నిన్ననే ఒక మెయిల్ చూశాను.. అందులో నీటి ఒడ్డున ఏదో పార్టీ జరుగుతున్న డెస్కు మీద జనాలు పరుగు లెత్తుతున్నట్టు కనపడుతున్నారు.. దాని తర్వాతి చిత్రాలలో చూస్తే.. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం.. ఒక మోస్తరు నుండి తీవ్రస్థాయిలో గాయ పడిన మానవ మృత దేహాలు కొన్ని ఆ నీళ్ళలో కనిపించాయి.. దానికి కారణం ఏదోదారుణ మారణ హోమం అనుకున్నాను.. కానీ అరచెయ్యంత కూడా లేని కొన్ని చేపలు వాళ్ళని అలా తినేశాయని తెలిసి నిర్ఘాంతపోయాను.. ![]() కార్డేట్స్..కెరాసిడే..కెరాసిఫార్మ్స్ కి సంబంధించిన చేపలంట ఇవి (బయలోజికల్లీ).. అంతే కాకుండా ఇవి సర్వభక్షకులంట(ఆమ్నివోరస్). వీటి సైజు ఆరు నుండి పద్దెనిమిది అంగుళాల వరకూ ఉండి.. అమెజాన్, పెరాగ్వేలాంటి నదీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయంట.. అంతే కాకుండా బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా కనిపించాయని చెబుతారు.. దాని తర్వాత ఒక వీడియో చూశాను.. ఎవరో ఆసామి ఒక ఎలకని ఫిరానా చేపలుండే ఎక్వేరియంలోనికి వదిలాడు.. అంతే నిమిషం కూడా కాకముందే దాని వెన్నుపూస మాత్రం మిగిల్చాయవి.. వీటి పల్లు మరీ దారుగా దారుణంగా కనిపిస్తున్నాయి తెలుసా అమ్మో, ఒక్క ముక్కలో చెప్పాలంటే వీటిని రాక్షస చేపలని చెప్పొచ్చు.. నా సలహా ఏంటంటే మీరెప్పుడైనా తెలియని ప్రదేశాల్లో ఏదైనా ఏటిలోనో లేక, చెరువులోనో.. దూకే ముందు అక్కడి పరిస్థితుల గురించి, విష పురుగుల గురించి విచారించి మరీ దూకటం మంచిదని నా ఉద్దేశ్యం.. ఒకవేళ మీరు వేరే దేశంలో ఉంటే అప్పుడు ఇది మరీ అవసరం.. ఇక్కడ ఇందాక నేను చెప్పిన విగత జీవులైన మానవుల ఛాయా చిత్రాలు ఉన్నాయి.. మీది వీక్ గుండె ఐతే చూడటం మానేయండి.. ^^^ ^^^ ^^^^ ^^^^^ ^^^^^^ ^^^^^^^ ^^^^^^^^
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, July 2, 2010
ఫిరానా: ఎప్పుడూ ఆకలితో ఉండే రాక్షసి చేపలు
Labels:
వింతలు
Subscribe to:
Post Comments (Atom)
photos ekkada andee?
ReplyDeletesuper blog ....really amazing...
ReplyDelete@prabhakarreddy: ప్రభాకర్ గారూ మరొక సారి చూడండి.. రీ అప్లోడ్ చేశాను.. ఇప్పుడు కనిపిస్తాయనే నేను భావిస్తున్నాను.. నాకైతే ముందర కూడా కనిపించాయ్.. మరి మీకెందుకు కనిపించలేదో నాకు తెలియట్లేదు..
ReplyDelete@sreeharsha: Thank you very much Harsha..
ReplyDeleteభలే విషయాలు చెప్తారండీ మీరు, అమ్మొ ఇంత భయంకరమైన చేపలా!
ReplyDeleteబాబూ బషీరుద్దీన్ బాబూ ఖాన్,
ReplyDeleteఅన్న బాషలో చెప్పాలి అంటే, నువ్వు ఎవో సినిమా పోస్టర్స్ చూపించి నిజమంటే నమ్మటానికి నేనేమైనా పిచ్చోడ్నా?
అవి కొత్తగా వస్తున్న 3 డి, చినెమా. పేరు PIRANHA 3D
http://piranha3dthemovie.com/
http://en.wikipedia.org/wiki/Red-bellied_piranha#Diet
http://en.wikipedia.org/wiki/Piranha
@తార: హల్లో తార గారూ... మనం నమ్మినా నమ్మకపోయినా... మనిషి ఫిరానాలకి దొరికితే ఏమౌతాడో మాత్రం క్లియర్గా తెలుస్తుంది.. వాటి లక్షణాలు, అలవాట్లు చూస్తే..
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/Piranha#Theodore_Roosevelt.27s_description
Any way thanks for commenting అండీ..
హుష్షో, రూజ్వెల్ట్ కదలు మీరూ నమ్ముతారా? అది అపోహ మాత్రమే, కానీ కడుపు మాడ్చితే ఎమవుతుందొ తెలియదు మరి, మనిషి ఐనా ఇంకో మనిషిని తింటారెమో... ఇంక అవి ఎంత.
ReplyDeleteనేను చెప్పింది మనుషుల పటాలగురించి
@తార: మీరు ఎక్స్ప్లోరేషన్ బాగా చేస్తారండీ.. very nice of you.. నేనవి నిజమనుకున్నాను సుమ్మీ...!!, any way people do know about the movie from your comment and links.. thanks for enlightening me.. NGC చానెల్లో బాతు, ఇంకా ఎక్వేరియమ్లో ఎలక ఫేట్ని చూశాక.. ఆ మనుషుల బొమ్మలు నిజమనుకున్నాను... మీరు చెప్పింది కూడా నిజమే.. అంత దారుణంగా ఎక్కడైనా జరిగితే.. న్యూస్లో ఐనా తెలుస్తుంది కదా.. ఏదేమైనా మీ లైట్ని దారపోసి మీరు "తార" అనిపించారు.... ఏంటి సరిపోలేదా... పోనీ దృవతార అంటే మీకు ప్రోబ్లమేమీ లేదు కదా.. once again thanks అండీ...
ReplyDeleteఅయ్యొ అంతగా పొగిడించికోవలసింది నేను కాదు, అంతర్జాలం, వికీ, అవి లేకపొతే నిజమనుకునే వాడ్నే నేనూ అంత బాగా చేశారు ఆ బొమ్మలను కదా.
ReplyDelete