నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Wednesday, May 19, 2010

పుత్రోత్సాహము...

"పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు,
జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.."

వ్యాఖ్యానం: సుమతీ శతకంలో బద్దెన అంటారూ.. నాయనా నీ గురించి మీ నాయనకి పక్కోడు చెబితే తప్ప నీ విషయంలో ఆయనకి సంతోషం రాదురా.. పుడుతూ పుడుతూ నలుగురు వందిమాదిగల్ని నీతో పాటు పట్టుకురా.. లేప్పోతే.. మీ నాన్న నీ గురించి ఎప్పుడూ సంతోషించడూ అని..

                  అసలు విషయాన్ని దాచేసి నాకు నచ్చింది తాత్పర్యంగా చెబుతున్నాననా మీ ఫీలింగు, ఔను మరి మూస పద్దతిలో తాత్పర్యం ఇదే అని చెప్పినంత మాత్రాన ఎలా ఒప్పుకుంటారు.. తనని ఎంతో ప్రేమించే తండ్రి, తన ప్రతిభ పైన చుట్టు ప్రక్కలవాళ్ళ కితాబు కోసం ఎందుకు ఎదురు చూస్తాడు.. ఆయన మైండు అంత వీక్ మైండా..  ఐనా బద్దెన చెప్పింది ప్రపంచంలో ఎనభై శాతం మంది ఎలా వర్తిస్తారు అనేది.. కానీ ప్రపంచ గమన నిర్ధేశకత్వాన్ని మార్చేది ఆ మిగిలిన ఇరవై శాతం మంది అనేది.. శాస్త్రీయంగా విశదీకరించబడింది..
                   

                    అందుకే ప్రతి తండ్రీ ఆలోచించాల్సిందేంటంటే.. తన పిల్లలు ఫస్టు ర్యాంకర్‌తో పోటీ పడుతున్నారా లేదా అనేది కాదు.. కీ షీట్‌తో పోటీ పడుతున్నారా లేదా అనేది చూడాలి, తన పిల్లలు మిగిలిన వాళ్ళ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారా లేదా అని కాదు, తమ పిల్లల స్థానం కంటే ఉన్నత స్థానం ఉంద లేదా వాళ్ళు ఉన్నతంగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి.. You may say that best result is the output of rationale which is in turn the result of divisive or comparitive study.. but your fellow being is always a multi-dimensional variable with infinitismally low probability of consistency's expectency within him/her with whom an ideal rationale is not appropriately calculated.. so take infinite by you to meet the best.. but not a variable or constant, that's temporarily or permanantly fixed. Remember that the statement saying a variable equivalent to infinite is an absolute hallucination.

4 comments:

  1. ఏదో బ్లాగులో మీ ఫొటో చూసి, యూనివర్సిటీ లో ఎక్కడో బాగా చూసినట్టుందే అని మీ బ్లాగు ని వెతుక్కుంతూ వచ్చి చూసా.....చూసాక అర్థమయింది మీరు HCU student అని. నేను కూడా. నన్ను కూడా మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. economics లో phd చేసాను.

    ReplyDelete
  2. @సౌమ్య: హల్లో, సహ నింగి విహంగమునకు సుస్వాగతం.. మీరు కూడ HCU student అని తెలిసి చాలా సంతోషిస్తున్నాను.. నేను మిమ్మల్ని చూసే ఉండుంటానేమో అని అనుకుంటున్నాను..కానీ economics వారెవరితోనూ నాకు పరిచయం లేకపోవటంతో ముఖ పరిచయం మాత్రమే ఉండి ఉండవచ్చు.. ఏదేమైనా ఇలా బ్లాగులో కలవటం చాలా సంతోషంగా ఉంది.. మీరు ఏ batch.. నేనైతే 2005 నుండి ఇక్కడే ఉన్నాను.. M.Sc., M.Tech., ఐపోయి ఇప్పుడు Ph.D. చేస్తున్నాను..
    మీ అంతవాణ్ణి కాకున్నా.. ఏదో సరదాగా బ్లాగ్ రాస్తున్నాను.. ఆదరిస్తారని ఆశిస్తూ.........

    --
    మౌళి

    ReplyDelete
  3. "సహ నింగి విహంగము"......పదప్రయోగం చాలా బాగుంది.
    అవునూ మనిద్దరికి పరిచయం లేదు, కానీ నన్ను చూస్తే "ఒహో ఈమెనా" అనుకుంటారు. ఎందుకంటే నేను మిమ్మల్ని అలాగే అనుకున్నాను కాబట్టి :)

    నేను 2000 నుండి లోనే ఉన్నానండి. MA, Mphil, PhD అక్కడే చేసాను. 2009 జూన్ లో PhD submit చేసాను.

    బ్లాగ్లోకంలో మన విహంగాలు చాలానే ఉన్నాయి. పోను పోను మీకే తెలుస్తుంది. మహేష్ తెలుసా మీకు? ఇక్కడ చూస్తే తెలుస్తుంది.
    http://parnashaala.blogspot.com/

    "మీ అంతవాణ్ణి కాకున్నా..." అంతమాటనేసారేంటండీ! నాకు అంత సీను లేదు. నేనూ ఏదో సరదాగానే రాస్తున్నాను :)

    ReplyDelete
  4. అంటే మీరు క్రిత సంవత్సరమే వెళ్ళారన్నమాట.. its very nice to meet you అండీ..
    నేను కూడా మనవాళ్ళెవరైనా బ్లాగుల్లో ఉంటారని చూస్తున్నానండీ.. లక్కీగా మీరు కలిశారు.. మీ బ్లాగులో కొన్ని పోస్టులు చూశానండీ.. అవి చదివాక అనుకున్నా.. బహు బ్లాగు బ్లాగు అని.. :) నేను కూడా రాయటం నేర్చుకోవాలండీ... ఏదో పిచ్చాపాటీగా రాస్తున్నాను.. నేను రాసే తరువాతి పోస్టులపై కూడా తమ అమూల్యమైన వ్యాఖ్యానాన్ని వివరించెదరని భావిస్తున్నానండీ..
    మీరు చెప్పిన మహేష్ కుమార్ గారిని చూసిన గుర్తు లేదండీ.. కానీ తన బ్లాగు చూశాను చాలా బాగుంది.. కొంచెం నిడివి ఎక్కువగా ఉంది..

    ReplyDelete