నిన్ను చూస్తూనే ఉన్నా.. ఐనా నీ మనసుకి తెలియట్లేదా?, ఔను తెలియాలంటే నువ్వు నన్ను చూడాలి కదా.. నువ్వు కనిపించే ఆ క్షణాన్నే.. తడి ఆరిన బంజరు భూమిపై తొలకరి మేఘపు వానలు చిరు జల్లులై కురిసినట్లుగా, శిశిర ఋతువు చలి తాకిడిలో మూగబోయిన కోయిలకి వసంతమై కానుకగా వచ్చినట్లుగా.. నా మనసు భావిస్తుంది.. కళ్ళు పట్టనంత విశాలమైన ఈ ప్రపంచం నిన్ను చూడగానే మాయమైపోతుందో ఏమో.. నువ్వు తప్ప ఏమీ కనిపించని ఆ మాయని ఎలా ప్రేరేపించగల్గుతున్నావ్.. విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలని నీ మాటల్లోనే అనే గానంలో పదాల్ని నిజంగా నిజం చేస్తున్నావ్. ఎన్ని తరాలైనా, ఎన్నెన్ని యుగాలైనా ఈ ప్రేమ భాషలో మార్పుండదేమో.. ఎన్నటికీ ఈ ప్రేమ భావనలో చేవ తగ్గదేమో... నిన్ను ప్రేమించాలనే ఆలోచన నా మనసుని ఒక లేగ దూడల్లే ఉరకలేయిస్తుంటే.. నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో అనే ఆలోచన, నా ప్రేమ భావాల ఊచకోతకి సిధ్ధమౌతోంది.. నా మనసు భాషణకే నిన్ను పలికించే శక్తి ఉంటే, మాటాడకనే నాలోని నీపై ప్రేమనంతా నీకు వివరించేయనా... నీతో పరిచయమయ్యాక నేన్నీకు నచ్చకపోతే ఎక్కడ నా ప్రేమకి తెర పడుతుందో అనే భావనలో.. నీ కళ్ళలో నన్నిష్టపడే కాంతి రేఖల కోసం ఎదురు చూస్తూ, నా మనసులోనే నిన్నారాధిస్తూ.. మూగగానే నా మనసు ఆలపించే గానాల సంగీత విభావరిని ఆనందిస్తున్నాను.. నువ్వు దరిలో ఉన్న క్షణాన్ని ఆస్వాదిస్తూ.. నిన్ను పలకరించమని నా మనసు చేసే చిలిపి అల్లరిని చిరు కోపంతో వారిస్తూనే, నా మనసుని సంభాలిస్తూ.... "నిన్నే ఆరాధించే నీ దానిని.. నీ ప్రేమే ప్రాణాలైన సుమరాణిని.." అంటూ నా కళ్ళలో ఆనంద మేఘాలు కన్నీటి చినుకులై రాలకముందే నీ మేఘ సందేశాన్నందిచాలని కోరుకుంటూ.. నీ ~ మౌళి
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Monday, July 19, 2010
నీ ప్రేమ భావనలో.. నేనెక్కడో?
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment