నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Friday, May 28, 2010

కొన్ని వింతలూ, విశేషాలూ

ప్రపంచంలోని సహజ అద్భుతాలు
నడిచే రాళ్ళు
www.FunAndFunOnly.org

గత కొన్ని దశాబ్దాలుగా ఆ desert of Death Valleyలో ఉన్న రాళ్ళు, వాటి  కదలికలతో శాస్త్రీయతని వాదోపవాదాలు వచ్చే స్థాయికి తీసుకొచ్చాయి..


వందల కొద్దీ పౌండ్ల బరువున్న కొన్ని రాళ్ళు ఒకే సారి మూకుమ్మడిగా కొన్ని వందలకొద్దీ గజాల దూరం జరిగిపోతుంటాయి..

 
బలమైన గాలులు మరియు వాటికి తోడుగా మంచుతో కూడిన జారిపోయే నేల ఈ చర్యకి కారణమని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతారు

ఐనా వాళ్ళు చెప్పిన కారణాలు ఆ రాళ్ళు ఒకేసారి వేర్వేరు దిశలవైపు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేదానికి కారణాలు ఇవ్వలేకపోయాయి

వాళ్ళ లెక్కల అంచనాలు కూడా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయాయి, ఎందుకంటే కొన్ని రాళ్ళని కదిలించాలంటే వందమైళ్ళకంటే ఎక్కువ వేగం కలిగిన గాలి కావాలంట..

నిలువపోత లావా

www.FunAndFunOnly.org


చిక్కనైన లావా(శిలా ద్రవం) బయటికి వచ్చి ప్రవహిస్తూండగా చల్లారే సమయంలో, అది ఒక షణ్ముకాకృతి దాల్చిన ఇటుకలు అవేవో మనిషి తయారు చేసినట్టు తయారవుతూ ఉంటాయ్..దీనికి ఒక ఉదాహరణ ఐర్లాండ్ తీరాన ఉన్నటువంటి
the Giant's Causeway (పైన చూపబడింది),
అన్నింటికన్నా పెద్ద ఆకృతి పేరు మాత్రం Devil's Tower in Wyoming.
నీలి బిలములు

www.FunAndFunOnly.org


జలాంతర్భాగంలో అతి లోతైన బిలాలు కొన్ని కనుక్కున్నారు.. అవి వ్యక్తపరచే రంగుని బట్టి వాటి నామధేయం నీలి బిలాలుగా స్థిరపడింది..అవి కొన్ని వందల కొద్దీఅడుగుల లోతుంటాయ్, ఈ ప్రదేశాలలో ఆమ్లజని శాతం తక్కువగా ఉన్నట్లుగా కనుక్కున్నారు..కొన్ని నీలి బిలాలలో పురాతన శిలాజాలున్నట్లుగా గుర్తించారు.. ఆ లోతుల్లో అవి చాలా భద్రంగా, అందంగా ఉంటాయ్.
ఎరుపు పాటు పోట్లు

www.FunAndFunOnly.org


వీటినే శైవలపు పూత లేదా పరుపు అని అభివర్ణించినా ఆశ్చర్యపడనక్కర్లేదు, ఇవి అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో తీరం వెంబడి అగుపిస్తాయి.. ఎర్ర రంగులో..ఇందులో చాలా రకాలు హానికారకాలు కావు, కానీ కొన్ని శైవలాలు అపాయకారులుగా గుర్తించటం జరిగింది..మంచు వలయాలు

www.FunAndFunOnly.org


నీటిలోని వలయాకృతి గల్గిన గమనాల ప్రభావం మూలంగా ఈ మంచు వలయాలు ఏర్పడతాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారుఇవి 500మీటర్ల వ్యాసంతో కూడా గమనించినట్లు పేర్కొన్నారు.. కొన్ని ఒకటొకటిగా కనిపిస్తే.. ఇంకొన్ని గుంపుగా కనిపించాయంట

