click to read this post in white background సెక్స్, ఇంటర్‌కోర్స్, తెలుగులో రతి క్రీడ ఇంకో పదం కామ కేళి... ఈ పదాలు వినపడితే ఒక సగటు టిపికల్ ఇండియన్, అవి పలికేవాడ్ని ఒక ఇడియట్గా, బేవార్సిగా, పనికిమాలినవాడిగా పరిగణించే సందర్భాలు చాలా ఉంటాయ్.. సెక్సనేది సామాజికంగా అందరికీ తెలిసిందే, ఫిజియొలాజికల్గా ఆలోచిస్తే ఒక కాఫీ తాగాలనే ఆలోచన, ఒక పాఠం చదవాలనే ఆలోచన, ఒక మంచి ప్రదేశాన్ని చూసి రావాలనే ఆలోచన .. etc. వీటి కన్నా వేరైతే కాదు సెక్సనేది. మరి ఎందుకని మన దేశంలో సెక్సంటే, దాని గురించి మాట్లాడకూడని విషయంగా పరిగణిస్తారు?, ఇతర దేశాల వాళ్ళలా దాన్ని సాధారణమైన ఫిజియోలజీ అవసరాలలా ఎందుకు సెక్సుని ఒక సగటు ఇండియన్ భావించడు?, పబ్లిక్‌లో తనకంటూ ఒకింత ఇమేజున్న ఏ మనిషీ సెక్సు గురించి మాట్లాడాలనే ఆలోచన వచ్చినంతనే ఎందుకు జంకుతాడు?.. నేను హిస్టోరియన్ని కాదు కాబట్టి సాంప్రదాయ పధ్ధతుల ఆవిర్భావం గురించి చెప్పలేను, కానీ పై పేరాలో ఉన్న ప్రశ్నలు అడగటానికి గల పర్యవసానాలు ఎందుకు మంచివని నాకనిపించాయో చెబుతాను. బేసిగ్గా మనం ప్రతి రోజూ నిర్వహించే పనులు రెండు రకాలు, మనకి మనం ఆలోచించి ఎవరి సహాయమూ లేదా అవసరమూ లేకుండా చేసే పని.. రెండోది ఆలోచన మనదే ఐనా మనతో పాటు వేరే మనుష్యులు కూడా ఉండి నిర్వహించవలసినవి. మనిషి శరీరానికి ఉండే సామాన్య అవసరాలలో తనకి తానుగా నిర్వహించకోగలిగేవి ఆలోచించటం, గాలి పీల్చటం, తినటం, నిద్రపోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం ఇలాంటివి అలాగే తనకి ఇతరుల సహాయం అవసరమయ్యే విధంగా ఉండే కార్యాలలో సంపాదించటం, మాట్లాడటం, ఇలా ఈ కోవలో కూడా చాలానే ఉన్నాయ్.. అందులో సెక్స్ ఒకటి.. నిజానికి తను స్వయంగా తాను నిర్వహించుకునే విషయాలకున్నంతటి అవసర తీవ్రత.. ఇతరుల సహాయంతో తను చేసే ఏ ఇతర పనులలోనూ ఉండదు, ఒక్క సెక్సులో తప్ప.. ఏం ఒప్పుకోరా? :) ఒక్కసారి ఉదయాన్నే లేచి బాత్రూముకెళ్ళాల్సిన పరిస్థితికి మీరు మాత్రమే కాకుండా ఇంకొక మనిషి ఆవసరం అనేది ఆ పనికి ఉంటే!?!?!..(వద్దూ, ఆపూ, ఊహించుకోలేకపోతున్నాం!!), ఓకే ఓకే వర్ణనలు ఆపేసి విషయానికొద్దాం.. ఇలా మన శరీరం తనకున్న స్వయం అవసరాలన్నిటిలో ప్రత్యుత్పత్తికి వేరే వారి అవసరాన్ని ప్రకృతి పరంగా ఏర్పరుచుకుంది. ఇతర అవసరాలకి భాగస్వామి అవసరం ఉన్నా, అలాగే సెక్సుకి కూడా భాగస్వామి అవసరం లేకపోయినా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.. రెండో ఊహే కనక నిజమైతే ప్రతి మనిషీ తన దేహమే దేశమై తిరుగుతూ జీవిస్తాడన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. సంఘజీవనం గడిపే మనిషికి పబ్లిగ్గా సెక్సు అనే పదానికి తత్సంభందిత కార్యానికి సంభందించి సిగ్గు లాంటివి గట్రా ఆవిర్భవించటానికి గల కారణాన్ని సాంఘికంగా మరియు