కూడా ఇంటర్నల్ డిఫెండర్ ఒకడున్నాడు మరి.... "అంటే ప్రేమనేది స్పాంటేనియస్‌గా పుట్టకూడదా??
ఒకమ్మాయ్ నచ్చటానికి కొలమానాలు, కారణాలు, లాంటివి లేకపోతే అది ప్రేమ అవ్వదా??
అన్నం పెట్టే అమ్మా, నాన్నలైనా అలా ప్రశ్నిస్తారో లేదో కానీ నువ్వు బాగా టూ మచ్ చేస్తున్నావ్ అంతరాత్మా
", అంటూ అదేదో సినిమాలో బ్రహ్మనందంలాగా వాపోయాడు
, తన అంతరాత్మ ఇంకా ఫోర్స్ చేస్తే తానెక్కడ మారిపోవాల్సొస్తుందేమో అని అనుకుంటా?... పాపం వాడి బంధువుల్లో చాలా మంది వాడికి క్లాసు పీకేవాళ్ళే 
ఎక్కువ, వీడి బ్యాడ్ ఫేట్ కొద్దీ చిన్నప్పుడు వీడి లెక్కల మాష్టారు ప్రతిక్షేపించటం అనే పదాన్ని బాగా నేర్పినట్లున్నాడు, అందుగ్గాను ఆ తొక్కలో మైండ్ ఎప్పుడూ ఎవరో ఒకరిని వీడికి ఎగెయినిస్టుగా ప్రతిక్షేపించి
, సరిగ్గా టైం చూసుకుని వాడి లోపల ఒక కోర్ట్ సీనో, లేక ఎఫ్.బీ.ఐ దర్యాప్తు బృందాన్నో ఏర్పాటు చేస్తుంది... పాపం ఎప్పుడూ ముద్దాయి వీడే
ఫేసూతో పాటు అవతారమంతా, పెళ్ళైపోయి
పెళ్ళామెప్పుడుదిలేస్తాదా అని ఎదురు చూసే మగడిలా తయారవుతుంది.. ఇమ్యూనిటీ పూర్తిగా లేని బబుల్ బేబీ
సిండ్రోం ఉండేవాడు కూడా వీడిలాగా దీనంగా మొహం పెట్టడేమో... వీడి ఉత్సాహం ఏంటో తెలీదు కానీ, ఒక రోజు ఎవరో ఒక కొత్తగా పెళ్ళైన ఆసామిని అడిగాడంట, ఎలా ఉందండీ మీ వైవాహిక జీవితం
? అని, ఆయన దానేకోమో బహు బేషుగ్గా
ఉందోయ్ అంటే, వీడికి డౌటొచ్చీ మీరు నిజంగానే పెళ్ళి చేసుకున్నారా?? అని అడిగేశాడంట. తర్వాతేమైందీ అనే కదా మీ ప్రశ్న, ఏముంటుందీ, వాడు వీడిని హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఒకటి పీకాడు
, ఆధునిక సమాజానికి తగినట్లు ఉండనివ్వట్లేదని చిన్నవాళ్ళ గొణుగుళ్ళు
... ఇవి కాకుండా ఎమోషనల్‌గా ఏమున్నాయి మన మానవ సమాజంలో అని.....
మరి.... నాకు తెలిసిన వాళ్ళలో ఆ ఏనుగంటే ఇష్టం లేని వాళ్ళని కూడా దాన్ని కొలవటానికి తీసుకుపోతుంటే జాలి వేస్తుంది కూడానూ....
No comments:
Post a Comment