భీకరాకృతుల మేఘాలు
www.FunAndFunOnly.org

వాటి పేరుకి తగ్గట్టుగానే ఆకృతిలో కూడా భయం గొల్పే విధంగా ఉంటాయీ మేఘాలు.. తుఫాను రాకడలను లేదా ఘోరమైన వాతావరణానికి ఇవి సంకేతాలన్నా ఆశ్చర్యపడనవసరం లేదు..వీటిలో మంచు శాతం అధికంగా ఉంటుంది.. ఇవి కొన్ని వందల మైళ్ళ దూరం వరకూ వ్యాపించి ఉంటాయిఅవి అంత భీకరంగా కనిపించినప్పటికీ వాటిని తుఫాను గురించి హెచ్చరించే విషయసూచికలుగానే పరిగణిస్తారు.మంటల ఇంద్ర ధనుస్సు

www.FunAndFunOnly.org


కొన్ని సందర్భాల్లో సూర్య కిరణాలు, మరియు నీటియావిరితో కూడిన మేఘాలు ఒక ప్రత్యేకమైన కోణంలో ఉండినపుడు బల్లపరుపుగా ఉండే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది..మేఘాల్లో ఉండే అసంపూర్ణ ఘనీభవ స్థితిలో ఉండే మంచు ముక్కల కాంతి వక్రీభవనాల వలన ఇది  ఏర్పడి వివిధ వర్ణాలుగా వెదజల్లబడుతుంది పైగా కొన్ని కోణాల్లో‌మాత్రమే ఈ ఇంద్రధనుస్సు నేల మీదున్న వారికి కనిపిస్తుంది

ముంపు బిలాలు

www.FunAndFunOnly.org


ప్రపంచంలోని అతి భయం గొల్పే సహజసిధ్దమైన సంఘటనలలో ఈ ముంపు బిలాలు ఏర్పడటం ఒకటిగా చెప్పొచ్చు.


కాల గమనంలో నేల లోపలి పొరలు క్షయించి ఒక్కసారిగా మట్టిని లోపలి తీసుకుంటాయి.

చాలా ముంపు బిలాలు సహజంగా ఏర్పడగ, కొన్ని మాత్రం మానవ తప్పిదాల కారణంగా ఏర్పడుతుంటాయి.


భూగర్బ జలాల స్థాయి తగ్గే కొలదీ.. ఏర్పడుతున్న కాళీ ప్రదేశాన్ని పూరించటానికి నేల కృంగినపుడు ఇలాంటి బిలాలు ఏర్పడటం బహు సహజం
.

నగర ప్రదేశాలలో ఏర్పడ్డ కొన్ని బిలాలు కొన్ని వందల అడుగుల లోతు ఉన్నవి కూడా ఉన్నాయి.. ఇవి చాలా భవన సముదాయాలని బలి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
పెనిటెంట్స్

www.FunAndFunOnly.org


వీటికి ఈ పేరుని మెక్సికోలోని మత గురువులు పెట్టారు,
మంచి మెరుపుతో కూడిన సహజమైన మరియు దారైన మొన తేలిన మంచు కత్తుల వలె బహు కోణాలలో ఉంటాయివి.

 
ఇవి ఎత్తైన ప్రదేశాలలో, అదీ అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయ్.. మనిషి కంటే ఎత్తుగా పెరిగి చాలా వైశాల్యాన్ని ఆక్రమించి ఉంటాయి
ద్వికుంభాకార మేఘాలు

www.FunAndFunOnly.org


ఎప్పుడైనా గుర్తు తెలియని ఎగిరే వస్తువుల గురించి అద్భుతంగా భావించారా.. ఇవి అలానే కనిపిస్తుంటాయ్?


సాంప్రదాయ విమాన చోదకులు వీటిపై గిరికీలు కొట్టేందుకు సాహసించకున్నా, మరరహిత విమాన చోదకులు మాత్రం వీటిని వదలరనే చెప్పాలి.


వాటి ఆకృతులు కొన్ని సార్లు మాయాపూరితంగానూ, లేదా కృత్రిమంగా చెక్కిన బొమ్మల లాగానో ఉంటూంటాయ్.

మామూలుగా విపరీతమైన వేగంతో వీస్తున్న గాలి తనతో పాటుగా తీసుకెళుతున్న మేఘాలు ఏదైనా కొండలు లేదా ఎత్తైన ప్రదేశాలు అడ్డు తగిలినపుడు ఆయా మేఘాలు ఈ ఆకృతులను సంతరించుకుంటాయి.
కాంతి స్థంభాలు

www.FunAndFunOnly.org


ఆకాశంలో నిలువుగా ఉంచబడిన స్తూపాకార కాంతివంతమైన స్థంభాల వలె కనిపించే ఆకృతులను కాంతి స్థంభాలుగా పేర్కొంటారు,
అవేవో గాలికి అంటుకున్న అగ్నులలాగా కనిపిస్తూ ఉంటాయి..


