నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Thursday, June 3, 2010

నేను ఎటకారస్తున్నా..!! :)


    ఇది  మరీ  ధారుణం  కదండీ, ఏదో  మాట  వరసకి  ఏదన్నా  అంటే  అలా  ఎటకారస్తున్ననేస్తున్నారు  వీళ్ళంతా. విషయమేంటంటే  నా  ఫ్రెండొకడున్నాడు  వాడి  దగ్గర  నేనొక  పుస్తకం  తీసుకున్నాను  (తీసుకున్నాను  కానీ  చదివేడిస్తే  కదా), దాన్ని  తిరిగిచ్చేద్దామంటే  ఆ  రోజు  తీరిక  లేక  నా  ఇంకొక  ఫ్రెండుని  రిక్వెస్టు  చేసి  ఆ  పుస్తకాన్ని  దాని  "ఓనరు"డుకిచ్చేయమని  చెప్పాను(ఓనరుడు  అన్నానని  వీడు  నన్ను  ఎటకారస్తున్ననేశాడు). ఇక్కడొచ్చిన  చిక్కేంటంటే  వాళ్ళిద్దరూ  ఒకరికొకరు  ముఖపరిచయం  లేదు, అందువలన  బుక్కు  ఇవ్వాల్సిన  నా  ఫ్రెండడిగాడు    ఆ  ఓనరుడి  పోలికలు  ఎలా  ఉంటాయో  చెప్పమని  అడిగాడు. వర్ణనలు  చెయ్యటానికి  నేనేమీ  కాళిదాసుని  కాదు  కదా  ఐనా  చెప్పాను, చిరంజీవికి  గాలి  తీసేస్తే  వెలిగిపోతున్న  మోహన్‌బాబు  మొహంలాగా  ఫేసూ, చొక్కాలో  ఇల్లు  కట్టుకుని  బ్రతికేస్తున్నట్టు  బాడీ  (మనోడు  బాగా  సన్నంగా, పీలగా  ఉంటాడులే), చీకేసిన  తాటి  టెంకెలాగా  జుట్టూ  (అంటే  ఎలా  ఉంటే  అలా  చెప్పకుంటే  వీడు  పోల్చుకోలేడు  కదా  మరి).. ఈ  మహానుభావుడు  వాడి  దగ్గరకెళ్ళి  పుస్తకమిచ్చేసి  ఉత్సాహం  ఆపుకోలేక  వాడితో  ఫ్రెండ్సిప్  చేసుకుని  మరీ  నేను  చెప్పిన  పోలికల్ని  వాడికి  లీక్  చేసేశాడు.. మన  బుక్కు  ఓనరుడిగాడికి  బాగా  మండినట్టుంది, వాడు  ఫోన్  చేసి  మరీ  నన్ను  ఎటకారస్తున్నని  తిట్టేశాడు.. పాపం  నేను. నిజాలు  చెప్పినందుకు  ఇలా  తిట్లు  కాయాల్సొచ్చింది..

