మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, May 13, 2010
లూజ్ ప్యాంట్...
ప్యాంట్ లూజవుతుంటే.. జనాలకి స్లిమ్ ఔతున్నారని చాలా సరదాగా ఉంటుంది కానీ.. ఆ ప్యాంటుని మడత పెట్టి తొడుక్కుని, బెల్టు తప్పని సరిగా వాడాల్సి రావటం మాత్రం.. చాలా బాదాకరమైన విషయం.. కొత్త బ్రాం"డెడ్" ప్యాంటు కొనుక్కుందామంటే పావు ఫెల్లోషిప్ దానికే పొయ్యాల్సుంటుంది.. పోనీ ఈ స్లిమ్నెస్ పర్మినెంటుగా ఉంటుందా అంటే.. సాఫ్టువేర్ ఫీల్డులాగా ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు.. కొన్ని సార్లనిపిస్తుంది జంతువులే బెటరూ, వాటికి సిగ్గూ అలాంటివి గట్రా ఏమీ ఉండవు.. బట్టలేసుకున్నా వేసకోకపోయినా పర్వాలేదు.. అడిగేవారెవరూ ఉండరు కదా అని.. ఐనా నాగరి"కథ" జరుగుతూ ఉన్న పంధా కూడా చక్రీయంగానే(cyclicగా) ఉంది.. అంటే మనిషి ఆవిర్భవించినప్పుడు బట్టలు లేవు తనకి.. తర్వాత సిగ్గెక్కువై బట్టలు వేసుకున్నాడు.. కొత్త పుంతలు తొక్కుతున్న మన సమకాలీన నాగరికతని చూస్తుంటే పూర్వ నాగరిక సమాజానికి దగ్గరలో ఉంది జనాల వేషధారణలో.. దీనర్దం మనం మళ్ళీ మన ఆరంభానికి సిద్దమౌతున్నామనా.. ఏమో!!.. ఇంతకీ ఎక్కడ స్టార్టు చేశానూ.. హా.. లూజు ప్యాంటూ.. బెల్టూ.. అవి వేసుకునే ఒక మని"హి".. [హి (he) not she షి హిహిహిహిహిహిహి].. ఔను ఫన్నీగానే ఉంటుంది.. ఈ రోజుల్లో "మనీ" ఇంకా ఒక "షి" (she), హి (he)తో పాటుగా ఉంటే కానీ అతనిని 'మని''షి'గా చూడట్లేదు జనాలు.. ఆ రెండూ లేదా ఏ ఒక్కటి లేకున్నా అతనిని.. జంగమ జీవ పదార్దాలనుండి తీసేసి స్థావర ఆవారా లాగా చూస్తున్నారు.. ఏంటో కదా.. నేనంటే అన్నానంటారు కానీ నిజాలు నిజాలే కదా... :)
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
:):)
ReplyDeleteప్యాంటులు గట్రా పక్కన పెట్టేసి ఎంచక్కా మన తెలుగోడి స్టైల్లోకి వచ్చేసి లుంగీలు, పంచలు కట్టేయండి. అప్పుడు లావైనా, స్లిమ్మైనా ఎటువంటి సమస్యా ఉండదు. :-))).
ReplyDeleteహి హి ....షి షి ...బాగా చెప్పారు :)
ReplyDelete@Padmarpita: ముదితల్ మాట్లాడగ ముత్యాలు రాలునేమో
ReplyDeleteఅన్నట్లు, చిరు నవ్వునే సమాధానం చేసేశారండీ
మీరు..
@నాగప్రసాద్: నాగప్రసాద్ గారూ మీ ఐడియా సూపరుగా
ఉంది, కానీ బయటికి కూడా అలాగే వెళ్ళాలంటే
నాకు పర్వాలేకున్నా, మన పుర జనులకి చాలా
పర్వా ఉంటుందండీ
@kishen Reddy: మీరు నా పైన చాలా దయ తలచారండీ
పుః లింగానికి హి, స్త్రీ లింగానికి షి.. ఒక వేళ
మిద్యా లింగాన్ని కూడా చేర్చి షి+ఇట్ అనుంటే
నేను రాసింది "షిట్" అయ్యుండేది.. మీ
దృష్టిలో.. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా మీకు
మీరు నాపైన దయ చూపించారని
ఎందుకన్నానో.