మానసికంగా ఆలోచిస్తే, శరీరం అవసరంగా భావించే సెక్సు అనే ఫీలింగుని తలదన్నే విధంగా మానసిక అవసరాలైనటువంటి ప్రేమ, అభిమానం, భాద్యత, సమాజం అంటే భయం లాంటి ఫీలింగ్సన్నీ కలగలసి, భాగస్వామి అవసరముండే సెక్సుకి ఇవన్నీ అవధులు, అవరోధాలుగా ఏర్పడి వాటిని దాటి వెళ్ళేందుకు పధ్ధతులూ అవీ గట్రా ఏర్పడి.. చివరకి ఆ పధ్ధతికి వ్యతిరేకమైన ధోరణిలో వచ్చే మాట కూడా ఒక నేరంలాగా భావించబడే స్థాయికి సమాజ జీవిన విధానం చేరిందని నా అభిప్రాయం.. బయొలాజికల్‌గా ఆలోచిస్తే, మనిషి ఇంట్యూషన్ నుండి వచ్చిన పధ్ధతుల వలన.. ఎవరు ఎవరితో సెక్సు చెయ్యాలనేది నిర్ణయింపబడిన విధానంలో జీన్సు ట్రాన్సఫర్ అనేది స్వపరాగ ధోరణిలో కాక పరపరాగ ధోరణిలో జరగటం వలన సమాజ స్థితి అభివృధ్ధి పథంలో ఉంది.. లేకుంటే సెక్సు యొక్క విచ్చలవిడితనంలో జీన్ లీచింగ్ జరిగి మనకి అవసరమయ్యే ఎన్నో మంచి జీన్సుని కోల్పోయి ఉండేవాళ్ళం.. మన ఆలోచనా పరిధి మరియు మన సాధన, మన వ్యాది నిరోధక శక్తి ఇలా చాలా విషయాలలో ఇప్పటి స్ట్రెంగ్తు మనకి బహుశా ఉండేవి కావు. ఎప్పుడో సాంప్రదాయ యుగంలో ఏర్పడిన కొన్ని మంచి అలవాట్లు సామాజిక భాద్యతల మూసలో తరువాతి తరాలకి చేరవేయబడుతూ మనకి (సామాజికంగా)చాలా మంచి చేశాయని చెప్పొచ్చు. అంతే కానీ అపోహాపూరితమైన వివరణలకి లోబడి దాని గురించి అభిప్రాయాలని ఏర్పరుచుకోటం సరికాదని నా అభిప్రాయం. ఇది చదివాను.. తెలిసినదాని ప్రకారం ఇప్పుడు సెక్సు ఎవరితో ఐనా, ఎలాంటివారితో ఐనా, ఎక్కడైనా ఇంకా ఎప్పుడైనా ఓకేనా?? ఇలాంటి వ్యంగ్యమైన ప్రశ్నాస్త్రం మీ మదిలో మెదులుతుందని నాకు తెలుసు. దానికి సమాధానంగా నేను చెప్పేదేంటంటే, ఒక మనిషిగా, నాగరికుడిగా, మన సమాజపు మరియు ప్రపంచ పౌరుడిగా "రెండో మనిషి"కి ఇబ్బంది కాకుండా నువ్వేమైనా చెయ్యి... ;) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Tuesday, July 27, 2010
సెక్స్ & సమాజం...
Subscribe to:
Post Comments (Atom)
వెరైటీ అంశాలని ఎంచుకుంటున్నావు. నీ పోస్టింగులలో ఈ మధ్య కాలంలో చాలా పరిణితి కనిపిస్తుంది మౌళీ.....గో ఎహెడ్
ReplyDelete@శరత్:
ReplyDeleteThank you very much Sarath :)
Please change the template very difficult to read.
ReplyDelete@Dileep M:
ReplyDeleteసారీ దిలీప్గారూ.. నేను టెంప్లేట్ మార్చను
template chadavataniki chala ibbandi ga vundi.
ReplyDelete@Anonymous:
ReplyDeleteDear Anonymous మీకు టెంప్లేట్ ఇబ్బందిగా ఉంటే.. మీరు గనక ఫైర్ఫాక్సు వాడుతున్నట్లైతే... అందులో view పైన క్లిక్ చేసి Page styleకి వెళితే అక్కడ Basic page style మరియు No style అని రెండు ఆప్సన్లుంటాయి.. అందులో No style క్లిక్ చేసి.. మీ కళ్ళు బైర్లు కమ్ముతుండే తెల్ల బ్యాగ్గ్రౌండులో నల్లక్షరాలని చూసి, చదివేయొచ్చు...
