నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Saturday, June 26, 2010

అపకారికినుపకారము.. కరెక్టేనా??

ఉపకారికినుపకారము
విపరీతముగాదు   సేయ   వివరింపదగున్
అపకారికినుపకారము
నెపమెన్నక   సేయువాడె   నేర్పరి   సుమతి

నర్సరీ, కిండర్   గార్డెన్   ఇంకా   అలాంటి   స్థాయి   నుండి   చదువుకున్న   వాళ్ళకి   కూడా   పైన   చెప్పిన   సుమతీ   శతకంలో   పద్యం   దాని   తాత్పర్యం   తెలుసును.. ఐనా   నాకు   డౌటే   అందుకే      నేను   చెబుతాను..
తాత్పర్యం:   నీకు   హెల్ప్   చేసేవాడికి   నువ్వు   హెల్ప్   చెయ్యటం   పెద్ద   గొప్పవిషయం   కాదూ, కానీ   నిన్ను   హర్ట్   చెయ్యటానికి   ప్రయత్నించినవాడికి   కూడా   నువ్వు   హెల్ప్   చెయ్యగలిగితే   అదీ   గొప్ప.. అలా   చెయ్యగలిగిన   వాడే   నేర్పరి.. నేర్పరి   అంటే   learnt   అని   అర్దం.

పద్యాన్ని   చదివేశారు   కదా, ఇప్పుడు   మనం   మాట్లాడుకుందాం   రండి.. ఆ   పద్యం   మన   ప్రాక్టికల్   లైఫ్‌కి   ఎంతవరకూ   అవసరమంటారు?   నిజంగానే   ఆ   శతక   కాలానికీ   ఇప్పటికీ   స్థితి   గతులు   చాలా   మారాయి   కదా.. ఇప్పుడు   నన్ను   స్కూల్లో   వేసి   ఈ   పద్యాన్ని      చెబితే.. బయట   ప్రపంచాన్ని   గమనించే   నేను   రచయితని   చిన్నచూపు   చూస్తానేమో   అనిపిస్తుంది.. ఈ   పద్యాన్ని   ఆదర్శంగా   తీసుకునే   తింగరోల్లెవరైనా      వాళ్ళకి   advantage   లేనప్పుడు   వాళ్ళకి   హెల్ప్   చేసినవాళ్ళకి   హెల్ప్   చేస్తారా.. పై   లైన్లు   ఓకే..
మూడో   లైను   అసలు   సంభవిస్తుందా.. ఒక   వేళ   ఎవరి   దగ్గరకైనా   ఈ   పద్యం   తీసుకెళ్ళి   హితోపదేశం   చెయ్యాలని   నేను   తలిస్తే, వాళ్ళ   వాదన   క్రింది      లైన్లలో   ఉన్న   వాక్యాలలాగానే   ఉంటుందేమో...

"అరటి   తోలు   చేయు   ఎగతాళి   కేక,
విరిగిన   నా   నడ్డి   మద్యనున్న   వెన్నుపూసకెరుక,
నాతో   వాగకుండ   చేరెదవా   నీ   ఇల్లు,
లేక   రాల్చనా   నీ   పల్లు   పదనాల్గు   రెల్లు"

అదేంటీ   నోటిలోని   పల్లు   ముప్పై   రెండు   కదా   అనే   కదా   మీ   డౌటు.. వావ్   మీరు   బయాలజీలో   బాగా   స్ట్రాంగనుకుంటా.. కానీ   ఇక్కడి   లాజిక్కేంటంటే.. వాడప్పటికే   హితోపదేశం   చేసినవాడిని   పీకి   నాలుగు   పల్లు   రాలుస్తాడు.. కాబట్టి   పల్లు   పదనాల్గు   రెల్లే.. మరి   మీ   "అమూల్"యమైన   లేదా   "హార్లిక్సు"ఐన   అదీ   కాకుంటే   "బూస్టైన"   అభిప్రాయమేమిటో..

ఐనా   ఈ   కాలంలో   నేర్పరికి   సుమతీ   శతకంలోనే   చాలా   చక్కటి   పద్యం   ఉందని   నా   అభిప్రాయం..

