ఏంటో కవితలంటే ప్రేమ, ప్రేమంటే అమ్మాయ్, మళ్ళీ అమ్మాయంటే కవితలు.. ఇవన్నీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా సాగుతుంటాయి.. ఐనా ఒకటి నిజం.. ఏదో చదివి అర్దం చేసుకున్న కవితలకీ.. రోడ్డు మీద వెళుతూ అలా ఒకసారి చూసిన ఎడ్వెర్టైజ్మెంటుకీ పెద్ద తేడా ఉండదు.. కవితంటే.. ఫీలయ్యి రాసేది.. చదువుతూ ఫీలయ్యేది.. అప్పుడే.. ఆకాశమంత ఎత్తునుండి దించి.. కత్తితో నరికి అందులో నీటిని తాగినప్పడు కొబ్బరి ఎంత నచ్చుతుందో కవిత అంత నచ్చుతుంది... ఫీలవకుండా చదివేసిన కవిత.. పైన ప్లాస్టిక్ రేపర్ తియ్యకుండా మింగేసిన స్వీట్ తియ్యగా ఎలా ఉండదో అలాగే ఉంటుంది.. ఏమో మీ భావాలు నాతో ఏకీభవించాలని లేదు కదా..
నింగికేసి చూస్తూ ఊహా సుందరిని గురించి ఆలోచిస్తూంటే.. అలా అలా కొన్ని కవితా వరుసలు వచ్చేశాయ్... అవే క్రింద బొమ్మలో ఉన్నాయ్.. చూసి చెప్పగలరు మీ అభిప్రాయాన్ని..
No comments:
Post a Comment