Mouli,
ReplyDeleteDiscussing about sex became a taboo after british came to India. They brought their victorian values with them. Before it was quite common to discuss the topic in public, including kama sutra. Hope that helps.
Hemanth
@Hemanath:
ReplyDeleteబ్రిటీష్ వారి ఆగమనం ముందు, సెక్సు గురించి మాట్లాడుకునేవారు అనేది మీరు చెప్పినట్లు నిజమే కావచ్చు.. కానీ వాల్ల victorian values ఏంటో నాకైతే అర్దం కాలేదు.. పైగా వాటి వలన discussion about sex అనేది ఎలా effect అయ్యిందనే విషయం అస్సలర్దం కాలేదండీ..
పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడితే పిల్లలు వింటారు. అందుకే చదువుకున్నవాళ్లు పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడరు. కాలేజిలో అమ్మాయిలకి వినిపించేలా డబల్ మీనింగ్ లు మాట్లాడే స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్లని చూస్తే పబ్లిక్ గా సెక్స్ గురించి మాట్లాడకపోవడమే మేలు అనిపిస్తుంది. .
ReplyDeleteDear readers and Mouli..
ReplyDeleteafter all sex is physiological need which is source process of globe..
being hypocritical in the context and concept of sex in public and in home environment leads the next generation into a kind of illusion and will lead them to know wat it is.. than facing other kind scenarios of our own successors its always advisable to make it an open forum to talk about... where several grow up factors and emotions will mix up together in dealing with this sensitive topic.. its better dealing it well in advance , before the consequences end up at a conspiracy... in our society... lets take concern when we interact with younger people and society.. let us take the chance to make concepts clear as our role to play.. will lead to better understanding levels abt this serious hypocracy among different set of people..
end of the day.. society means we the people...
cheers to mouli.. rock on....
aditya
నిజమే వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో ఎవరితోనయినా శృంగారం జరపవచ్చు.
ReplyDeleteసెక్స్ గురించి మీ ధోరణి బావుంది కానీ టెంప్లేట్ గురించి మీ ధోరణి బావోలేదు. మీ టెంప్లేట్ చక్కగా చూడాలంటే ఎవరికివారు పైన మీరు చెప్పినట్లుగా అంత కష్టపడాలన్నమాట! సరే, మీ టెంప్లేట్ మీ ఇష్టం కానీ ఎక్కువమంది చదువరులకు ఇబ్బంది కలిగించనిది ఎన్నుకోవడం బావుంటుంది. మొదటినుండీ చూస్తున్నాను - మీ టెంప్లేట్ ఎన్నికలు అన్నీ కళ్ళకు ఇబ్బందిగా వుండి చదవడానికి శ్రమ అవుతోంది. నాకయితే పైన మీరు చెప్పినంతంగా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకొని కష్టపడి చదివేంత ఓపిక లేదు. ఒక్క రీడర్ చదవనంత మాత్రాన మీకు నష్టం కూడా ఏమీలేదులెండి.
@aditya:
ReplyDeleteThank you for your comment Aditya. Probably those ought to be done tasks, which you told about are the matter of less possibility at least in the present generation or just after it. Whether you agree or not some things are farer than they appear in reality... and the distance is relative, in terms of time..
@శరత్ 'కాలమ్':
ReplyDeleteనేనైతే అలా చెప్పలేదండీ.. అలా ఎందుకు జనాలు ఒప్పుకోరో చెప్పటానికి ప్రయత్నించాను... మన భారతీయ సాంప్రదాయంలో జనాల నమ్మకం ప్రకారం ఒక మనిషికీ, పశువుకీ మద్యనున్న తేడాని చెప్పటానికి, ఈ విషయాన్నే ఈ విషయాన్నే ప్రస్తావిస్తారు.. మరి మనిషెందుకు పశువులాగా ఉండకూడదూ అని పాయింటు లాగారనుకోండీ, మీ పాయింటుకి సమాధానం ఇచ్చే తెలివితేటలు నా దగ్గర లేవు కాబట్టి, గడ్డికి పోటీ ఎక్కువైపోతుంది కాబట్టి అని చెప్పేసి, దులిపేసుకుని వెళిపోతానండీ..
ఇక నా టెంప్లేట్ విషయానికొస్తే, మీకో మనవి.. నాకు డార్కు బ్యాగ్గ్రౌండు మీద లైట్ అక్షరాలంటే ప్రాణం.. నేను వెబ్ డిజైనింగు ప్రాక్టీస్ చెయ్యటం ప్రారంభించినప్పట్నుంచీ.. ఐతే ట్రాన్సపరెంటు లేదా డార్కు బ్యాగ్గ్రౌండులే వాడుతున్నానండీ.. నాకవి ఎందుకు నచ్చుతాయంటే, స్క్రీన్ మొత్తం తెల్లగా ఉండి కళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, నల్లగా ఉంటూ కళ్ళకి ప్రశాంతతని కలుగజేస్తుంది...
