నీలో ఏముందో తెలియదు.. నిన్ను చూసిన ఆ లిప్తలో, నీ కళ్ళతో నా కళ్ళు చూపులు కలిపిన ఆ క్షణం.... ఏదో పరవశం, నన్ను ఏ లోకాలకో తీసుకుపోతుంది... విధికి ప్రేమన్నా, మనిషి మనసన్నా, గుండె బరువన్నా ఎందుకంత అలుసో, రెండు మూడు క్షణాల కన్నా నన్ను నిన్ను చూడనివ్వదు.. పోనీ నీతో మాట్లాడదామంటే... అమ్మో, గుండే వేగం పరుగులు తీస్తుంది, కష్టం.. నీ గురించి తెలుసుకునే నా మూగ ప్రయత్నాలలో... అందంగా నవ్వే నీ ముఖం, మెరిసే నీ కళ్ళు.. వాటికి ఓ రెండు సోడా బుడ్డీ కళ్ళద్దాలు తప్ప.. కనీసం నీ పేరేంటో కూడా తెలుసుకోలేకపోయాను..... నీతో పరిచయం, ప్రణయం, పరిణయం.. ఇలా ఇంకా ఇలాంటి ఏ కలలోనూ విహరించలేదు.. ఎందుకంటే... నా కలల కోటకి నీ ఇష్టమనే పునాది ఉందో లేదో తెలియకుండానే కడితే... నేను కట్టిన కోట కూలి.. నా మనసుకి పడే బీటల్ని పూరించగలిగే శక్తి లేనివాన్ని... ఐనా దూరం నుండో, దగ్గర నుండో నిన్నలా చూసి.. పొరపాటుగానైనా నువ్వు నన్ను చూడాలనే ఆశతో ఉర్రూతలూగే నా హృదయానికి తెలియదు.. నా ఈ మనసు మూగదని మాటలు రానిదని, నిన్నెప్పటికీ చేర సాహసించలేనిదనీ..... పాపం పిచ్చి మనసు నిన్ను సొంతం చేసుకునే ధైర్యం లేక ఒక జీవితకాలం కనీసం నిన్ను కనిపించేట్టు చెయ్యాలని దేవునికి చేసే ప్రార్ధనలు వింటూంటే.. దాని ఆశని చూసి ఏడవాలో.. దాని అజ్ఞానాన్ని చూసి నవ్వాలో తెలియటం లేదు :( |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Monday, July 26, 2010
నేను to ఆ అమ్మాయి...
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
బావుంది. కానీ వెంటనే మనసు విప్పి చెప్పక పొతే జీవితాంతం బాధ పడాల్సివస్తుంది. కాదనిపించుకొన్నా అనుక్షణం మరిచిపోకపోవడమే ఆరాధన అంటే.
ReplyDelete@తొలకరి:
ReplyDeleteమీ ఎడ్వైజుకి చాలా థాంక్సండీ, కానీ........
@తొలకరి: ఆరాధన వరకు ఓకే కానీ, కాదనిపించుకున్నాక కలిగే బాధ కూడా ఏమంత తక్కువది కాదండోయ్, జీవితాంతం ఆరాధనతో పాటుగా అదీ క్యారీ అవుతుంది.
ReplyDelete-- శరత్
@తొలకరి:& @శరత్ as Anonymous: అందుకే.. ఆశ లేని ఆరాధన అనే కాన్సెప్టొకదాన్ని ప్రొపోజ్ చేస్తున్నాను.. నచ్చితే ఫాలో ఐపోండి.. నన్ను ఫాలో అవ్వమని మాత్రం చెప్పొద్దు...
ReplyDelete