సూర్య కిరణాలు కానీ లేదా కృత్రిమ దీపాల కాంతికానీ వాతావరణంలో ఉండే మంచు బిందువులుచే పరావర్తనం చెందించినపుడు ఇవి ఏర్పడుతుంటాయి.Sundogs(సూర్య శునకాలు)

www.FunAndFunOnly.org

సూర్య శునకాలు కూడా కాంతి స్థంభాలవలెనే మంచు బిందువులలోంచి కాంతి ప్రసరించినపుడు ఏర్పడతాయి.

కానీ వీటి ఆకృతులు చూపరులకి ముచ్చట గొలుపుతూ ఉంటాయి.


ఆకాశంలో సూర్యుడు ఉండే దూరాన్ని ఆధారంగా చేసుకుని సూర్యశునకాల ఆకృతులు మార్పులు చెందుతూ ఉంటాయి.


ఈజిప్టు మరియు గ్రీకు నాగరికతల కాలం నుండి కూడా ఈ సూర్యశునకాల ప్రస్తావన ఉన్నట్లు చరిత్ర చెబుతుంది.అగ్ని సుడిగుండాలు


www.FunAndFunOnly.org


వాతావరణంలో గాలి వాలు ఒక ప్రత్యేకమైన కోణాల్ని సంతరించుకున్నప్పుడు దమనకాండ జరిగితే ఈ అగ్నిసుడిగుండాల ఏర్పడటాన్ని చూడవచ్చు.


వీటి పుట్టుకకు కొన్ని సార్లు భూకంపాలు, పిడుగులు  కూడా కారణం కావచ్చు.. ఇవి కొన్నిసార్లు నమ్మశక్యం కాలేని ప్రమాదాలని తెచ్చి పెడతాయి మంటలు ఏర్పడిన ప్రదేశాలనుండి అగ్ని కానీ దాని వేడిమి కానీ చేరలేని ప్రదేశాల్ని కూడా చేరి విద్వంశాల్ని సృష్టిస్తుంటాయ్.


ఇవి ఆకాశంలో ఒక మైలు ఎత్తుకు ఎగసి గంటకి వందమైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంటాయి.. ఇవి ఏర్పడిన సమయం నుండి ఇరవై నిమిషాల పైగా వాటి ప్రభావాన్ని చూపగల్గుతూ ఉంటాయి..

 
నారింజ రంగు చంద్రుడు

www.FunAndFunOnly.org


ఎప్పుడైనా చంద్రుడు నారింజ పండు రంగులో ఆకాశంలో వ్రేళ్ళాడుతూ కనిపించాడా, అలా బలే అందంగా ఉంటాడు కదా. ఆ సమయంలో మీరు బాగా గమనించినట్లైతే చంద్రుడేదో మనకి అందేస్తాడేమో అనేంత తక్కువ ఎత్తులో కనిపిస్తుంటాడు.


కానీ ఎందుకలా జరుగుతుందీ? అసలు చంద్రుడికి రంగేదైనా ఉందా?


చంద్రుడు వాలుగా తన కాంతిని ప్రసరించేటప్పుడు, ఆ కాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉండి.. ఆ ప్రయాణంలో మిగిలిన కాంతి తరంగాల్ని కోల్పోయి ఎరుపు, నారింజ రంగుల్ని మాత్రం మిగుల్చుకుంటుందన్నమాట..

 
ఆకరి చిత్రాన్ని మీరు గమనించినట్లైతే, అందులో చక్కగా చూపబడిన చంద్రుని నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుందో కనిపిస్తుంది


ఆ వేర్వేరు రంగుల్ని సంతరించుకున్న ఎత్తు పల్లపు ప్రదేశాల్ని గమనించినట్లైతే చంద్రుని చరిత్రలో జరిగిన సంఘటనలు, సౌర పదార్ధపు తాడనలు, పదార్ధ చలనాలు వంటి విషయాలు బోదపడతాయి.

3 comments:

  1. none of the pictures are visible....

    ReplyDelete
  2. I don't know guys why you are saying it this way.. I could see them very nicely.. there could be some or other reason.. check with your net once.. at least in the blog I found no problem of visibility of these pics..

    ReplyDelete