"ఎప్పటికెయ్యది   ప్రస్తుత
మప్పటికా   మాటలాడి
అన్యుల   మనముల్   నొప్పించక   తానొవ్వక  
తప్పించుకు   తిరుగువాడె   ధన్యుడు   సుమతీ"

ఏం   కాదంటారా.. కాకపోతే   అందరికీ   ఆ   టాలెంటుంటుందా?   ఏమో   మరి?   నేను   మూడో   తరగతి   చదువుతున్నప్పుడొకసారి   మా   తాతయ్య   నాకు   పద్యాలు   చెబుతూ   ఈ   పద్యం   చదివి   దాని   గురించి   చెప్పి   ఏం   అర్దమయ్యిందంటే   ఏమీ   చెప్పలేక   చీవాట్లు   తిన్నాను.. ఒక   గంట   దాని   గురించే   ఆలోచించాక   ఆయన   దగ్గరికే   వెళ్ళి   అప్పటి   నా   భాషా   పరిజ్ఞాన   లేమితో   అక్కడున్న   పదాలనే   కొద్దిగా   మార్చి   చెబితే.. చీవాట్లు   పెట్టివవారు   కాస్తా   పగలబడి   నవ్వి   తర్వాత   వాళ్ళ   స్కూల్లో   కొలీగ్సుతో   కూడా   ఆ   విషయాన్ని   షేర్   చేసుకున్నారంట.. ఆ   మార్చిన   పద్యం   ఎలా   సాగిందంటే..

"ఎప్పటికెయ్యది   ప్రస్తుత
మప్పటికా   మాటాడక
అన్యుల   మనముల్   నొప్పించి,తానొచ్చి
తన్నించుకు   తిరుగువాడె   మౌళీ   సుమతీ"

నన్ను   నేను   పొగిడేసుకున్నానని      మీకు   జెలసీగా   ఉంది   కదా.. ఏం   అవసరం   లేదు   కావాలంటే   మీ   పేరు   చెప్పండి   మిమ్మల్ని   కూడా   పొగుడుతాను.. అప్పటి   మహానుభావులు   రాసిన   గొప్ప   గొప్ప   పద్యాలని   ఈ   కాలానికి   చెందిన   మనం.. సారీ   సారీ.. "నేను"   ఇలా   తింగరి   తింగరిగా   చెప్పుకుంటున్నాను.. మరి   మనం   రాసే   సాహిత్యంపైన   ఇంకో   శతాబ్దం   తర్వాతవారు   చేసే   కామెంట్లేమిటో.. :)

కానీ   ఈ   పోస్టులో   నే   టూ   మచ్   సీరియస్సుగా, అస్సలు   నవ్వకుండా, ముఖం   బిగబట్టి   మరీ   అడిగే   ప్రశ్నేంటంటే.. స్కూల్లో   పిల్లలకి   ఇలాంటి   అప్రస్తుతమైన   పద్యాలు   అవసరమా, లేదా.. అసలవి   అప్రస్తుతమా   కాదా.. పద్య,గద్య   పాఠ్యాంశాలన్నీ   కొంతమంది   స్థబ్ధ   విద్యావంతుని   ఆస్తులుగా   భావిస్తున్నారు.. ఈ   భావన   నిజంగా   నిజమా??   వాళ్ళే   మన   భాష   మృత   భాష   కోవలోనికి   చేరుతుందని   భయపెడుతున్నారు.. దీన్ని   మీరు   ఒప్పుకుంటారా??

నేనైతే   ఇవన్నీ   మన   పాఠ్యాంశాలలో   భాగాలు   కావాలంటాను.. కారణం   మీ   వివరణని   లేదా   వాదనని   కామెంట్ల   రూపంలో   నాతో   చర్చిస్తే   చెబుతాను   లేదంటే   చెప్పను..


Share

16 comments:

  1. I believe both Sumathi & Vemana poems are evergreen and applicable across generations. It is only in our own interpretation we messup and eventually, advancing (?) to the stage of questioning them and their usage..