    వీడు, అదే  ఓనరుడు  నన్ను  ఇంకోసారి  కూడా  తిట్టేశాడు, ఆ  స్టోరీ  ఏంటంటే.. వాడు  నాకు  ఫోన్  చేస్తున్నాడు, నేను  బిజీగా  ఉండి  చూసి  కూడా  తియ్యలేదు, కానీ  ఆ  విషయం  చెబితే  వాడు  నమ్మడు  ఇంకా  ఫీలౌతాడు  కూడానూ, బిజీ  తగ్గిపోయిన  తర్వాత  నేనే  వాడికి  కాల్  చేస్తే    ఫోన్  లిఫ్టు  చెయ్యలేదెందుకని  అడిగేశాడు.. ఫోను  సైలెంటులో  ఉందీ  వినబడక  తియ్యలేదని  చెప్పా.. అంటే    వైబ్రేషన్  లేదా  అన్నాడు.. వైబ్రేషన్  ఉంది  కానీ  ఫోనేమో  మెత్తటి  ప్రదేశం  మీద  రెండు  క్లోత్స్  మద్యలోఉండిపోయింది  కాబట్టి  తెలియలేదు  అన్నా, నా  నోటి  దురదని  వాడు  క్యాచ్  చేసేశాడనుకుంటా  డౌటొచ్చి  డీటెయిల్డుగా  చెప్పమన్నాడు.. ఏం  చేస్తాం  చెప్పాను.. "అది  కాదురా  ఫోను  పోకెట్లో  ఉందీ  అది  మరి  రెండు  క్లోత్సు  మద్యలో  ఉన్నట్టే  కదా.. ఆ  పోకెట్టేమో  నా  తొడపైన  ఉంది, తొడంటే    మరి  మెత్తని  ప్రదేశమే  కదా, నువ్వంటే  బొత్తిగా  బోన్  గాడివి  వైబ్రేషన్  వస్తే  బాడీ  అంతా  ఊగిపోతుంది"  అనే  సరికి  టపీ  మని  ఫోను  పెట్టేశాడు, సాయంత్రం  వరకూ  వాళ్ళ  వీధిలో  గుమ్మం  దగ్గర  కర్ర  పట్టుకుని  మరీ  నిల్చున్నాడంట, నేనా  దారిలో  వెల్తానేమో  ఒక  చూపు  చూడొచ్చని.. మనమటువైపు  వెళ్తే  కదా, కోపం  తగ్గాక  ఫోన్  చేసి  కనీసం    ప్ఫది  సార్లనుంటాడు  నన్ను  ఎటకారస్తున్నని.. ఏం  నాకు  కోపం  రాదా  నేను  కూడా  కర్ర  పట్టుకుని  నిల్చున్నా  గుమ్మం  దగర, వాడు  కూడా  మా  ఇంటి  వైపు  రాలేదు.

    నేను  కొంచెం  లావుగా  ఉంటానేమో(ఒక  మోస్తరు  కంటే  చాలా  తక్కువే)  ఐనా  మా  మామయ్య  నన్ను  ఇద్దరు  మనుషులంటాడు  (కనీసం  ఒకటింపావు  కూడ  ఉండనంటే  వినడే). ఒక  సారి  తనూ  నేనూ  తన  కారులో  కూర్చున్నప్పుడు  దానికి  బ్యాటరీ  బాగులేక(ఇది  మెకానిక్  చెప్పాడు)  స్టార్టు  కాకపోతే, కారు  ఇద్దరు  కంటే‌  ఎక్కువమంది  ఉంటే  వెళ్దంట  అన్నాడు, మరి  నువ్వు  దిగిపోతే  కారెవరు  నడుపుతారూ  అన్నాను.. దానికే  ఆయన  నన్ను  ఎటకారస్తున్ననేశాడు.. మీరే  చెప్పండీ  నేను  ఎటకారస్తున్నా  మా  మామయ్యనా.. ఏంటో  నోట్లో‌వేలెడితే  లాలీపాపలో  షుగరెయ్యటం  మర్చిపోయారేంటీ  అని  అడిగే  అమాయకున్ని  నేను,  ఇలాంటోడ్ని  అందరూ  ఎటకారస్తున్ననేయడమేనంటా!!.. ఇదేమన్నా  న్యాయంగా  ఉందా..??  :)





8 comments:

  1. మీరు నిజంగానే ఏటకారుస్తున్నరేమో.....?

    ReplyDelete
  2. బావున్నాయి మీవెటకారాలు.

    ReplyDelete
  3. Meeru mummaatiki vetakaaristhunnaaru anthe

    ReplyDelete
  4. datz true mouli.... neeku vetakaram konchem ekkuve.....

    ReplyDelete
  5. అద్దిరిపోయింది పోస్టు
    నేను మాత్రం ఎటకారించట్లేదండి . నిజమే చెప్తున్నా :)

    ReplyDelete
  6. అస్సలు అస్సలు న్యాయంగా లేదు...

    ReplyDelete
  7. ivi mumatike punchule,,
    em punches anna..

    ReplyDelete