అదేంటో భాద్యతాయుతంగా ఉండేవాళ్ళు ఎంత సౌమ్యంగా ఉన్నా.. ఎంత సామరస్యంగా డీల్ చేసినా.. వాళ్ళను చూస్తే ఒక రకమైన భయం, మరో రకమైన గౌరవం కలుగుతుంటుంది అందరికీనూ.. భాద్యతాయుతంగా లేని వారికి ఎంత కౌశలం, పాటవం ఉన్నా.. ఆ సాధికారత రాదెందుకనో.. కానీ బాగా భాద్యతతో ఉన్నావాళ్ళలో, సరదాగా మాట్లాడేవాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను.. బహుశా భాద్యతా,భారాలు మిత్రులై.. భాద్యతా, సరదాలు శత్రువులై ఉంటాయనుకుంటా.. ఐనా అందరూ నాలాగా ఫన్నీగా ఉంటారనుకుంటే ఎలా.. కదా?! :) ... ఐనా ఏంటో.. ముందుగా ఎంజాయ్ అనే నెపంతో చిన్న చిన్న "కోరికలు" తీరేందుకు జీవితమనే మురుగు నీటి ఊబిలో దిగుతారు జనాలు... ఎంజాయ్మెంట్ చాక్లెట్ కోటింగున్న చేదు మెడిసిన్ లాగా ఉంటుంది.. కోటింగు కరిగిపోగానే.. భాద్యతలు.. ప్రతి ఒక్కరూ జీవితమనే ఊబిలో ఈదుతూ చిన్నప్పటి కుట్రలీశ్వరన్ రేంజిలో బిల్డప్పులిచ్చేవాళ్ళే... ఇంకా సరదా ఐన విషయం ఏంటంటే ఎవరెంత తక్కువ లోతు మునిగిపోతే వాళ్ళంత బాగా జీవితాన్ని గెలిచినట్లు వాళ్ళలో వాళ్ళే డిసైడ్ చేసుకుని.. వాళ్ళ గెలుపుతో, ఓడిపోతున్నారని వాళ్ళు ఫీలవుతున్నవారిని గేళి చెయ్యటం వారి సరదా.. ఒడ్డు మీదే ఉండిపోదామనుకునే వాళ్ళని.. లోపలికెళ్ళేవాళ్ళు లాగేస్తుంటారు.. ఒడ్డునున్నవాళ్ళు తోసేస్తుంటారు.. కొద్ది కొద్దిగా అర్దం చేసుకునేందుకు ట్రై చేసే విషయమేంటంటే బావ దారిద్ర్యపు భాషణాన్ని ఎవరూ పట్టించుకోరు కానీ.. భాద్యతా దారిద్ర్యపు జీవితాన్ని మాత్రం చేతకానితనం క్రింద భావిస్తారు...... జీవితం అనేది ప్రకృతి ఐతే జీతం అనేది వికృతి అంట... దాని ఆకృతి మళ్ళీ భాద్యతేనంట.. మరైతే కెలామిటీ అంటే ఏ కృతో?.............. ఏదో వ్రాశాను..... కారణాలేమీ లేవు.... ఇంత చదివాక మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చెయ్యకండేం..... ఏం లేదు ఇలా వ్రాయగలిగే వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోవటం చాలా కష్టమక్కడ....
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, July 10, 2010
భాద్యత(Responsi.."ability")
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
Good Analysis. :)
ReplyDelete@Anonymous: Thank you very much.. :)
ReplyDeleteఛీ ఏం పోస్ట్ రా బాబు బుర్ర బ్లాక్ చేసావ్ మౌళి
ReplyDeleteదూల తీరిపోయింది నీ పోస్ట్ చదివాక
@Anonymous: Thank you dear inventor... కానీ ఎందుకు తీరిపోయిందో చెప్పలేదు... :)
ReplyDeleteచంద్రమౌళి గారు మీ బ్లాగు టెంప్లేట్ మార్చండి.నల్లటి స్లైడ్స్ మీద చదవడం కష్టం గా ఉంది. 'బాధ్యత' అనుకుంటాను భాద్యత కాదు
ReplyDelete@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: ముందుగా నా బ్లాగు వీక్షించినందుకు మీకు నా దన్యవాదాలు.. నా బ్లాగు టెంప్లేట్ విషయంలో మీరు పెద్ద మనసు చేసుకోవాలండీ.. నేను ఎంతో ఇష్టపడి డిజైన్ కం మోడిఫై చేసుకున్న టెంప్లేట్ అండీ ఇది.. కళ్ళు బైర్లు కమ్మేటట్లుండే తెరమీద ఎక్కువ సేపు చదివితే కళ్ళు అలసిపోతాయనే కారణంతో ఈ టెంప్లేట్ ఇలా నాకు నచ్చినట్లుగా మోడిఫై చేసుకున్నానండీ..
ReplyDeleteనా తెలుగుని సరి చేసినందుకు చాలా దన్యవాదాలు.. ఐనా నాకు నేను క్షమాపణలు చెప్పుకోవాల్సిన విషయం ఒకటుందండీ.. అదే నా మతి మరుపు.. ఐనా కానీ మీ సూచనని గుర్తు పెట్టుకునేందుకు తప్పకుండా ట్రై చేస్తాను.. మరొకసారి దన్యవాదాలు..
చంద్రమౌళి గారూ
ReplyDeleteమీరెలాగూ టెంప్లేట్ రూపకల్పనలోనూ నైపుణ్యం కలిగిఉన్నారు
కనుక ఫైరుఫాక్సు వాడేవారి కోసం మీ బ్లాగు చదవటానికి ఓ
తేలికపాటి style sheet జతచేయరూ - ప్లీజ్..
_________________________________
ఉదాహరణకి మాత్రమే (firefox stylish addon) :
@namespace url(http://www.w3.org/1999/xhtml);
@-moz-document domain("mouliantharmadhanam.blogspot.com") {
body {background: grey !important ;}
IMG[src*="layoutsparks"] {display :none !important;}
#crosscol {background: skyblue !important ;}
#content-wrapper {background: skyblue !important ;}
#Blog1 {background: skyblue !important ;}
.comment-body {color: blue !important;}
.comment-body {background-color: white !important;}
}
@ranjani: ఎందుకు లెండి రంజని గారూ.. నా టెంప్లేట్ టేస్టు చాలా మందికి నచ్చేదిలా కనిపించట్లేదు.. అలాంటప్పుడు తయారు చేసినా.. లేదా మోడిఫై చేసి ఇచ్చినా, ఎవరికి నచ్చుతుంది చెప్పండి.. సమయాభావం వలన ప్రస్తుతం తయారు చెయ్యలేకపోతున్నాను కూడా.. పైగా నేను వేరే టెంప్లేట్ నుండే డిజైన్ చేసుకున్నానండీ.. నాట్ ఫ్రం స్క్రాచ్.. అదన్నమాట సంగతి...
ReplyDelete