    It is a moral that poem is trying to teach. Mere fact that many aren't following make it right not to follow them.

    Regards

    Seetharam

    ReplyDelete
  2. చంద్రమౌళి గారు సుమతి శతకకారుడు, వేమన శతకం, రామాయణం లో రాముడి పాత్ర లేదా ఇంకొటేదో ఆదర్శాలు చెప్పే పాత్ర ఐనా వీటి ద్వారా చెప్పేది ఒక ఐడియల్ సిస్టం కి సూత్రాలు . నిజ జీవితం లో ఈ ప్రపంచం లో తప్పు అనేది లేని ఐడియల్ సిస్టం అనేది ఉండటం అసాధ్యం, దానికోసం ప్రయత్నిచటం దురాశ కూడా . కాని అలాగా అని స్టాండర్డ్స్ తగ్గించుకుంటూ పోయమనుకోండి చివరకి ఈ సమాజస్వరూపం ఏమవుతుందో చెప్పనక్కర్లేదు . కనీసం ఇలాంటివి చదివి లేదా తెలుసుకొని అర్ధం చేసుకున్నాం అనుకోండి , అపకారి కి ఉపకారం చేయకపోయినా , ఉపకారి కన్నా ఉపకారం చేస్తాం కదా, అంత వరకు మేలే కదా . కాబట్టి ఎటువంటి స్థితిగతులు ఉన్నా కొంతమంది నన్నా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇటువంటి పాఠాలు పిల్లలకి ఆవసరమే నా అభిప్రాయం .
    సింపుల్ గా చెప్పాలంటే కలెక్టరు కావాలని ప్రయత్నిస్తే చివరికి బిల్లు కలెక్టరు అన్నా కాలేకపోతామా అలా అన్న మాట :)

    ReplyDelete
  3. @Seetharam

    మీరు చెప్పినట్లు ఆ శతకాలు రెండూ, evergreen అండీ.. కానీ ఆ పదం comparitive కదండీ.. ఎవరైనా అందమైన పార్కుని చూడాలనుకుంటారు కానీ అందులో బ్రతకాలనుకోరు కదా.. మరి అక్కరకు రాని సామాజిక పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో వాటి పచ్చదనం intensityని ఎవరు ఎంతగా తీసుకుంటారంటారు?, ఎవరూ తీసుకోనపుడు అవి ఎంత green ఐతే మాత్రం ఎవరు పట్టించుకుంటారండీ.. అసలు జనాలంటున్నదేంటంటే, పద్యాల్లో‌ఉండే విషయం నిజ జీవితంలో చెయ్యలేనప్పుడు, వాటిని green అని ఎలా అనమంటారూ అని.. మీరు interpretation అన్నారు కదా.. for your infomation ఆ పద్యాలు కూడా ఆయా కవుల/రచయితల interpretationఏ. ప్రాపంచికమంతటినీ మాయగా చూపించగలిగే వారి భావనలు ఎంత గొప్పవైనా.. ఈ ప్రపంచంలో మునిగి తేలే ప్రస్తుత మానవులకి ఆ పద్యాలు ఎలా శిరోధార్యాలు ఔతాయండీ.. ఐనా పర్లేదు లెండి మీకూ, నాకూ ఇంకొందరికీ ఆ పద్యాలు తెలుసననే భావంలోనైనా సంతృప్తి పొందుదాం... నా పోస్ట్ పైన మీ విలువైన కామెంటుని అందచేసినందుకు మీకు నా దన్యవాదాలండీ... :)