మీకింకో విషయం చెప్పాలి నేను మీ బ్లాగు చదివేటప్పుడు కాంపిజ్లో ఉండే స్క్రీన్ నెగెటివి ఆప్సన్ ఎనేబుల్ చేసి చదువుతాను..
రీజన్ ఇదే కానీ నేనేమీ మోనార్కునీ, సీతయ్యనీ కాదండీ.. జనాలు అడుగుతున్నా టెంప్లేట్ మార్చకపోవటానికీ... మరీ బ్లాగు చదవనని అలిగితే ఎలాగండీ బాబూ.. కావాలంటే మీకో లాలీపాప్ కొనిపెడతాను.. చదవండి ప్లీజ్ ;)
టాపిక్ ఎమో కాని, నేను ఇటు తొంగి చూడని కారణం టెంప్లెటే, కళ్ళు బైర్లు కమ్మేలాగా ఉన్నది, డార్క్ బ్యాక్‌గ్రౌండే అనుకుంటే, మాళ్ళీ దాని వెనుక ఎర్రగా రోజా పూలు, చదవాలీ అన్నా, కళ్ళు వద్దు, వద్దు అంటుంటే ఏమి చదువుతాం? మన ఇష్టా ఇష్టాలు కన్నా పాఠకుడి సౌకర్యం ముఖ్యం అని నా భావన.వెనకాల ఆ రోజాలు అన్నా తీసేస్తే కాస్త గుడ్డిలో మెల్ల.
ReplyDelete^ Sharat & Taara(k)
ReplyDeletewhy cant you use firefox and
view this blog with different
background colors & no roses !
you have to add a simple add-on
and a simple style (only once..)
& whenever you visit this blog
it automatically turns into your
own choice of colors :)
guidance available here :
http://userstyles.org/stylish/
@తార:
ReplyDeleteపాఠకుడు చాలా ఇంపోర్టెంటేనండీ కానీ.. నా బేసిక్ టేస్టుని వదులుకోవాలంటే.. ఊహూ.. ఒక పేద్ద లాలీపాప్ కొని మీ టెంప్లేట్ బాదితులందరికీ దాన్నే పంచిపెడతాను దయ చేసి నా బ్లాగు చదవండయ్యా.. మీకు చదవటానికి కష్టంగా ఉంటే నో స్టైల్ మోడ్‌లో(నాకు కళ్ళు బైర్లు కమ్మేటట్లుండే మోడ్) చదివేసెయ్యండీ.. ఐనా ఇలాంటి చిన్న చిన్న కారణాలు మన బ్లాగ్ఫ్రెండ్షిప్ని ఆపేస్తాయా చెప్పండీ..? :)
@ranjani:
ReplyDeleteరంజని గారూ మీకు మరలా మరలా నా శత వందనాలండీ.. నా బ్లాగ్విజిటర్సుకి వ్యూఓపదేశం చేసి వారి మార్గాన్ని సులభతరం చేసినందులకు.. మీకు విజయీ భవ విజయీ భవ..
@Chandramouli Malleda గారు,@ranjani గారు,
ReplyDeleteనాకు లాలీపాప్ వద్దు కాని, ఒక 512MB RAM కొనిపెట్టండి చాలు, మీ బ్లాగ్ కి రాగానే నా ఫైర్ ఫాక్స్ తట్టుకొలేకపోతున్నది మరి.
ఫైరుఫాక్సులో స్టైలిష్ ఏడ్-ఆన్ వాడి చూడండి :) అదనపు RAM
ReplyDeleteఅవసరం ఉండదు. నేను 10 సంవత్సరాల క్రితం కొన్న కంప్యూటరుని
1GB RAM తో , CRT మానిటరుతో వాడుతున్నా !
మీకు 1GB ఐనా ఉన్నది, నాకు 256MB నే,
ReplyDeleteఎంతో మంది చెబుతున్నా మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చక పొవడం ........ కాకి పిల్ల కాకికి ముద్దు..
ReplyDeleteకాకి "పిల్లకాకి"కి ముద్దు నా ?
ReplyDelete@Anonymous & @Anonymous:
ReplyDeleteఔనండీ.. కాకిపిల్ల కాకికి ముద్దు.. పిల్లకాకికి కాకి కూడా ముద్దే.. మీరు పేరు వ్రాయలేదెందుకనో.. ఐనా నా బ్లాగుని విజిట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు...