క్రికెట్టు జరుగుతూ ఉంటుంది, టీవీల ముందు గృహ జనులైనా, పుర జనులైనా గుంపులు గుంపులుగా అతుక్కుపోయి చూస్తూ ఉంటారు.. అందులో అప్పుడప్పుడూ ఇండియా కూడా ఆడుతుంది, కొన్ని సార్లు గెలుస్తుంది కూడానూ.. ఇండియా గెలిచిందని తెలిసిన కొన్ని క్షణాలపాటు కొన్ని కోట్ల ఊపిరితిత్తులు బిగ్గరగా గాలి పీల్చుకుని నిట్టూరుస్తాయి.. నిజంగా భరతమాత ప్రాణమున్న మనిషిలా ఉండుంటే, ఆ భారతీయతకి ఎంత సంతోషిస్తుందో.. ఎక్కణ్ణుచ్చొందండీ ఈ భారతీయత, ఇంత "భార"తీయత క్రికెట్లో మాత్రమే ఉందా లేక అన్నిట్లో ఉందా, అన్నిట్లో అంటే వేటిలో.. అంటే కొన్నిట్లో ఉండక్కర్లేదా.. కావచ్చు మరి, దొంగాడు భారతీయుడైనంత మాత్రాన ఇంటిలో సొమ్ముని దోచుకుపొమ్మని అడగం కదా అలాగే దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకోం కూడా.. పైన వేసిన సోది ఓకే మరి నువ్వేం చెప్పి ఏడవాలనుకుంటున్నావ్ అనుకుంటున్నారా?(మీ ఫీలింగు నాకర్దమైంది).. చెబుతాను కొద్దిగా ఓపిక పట్టండి.. భారతీయత అనేది స్వాతంత్ర పోరాటంలో ఏకీకృతమైన మనస్తత్వ వైఖరి, కొందరికది రక్తంలోజీర్ణమైతే ఇంకొందరికి భావంలోనే ఉండిపోయింది.. నా కల ఏంటంటే మనందరం ప్రపంచ పౌరుల్లా ఈ భూగోళమంతా మనదే(మనది అంటే ప్రపంచంలో అందరిదీనూ) అనేటట్లుగా మారిపోవాలని. కానీ ఎన్నో త్యాగాలు చేసి ""వేరొక""దేశంతో పోరాడితేనే కానీ భారతీయత అనే భావన అందరిలో రాలేదు, మరి నా ప్రపంచం అనే భావం మదిలో ఉరుకులు పరుగులు తీయాలంటే.. బహుషా మన మీద ఏలియన్సు అజమాయిషీ చెలాయించాలేమో.. అంటే ఇలా త్యాగాలు చేసి, ప్రాణాలు కోల్పోయి, పోరాటాలు సాగిస్తే కానీ ఒక జాతీయతా భావం రాదా? నిలదొక్కుకోదా? చాలా మంది ఔను అనొచ్చేమో కానీ, నాకు అవేమీ అవసరం లేకుండానే ఆ భావం కలిగింది.. ప్రతి తల్లీ మరొక తల్లి బిడ్డే కదా.. మరి మన భారత దేశం నైసర్గికంగా భూమాత బిడ్డ, ఆవాస పరంగా ప్రపంచానికి బిడ్డ.. కలసి ఉంటే కలదు సుఖం కదా మరీ.. లేదు ఇది జరిగే విషయం కాదంటారా?(మీ ఫీలింగు నాకు అర్దమైంది), భారతీయత లాగా ప్రపంచీయత దేని కోసం అంటారా? నేను నా పదాలతో చెబితే ఊక దంపుడవుతుంది, మీలో ఆ భావం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.. ఎందుకంటే పదాలు భావాల్ని రేకిత్తించగలవ్ కానీ అవే భావాలు కాలేవు.. మీరనుకుంటున్నది కరెక్టే, ఇది జరిగే మాట కాదు.. కానీ ఎందుకో ఈ వినూత్న ప్రపంచ ఏకీకృత భావన అందిరిలో వచ్చి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఒక్క సారి ఊహించుకుంటుంటే నా మది పులకించిపోతుంది. వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ఆరంభమౌతుంది.. కానీ ఆరంభం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది.. కానీ అందరికీ నిర్ణయం "అవసరం" పైన ఆధారపడి ఉంటుంది.. ఇలాంటి భావన వ్యాపించి ప్రపంచ పౌరులందరూ ఒక నిర్ణయానికొచ్చేసరికే ఇంకొక వెయ్యి వేల ఏళ్ళు పట్టొచ్చు.. కానీ ఆ నా కల నిజమయ్యే రోజుకి నేను నాకు కానీ వేరెవరికీ కానీ తెలిసేందుకు అవకాశమే లేదు.. అవసరం అసలే లేదు.. విడిపోవాలనుకునే తత్వం పెంచి పోషించబడితే మనిషికి తాను నిల్చునే 6:3:3 ఘనపు అడుగుల ప్రదేశం మాత్రమే తన ప్రపంచంగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. నాకు తెలిసినంత వరకూ చెట్లకి ఆ భావన సమంజసంగా ఉంటుంది, ఎందుకంటే అవి అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థావర జీవులు కదా.. ఈ ఆర్టికల్ చదివించి మీ అమూల్యమైన సమయాన్ని వ్యర్ధపరచినట్లైతే క్షమించండి, కానీ.. దయ చేసి మీ అభిప్రాయాలని తెలపండి. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, June 5, 2010
నేను ప్రపంచ పౌరుణ్ణి...
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
Really nice! globalization ki 'avasaram' tvaralone ravalani korukuntu..!!!
ReplyDelete