    ReplyDelete

  4. @Sravya Vattikuti బాగా చెప్పారండీ శ్రావ్యగారూ.. ideal system అనేది ఎక్కడా ఉండదు.. ప్రపంచం మొత్తం మంచిగా ఎలా మారలేదో, చెడ్డగా కూడా పూర్తిగా మారలేదు.. కానీ ఈ నీతి వాక్యాలు లేదా పద్యాలు ఒకానొక కాలంలో వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని ఆయా సమాజాలలో మనుషుల మనః ప్రవృత్తుల ఆధారంగా globalisedగా వక్తపరచబడింది.. కాలానుగుణంగా వచ్చే మార్పుల్లో నేర్పరి, నేర్పరిలా కాక వెర్రిబాగులవాడిగానో అమాయకుడిలాగానో కనిపిస్తుంటాడు.. బ్లాగు చివర్లో మీరు సరిగా గమనించి ఉన్నట్లైతే, నా అభిప్రాయం మీ అభిప్రాయంతో ఏకీభవించి ఉన్నట్లు మీకు రూఢి ఔతుంది. కానీ మీరనే standards తగ్గించుకునే ప్రక్రియ గురించి మాట్లాడినట్లైతే.. వాటి స్థితిగతులు పూర్తిగా దేశ, కాల, మాన పరిస్థితులపై ఆధారపడి ఉంటాయంటాన్నేను.. ఒక line పెద్దదని చెప్పాలంటే దాని కంటే‌చిన్న line ఉంటేనే కానీ చెప్పలేం.. అదండీ standards తాలూకా fate.. మరి ఎక్కువా తక్కువా అనేది మన perception పైననే ఆధారపడి ఉంది.. అది శ్తతక కవులు చెప్పిందానికి సమమైనా సరే, కాకున్నా సరే..

    ReplyDelete
  5. Good discussions are going on..

    ReplyDelete
  6. నెలకు మీరు 25 కి పైగా పోస్ట్ లు రాస్తున్నారు
    మరి వేరేవాళ్ళ బ్లాగుల్లో మీరు కామెంట్లు రాయడం లేదు
    అయినా చాలా మంది మీ బ్లాగుల్లో కామెంట్లు రాస్తున్నారు అంటే అపకారికి నుపకారం చేస్తున్నట్టే కదా
    vice versa

    ReplyDelete
  7. "ఎప్పటికెయ్యది ప్రస్తుత
    మప్పటికా మాటాడక
    అన్యుల మనముల్ నొప్పించి,తానొచ్చి
    తన్నించుకు తిరుగువాడె మౌళీ సుమతీ"


    అంతే కదా చెరసాల శర్మ /ప్రవీణ శర్మ/మార్తాండ కి ఒక రెడ్ హేన్ద్రేడ్ గా దొరికిపోయే ఒక ప్రశ్న వేస్తాం
    కాని తను నేను నిద్రమత్తులో రాసాను ఆ పోస్ట్ అని చెప్పి తప్పించుకు తిరుగుతుంటాడు
    సో ఇది కూడా వంద కి రెండొందలు పర్సెంట్ కర్రెక్ట్

    ReplyDelete
  8. @Anonymous ఏంటండీ అజ్ఞాత వ్యక్తి గారూ.. పోస్టింగ్ అపకారమంటారా.. హహహాహహహాఅహ్హ్హాఅహాఆఆ.. నేను బ్లాగ్ పోస్టింగుకి స్పెండ్ చేసే టైమే పదిహేను నిమిషాలు.. కొంచెం పెద్ద పోస్టయితే.. మ్యాగ్జిమం అరగంట.. సైన్సు స్ట్రీమ్‌లో పిహెచ్.డి చేసేవాళ్ళకి బ్లాగు చదివే టైమ్‌ ఓన్లీ శలవు రోజుల్లోనే ఉంటుందండీ... పోనీలే ఆదివారం చదువుదామనుకుంటే.. ఏదో పెద్ద పోస్టు ప్రిపరేషన్లోనో లేక ల్యాబులోనో గడిచిపోతుంది... ఏం చెయ్యమంటారు చెప్పండీ.. ఐనా మీరు మీ పేరు చెప్పకపోయినా నా అంతర్మధనాన్ని పెద్ద మనస్సుతో ఆశీర్వదించారు కాబట్టి చాలా ధన్యవాదాలండీ

    ReplyDelete
  9. @Anonymous మళ్ళీ అజ్ఞాతగారికి, ఆయన ఏదో కొన్ని ఇంటరెస్టింగ్ పోస్టులు పోస్ట్ చేస్తాడనుకుంటే.. కొన్ని పోస్టుల్లో ఆయన సోర్సు స్టాండర్డుగా ఉండట్లేదు.. ఐనా సరే.. సైన్సు బాగా స్ప్రెడ్ అవ్వాలండీ.. ఎలాగూ రిఫరెన్సులు లేనివాటిని వెతుక్కునేందుకు మనకి సెర్చింజన్లున్నాయి కదా... ఆఖరికి చూడండి.. ఆయన ధన్యుడు, నేనేమో నేనుగా మిగిలిపోయాం.. మీరేమో ఎవరో తెలియకుండా పోయారు.. పర్వాలేదు లెండి.. ఇలా ఐనా అదృశ్య శక్తులేవో భూప్రపంచం మీద అనామధేయంగా ఆశీర్వదిస్తున్నాయనుకుంటాం.. మీ ఎక్సెలెంటు కామెంటుకి.. నా బెనవలెంటు ధన్యవాదాలండీ...

    ReplyDelete
  10. ఏం మాట్లాడుతున్నావ్ చంద్ర మౌళి ఇంటరెస్టింగ్ పోస్ట్లు మార్తాండ రాస్తాడా?
    ఎలా? హౌ?
    రెండో తరగతి పుస్తకాలను రోజుకో పేజి స్కాన్ చేసి బ్లాగులో పెట్టుకొని సైన్సు బ్లాగు అని ప్రచారం చేసుకునే మార్తాండ రాతలను ఇంటరెస్టింగ్ పోస్ట్ లుగా చెప్పిన మీ వ్యాఖ్యను ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాం
    మచ్చుకి రెండు samples ఇస్తా పండగచేసుకోండి మీరు స్పృహలోకి వచ్చినట్టైతే
    http://stories.blogzine.sahityaavalokanam.gen.in/2009/10/blog-post.html

    http://stories.blogzine.sahityaavalokanam.gen.in/search/label/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82

    ReplyDelete
  11. @Anonymous మళ్ళీ స్వాగతం అండీ అజ్ఞాత గారూ.. మీరు చూపించిన శాంపిల్స్ చదవక ముందు చూడకుండానే నేను అవాక్కయ్యాను.. మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది.. కాకుంటే సైన్సు కబుర్లు నెట్టుండే రెండో తరగతి వాడికైనా సరే పనికొస్తాయి కదా అని నా అభిప్రాయం.. అన్నట్టు ఇందాక మీరు ఖండ ఖండాలుగా ఖండించిన వ్యాఖ్యని ఎప్పుడే ఫెవికాల్ పెట్టి అతికించేశాను... కానీ ఎవరితో మాట్లాడుతున్నానో తెలియకుండానే మాట్లాడేస్తుంటే నాకు ఏదో చిరంజీవి సినిమాలో ఒక డైలాగు గుర్తొస్తోంది.. "సుర భేతాళా ఈ అయ్యగారి జేబులో ఏముందో చెప్పు అని వీధి గారడీ వాడిలా చిరంజీవి అడుగుతాడు కదా"... ఐనా మీకు బాగా బిడియం ఎక్కువనుకుంటానండీ... ఏదేమైనా మళ్ళీ థాంక్సండీ... :)

    ReplyDelete
  12. రెండో తరగతి పిల్లాడి కి నెట్ ఇస్తే వీడు సైన్సు బ్లాగుతో పాటు ఆ పక్కన సాహిత్య అవలోకనం పేజ్ కూడా కనిపిస్తుంది
    వదిన మరిదిని పెళ్లి చేసుకోవాలి కదా మమ్మీ అని ఆ అబ్బాయి అడిగితె అవ్వాక్కవడం మన వంతవుతుంది
    పిల్లలకి పుస్తకం హార్డ్ కాపీ గా ఇవ్వడమే చాలా ఉత్తమం అని నా అభిప్రాయం :)

    ReplyDelete
  13. @Anonymousఐతే అదే రెండో తరగతి పిల్లోడు డిగ్రీ చదువు పూర్తి చేసిన తర్వాత ఆ మాటంటే మీరు యాక్సెప్టు చేస్తారా అండీ.. అప్పుడు కూడా చెయ్యరు కదా.. పిల్లలలా చెడిపోతారనే అపోహ ఎనభై శాతం మంది కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు అనుకుంటూంటారండీ.. నిజానికి పిల్లలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఉన్నా సరే.. పేరెంట్సు యొక్క influence వాళ్ళ మీద ఉండేటట్టుగా పేరెంట్సుంటే వాళ్ళెప్పుడూ చెడిపోరు.. ఇది నా అభిప్రాయం.. ఒక వేళ మీలా అలా సెక్యూరిటీ ప్రాబ్లం గురించే ఆలోచిస్తే.. ప్రపంచంలో వేరే సమయం, విధానం ఇంకా ఎన్నెన్నో లేవా వాళ్ళు పాడైపోటానికి.. పాడైపోతారు కదా వాళ్ళని గొలుసులేసి కట్టరు కదా.. ఏమో మీరు కట్టినా కడతారు.. ఈ వ్యాఖ్యలు నేను ఆ బ్లాగుల్ని సమర్థిస్తూ వ్రాసినవి కావు.. మీ అభిప్రాయానికి నా సమాధానంగా వ్రాసినవి... నా బ్లాగుని మరలా మరలా కెలికినందుకు.. మీకు మరలా మరలా.. నా ధన్యవాదాలు..

    ReplyDelete
  14. హాయ్ మౌళి... నేను ఈరోజే చదివాను కాబట్టి ఆలస్యంగా వ్యాఖ్యానిస్తున్నందుకు క్షమించాలి..
    వేమన, సుమతి శతకాలలోని పద్యాలూ చదివిన తర్వాత (మొత్తం కాదు కొన్నే చదివాను) వాళ్ళు నిజంగా చాల గొప్పవాళ్ళు అనిపిస్తుంది. ముఖ్యంగా బద్దెన (ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే )ఎందుకంటే ఒక మనిషికి జీవిత కాలంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, ప్రతి సందర్భానికి తగ్గట్టు ఒక పద్యం ఉంటుంది. ఇక విషయానికొస్తే... ఈ కాలంలో పిల్లలకి పాఠ్యాంశాలలో వీటిని ఉంచాలా? వద్దా? అంటే ఖచ్చితంగా ఉంచాలి అనే అంటాను.. ఎందుకంటే నువ్వు సీతారాం గారికి ఇచ్చిన తిరుగు టపాలో ఎవరైనా అందమైన ఉద్యానవనాన్ని చూడలనుకుంటారు కానీ అందులో ఉండాలనుకోరు అని అన్నావ్... నిజమే.. కానీ ఉద్యానవనం ఎప్పుడు అందంగా కనిపిస్తుంది??? ఉండే ఇల్లు, పరిసరాలు బాగా లేనప్పుడు మాత్రమే...
    ఇట్లు
    కళ్యాణ్

    ReplyDelete
  15. @Kalyan: నిజమే అండీ కళ్యాణ్‌ గారూ, ఆ పద్యాలు జీవన విధానంలో ఉండాల్సిన ఐడియల్సుని చెప్పటమే కాకుండా, మంచితనానికి మచ్చుతునకలుగా మిగిలుతాయి, సమాజం ఎమర్జెన్సీ విధించబడిన కండిషన్లో ఉండాల్సింది కాదు కాబట్టీ, ప్రశాంత జీవన వాతావరణాన్నే కోరుకుంటుంది కాబట్టీ, ఐడియల్స్ అంటే‌ ఏంటో‌ ఒక సామూహిక ఎకీకృత అవగాహన ఇవ్వగలిగే సత్తా ఉన్నవి ఆ పద్యాలు, ఏ కొందరు అతి అభివృద్ది చెందినవాళ్ళకో, అర్ధం కాని వాళ్ళకో, అర్ధం‌ చేసుకోవాలనుకోని వాళ్ళకో తప్ప... మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, మంచి కామెంట్‌ చేసినందుకు చాలా ధన్యవాదాలండీ కళ్యాణ్ గారూ.. :)

    ReplyDelete